కార్తీకమాసం దగ్గరకి వచ్చేటప్పటికి సాలగ్రామం, సాలగ్రామం అంటారు. సాలగ్రామం దానం చెయ్యాలంటే రెండు లక్షణాలు మీకు తెలిసుండాలి. ఒకటి సాలగ్రామం అంటే రాయే కదా అని మీరు అనుకోకూడదు. రాయి సాలగ్రామం. ఆ సాలగ్రామమే విష్ణువు. సాలగ్రామమే శివుడు. అంతటా పరమేశ్వరుణ్ణి చూడగలగాలి. నిన్ను ఉద్ధరించేవాడు కూడా నీతో కలిసి ఉండదు. సాలగ్రామం ఎక్కడ వుంటుంది? వేరే ఎక్కడా వుండదు. రాళ్ళల్లో వెతికి సాలగ్రామం తియ్యాలి. నిన్ను ధర్మపథంలో నడిపించగలిగే, వేదములో విశ్వాసము వున్న గురువు , నీలాగే ఆయనా కుటుంబ జీవనం చేస్తున్నట్ట్లుగా ఉంటాడు. మనం సంసారంలో మునిగాము. ఆయన తేలి పరమాత్మ పాదములు పట్టుకున్నాడు. ఇద్దరూ రాళ్ళలోనే వున్నారు. రాళ్ళలో వున్న సాలగ్రామం లాంటివాడు గురువు. రాళ్ళల్లో వున్న రాయిలాంటివాళ్ళం మనం. రాయికి గౌరవం ఎందుకు వచ్చింది అంటే సాలగ్రామాల మధ్యనే వున్నది కాబట్టి. సాలగ్రామం కోసం రాళ్లన్నీ తీసి వెతుక్కుంటూ వుంటారు. రాళ్ళల్లో సాలగ్రామం వున్నట్టు , సాలగ్రామమంత గొప్పదని నీకు పూజ చేసినప్పుడు తెలిసింది - నీతోనే కలిసి నీ వూళ్ళోనే వున్న గురువుగారి అంతర వైభవమును గుర్తించి ఇలా పైకి వున్న తలని వంచి ఆయన పాదములయందు వుంచడంలో వుంది నిజమైన సాలగ్రామం! అందులో వుంది అసలు రహస్యమంతా.
శివకేశవ అబేధమైన పూజ సాలగ్రామ పూజ. ఏకం సత్!
వున్న ఒక్క పరతత్త్వము, ఆ పరమేశ్వరుడు ఈ రూపంగా వున్నాడని గుర్తేరగడమే సాలగ్రామాన్ని దానం చెయ్యడం, దీపం దానం చెయ్యడం, దీపం వెలిగించడం, శక్తి కొలది ఎవరికి తోచిన దానాన్ని వారు చెయ్యడం.
శివకేశవ అబేధమైన పూజ సాలగ్రామ పూజ. ఏకం సత్!
వున్న ఒక్క పరతత్త్వము, ఆ పరమేశ్వరుడు ఈ రూపంగా వున్నాడని గుర్తేరగడమే సాలగ్రామాన్ని దానం చెయ్యడం, దీపం దానం చెయ్యడం, దీపం వెలిగించడం, శక్తి కొలది ఎవరికి తోచిన దానాన్ని వారు చెయ్యడం.
No comments:
Post a Comment