పంచభూతలింగములు అనగానే అయిదు క్షేత్రములు గుర్తుకు వస్తాయి.
- ౧. పృథ్వీలింగం - కాంచీపురంలోని ఏకామ్రేశ్వర లింగము
- ౨. జలలింగం - తమిళనాడులోని తిరుచునాపల్లి శ్రీరంగానికి సమీపంలోని జంబుకేశ్వర లింగం
- ౩. అగ్నిలింగం - అరుణాచలంలోని అరుణాచలేశ్వర లింగం
- ౪. వాయులింగం - శ్రీకాళహస్తీశ్వర మహాలింగం
- ౫. ఆకాశలింగం - చిదంబరేశ్వర లింగం
- ఈఅయిదు ఉన్న క్షేత్రం ఈ శరీరం.
6. సూర్యలింగం: ప్రొద్దున్నే ఆకాశంలో చూస్తే కనపడుతుంది. సూర్యలింగం ప్రత్యక్షం. ఇది కోణార్క్ లో ఉన్నది. ఇది శిల్పులు చెక్కిన ఆలయం కాదు. దీని గురించి పురాణాలలో ఉన్నది. కాశీలో గభస్తీశ్వరుడు, లోలార్కేశ్వరుడు అను పేర్లతో శివుడు సూర్య రూపంలో ఉన్నాడు.
7. చంద్రలింగం: ఇదీ ప్రత్యక్షమే. ప్రభాస క్షేత్రంలో ఉన్న సోమనాధ జ్యోతిర్లింగం. ఇది జ్యోతిర్లింగం అయినప్పటికీ చంద్రకళలతో ఉంది. సోమశిల సోమేశ్వర క్షేత్రమే. పంచారామాలలో సోమారమమనే క్షేత్రం మనకి కనపడుతూ ఉన్నది. ఇక్కడ విశేషం ఏమిటంటే శుక్లపక్షంలో తెల్లదనం రోజు రోజుకూ పెరుగుతూ ఉంటుంది. కృష్ణపక్షంలో క్రమంగా తరుగుతూ ఉంటుంది. భారతీయ దేవాలయాలలో వైజ్ఞానిక దైవత్వ రహస్యం అత్యంత ఆశ్చర్యకరం. ఇటువంటి దివ్య క్షేత్రాలు భారతదేశంలో అందునా హిందువులకు మాత్రమే ఉన్నాయి అని మనం సగర్వంగా, సానందంగా చెప్పుకోవచ్చు.
8. యజమాన లింగం: నేపాల్ క్షేత్రంలో పశుపతి లింగం పేరుతో మనకి కనపడుతూ ఉన్నది.
మానవశరీరంలో షట్చక్రములు ఉన్నాయి. అవి

౧. మూలాధారం: ౨. స్వాధిష్ఠానము ౩. మణిపూరము ౪. అనాహతము ౫. విశుద్ధము
ఇవి మానవశరీరంలో పంచభూత క్షేత్రములు. భ్రూమధ్య స్థానం జ్యోతిర్లింగ క్షేత్రంగా చెప్పబడుతున్నది. ప్రపంచానికంతటికీ వెలుగునిస్తున్నాడు కాబట్టి జ్యోతిర్లింగం అన్నారు. జ్యోతి అంటే వెలుగు, చైతన్యము. ఈభూమియందు మనకు వెలుగు చైతన్యం ఇచ్చే వాడు సూర్యుడు. ఆసూర్య మండలంలో వెలుగు పరమేశ్వరుడు. ఆదిత్యమండలాంతరవర్తి. ఒక్కొక్క మాసంలో ఒక్కోలా ప్రకాశిస్తున్నాడు. ఈవిధంగా పన్నెండు రకాలుగా ఉన్న సూర్యుడిని ద్వాదశాదిత్యులు అంటాం. మనకు కనిపించే జ్యోతిర్లింగ స్వరూపమైన సూర్యుడిని ద్వాదశ సంఖ్యలో చెప్తున్నాం కనుక జ్యోతిర్లింగ స్వరూపుడైన శివునికి కూడా ద్వాదశ సంఖ్య వచ్చింది. పన్నెండులో ప్రళయకాలాలలో కూడా నశించని గొప్ప జ్యోతిర్లింగ క్షేత్రం విశ్వేశ్వర లింగం. భ్రూమధ్య స్థానానికి కాశీ అని పేరు. ఇడ పింగళ నాడులకు మధ్య సుషుమ్న నాడి ఉంటుంది. ఇడ, పింగళ నాడులు వరణ, అసి అనుకుంటే సుషుమ్న నాడి గంగ. ఈమూడు ఉన్న స్థలం వారణాశి.
సహస్రారం కైలాసం. కం - సుఖం, ఆనందం; కైలాసం అంటే ఆనందం లాస్యం చేసే చోటు. శిరస్సుకు ’కం’ అని పేరు. శిరస్సుపై శివశక్తులు కలిసి లాస్యం చేసే చోటు కైలాసం. సహస్రారమే శివశక్త్యైక్య రూపము, మహాకైలాసనిలయా మృణాళ మృదోర్లతా అని చెప్పబడుతున్నది. సహస్రారం కైలాసం, భ్రూమధ్యం కాశీక్షేత్రం. విశుద్ధి చక్రం నుంచి మూలాధారం వరకు పంచభూతలింగములు. ఇవి మానవశరీరంలోని శివలింగ క్షేత్రములు. నీలో ఉన్నశివుడిని తెలుసుకుంటే అప్పుడు శివోహం అనే స్థాయికి చేరతాము.
No comments:
Post a Comment