అప్పుడి నాయనారు-నాయనార్ల (శివభక్తులు) చరిత్రలు

గురుభక్తి విషయంలో అప్పుడి నాయనారును చెప్పి మరొకరి గూర్చి చెప్పాలి. అయన గురుభక్తి నిరుపమానము. గాఢ శివభక్తుడు. గృహస్తుగా తన ధర్మాన్ని జాగరూకతతో నిర్వహించేవాడు. చోళదేశంలోని తొంగలూరు భ్రాహ్మణుడాతడు.

అప్పుడి అప్పారు ఖ్యాతి విన్నాడు. పల్లవరాజు అప్పారును శిక్షించి నట్లును, శిక్షగా అప్పారును బండరాయికి కట్టించి సముద్రములో పడవేస్తే దైవ కృపచే బండతేలి పోయి అప్పారును సురక్షితముగా తీరాన్ని చేర్చినదని మొదలైన కదలన్నీ అప్పారు గురించి విన్నాడు. అయన పనులకు ముగ్దుడై అప్పారును చూడకపోయినా అప్పారును తన గురువుగా నెంచుకొని గురుపూజా దురంధరుడయ్యాడు. పరమశివుడు భక్తులయెడ కృపతో గురువుగా భాసిస్తాడు. అప్పుడి సదా గురుపద కమలములను ధ్యానిస్తూ వుండేవాడు. తన కుమారులకు వాగీశులని పెద్దవాగీశుడు చిన్ని వాగీశుడని పేర్లు పెట్టాడు. గృహోపకరణములకు, తవ్వించిన నూతులకు, తటాకములకు, వేయించిన తోటలకు అన్ని ధర్మకార్యములకు గురువు గారిపేరు మీద వాగీశునిధర్మము అని వుంచాడు.

అప్పారు ఒక రోజున తింగలూరు మీదుగా ప్రయాణం చేస్తున్నాడు. ఒక జలాశయం దగ్గరకు వెళ్ళాడు. తన పేరే అంతటాకనబడింది. ఆశ్చర్యపోయాడు. బాటసారుల నుండి తీర్థయాత్రీకుల నుండి ఇవన్నీ అప్పుడి నాయనారు నిర్మించినవే నని తెలిసింది. విస్మయంతో అప్పుడి దగ్గరకు వెళ్లాడు. అప్పుడి ఈ శివభక్తుని సాదరంగా బహునమ్రతతో ఆహ్వానించాడు. అప్పారు అప్పుడిని పలుకరించి మహాశయా! మిమ్ములను గూర్చి, మీ మంచి పనులగూర్చి పెక్కుమంది నుంచి విన్నాను. మీకు నా జోహారులర్పించ వచ్చాను. నాపై దయవుంచి తెలుపండి. ఈ ధర్మ కార్యాలన్నిటిపైనా మీ పేరుంచకుండా ఎవరిపేరో ఎందుకు పెట్టారు? అని అడిగాడు. ఈ విధంగా అతిసామాన్యంగా అప్పారు అడిగేటప్పటికి - అప్పుడికి ఒకింత కోపమేకలిగింది. స్నేహితుడా! నీవు శివభక్తుడివిగా కన్పడుతున్నప్పటికి వాగీశుని గూర్చి ఏమీ తెలియనట్లు కనపడుతున్నావు. పల్లవరాజు ఆయనను ఎన్ని బాధలు పెట్టాడు. దైవకృపచే ఎలా రక్షింపబడి శైవమత వ్యాప్తికి తోడ్పడ్డాడో తెలియదా? రాజుగారు అతనిని బండకు కట్టించి సముద్రములో త్రోయించిన సంగతి, ఎలా తేలిపోయి అయన సురక్షితంగా తీరము చేరాడో నీవు వినలేదా? ఎవరు నువ్వు అని అడిగాడు.

అప్పుడి గురుభక్తి తత్పరతకు అప్పారు చలించిపోయాడు. అప్పుడితో నేను తీవ్ర రుగ్మతకు లోనయి శివుని పాదాలనాశ్రయించిన దీనుడను. పరమశివుని కృపచే ఆ తీవ్రరుగ్మత నుండి బయటపడి శైవమతానికి తిరిగివచ్చిన అల్పుడను అని అప్పారు అన్నాడు.

అప్పారు గురించి రెండు రకముల చిత్రణలను చూడుడు. అప్పుడి అప్పారు యొక్క ఘనతను ముచ్చటించాడు. అప్పారు తన లోసగుల గూర్చి చెప్పాడు.

ఈ పై మాటలు ఆ శివభక్తుని నోట వినగానే అప్పుడికి అర్థమైంది. తన గురువైన అప్పారుతోనే తాను స్వయముగా మాట్లాడుతున్నానని. తన గురువే తనయెదుట సాక్షాత్కరించాడని. అప్పుడి అప్పారుకు ప్రణతులనర్పించి తాను తన భార్య కలిసి అప్పారును అర్చించారు. తమ నుండి బిక్షను తీసికొనవలసినదిగా అర్థించాడు. అప్పారు బిక్షకు అంగీకరించాడు. అప్పుడి తనయుడు తోటలోనికి అంటె ఆకులూ కోసుకుని తీసుకుని వచ్చుటకు వెళ్లగా పాము అతనిని కరిచింది. ఆ తనయుడు గూడ శివభక్తుడే. అమ్మ చేతిలో ఆకుల నుంచుతూ పాము సంగతి చెప్పి మరణించాడు.

అప్పుడి ఇది గమనించి అతిథికి భంగము కాకుండా దు:ఖము దిగమింగుకొని అప్పారును భోజనానికి రమ్మని పిలిచాడు. అప్పారు అప్పుడికి, అప్పుడి భార్యకు భస్మమిచ్చి మీ పిల్లవానిని పిలువమన్నాడు. అప్పుడి - ఆతను రాలేని పరిస్థితిలో వున్నాడని బదులు ఇచ్చాడు. అప్పారు అప్పుడిని నిజం చెప్పమని నిలదీశాడు. అప్పుడి - నిజం చెప్పాడు. అప్పారు వెంటనే అప్పుడితో తన తనయుడి శవాన్ని దేవాలయం ముందరకు తెమ్మన్నాడు. అక్కడ అప్పారు ఒక పాటలో దేవుని వినుతించాడు. ఒక అద్భుతం జరిగింది. పిల్లవాడు నిదుర నుంచి లేచినట్లుగా లేచాడు. తల్లిదండ్రులు తప్ప అందరూ సంతోషించారు. తల్లిదండ్రులు అథితి భోజనమునకు ఆలస్యమైనదని చింతించారు. అప్పారు వెంటనే కూర్చుని భోజనము చేశాడు. అప్పారు అప్పుడితో కొంతకాలమున్నాడు. అప్పారు యెడ గురుభక్తి మూలాన అప్పుడికి శివసాయుజ్యమొచ్చింది.

Photo: అప్పుడి నాయనారు-నాయనార్ల (శివభక్తులు) చరిత్రలు

No comments:

Post a Comment