కార్తీక పౌర్ణమి

కార్తీక పౌర్ణమి రోజున ప్రతి వాళ్ళూ తమ ఇంట్లో కార్తిక దీపాలు పెట్టాలి. ఇంట్లో కార్తిక దీపం పెట్టమనటానికి ఒక కారణముంది. ప్రతి గృహస్థూ తమ ఇంట్లో ప్రతి రోజూ దీపం వెలిగించాలి. దీపం వెలగని రోజు ఒక్కటి కూడా ఉండకూడదు. ఒకవేళ ఊరికి వెళ్ళాల్సి వస్తే ఎవరినైనా పిలిచి ఇంట్లో దీపం పెట్టమనాలి. కానీ కొన్ని సార్లు దీపం పెట్టలేని పరిస్థితులు ఏర్పడవచ్చు. ముఖ్యంగా మన ఆధునిక జీవితంలో ప్రతిరోజూ దీపం వెలిగించడం కుదరకపోవచ్చు. అలాంటి వారు తమ దోషాన్ని పోగొట్టుకోవటానికి ప్రాయశ్చిత్తంగా వచ్చే అద్భుతమైన తిథి కార్తిక పౌర్ణమి. అందుకే చాలామంది కార్తిక పౌర్ణమి రోజున 365 వత్తులతో గుత్తి దీపం పెడతారు. ఒక ఏడాదంతా దీపం పెట్టకపోతే ఎంత పాపం వస్తుందో దానికి పరిహారం ఈ గుత్తి దీపం. ఈ దీపాన్ని దంపతులిద్దరూ కలిసి వెలిగించాలి.
ఇంట్లో దీపం పెట్టాలంటే కార్తిక పౌర్ణమి తిధి ప్రధానం. దేవాలయంలో పెట్టేటప్పుడు కృత్తికా నక్షత్రం ప్రధానం. అందుకే ఇప్పటికీ అరుణాచలంలో కృత్తికా నక్షత్రం నాడు జ్యోతిని వెలిగిస్తారు. అరుణాచలంలో ఆ కృత్తికా దీపోత్సవం చూడటానికి కొన్ని లక్షల మంది వస్తారు. ఆ రోజున గిరి ప్రదక్షిణ చేయటానికి అవకాశమే ఉండదిక. మొత్తం కొండంతా జనంతో నిండిపోతుంది. అందరూ దీపాన్నే చూసి నమస్కారం చేస్తారు. భగవాన్ రమణులంతటి వారు కూడా అసుర సంధ్య వేళ అయ్యేటప్పటికీ ఓ చెక్క సోఫాలో పడుకుని అరుణాచలం కొండమీద వెలిగే దీపం కోసం ఎదురు చూస్తూండేవారు. అరుణాచలం అంటేనే అగ్నిలింగం కాబట్టి, అక్కడ కొండమీద వెలిగించే దీపానికి అంత ప్రఖ్యాతి. కార్తిక పౌర్ణమినాడు వెలిగించే దీపం కేవలం మనకోసమే కాకుండా, మనం చేసే దుష్క్రుతులను పోగొట్టి మన పాపాలను పోగొట్టి అంతర తిమిరాన్ని పోగొట్టి, లోకోపకారం చేసి, సమాస జీవులనుద్ధరించడానికి పెట్టిన దీపం.
అరటి దొప్పల దీపాలు
కార్తిక పౌర్ణమి రోజు దీపాలు దూరంగా వెళ్లిపోవాలి. దీపాలను అరటి దోప్పలలో పెట్టి నీటిలో విడిచి పెడతారు. అప్పుడు ఆ దీపాలు నీటిని ఆధారం చేసుకొని వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోతున్న దీపాలను చూస్తూ కొద్ది సేపు ఉండాలి. ఆ తర్వాతే ఇంటికి రావాలి. మన పెద్దలు ఈ నిబంధన విధించటానికి ఒక కారణముంది. నీళ్లన్నీ సముద్రంలో కలుస్తాయి. అంటే దీపం కూడా సముద్రంలో కలుస్తుంది. ఇదే విధంగా మానవులందరూ ఆ పరమేశ్వరుడిలో కలుస్తారు. దీపాన్ని నీరు తనతో పాటుగా సముద్రంలో కలిపపేసినట్లు దీపాన్ని చూస్తూ భగవంతుడిని ప్రార్థిస్తే – ఆయన మనందరినీ తనలో కలుపుకుంటాడనే పారమార్ధికమైన భావనతో దీపాన్ని చూడమంటారు. అంతేకాకుండా, ఈశ్వరుడికి ‘తజలా’ అనే పేరు కూడా ఉంది. ‘తజలా’ అంటే నీరు అని అర్థం. లింగ పురాణంలో “సంజీవనం సమస్త నిగత సలిలభవాయుక్తి యుచ్యతే మూర్తి భవస్య పరమార్థః” అని చెబుతారు. అంటే “నీరు రూపంలో పరమశివుడున్నాడు. నీటిని ఆశ్రయించి దీపం వెడుతోంది. భగవంతుణ్ణి ఆశ్రయించి సంకల్పాలు వెడుతున్నాయి. సంకల్పాలు ఊపిరిమీద ఆధారపడతాయి. ఊపిరి తీసి విడిచి పెడుతుంటే సంకల్పాలు నడుస్తూ ఉంటాయి” అని దీనర్థం. అరటి దోప్పల్లోనే దీపాలను పెట్టడం వెనక మరొక పరమార్థం కూడా ఉంది. దీపం అరటిదోప్ప మీద ప్రయాణం చేస్తుంటే దానిలో ఉన్న ఆవునెయ్యి అంతా ఆవిరై పోతుంది. నెయ్యి ఆవిరి కావటంతో కొద్ది సేపటికి దొప్ప తిరగబడి నీటిలో కలిసిపోతుంది. అలా కలిసిపోయిన దోప్పాలను నీటిలోని చేపలు తింటాయి. అంటే దీపాలు విడిచిపెట్టడం వల్ల పర్యావరణానికి ఎటువంటి హానీ కలుగదు.
జ్వాలా తోరణం:
కార్తిక పౌర్ణమినాడు దేవాలయాలలో జ్వాలా తోరణాలను నిర్మిస్తారు. దీనివల్ల అన్ని దోషాలూ తొలగిపోతాయని భావిస్తారు. ఈ జ్వాలా తోరణాలను యమద్వారం ఎలా ఉంటుందో అలా నిర్మిస్తారు. రెండు కర్రలు నిలువుగా పాటి, వాటిపై అడ్డంగా కర్ర కడతారు. కొత్త గడ్డి తీసుకొచ్చి ఆ కర్రకు చుడతారు. దానిమీద నెయ్యి పోసి వెలిగిస్తారు. శ్రీనాధ మహాకవి తన భీమేశ్వర పురాణంలో ద్రాక్షారామంలో జరిగే జ్వాలా తోరణాన్ని
కార్తికవేళ భీమశంకరుని నగరమందు
దూరునెవ్వాడు చిచ్చుర తోరణంబు
వాడు దూరడు ప్రాణ నిర్వాణవేళ
ఘోర భీకర యమద్వార తోరణంబు!!
అని వర్ణిస్తాడు. “కార్తిక మాస పౌర్ణమి తిదినాడు జ్వాలా తోరణం కింద పార్వతీ పరమేశ్వరులు పల్లకీలో వెళుతుంటే వారితో కలిసి మూడు మార్లు ఎవరు తోరణం కింద అటు వెళ్ళి వచ్చారో ఇక వారు యమద్వారంలో ఉండే అగ్ని తోరణాన్ని చూడదు. అంటే శైవలోకాన్ని కానీ, విష్ణు లోకాన్ని కానీ పొందుతారు. ఇది అశుతోషుడైన పరమేశ్వరుడు మహర్షులకు ఇచ్చిన అద్భుతమైన కానుక” అని దీని అర్థం. అందుకే కార్తిక పౌర్ణమి నాడు చాలా ఆలయాలలో జ్వాలా తోరణం తప్పనిసరిగా చేస్తారు. ఆ జ్వాలా తోరణంలో కాలిపోగా మిగిలిపోయిన గడ్డి రక్షా పెడుతుంది భావిస్తారు. దాన్ని తెచ్చి చూరులోనో గడ్డివాములోనో పెడతారు. కొంత గడ్డిని దాన్యాగారంలో పెడతారు. దీనివల్ల భూతప్రేతాది ఉగ్రభూతాల నుంచి రక్షణ లభిస్తుందని, కరువు కాటకాలు లేకుండా దాన్యాగారాలన్నీ నిండుగా ఉంటాయని నమ్ముతారు.

Photo: కార్తీక పౌర్ణమి రోజున ప్రతి వాళ్ళూ తమ ఇంట్లో కార్తిక దీపాలు పెట్టాలి. ఇంట్లో కార్తిక దీపం పెట్టమనటానికి ఒక కారణముంది. ప్రతి గృహస్థూ తమ ఇంట్లో ప్రతి రోజూ దీపం వెలిగించాలి. దీపం వెలగని రోజు ఒక్కటి కూడా ఉండకూడదు. ఒకవేళ ఊరికి వెళ్ళాల్సి వస్తే ఎవరినైనా పిలిచి ఇంట్లో దీపం పెట్టమనాలి. కానీ కొన్ని సార్లు దీపం పెట్టలేని పరిస్థితులు ఏర్పడవచ్చు. ముఖ్యంగా మన ఆధునిక జీవితంలో ప్రతిరోజూ దీపం వెలిగించడం కుదరకపోవచ్చు. అలాంటి వారు తమ దోషాన్ని పోగొట్టుకోవటానికి ప్రాయశ్చిత్తంగా వచ్చే అద్భుతమైన తిథి కార్తిక పౌర్ణమి. అందుకే చాలామంది కార్తిక పౌర్ణమి రోజున 365 వత్తులతో గుత్తి దీపం పెడతారు. ఒక ఏడాదంతా దీపం పెట్టకపోతే ఎంత పాపం వస్తుందో దానికి పరిహారం ఈ గుత్తి దీపం. ఈ దీపాన్ని దంపతులిద్దరూ కలిసి వెలిగించాలి. 
ఇంట్లో దీపం పెట్టాలంటే కార్తిక పౌర్ణమి తిధి ప్రధానం. దేవాలయంలో పెట్టేటప్పుడు కృత్తికా నక్షత్రం ప్రధానం. అందుకే ఇప్పటికీ అరుణాచలంలో కృత్తికా నక్షత్రం నాడు జ్యోతిని వెలిగిస్తారు. అరుణాచలంలో ఆ కృత్తికా దీపోత్సవం చూడటానికి కొన్ని లక్షల మంది వస్తారు. ఆ రోజున గిరి ప్రదక్షిణ చేయటానికి అవకాశమే ఉండదిక. మొత్తం కొండంతా జనంతో నిండిపోతుంది. అందరూ దీపాన్నే చూసి నమస్కారం చేస్తారు. భగవాన్ రమణులంతటి వారు కూడా అసుర సంధ్య వేళ అయ్యేటప్పటికీ ఓ చెక్క సోఫాలో పడుకుని అరుణాచలం కొండమీద వెలిగే దీపం కోసం ఎదురు చూస్తూండేవారు. అరుణాచలం అంటేనే అగ్నిలింగం కాబట్టి, అక్కడ కొండమీద వెలిగించే దీపానికి అంత ప్రఖ్యాతి. కార్తిక పౌర్ణమినాడు వెలిగించే దీపం కేవలం మనకోసమే కాకుండా, మనం చేసే దుష్క్రుతులను పోగొట్టి మన పాపాలను పోగొట్టి అంతర తిమిరాన్ని పోగొట్టి, లోకోపకారం చేసి, సమాస జీవులనుద్ధరించడానికి పెట్టిన దీపం.
అరటి దొప్పల దీపాలు 
కార్తిక పౌర్ణమి రోజు దీపాలు దూరంగా వెళ్లిపోవాలి. దీపాలను అరటి దోప్పలలో పెట్టి నీటిలో విడిచి పెడతారు. అప్పుడు ఆ దీపాలు నీటిని ఆధారం చేసుకొని వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోతున్న దీపాలను చూస్తూ కొద్ది సేపు ఉండాలి. ఆ తర్వాతే ఇంటికి రావాలి. మన పెద్దలు ఈ నిబంధన విధించటానికి ఒక కారణముంది. నీళ్లన్నీ సముద్రంలో కలుస్తాయి. అంటే దీపం కూడా సముద్రంలో కలుస్తుంది. ఇదే విధంగా మానవులందరూ ఆ పరమేశ్వరుడిలో కలుస్తారు. దీపాన్ని నీరు తనతో పాటుగా సముద్రంలో కలిపపేసినట్లు దీపాన్ని చూస్తూ భగవంతుడిని ప్రార్థిస్తే – ఆయన మనందరినీ తనలో కలుపుకుంటాడనే పారమార్ధికమైన భావనతో దీపాన్ని చూడమంటారు. అంతేకాకుండా, ఈశ్వరుడికి ‘తజలా’ అనే పేరు కూడా ఉంది. ‘తజలా’ అంటే నీరు అని అర్థం. లింగ పురాణంలో “సంజీవనం సమస్త నిగత సలిలభవాయుక్తి యుచ్యతే మూర్తి భవస్య పరమార్థః” అని చెబుతారు. అంటే “నీరు రూపంలో పరమశివుడున్నాడు. నీటిని ఆశ్రయించి దీపం వెడుతోంది. భగవంతుణ్ణి ఆశ్రయించి సంకల్పాలు వెడుతున్నాయి. సంకల్పాలు ఊపిరిమీద ఆధారపడతాయి. ఊపిరి తీసి విడిచి పెడుతుంటే సంకల్పాలు నడుస్తూ ఉంటాయి” అని దీనర్థం. అరటి దోప్పల్లోనే దీపాలను పెట్టడం వెనక మరొక పరమార్థం కూడా ఉంది. దీపం అరటిదోప్ప మీద ప్రయాణం చేస్తుంటే దానిలో ఉన్న ఆవునెయ్యి అంతా ఆవిరై పోతుంది. నెయ్యి ఆవిరి కావటంతో కొద్ది సేపటికి దొప్ప తిరగబడి నీటిలో కలిసిపోతుంది. అలా కలిసిపోయిన దోప్పాలను నీటిలోని చేపలు తింటాయి. అంటే దీపాలు విడిచిపెట్టడం వల్ల పర్యావరణానికి ఎటువంటి హానీ కలుగదు.
జ్వాలా తోరణం:
కార్తిక పౌర్ణమినాడు దేవాలయాలలో జ్వాలా తోరణాలను నిర్మిస్తారు. దీనివల్ల అన్ని దోషాలూ తొలగిపోతాయని భావిస్తారు. ఈ జ్వాలా తోరణాలను యమద్వారం ఎలా ఉంటుందో అలా నిర్మిస్తారు. రెండు కర్రలు నిలువుగా పాటి, వాటిపై అడ్డంగా కర్ర కడతారు. కొత్త గడ్డి తీసుకొచ్చి ఆ కర్రకు చుడతారు. దానిమీద నెయ్యి పోసి వెలిగిస్తారు. శ్రీనాధ మహాకవి తన భీమేశ్వర పురాణంలో ద్రాక్షారామంలో జరిగే జ్వాలా తోరణాన్ని 
కార్తికవేళ భీమశంకరుని నగరమందు 
దూరునెవ్వాడు చిచ్చుర తోరణంబు 
వాడు దూరడు ప్రాణ నిర్వాణవేళ
ఘోర భీకర యమద్వార తోరణంబు!!
అని వర్ణిస్తాడు. “కార్తిక మాస పౌర్ణమి తిదినాడు జ్వాలా తోరణం కింద పార్వతీ పరమేశ్వరులు పల్లకీలో వెళుతుంటే వారితో కలిసి మూడు మార్లు ఎవరు తోరణం కింద అటు వెళ్ళి వచ్చారో ఇక వారు యమద్వారంలో ఉండే అగ్ని తోరణాన్ని చూడదు. అంటే శైవలోకాన్ని కానీ, విష్ణు లోకాన్ని కానీ పొందుతారు. ఇది అశుతోషుడైన పరమేశ్వరుడు మహర్షులకు ఇచ్చిన అద్భుతమైన కానుక” అని దీని అర్థం. అందుకే కార్తిక పౌర్ణమి నాడు చాలా ఆలయాలలో జ్వాలా తోరణం తప్పనిసరిగా చేస్తారు. ఆ జ్వాలా తోరణంలో కాలిపోగా మిగిలిపోయిన గడ్డి రక్షా పెడుతుంది భావిస్తారు. దాన్ని తెచ్చి చూరులోనో గడ్డివాములోనో పెడతారు. కొంత గడ్డిని దాన్యాగారంలో పెడతారు. దీనివల్ల భూతప్రేతాది ఉగ్రభూతాల నుంచి రక్షణ లభిస్తుందని, కరువు కాటకాలు లేకుండా దాన్యాగారాలన్నీ నిండుగా ఉంటాయని నమ్ముతారు.

No comments:

Post a Comment