జులై 14 నుంచి గోదావరి పుష్కరాలు.

గోదావరి పుష్కరాలు వచ్చే ఏడాది జులై 14 నుంచి 25వ తేదీ వరకు జరిగే అవకాశం కనిపిస్తోంది. 2015 జులై 14వ తేదీ ఉదయం 6.26గంటలకు దేవగురువు బృహసృతి సింహరాశిలోకి ప్రవేశిస్తారని వేదపండితులు నిర్థారించడంతో ఆ సమయం నుంచి పుష్కరాలు ప్రారంభించాలని దేవాదాయశాఖ ప్రభుత్వానికి నివేదించింది. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో శుక్రవారం నిర్వహించే ఉపసంఘంలో గోదావరి పుష్కరాల నిర్వహణ తేదీలపై ఒక నిర్ణయానికి వస్తారు. 2003లో చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ప్రభుత్వం ఇప్పుడు రూ.957కోట్ల అంచనా వ్యయంతో మహాకుంభమేళాస్థాయిలో నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తోంది. రూ.600కోట్లను కేంద్రం గ్రాంట్ గా అడుగుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు రూ.547.98కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాకు రూ.408.86 కోట్లు కేటాయించాలని అధికారులు కోరుతున్నారు.

No comments:

Post a Comment