దీపదానం

దీపదానం వల్ల కలిగే పరమోత్తమ ఫలయోగాన్ని ధర్మరాజుకు భీష్ముడు చెప్తున్నాడు:

దీపం పైకి ప్రసరించే తేజస్సు, కాంతిని విస్తరింపజేసేది. కాబట్టి దీపప్రదానం రాజుల తేజస్సును పెంపొందింపజేస్తుంది. అంధకారం అంధతామిస్రమనే నరకం. దక్షిణాయనం కూడా అంధకార బంధురమే. ఉత్తరాయణం కాంతిమయం. అందువలన, అంధతామిస్ర నరకం నుండి తప్పించుకోవడానికి దీపదానం శ్రేష్ఠం.

దీపజ్వాల పైకి ప్రసరిస్తుంది. అది చీకటికి మందు. కాబట్టి దీపదానం చేసిన వాడు ఊర్ధ్వ గతిని పొందుతాడని నిశ్చయం.

దేవతలు తేజస్వులు, కాంతిమంతులు, కాంతిని ప్రసరింపజేసేవారు. రాక్షసులు, తామసులు కాబట్టి దేవతా ప్రీతికి దీపదానం చెయ్యాలి.

దీపదానం వల్ల నరుని కళ్ళు సమర్థాలవుతాయి. నరుడు కాంతిమంతుడవుతాడు.

దీపదానానంతరం దీపాన్ని ఆర్పరాదు, మరొకచోటికి కొనిపోరాదు, నశింపజేయరాదు. దీపాన్ని హరించిన వాడు గ్రుడ్డివాడు అవుతాడు, శోభాహీనుడవుతాడు. మరణానంతరం నరకానికి వెళతాడు.

దీపదాత స్వర్గలోకంలో దీపమాల వలె వెలుగొందుతాడు.

నేతితో దీపాన్ని వెలిగించి దానం చేయటం మొదటి పధ్ధతి.

ఓషధీ రసాలతో వెలిగించటం రెండవ పధ్ధతి.

తనకు పుష్టిని కోరుకొనే వాడు వస మేధస్సు, ఎముకలనుండి తీసిన నూనెతో దీపాలు వెలిగించరాదు.

తనకు ఐశ్వర్యాన్ని అభిలషించేవాడు నిత్యమూ కొండలనుండి జారే ప్రవాహాల దగ్గర, అరణ్యంలో, దేవమందిరాలలో, కూడళ్ళలో, గోశాలలో, బ్రాహ్మణుల ఇంటిలో, దుర్గమ ప్రదేశాలలో దీపదానం చేయాలి. ఆ పవిత్ర దీపదానం ఐశ్వర్యప్రదం. దీపాన్ని దానం చేసిన నరుడు వంశాన్ని దీపింపజేస్తాడు. శుద్ధ చిత్తుడై వెలుగొందుతాడు. మరణానంతరం శాశ్వత జ్యోతిర్మయ లోకాలను పొందుతాడు.
Photo: (దీపదానం - మహా భారతం - అనుశాసనిక పర్వం)

No comments:

Post a Comment