గుంటూరు జిల్లా చేజెర్లలోని కపోతేశ్వర ఆలయ విశేషాలు

మహాభారతంలోని కథ :
మాంధాత కుమారుడైన శిబి చక్రవర్తికి మేఘదాంబరుడు, జీమూత వాహనుడు అనే ఇద్దరు తమ్ముళ్లు వుండేవారు. వారిద్దరిలో మేఘదాంబరుడు.. తన అన్న అనుమతితో 1500 మందిని వెంటబెట్టుకుని కాష్మీరదేశం విడిచి తీర్థయాత్రలకు వెళ్లాడు. అతడు ఒక కొండపై యోగులతో కలిసి కొన్నాళ్లవరకు తపోదీక్షను ఆచరించి, మరణించాడు. ఆ కొండపైనే అతని శరీరం దహనం చేయగా.. ఆ భస్మం ఒక లింగరూపం ధరించింది.
మేఘదాంబరుడు తిరిగి రాలేదన్న నెపంతో జీమూత వామనుడు తన అనుచరులను తీసుకుని వెదుకుతూ ఆ కొండవద్దకు చేరుకున్నాడు. అన్నకు జరిగిన విషయం గురించి తెలుసుకుని.. అతను కూడా అదే కొండపై తపమాచరించి, మరణించాడు. అతని భస్మం కూడా లింగరూపం ధరించింది.
మరికొన్నాళ్ల తరువాత తన ఇద్దరు తమ్ముళ్లు తిరిగి రాలేదనే బెంగతో.. శిబి చక్రవర్తి కొంతమంది అనుచరులను తీసుకుని వెదుక్కుంటూ వెళతాడు. కొండ దగ్గరకు చేరుకున్న తరువాత అక్కడ అతను రెండు లింగాలను చూస్తాడు. అప్పికప్పుడే అతను నూరు యజ్ఞాలు చేయాలని సంకల్పిస్తాడు. అలా 99 యాగాలు ఎటువంటి లోపం లేకుండా పూర్తి చేశాడు. అయితే 100వ యాగం చేస్తుండగా.. దేవతలు అతనిని పరీక్షించాలని అనుకుంటారు.

అప్పుడు శివుడు ఒక వేటగానిలాగా, బ్రహ్మ అతని బానంలాగా, విష్ణువు ఒక కపోతంలాగా అక్కడికి చేరుకుంటారు. వేటగాని రూపంలో వున్న శివుడు, పావురాన్ని తరుముతుండగా.. ఆ పావురం శిబి చక్రవర్తి దగ్గరకు చేరుకుని శరణు కోరుకుంటుంది. చక్రవర్తి ఆ పావురానికి అభియమిచ్చాడు. వేటగాడు అక్కడికి చేరుకుని, ఆ పావురాన్ని తనకివ్వాలని కోరాడు. లేకపోతే తన కుటుంబం ఆకలితో అలమటిస్తారని వేడుకుంటాడు.
దాంతో శిబి చక్రవర్తి ఇరకాటంలో పడిపోతాడు. చివరకు తను పావురానికి సమానమైన తన మాంసాన్ని ఇస్తానని ఆ వేటగాడిని ఒప్పిస్తాడు. త్రాసులో ఒకవైపు పావురాన్ని వుంచి, మరోవైపు తన శరీరంలో నుంచి కొంత మాంసాన్ని కోసం వుంచాడు. అయినా అది సరితూగలేదు. కొద్దిసేపటివరకు ఇలా చేయగా.. అది సరితూగకుండా అలాగే వుండిపోయింది. చివరకు శిబి చక్రవర్తి తన తలను నరికి.. ఆ త్రాసులో పెట్టించాడు.
అతడు చేసిన ఈ త్యాగానికి మెచ్చి దేవతలు అతనిని పునరుజ్జీవితుడిని చేసి, ఏదైనా వరం కోరుకోమని చెప్పారు. ఆ రాజు తనకు, తన పరివారానికి కైలాస ప్రాప్తి కలగించాలని కోరుకున్నాడు. అలాగే తమ శరీరాలు లింగాలుగా మారిపోవాలని కోరాడు. అలా ఆ విధంగా తల లేని శిబి మొండమే.. కపోతేశ్వర లింగమైందని ఈ కథ సారాంశం.

ఆలయ విశేషాలు :
చేజర్ల గ్రామంలో వున్న ఈ ఆలయం నిర్మాణం.. గ్రామానికి వాయువ్య దిశగా వుంటూ.. ముఖం తూర్పు దిక్కుగా వుంటుంది. తూర్పున వున్న ఒకే ద్వారంపైన ఒక చిన్న గోపురం వుంటుంది. ఈ గోపురానికి ఎటువంటి అలంకరణలు వుండక.. సాదాసీదాగా వుంటుంది.
ఆలయానికి బయటభాగంలోదక్షిణంవైపు ఒక పెద్ద చెట్టు వుంటుంది. దాని కాండం పొడవు 56 అడుగులు వుండేది. అయితే ఈ చెట్టు 1917లోనే కూలిపోయింది. ఈ ఆలయ నిర్మాణాన్ని వాస్తుశాస్త్రంలో ‘‘హస్తిప్రస్త’’ (ఏనుగు వీపు) అని అంటారు. ఈ ఆలయం ముందుగా బౌద్ధ చైత్యం అయినా.. దానిని హిందువుల పూజా విధానానికి అనువుగా మలిచారు.
ఈ ఆలయంలో వున్న కపోతేశ్వర లింగం.. తలలేని మొండం శరీరాకృతిలో కనిపిస్తుంది. లింగానికి పై భాగంలో రెండు రంధ్రాలు వున్నాయి. కుడిపక్కనున్న రంధ్రంలో ఒక పాత్రకు సరిపడా నీళ్లు మాత్రమే పడుతాయి. అదే ఎడమవైపునున్న రంధ్రంలో ఎన్ని నీళ్లు పోసినా.. అవి తిరిగిరావు.
ఈ కపోతేశ్వరాలయంలో 9 శాసనాలున్నాయి. వాటిలో రెండు శాసనాల ప్రకారం.. కపోతీశ్వరుని చుట్టూ 4,444 లింగాలున్నాయి. మరో రెండు శాసనాలు క్రీ.శ.1069, 1087 కు చెందినవి. అలాగే విజయనగర కాలపు శాసనాలు కూడా ఇక్కడ చాలా వున్నాయి.
 
Photo: గుంటూరు జిల్లా  చేజెర్లలోని కపోతేశ్వర ఆలయ విశేషాలు

No comments:

Post a Comment