శివుడు ....శివ అనగా సంస్కృతంలో శుభం, సౌమ్యం అని అర్థాలున్నాయి. ఈయన త్రిమూర్తులలో చివరివాడైన లయకారుడు. శివుడు హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథముడు. శివుడు పశుపతిగాను, లింగం రూపములోను సింధు నాగరికత కాలానికే పూజలందుకున్నాడు. శివుడు అనార్య దేవుడు. కానీ తరువాత వైదిక మతంలో లయకారునిగా స్థానం పొందాడు. నేటికీ దేశమంతటా శివాలయాలే అధిక సంఖ్యలో ఉన్నాయి. వేదాలలో శివుడు రుద్రునిగా పేర్కొనబడినాడు.
శైవంలో శివుని పరమాత్మగాను, ఆదిదేవునిగాను భావిస్తారు. అయితే స్మార్తం వంటి ఇతర హిందూ శాఖలలో దేవుని యొక్క అనేక రూపాలలో ఒకనిగా పూజిస్తారు. వైష్ణవంలో శివుని విష్ణువు యొక్క రూపముగా భావిస్తారు. శివుని ప్రత్యేకంగా ఆరాధించే హిందూ మతస్థులను శైవులంటారు.శైవం, వైష్ణవం ,శాక్తేయం హిందూ మతంలోని మూడు ముఖ్యమైన సాంప్రదాయాలు.
పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్ధం ఉన్నది. శివుని త్రిశూలం సత్వ, రజ, తమో గుణాలకు ప్రతిరూపాలు. ఢమరుకం శబ్ద బ్రహ్మ స్వరూపం. అతని శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి, గంగాదేవి శాశ్వతత్వానికి ప్రతీక. అతని దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలుగాను, ధరించిన ఏనుగు చర్మం అహంకారాన్ని త్యజించమని, ఆశీనంపైన పులిచర్మం కోరికలకు దూరంగా ఉండమని, భస్మం పరిశుద్ధతనూ సూచిస్తాయి. ఆయన పట్టుకున్న నాలుగు జింక కాళ్ళు చతుర్వేదాలకు, నందీశ్వరుడు సత్సాంగత్యానికి, నంది ధర్మదేవతకు, మూడవ నేత్రం జ్ఞానానికి సూచిక.

No comments:
Post a Comment