పరమ పావనమైన కార్తీక సోమవార వైభవాన్ని పురాణములు బహుముఖాలుగా చెప్తూన్నాయి. కొన్ని కొన్ని కథారూపములతో అందిస్తూన్నాయి. కథలు వినేటప్పుడు ఒకవిధమైన ఆసక్తి, శ్రద్ధ కలుగుతాయి. ఈ కథలన్నీ కూడా జరిగినవాటిని మనకి ఒక తార్కాణంగా చూపిస్తున్నటువంటి స్వానుభవ గాధలు. ఇవి పురాణములలోనూ, ఐతిహ్యాలలో కూడా కనబడుతూ ఉంటాయి. ముఖ్యంగా శివ వ్రతములు అవి ఏవైనప్పటికీ కూడా దివ్యములు. అవి ప్రదోష వ్రతం కావచ్చు, మాస శివరాత్రి వ్రతం కావచ్చు. అలాగే శ్రావణ మాస, మాఘ మాస వ్రతములు ఇత్యాదులన్నీ కూడా శివ వ్రతములు అని చెప్పబడుతున్నాయి. శివ వ్రతము పాప సంహారము, అభీష్ట కారకము, మోక్ష ప్రదాయకము. ఈవిధంగా మూడు రకాల సిద్ధులు శివపూజ వల్ల లభిస్తున్నాయి.
వ్రతాలన్నింటిలోకి శివ వ్రతములు మేలయితే శివ వ్రతాలలో సోమవార వ్రతములు మేలు అన్నారు. ఈ సోమవార వ్రతములు ఏడాది పొడవునా చేయవచ్చు. కొందరు జీవిత కాల సోమవార వ్రతములు చేస్తారు. ఇంక వారియొక్క భాగ్యం చెప్పడానికి ఏమున్నది? అందునా విశేషించి పదహారు సంఖ్యతో సోమవారములు ఉన్నాయి. శ్రావణ, కార్తిక, మాఘమాస - ఈ మూడు మాసములలో సోమవారములకి మరింత విశేషమున్నది. అయితే వ్రతం చేసే వాడు నిర్మలమైన మనస్సుతో, విస్తారమైన భక్తితో పూజ చేయాలి. ఈ రెండే అర్హతలు ప్రధానంగా. నిర్మలమైన అంతఃకరణము, చక్కని భక్తి. అంటే పరమాత్మపై ప్రీతి భావము కలిగి ఉండాలి. అటువంటి వారు ప్రదోష కాలంలో చక్కని మండపాన్ని ఏర్పరచి హిమగిరి పుత్రికా రమణు ఇందు కళాధరు - ఇక్కడ చెప్పేటప్పుడు పార్వతీ రమణుడు అన్నప్పుడు పార్వతీ సహితునిగానే శివారాధన చేయాలి. ఇందు కళాధరుడు - ఇది మర్చిపోరాదు. చంద్ర శేఖరుడు. చంద్రశేఖర స్వరూపంగా ఉమా సహిత శివుని ధ్యానించడం ఒక ప్రక్రియ. అందుకు మనం శివలింగమునందు ఆరాధించినప్పటికీ ధ్యానంలో మాత్రం "ఉమా సహాయం పరమేశ్వరమ్ విభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం" అని నీలకంఠుడై, చంద్రశేఖరుడై, ఉమాసహితుడై మందస్మిత వదనారవిందుడై ధవళ శరీరంతో ఉన్నటువంటి శివుణ్ణి మనం ధ్యానం చేసి ఆరాధన చేయాలి. ఇలాగ నిత్య సోమవార వ్రతములున్నాయి. ఇది అన్ని వర్ణముల వారూ చేయడగినటువంటి దివ్యమైన వ్రతము. స్త్రీపురుషులందరూ చేయవచ్చు. పైగా సులభమైన వ్రతము. దుర్లభమైన ఫలాలను కూడా సులభంగా ఇవ్వగలిగేటటువంటి వ్రతము.

No comments:
Post a Comment