గాజులు ధరించడం యొక్క విశేషం

ప్రస్తుత కాలంలో కథలలోనూ వృద్ధ సుమంగళి వల్లను వారి నిరాశా నిస్పృహ వల్లను గాజుల ఔన్నత్యం తెలుస్తున్నది. ఏదో కొన్ని ఇండ్లలో పరంపరానుక్రమము వల్ల శీమంతం గాజులు పెట్టడం అనేది వాడుకలో వస్తున్నది. కాని చాలా మంది పాశ్చాత్య వ్యామోహం వల్ల లేమి వల్ల గర్భిణి స్త్రీకి చేయవలసిన సంస్కారములు చేయడం వదిలేసారు. ఈ సంస్కారములో కేవలం గర్భిణి స్త్రీకి గాజులు పెట్టడం కాకుండా విచ్చేసిన సుమంగళి స్త్రీలకూ కన్యా బిడ్డలకు కూడా గాజులు పంచడం ఒక గొప్ప విశేషం. ఈ సంస్కారములో కేవలం అద్దం గాజులే వాడకంలో వుండాలి కాని ఇప్పుడిప్పుడు అందరు ప్లాస్టిక్ గాజులకు మారడం శోచనీయం. పూర్ణ గర్భిణి నిదానముగా కడుపు భారంవల్ల నడుస్తుంది ఆమెకు ఇరుగు పోరుగులలోను ముందు వెనుకలోను పొరుగువారి అవసరం వాళ్ళ పైన పడి హాని చేయకుండా ఉండటానికి అద్దాల గాజులు వేస్తారు. ఆ గాజుల శబ్దం వాళ్ళ పొరుగువారికి ఒక సంకేతం అందడం తద్వారా గర్భిణిని మొదకుండా ఉండటానికి దోహదం చేస్తుంది.
దేవభాషలో గాజులకు కంకణము అని పేరు. గాజులను అద్దముతో, శంఖముతో, దంతముతో, లక్కతో చేసి ధరించడం మన దేశ ఆచారం. పంజాబ్ ప్రాంతములో గాజులు దంతముతోను, వంగ దేశమందు శంఖముతోను, చేయడం పరిపాటి. ఉత్తర భారతమందు వివాహమందు స్త్రీలకూ ఎర్ర రంగు చీర గాజులు ధరించడం శుభ సంకేతముగా పరిగణించ బడుతున్నది. కర్నాటక, మహారాష్ట్ర దేశములందు ఆకుపచ్చ రంగు వాడకం ఆచారం.
అద్దాల గాజులు దేవి తత్త్వం. సాత్వీకానికి చైతన్యానికి ప్రతీక. గాజులు అంతరిక్షంలోని ఆ గుణములను ఆకర్షించి స్త్రీలకూ మేలు చేస్తుంది. అద్దం గాజుల శబ్ద ప్రకంపనలు దుష్ట శక్తులను పారదోలును. గాజులు ధరించిన్ స్త్రీలను దుష్ట శక్తుల బారి నుంచి దృష్టి దోషములనుంచి కాపాడును
కాని ప్రస్తుత కాలంలో స్త్రీలు గాజులు ధరించడం బొట్టు పెట్టుకోవడం తల జడవేసుకోవడం ఒక నామోషీగా భావిస్తూ జుట్టు విరవపోసుకొని బొట్టు గాజులు లేకుండా ప్రేతత్వంతో తిరుగుతున్నారు దీని ప్రభావం వాళ్ళ వారిలో క్రూరత్వం విచ్చలవిడితనం పొగరుబోతుతనం అధికమై కష్టాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా స్త్రీలు మేల్కోవడం ఏంతో అవసరం.

Photo: గాజులు ధరించడం యొక్క విశేషం

No comments:

Post a Comment