ఆషాడ మాసం లో శుద్ధ ఏకాదశి రోజున క్షీరసాగరం లో శయనించిన విష్నుభగవానుడు ... కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రనుండి మేల్కొంటాడని , అలా నిద్రనుండి మేల్కొనిన మరుసటి రోజే క్షీరాబ్ది ఏకాదశి గాను ఆ మరుచటి రోజు క్షీరాబ్ధి ద్వాదశి గాను భక్తులు పండుగను జరుపుకుంటారు .
కృతయుగం లో దేవతలు , రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసిన రోజు కనుకే " క్షీరాబ్ధి ద్వాదశి " అని పిలుస్తారు .
అమృతం కోసం క్షీరసాగరాన్ని చిలికారు కనుక " చిలుక ద్వాదశి" అని ,
అమృతం కోసం సాగరాన్ని మధించారు గనుక "మధన ద్వాదశి" అని వాడుకలో ఉంది .
క్షీరసాగర మధనము లో జన్మించిన లక్ష్మీదేవిని శ్రీమహావిష్ణువు దేవ దానవ సమక్షములో వివాహమాడుతాడు . లక్ష్మీ కల్యాణము జరుపుతారు .
శ్రీమహావిష్ణువు లక్ష్మీ సమేతం గా బ్రహ్మ , ఇంద్రాది దేవతల తో కలసి బృందావనానికి వెళ్ళారు అంటారు ... అందుకే ఈ రోజుని " బృందావని ద్వాదశి" అని కుడా అంటారు .
బృందా విష్ణువుల వివాహము (గాంధర్వ వివాహము)జరిగి బృంద తులసి చెట్టు గాను ,
విష్ణువు సాలగ్రామం (శిలగా)గా ఒకరిని ఒకరు శపించుకున్న రోజు గనుక " బృంద ద్వాదశి " అంటారు .
దశావతారాల్లోని శ్రీకృష్ణావతారంలో తులసికీ శ్రీకృష్ణునికీ కార్తీక ద్వాదశినాడు వివాహం జరిగిందని పురాణ కథనం. తులసి కల్యాణానికి దేవ దీపావళి అనీ పేరు. దీపావళినాటిలాగా కార్తీక శుద్ధ ద్వాదశినాడు ఇంటినిండా దీపాలు ప్రమిదల్లో వెలిగిస్తారు.
చాతుర్మాస్యవ్రతం ఆచరించిన సాధకులు కార్తీకశుద్ధ ద్వాదశిరోజు వ్రతసమాప్తి చేయడం ఆచారంగా వస్తోంది.
క్షీరాబ్ధి ద్వాదశి శ్రీ మహావిష్ణువు తేజోభరితంగా అమృతకలశాహస్తయై సకల సిరులతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని పరిణయమాడిన శుభతిధి. ఈ కారణం చేతనేక్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం ముత్తయిదువలు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి, శ్రీ మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి వివాహం జరిపిస్తారు. తులసీదేవిని శ్రీలక్ష్మీదేవిగానూ, ఉసిరి చెట్టును శ్రీమన్నారాయణునిగాను తలచడం వల్ల తులసి చెట్టుకు, ఉసిరి కొమ్మకను కలిపి విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని సభక్తికంగా పూజించి, వారిద్దరికీ వివాహం జరిపించినట్లుగా భావించి పునీతులవుతారు.

No comments:
Post a Comment