రుద్రాభిషేకం

రుద్రాభిషేకం చేసినప్పుడు జ్ఞానం రావడం అనేటటువంటిది రక్షణ కలగడం అనేటటు వంటిది రెండు ప్రయోజనాలు వుంటాయి. లౌకికమైన కోరికలు తీర్చుకోవడం అనేది తప్పనిసరి. ఒక కుటుంబంలో ఒక గృహస్థుగా వున్నప్పుడు కొన్ని లౌకికమైన కోరికలు వుంటాయి. అవి వుండకూడదు అని శాస్త్రమూ చెప్పలేదు. భగవంతుడు కూడా భగవద్గీతలో యేమన్నాడంటే "ఆర్తో జిజ్ఞాసు రర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ" - కోరికలున్న వాళ్ళు నన్నే పట్టుకుంటారురా అన్నాడు. కొన్ని కోర్కెల రూపంలో వుండి కోర్కెలవుతాయి. కొన్ని కోరిక కానీ కోరిక కాదు. అది ఈశ్వరుడికి ప్రీతిపాత్రమైనది అవుతుంది. నేను ఇంటి యజమానిగా వున్నాను. నా కొడుకు/కూతురు కష్టపడకుండా వుండాలని అపమృత్యువు చేత గ్రసింపబడకుండా దీర్ఘాయువై వుండి నా మూడో తరాన్ని చూడాలని కోరుకోవడం తప్పు కాదు కదా! అది ఇవ్వగలిగిన స్థానం పరమేశ్వరుడిది.ఆయననే కదా ఆశ్రయించాలి. అది ఆశ్రయించడానికి యే అనువాకంతో/యే పదార్థంతో అభిషేకం చేస్తే లౌకికమైన కోర్కెలు తీరుస్తుందో చెప్పారు. ఆ పదార్థం ఒక్కటీ కాదు కోరిక తీర్చేది. ఆ పదార్థం లింగంమీద మంత్రంతో పడాలి. మంత్రం ప్రధానం. అభిషేకం చేయాలంటే మంత్రమూ వుండాలి (మంత్రం లేకుండా తీసుకెళ్ళి పోసేస్తాను అంటే కుదరదు), పదార్థం వుండాలి, లింగం వుండాలి. ఈ మూడూ కలిస్తే విస్ఫోటనం వుంటుంది అందులోనుంచి. లౌకికమైన కోరికలు తీరడానికి ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క దానికి కారణమౌతుంది. దాహం వేసినప్పుడు ద్రవమే కదా అని పాకం/నెయ్యి త్రాగితే దాహం తీరుతుందా? మంచినీళ్ళు త్రాగాలి. ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క కోరికని/ఆర్తిని/తాపాన్ని తీరుస్తుంది. అంతటా నిండివున్న మంగళకరమైన శివలింగంలోనుంచి ఒక్కొక్క మంగళకరమైన అనుగ్రహశక్తి బయటికి రావాలి అంటే ఒక్కొక్క పదార్థంతో, మంత్రంతో అన్వయం చేయాలి.
పాలు - ఆవుపాలతో అభిషేకము సమస్త సౌఖ్యములకూ కారణము. జ్ఞానం నుంచి సర్వసౌఖ్యాలు ఇస్తుంది.
పెరుగు - ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం లోపించి ఆరోగ్యం కావాలి అనుకున్నప్పుడు ఆవుపాలు తోడుపెట్టిన పెరుగుతో అభిషేకం చేసి దానిని ప్రసాదంగా పుచ్చుకుంటే అది అనారోగ్యం కలగడానికి హేతువైన పాపాన్ని తొలగించి ఆరోగ్యమనే మంగళప్రద శక్తినిస్తుంది.
నెయ్యి - ఐశ్వర్యం కావాలంటే, కొడుకికి వుద్యోగం వచ్చి స్థిరపడాలి అన్నా ఆవునేతిని ఉపయోగించి అభిషేకం చేసి ఆ ప్రసాదాన్ని పుచ్చుకుంటే యేది ఐశ్వర్యాన్ని సంపాదించుకోవడానికి అడ్డు వస్తోందో ఆ అడ్డు తొలగిపోతుంది.
తేనె - తేజస్సు పొందాలి అనుకుంటే తేనెతో అభిషేకం చేయాలి. తేనెలో రెండు రకాలు - తేనె పట్టునుండి వచ్చే తేనె; పుట్ట తేనె. తేనెపట్టునుంచి వచ్చిన తేనెతో పరమశివుడికి అభిషేకం చేస్తే వాళ్ళకి తేజస్సు కలుగుతుంది. గోధుమ త్రాచు/నాగుపాము పుట్టలోకి దూరి శరీరాన్ని వేగంగా విదిలిస్తే చీమలు భయపడి బయటికి వెళ్ళిపోతాయి. విషపుగాలి ఊదుతుంది. చీమలన్నీ వెళ్ళిపోతాయి. చాలాకాలం సాధన చేసి శరీరాన్ని తిప్పుతుంది. లోపల మట్టి అంతా ఊడి మెత్తగా తయారవుతుంది. అక్కడ ఒకరకమైన జాతి తేనెటీగలు లోపల ఒక పట్టు పెడతాయి. పాము లోపలికి వెళ్ళినప్పుడు తేనెటీగలన్నీ బయటికి వెళ్ళేటట్లు కొడుతుంది. చీమలు బయటికి రాకుండా తేనెటీగలు బయటికి వచ్చినా, త్రాచుపాము లోపలికి వెళ్తుంటే తేనెటీగలు బయటికి వచ్చినా, లేదా పాము వెళ్ళిపోయాక తేనెటీగ లోపలికి వెళ్తున్నా అందులో తేనెపట్టు వుందని అర్థం. అప్పుడు కలుగులోకి పొగ వచ్చే పదార్థాన్ని చొప్పించినప్పుడు ప్రక్క కలుగులోంచి పాము వెళ్ళిపోతుంది. తేనెటీగలన్నీ వెళ్ళిపోతాయి. అప్పుడు పుట్ట త్రవ్వి తేనె తీసి తాటాకులో పోసి పిండుతారు. అప్పుడు వచ్చేదానిని పుట్ట తేనె అంటారు. అది నాలుక మీద పడితే అమృతం పడినట్లే వుంటుంది అంటారు. ఆ పుట్ట తేనె తెచ్చి అభిషేకం చేస్తే గంధర్వగానం వస్తుంది ఉత్తరజన్మలో. వాగ్గేయకారుడౌతాడు. అన్నమాచార్యుల వారిలా, ఒక శ్యామాశాస్త్రి గారిలా అవగలిగిన సంగీత విద్య ఎక్కడినుంచీ వస్తుంది అంటే పుట్టతేనెతో అభిషేకం చేస్తే. కానీ అది లభ్యమవుతుందనుకోవడం చాలా కష్టం.
పంచదార - పంచదారతో అభిషేకం చేస్తే దరిద్రం పోతుంది. దరిద్రం పోవడం వేరు, ఐశ్వర్యం కలగడం వేరు. దరిద్రం అంటే అన్నీ వుంటాయి కానీ అనుభవించడానికి వుండదు. ఇదంతా పోగొట్టి మనసులో అనుకున్నట్లు అనుభవించే శక్తిని ఇచ్చేవాడు పరమేశ్వరుడు. దరిద్రనాశనం బాహ్యంలో లేకపోవడం దగ్గరినుంచి ఉన్నది అనుభవించేంతవరకు. ఇది శివానుగ్రహం చేతనే సాధ్యం.
మారేడు దళం - మారేడు దళం యొక్క ఈనె క్రిందకి వెళ్ళేటట్లు పెద్దగా ఉన్న ఆకుని పైకి పెట్టి కొంచెం అంచు అభిషేకం చేసే పాత్రకేసి నొక్కాలి. పాత్రను ఒడుపుగా వంచితా మారేడు దళం చివరినుంచి (శీర్షం నుంచి) ధార పడుతుంది. ఆ ధార శివలింగం మీద పడేటట్లుగా అభిషేకం చేస్తే సర్వసౌఖ్యములకూ కారణమౌతుంది.
పసుపు నీళ్ళల్లో కలిపి అభిషేకం చేస్తే మంగళములకు కారణమౌతుంది.
మామిడిపండు రసంతో అభిషేకం చేస్తే రోగం పోవడానికి కారణమౌతుంది.
నేరేడు పండ్ల రసంతో అభిషేకం చేస్తే వైరాగ్యం కలగడానికి కారణమౌతుంది. ఎంత వయస్సు వచ్చినా ఇంకా అర్థరహితమైన జీవితం. పిచ్చి కోరికలు. బ్రతికున్నంతకాలం కోరికలే? గురువుగారి దగ్గరికి వెళ్ళినా. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళినా కోరికలే. బ్రతుకంతా కోరికలు వుండడం కాదు. ఏదో ఒకనాడు చెప్పులు విప్పాల్సిందే. వైరాగ్య సుఖాన్ని పొందాలి. ఈశ్వరుడియందు మనస్సు పెట్టాలి. అలా కాకుండా కోరికలతో వెంపర్లాడే స్థితి మనస్సులో వుంటే ఆ పరిస్థితి తొలగించమని నేరేడు పండ్ల రసంతో అభిషేకం చేయాలి.
నవరత్నాలు నీళ్ళల్లో వేసి అభిషేకం చేస్తే ఇల్లు కట్టుకోలేక పోయిన వాడికి ఇల్లు కట్టుకునే అదృష్టం కలుగుతుంది.
బంగారం నీళ్ళల్లో వేసి అభిషేకం చేస్తే భూమి కలిసొస్తుంది.
కస్తూరి నీళ్ళల్లో కలిపి అభిషేకం చేస్తే చక్రవర్తిత్వాన్ని పొందుతాడు. బాహ్యంలో రాజ్యానికి చక్రవర్తి. ఏ కోరికా లేక కస్తూరితో అభిషేకం చేస్తే భక్తి సామ్రాజ్యానికి చక్రవర్తివి అవుతావు.
విభూతిని నీళ్ళల్లో కలిపి అభిషేకం చేస్తే సమస్త పదార్థాలతో అభిషేకం చేసినట్లే అని శాస్త్రంలో మర్యాద చూపించింది. ఈ పదార్థం చేశారు, ఈ పదార్థంతో చేయలేదు అన్న లోటు చెప్పరు. అన్నింటితో చేసేసినట్లే.
ప్రతిరోజూ ఇంట్లో చందనం తీసి దానిని నీళ్ళల్లో కలిపి అభిషేకం చేస్తే సంతానం కలుగుతుంది. చందనంతో రోజూ అభిషేకం చేస్తే కొడుకు వృద్ధిలోకి వస్తాడు.
కాబట్టి ఒక్కొక్క పదార్థంతో అభిషేకం చేస్తే ఒక్కొక్క లౌకికమైన ప్రయోజనాలు కలుగుతాయి. కోరికలు ఒక వయస్సులో అవసరం. ఆ కోరికలు తీర్చుకోవడానికి రుద్రాధ్యాయం ఈ పదార్థాలను చెప్పింది. రుద్రకామ్యార్చన అంటారు. కోరికలనుండి కోరికలు కాని కోరికల వరకు ఇవ్వగలిగిన వాడు ఒక్కడే పరమేశ్వరుడు. అది అభిషేక ప్రక్రియ చేత లభిస్తుంది. అందుకు రుద్రం, రుద్రాధ్యాయం, రుద్రాభిషేకం అంత గొప్పవి. ఇవన్నీ లౌకిక ప్రయోజనములు, ఆంతరమునందు విశేష ప్రయోజనములు.

Photo: రుద్రాభిషేకం చేసినప్పుడు జ్ఞానం రావడం అనేటటువంటిది రక్షణ కలగడం అనేటటు వంటిది రెండు ప్రయోజనాలు వుంటాయి. లౌకికమైన కోరికలు తీర్చుకోవడం అనేది తప్పనిసరి. ఒక కుటుంబంలో ఒక గృహస్థుగా వున్నప్పుడు కొన్ని లౌకికమైన కోరికలు వుంటాయి. అవి వుండకూడదు అని శాస్త్రమూ చెప్పలేదు. భగవంతుడు కూడా భగవద్గీతలో యేమన్నాడంటే "ఆర్తో జిజ్ఞాసు రర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ" - కోరికలున్న వాళ్ళు నన్నే పట్టుకుంటారురా అన్నాడు. కొన్ని కోర్కెల రూపంలో వుండి కోర్కెలవుతాయి. కొన్ని కోరిక కానీ కోరిక కాదు. అది ఈశ్వరుడికి ప్రీతిపాత్రమైనది అవుతుంది. నేను ఇంటి యజమానిగా వున్నాను. నా కొడుకు/కూతురు కష్టపడకుండా వుండాలని అపమృత్యువు చేత గ్రసింపబడకుండా దీర్ఘాయువై వుండి నా మూడో తరాన్ని చూడాలని కోరుకోవడం తప్పు కాదు కదా! అది ఇవ్వగలిగిన స్థానం పరమేశ్వరుడిది.ఆయననే కదా ఆశ్రయించాలి. అది ఆశ్రయించడానికి యే అనువాకంతో/యే పదార్థంతో అభిషేకం చేస్తే లౌకికమైన కోర్కెలు తీరుస్తుందో చెప్పారు. ఆ పదార్థం ఒక్కటీ కాదు కోరిక తీర్చేది. ఆ పదార్థం లింగంమీద మంత్రంతో పడాలి. మంత్రం ప్రధానం. అభిషేకం చేయాలంటే మంత్రమూ వుండాలి (మంత్రం లేకుండా తీసుకెళ్ళి పోసేస్తాను అంటే కుదరదు), పదార్థం వుండాలి, లింగం వుండాలి. ఈ మూడూ కలిస్తే విస్ఫోటనం వుంటుంది అందులోనుంచి. లౌకికమైన కోరికలు తీరడానికి ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క దానికి కారణమౌతుంది. దాహం వేసినప్పుడు ద్రవమే కదా అని పాకం/నెయ్యి త్రాగితే దాహం తీరుతుందా? మంచినీళ్ళు త్రాగాలి. ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క కోరికని/ఆర్తిని/తాపాన్ని తీరుస్తుంది. అంతటా నిండివున్న మంగళకరమైన శివలింగంలోనుంచి ఒక్కొక్క మంగళకరమైన అనుగ్రహశక్తి బయటికి రావాలి అంటే ఒక్కొక్క పదార్థంతో, మంత్రంతో అన్వయం చేయాలి.
పాలు - ఆవుపాలతో అభిషేకము సమస్త సౌఖ్యములకూ కారణము. జ్ఞానం నుంచి సర్వసౌఖ్యాలు ఇస్తుంది.
పెరుగు - ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం లోపించి ఆరోగ్యం కావాలి అనుకున్నప్పుడు ఆవుపాలు తోడుపెట్టిన పెరుగుతో అభిషేకం చేసి దానిని ప్రసాదంగా పుచ్చుకుంటే అది అనారోగ్యం కలగడానికి హేతువైన పాపాన్ని తొలగించి ఆరోగ్యమనే మంగళప్రద శక్తినిస్తుంది.
నెయ్యి - ఐశ్వర్యం కావాలంటే, కొడుకికి వుద్యోగం వచ్చి స్థిరపడాలి అన్నా ఆవునేతిని ఉపయోగించి అభిషేకం చేసి ఆ ప్రసాదాన్ని పుచ్చుకుంటే యేది ఐశ్వర్యాన్ని సంపాదించుకోవడానికి అడ్డు వస్తోందో ఆ అడ్డు తొలగిపోతుంది.
తేనె - తేజస్సు పొందాలి అనుకుంటే తేనెతో అభిషేకం చేయాలి. తేనెలో రెండు రకాలు - తేనె పట్టునుండి వచ్చే తేనె; పుట్ట తేనె. తేనెపట్టునుంచి వచ్చిన తేనెతో పరమశివుడికి అభిషేకం చేస్తే వాళ్ళకి తేజస్సు కలుగుతుంది. గోధుమ త్రాచు/నాగుపాము పుట్టలోకి దూరి శరీరాన్ని వేగంగా విదిలిస్తే చీమలు భయపడి బయటికి వెళ్ళిపోతాయి. విషపుగాలి ఊదుతుంది. చీమలన్నీ వెళ్ళిపోతాయి. చాలాకాలం సాధన చేసి శరీరాన్ని తిప్పుతుంది. లోపల మట్టి అంతా ఊడి మెత్తగా తయారవుతుంది. అక్కడ ఒకరకమైన జాతి తేనెటీగలు లోపల ఒక పట్టు పెడతాయి. పాము లోపలికి వెళ్ళినప్పుడు తేనెటీగలన్నీ బయటికి వెళ్ళేటట్లు కొడుతుంది. చీమలు బయటికి రాకుండా తేనెటీగలు బయటికి వచ్చినా, త్రాచుపాము లోపలికి వెళ్తుంటే తేనెటీగలు బయటికి వచ్చినా, లేదా పాము వెళ్ళిపోయాక తేనెటీగ లోపలికి వెళ్తున్నా అందులో తేనెపట్టు వుందని అర్థం. అప్పుడు కలుగులోకి పొగ వచ్చే పదార్థాన్ని చొప్పించినప్పుడు ప్రక్క కలుగులోంచి పాము వెళ్ళిపోతుంది. తేనెటీగలన్నీ వెళ్ళిపోతాయి. అప్పుడు పుట్ట త్రవ్వి తేనె తీసి తాటాకులో పోసి పిండుతారు. అప్పుడు వచ్చేదానిని పుట్ట తేనె అంటారు. అది నాలుక మీద పడితే అమృతం పడినట్లే వుంటుంది అంటారు. ఆ పుట్ట తేనె తెచ్చి అభిషేకం చేస్తే గంధర్వగానం వస్తుంది ఉత్తరజన్మలో. వాగ్గేయకారుడౌతాడు. అన్నమాచార్యుల వారిలా, ఒక శ్యామాశాస్త్రి గారిలా అవగలిగిన సంగీత విద్య ఎక్కడినుంచీ వస్తుంది అంటే పుట్టతేనెతో అభిషేకం చేస్తే. కానీ అది లభ్యమవుతుందనుకోవడం చాలా కష్టం.
పంచదార - పంచదారతో అభిషేకం చేస్తే దరిద్రం పోతుంది. దరిద్రం పోవడం వేరు, ఐశ్వర్యం కలగడం వేరు. దరిద్రం అంటే అన్నీ వుంటాయి కానీ అనుభవించడానికి వుండదు. ఇదంతా పోగొట్టి మనసులో అనుకున్నట్లు అనుభవించే శక్తిని ఇచ్చేవాడు పరమేశ్వరుడు. దరిద్రనాశనం బాహ్యంలో లేకపోవడం దగ్గరినుంచి ఉన్నది అనుభవించేంతవరకు. ఇది శివానుగ్రహం చేతనే సాధ్యం.
మారేడు దళం - మారేడు దళం యొక్క ఈనె క్రిందకి వెళ్ళేటట్లు పెద్దగా ఉన్న ఆకుని పైకి పెట్టి కొంచెం అంచు అభిషేకం చేసే పాత్రకేసి నొక్కాలి. పాత్రను ఒడుపుగా వంచితా మారేడు దళం చివరినుంచి (శీర్షం నుంచి) ధార పడుతుంది. ఆ ధార శివలింగం మీద పడేటట్లుగా అభిషేకం చేస్తే సర్వసౌఖ్యములకూ కారణమౌతుంది.
పసుపు నీళ్ళల్లో కలిపి అభిషేకం చేస్తే మంగళములకు కారణమౌతుంది.
మామిడిపండు రసంతో అభిషేకం చేస్తే రోగం పోవడానికి కారణమౌతుంది.
నేరేడు పండ్ల రసంతో అభిషేకం చేస్తే వైరాగ్యం కలగడానికి కారణమౌతుంది. ఎంత వయస్సు వచ్చినా ఇంకా అర్థరహితమైన జీవితం. పిచ్చి కోరికలు. బ్రతికున్నంతకాలం కోరికలే? గురువుగారి దగ్గరికి వెళ్ళినా. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళినా కోరికలే. బ్రతుకంతా కోరికలు వుండడం కాదు. ఏదో ఒకనాడు చెప్పులు విప్పాల్సిందే. వైరాగ్య సుఖాన్ని పొందాలి. ఈశ్వరుడియందు మనస్సు పెట్టాలి. అలా కాకుండా కోరికలతో వెంపర్లాడే స్థితి మనస్సులో వుంటే ఆ పరిస్థితి తొలగించమని నేరేడు పండ్ల రసంతో అభిషేకం చేయాలి.
నవరత్నాలు నీళ్ళల్లో వేసి అభిషేకం చేస్తే ఇల్లు కట్టుకోలేక పోయిన వాడికి ఇల్లు కట్టుకునే అదృష్టం కలుగుతుంది.
బంగారం నీళ్ళల్లో వేసి అభిషేకం చేస్తే భూమి కలిసొస్తుంది.
కస్తూరి నీళ్ళల్లో కలిపి అభిషేకం చేస్తే చక్రవర్తిత్వాన్ని పొందుతాడు. బాహ్యంలో రాజ్యానికి చక్రవర్తి. ఏ కోరికా లేక కస్తూరితో అభిషేకం చేస్తే భక్తి సామ్రాజ్యానికి చక్రవర్తివి అవుతావు.
విభూతిని నీళ్ళల్లో కలిపి అభిషేకం చేస్తే సమస్త పదార్థాలతో అభిషేకం చేసినట్లే అని శాస్త్రంలో మర్యాద చూపించింది. ఈ పదార్థం చేశారు, ఈ పదార్థంతో చేయలేదు అన్న లోటు చెప్పరు. అన్నింటితో చేసేసినట్లే.
ప్రతిరోజూ ఇంట్లో చందనం తీసి దానిని నీళ్ళల్లో కలిపి అభిషేకం చేస్తే సంతానం కలుగుతుంది. చందనంతో రోజూ అభిషేకం చేస్తే కొడుకు వృద్ధిలోకి వస్తాడు.
కాబట్టి ఒక్కొక్క పదార్థంతో అభిషేకం చేస్తే ఒక్కొక్క లౌకికమైన ప్రయోజనాలు కలుగుతాయి. కోరికలు ఒక వయస్సులో అవసరం. ఆ కోరికలు తీర్చుకోవడానికి రుద్రాధ్యాయం ఈ పదార్థాలను చెప్పింది. రుద్రకామ్యార్చన అంటారు. కోరికలనుండి కోరికలు కాని కోరికల వరకు ఇవ్వగలిగిన వాడు ఒక్కడే పరమేశ్వరుడు. అది అభిషేక ప్రక్రియ చేత లభిస్తుంది. అందుకు రుద్రం, రుద్రాధ్యాయం, రుద్రాభిషేకం అంత గొప్పవి. ఇవన్నీ లౌకిక ప్రయోజనములు, ఆంతరమునందు విశేష ప్రయోజనములు.

No comments:

Post a Comment