పృథివి అంతా శివుడే.

పృథివి అంతా శివుడే. ఆయన కానిది లేదు. పృథివి అంతా ఆయన స్వరూపం. ఆపస్ - అంటే నీరు ఆయన స్వరూపం; తేజస్సు - అగ్నిహోత్రం ఆయన స్వరూపం; వాయువు పరమేశ్వరునియొక్క స్వరూపం; ఆకాశం ఆయనయొక్క స్వరూపం. సూర్యుడు పరమశివుని యొక్క స్వరూపం. చంద్రుడు పరమశివుని యొక్క స్వరూపం. ఆఖరికి నేను అని లోపల చూపించుకొనే యాజమాన స్వరూపం కూడా పరమశివ స్వరూపం. అష్టమూర్తి తత్త్వం మీద ఆయనయొక్క తత్త్వం అంతా నడుస్తుంది కాబట్టే శివపూజయండు కూడా ఒక లక్షణం ఉంటుంది. శివపూజను 108నామాలతో చేశారా, సహస్ర నామాలతో చేశారా, అన్న దానితో సంబంధం ఉండదు. శివపూజ పరిపూర్ణం కావాలి అంటే ఆగమ తత్త్వవేత్తలు అయినటువంటి పెద్దలు చెప్పే మాట ఒకటే - ఎనిమిది నామములతో పూజ చేస్తే చాలు.
భవాయ దేవాయ నమః;
శర్వాయ దేవాయ నమః
ఈశానాయ దేవాయ నమః
పశుపతయే దేవాయ నమః
రుద్రాయ దేవాయ నమః
ఉగ్రాయ దేవాయ నమః
భీమాయ దేవాయ నమః
మహతే దేవాయ నమః
ఈ ఎనిమిది నామముల చేత శివపూజ పూర్తి అయిపోతుంది. ఈ ఎనిమిది నామములకు పత్ని అన్న మాటను కలిపితే అమ్మవారి పూజ పూర్తి అయిపోతుంది.
భవస్య దేవస్య పత్న్యై నమః
ఆయన కొడుకులకి పూజ చేయాలంటే భవస్య దేవస్య పుత్రై నమః అంటే ఆయన కొడుకులకి పూజ పూర్తి అయిపోతుంది. ఎనిమిది అంకె మీద పరమశివుడి తత్త్వం నడుస్తూ ఉంటుంది. అందుచేత ఆయన నామములు కూడా ఎనిమిది నామములే చెప్తాం. ఆయనయొక్క పత్నీ స్వరూపమైన పరదేవతకు పూజ చేయాలన్నా, ఆయన కుమారులైన విఘ్నేశ్వరునికి, సుబ్రహ్మణ్యుడికీ పూజ చేయాలన్నా ఆ ఎనిమిది నామములకు ప్రక్కన పత్ని అన్న శబ్దాన్ని, పుత్రా శబ్దాన్ని చేర్చి పూజ చేస్తే శివపూజ కుటుంబ పరంగా పూర్తీ అయిపోతుంది. అందుకని ఎనిమిది అంకె మీద ఉండేది అంతా సాకార తత్త్వము. శివుడు తప్ప వేరొకటి లేదు జగత్తులో. అంతటా ఆయన నిండి నిబిడీ కృతమై ఉంటాడు.

Photo: పృథివి అంతా శివుడే. ఆయన కానిది లేదు. పృథివి అంతా ఆయన స్వరూపం. ఆపస్ - అంటే నీరు ఆయన స్వరూపం; తేజస్సు - అగ్నిహోత్రం ఆయన స్వరూపం; వాయువు పరమేశ్వరునియొక్క స్వరూపం; ఆకాశం ఆయనయొక్క స్వరూపం. సూర్యుడు పరమశివుని యొక్క స్వరూపం. చంద్రుడు పరమశివుని యొక్క స్వరూపం. ఆఖరికి నేను అని లోపల చూపించుకొనే యాజమాన స్వరూపం కూడా పరమశివ స్వరూపం. అష్టమూర్తి తత్త్వం మీద ఆయనయొక్క తత్త్వం అంతా నడుస్తుంది కాబట్టే శివపూజయండు కూడా ఒక లక్షణం ఉంటుంది. శివపూజను 108నామాలతో చేశారా, సహస్ర నామాలతో చేశారా, అన్న దానితో సంబంధం ఉండదు. శివపూజ పరిపూర్ణం కావాలి అంటే ఆగమ తత్త్వవేత్తలు అయినటువంటి పెద్దలు చెప్పే మాట ఒకటే - ఎనిమిది నామములతో పూజ చేస్తే చాలు.
భవాయ దేవాయ నమః;
శర్వాయ దేవాయ నమః
ఈశానాయ దేవాయ నమః
పశుపతయే దేవాయ నమః
రుద్రాయ దేవాయ నమః
ఉగ్రాయ దేవాయ నమః
భీమాయ దేవాయ నమః
మహతే దేవాయ నమః
ఈ ఎనిమిది నామముల చేత శివపూజ పూర్తి అయిపోతుంది. ఈ ఎనిమిది నామములకు పత్ని అన్న మాటను కలిపితే అమ్మవారి పూజ పూర్తి అయిపోతుంది.
భవస్య దేవస్య పత్న్యై నమః
ఆయన కొడుకులకి పూజ చేయాలంటే భవస్య దేవస్య పుత్రై నమః అంటే ఆయన కొడుకులకి పూజ పూర్తి అయిపోతుంది. ఎనిమిది అంకె మీద పరమశివుడి తత్త్వం నడుస్తూ ఉంటుంది. అందుచేత ఆయన నామములు కూడా ఎనిమిది నామములే చెప్తాం. ఆయనయొక్క పత్నీ స్వరూపమైన పరదేవతకు పూజ చేయాలన్నా, ఆయన కుమారులైన విఘ్నేశ్వరునికి, సుబ్రహ్మణ్యుడికీ పూజ చేయాలన్నా ఆ ఎనిమిది నామములకు ప్రక్కన పత్ని అన్న శబ్దాన్ని, పుత్రా శబ్దాన్ని చేర్చి పూజ చేస్తే శివపూజ కుటుంబ పరంగా పూర్తీ అయిపోతుంది. అందుకని ఎనిమిది అంకె మీద ఉండేది అంతా సాకార తత్త్వము. శివుడు తప్ప వేరొకటి లేదు జగత్తులో. అంతటా ఆయన నిండి నిబిడీ కృతమై ఉంటాడు.

No comments:

Post a Comment