శివ నామము నోటియందు గలవారు, తమ నోటితో సదాశివ, శివనామములను ఉచ్చరించుచుండు వారిని ఖదిర వృక్షమునందలి అగ్నిని స్పృశించలేనట్లు ఏ ప్రాణులును తాకుటకు సాహసించలేరు. "శ్రీ శివాయ నమస్తుభ్యం"- ఓ శ్రీ శివా! నీకు నమస్కారము - ఈమాట నోటినుంచి వెడలినప్పుడు ఆ నోరు సకల పాపములను నశింపజేయు పవిత్ర తీర్థమగును. ప్రసన్నతా పూర్వకముగా ఆ నోటిని దర్శించిన వాడు నిశ్చితముగా తీర్థ సేవ వలన కలుగు ఫలము పొందును. శివనామము, విభూతి, రుద్రాక్షలు - యీ మూడున్నూ త్రివేణితో సమానముగా పరమ పుణ్యమయమని తలంచబడును. శుభాకరములగు ఈ మూడు వస్తువులు సర్వదా ఉన్నచోటును దర్శించుట తోనే త్రివేణీ స్నాన ఫలము లభించును. భగవంతుడగు శివనామము 'గంగ', విభూతి 'యమున', 'రుద్రాక్ష' సరస్వతి అని భావించబడును.
No comments:
Post a Comment