ఏకాదశి తిధి విష్ణుప్రీతికరమైనది. అందునా కార్తీకమాసంలో వచ్చే ఏకాదశి ఎంతో మహిమాన్వితమైనది. కార్తీక శుద్ధ ఏకాదశి ని " ప్రబోధైకాదశి", బృందావన ఏకాదశి అని పేరు. ఆషాడ ఏకాదశి ( అనగా శయన ఏకాదశి) నాడు శయనించిన ( యోగనిద్ర ) స్వామి, ఆ రోజు మేల్కొంటాడని పురాణ కథనం. ఆ ప్రబోధన మంత్రం!
ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద! త్యజనిద్రాం జగత్పతే!
త్వయిసుప్తే జగత్ సుప్తం ఉత్థితే చోత్థితం జగత్
దీనితో ప్రార్థన చేసి, ఈ రోజున శ్రీ మహావిష్ణువును అర్చించి, ఉపవాసం చేయాలి. భాగవతం లోని, " అంబరీషోపాఖ్యానం" పఠనం, శ్రవణం శ్రేష్ఠం. రాత్రి పూట విష్ణునామకీర్తనతో కాలంగడపాలి. తులసి వనంలో గానీ, తులసి కోట దగ్గర గానీ విష్ణుపూజ చేయాలి. తులసి వనాన్ని " బృందావనం " అంటారు.

No comments:
Post a Comment