విభూతి మహాత్మ్యం:

ఒకడు అంతరమునందు ఉద్దీపనను పొందుతాడు. బాహ్యమునందు లోకోపకారం చేస్తాడు. ఎందుకని? ఈ ప్రపంచంలో పరమేశ్వరుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విభూతినిచ్చి నిర్మలత్వముతో ఉదయించు, ఇతరులకు చెందకు అంటాడు. అది తానె ఉదయిస్తుంది. కొన్నికొన్నిటికి పరమేశ్వరుడు విభూతినిచ్చినా తమకు అనుకూలంగా వాటిని ఉపయోగించుకోవటం వాటికి చేతకాదు. దీనికి ఉదాహరణ చెప్పాలంటే, భగవంతునికి పూజ చేశామనుకోండి. ఆయన లొంగిపోతాడు. ఆయనకు కూడా అలసట ఉంటుంది. పూలు వేశారనుకొండి మళ్ళీ వేడెక్కిపోతాడు. చెయ్యి పెట్టి చూడండి. ఎంత వేడిగా ఉంటుందో. చాలా వేడి. అగరొత్తుల కట్ట వెలిగించి అక్కడ పెడతాడు. పొగ! బడలిపోయిన పరమేశ్వరునికి చామరం వీస్తే ఆయన హమ్మయ్య! అని ప్రశాంతత పొందుతాడు.
అందుకే రాజోపచారాల్లో చామరం వీచయామి, చామరం వేస్తాం. చామరం ఎక్కడిది? చామరీ మృగం తోక. ఆ చామరీ మృగం తోకలోని వెంట్రుకలను గుదించి చామరంగా వేస్తాం. తన వెంట్రుకలు ఈశ్వరుని ఖేదాన్ని కూడా తగ్గించగల గొప్పవని తెలుసుకొని చామ్రీ మృగం వచ్చి చామరం వేస్తుందా ఈశ్వరుడికి? వెయ్యలేదు. ఒక ఏనుగు దంతం చాలా అందంగా ఉంటుంది. కానీ ఏనుగుకు తెలుసా? నాకో దంతం వుంది. ఈ దంతం ఇంత అందంగా ఉంటుంది నేను బొమ్మలు చేయించుకోవచ్చు అని తెలుసా? తెలియదు. చేప ఒక్కటే నీళ్ళలో ఈదగలదు. నీటిలో ఈదగలిగే శక్తి నాకే వుంది అని చేప మురిసిపోగలదా? మురిసిపోలేదు. నీటిలో వుండే చేప భూమిమీద ఉండలేదు. భూమిలో వుండే ప్రాణి నీటిలో పడి బ్రతకలేదు. కానీ ఒక్క మనిషి మాత్రం చామరీ మృగం వెంట్రుకలు తెచ్చి ఈశ్వరునికి చామరం వేసి పుణ్యం పొందుతాడు. ఆవుపాలు తెచ్చి అభిషేకం చేసి ఇహమునందు పరమునందు కూడా సౌఖ్యాన్ని పొందుతాడు. ఎక్కడో నీటిలో తిరుగుతున్న చేపను పట్టుకుని తెచ్చి తాను తింటాడు. ఎక్కడో పక్షి ఎగరవలసిన ఆకాశంలో తాను విమానంలో ఎగురుతున్నాడు. ఈ భూమిమీద వేగంగా వెళ్ళటానికి వీలయ్యే సాధనాలని తాను కనిబెడుతున్నాడు. సింహాలు, పెద్ద పులులు స్వేచ్ఛగా తిరుగుతూంటే తానూ నిర్భయంగా ఉండడానికి బలిష్ఠమైన ఇనుప ఊచలతో కూడుకున్న వాహనాన్ని ఎక్కి స్వేచ్ఛగా అవి విహరిస్తున్న అరణ్యంలో చూస్తున్నాడు. దేని విభూతిని అదే అనుభవిస్తుంది ప్రపంచంలో. అన్ని విభూతులను తానుగా అనుభవించగలవాడు మనుష్యుడొక్కడే. ఆ శక్తి ఈశ్వరుడు ఒక్క మనుష్యునికే ఇచ్చాడు. ఇంకెవ్వరికీ ఇవ్వలేదు. ఇంకా విభూతి గలది కుక్క వుంది. రాత్రి తెలివిగా వుంది ఎవరింట్లో అనుమానాస్పదులున్నారో గమనిస్తుంది కుక్క. దానికి విభూతి ఉందని తెలిసి నిన్ను నువ్వు రక్షించుకోవటానికి దాన్ని ఇంటికి తెచ్చి పడుకుంటావు. కానీ గుప్పెడు అన్నం మాత్రం కుక్కకు వేయడం లేదు. నీ గడప లోపలికొస్తే కొడతావు. కుక్క శక్తిని నువ్వు వాడుకుంటావు. నెమలి పురివిప్పి ఆడితే ఎంతో సంతోషంగా వుంటుంది. గబగబా ఫోటోలు తీసి చూసి ఆనందిస్తారు. ఒక్కసారి మీకు ప్రవచనం వచ్చు కదా ఒక్క శ్లోకం చెప్పండి అని ఎవరూ నన్ను అడగలేదు. నేడు సమస్త భూతములయొక్క విభూతిని అనుభవిస్తాను. కానీ నాకున్న విభూతిని ఆ ప్రాణులు మాత్రం అనుభవిస్తాయని నమ్మకం ఏమిటి? ఇన్ని ప్రాణుల అనుగ్రహాన్ని నువ్వు పొండుతున్నావు. అందుకే అది ఇంకా కొన్ని కోట్ల జన్మలెత్తితే గానీ పొందలేని మనుష్య శరీరాన్ని నువ్వు పొందివున్నావు కాబట్టి నువ్వు వాటికి ఉపకారం చెయ్యాలి. అలా ఉపకారం చేసి సమస్త భూతములను తరింపజేయగల శక్తి మనుష్య ప్రాణికి అనుగ్రహింపబడిన కాలం కార్తీకమాసం. అందుకే సూర్య భగవానుడు దూరంగా ఉంటాడు. వేడి తగ్గి ఉంటుంది. వేడి తగ్గి వున్న కారణం చేత చలికి చాలా జీవులు శరీరాల్ని విడిచిపెడతాయి. చలికి శరీరాలు విడిచిపెట్టకుండా నువ్వుల నూనెతో, ఆవునేతితో దీపం పెడతారు.

Photo: విభూతి మహాత్మ్యం:

No comments:

Post a Comment