అజామిళుడు

పూర్వం కన్యాకుబ్జం అనే పట్టణంలో అజామిళుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మహా పాపాత్ముడు, పరమ దరిద్రుడు, నింద్య చరిత్రుడు, అజ్ఞాని, దురాచారపరుడు, నికృష్ట జీవనుడు. జూదాలన్నా, వివాదాలన్నా ఆదరం మెండు. దొంగతనానికి పెట్టింది పేరు. అతడు యౌవనపు మత్తులో ఒక దాసీ దానిని భార్యగా చేసుకున్నాడు. ఆమెయందు పదిమంది కొడుకులను కన్నాడు. ఆతడు ఆ వ్యామోహ సముద్రములో మునిగిపోయాడు. ఆ పిల్లల లాలన పాలనలో, ముద్దు ముచ్చట్లలో చాలాకాలం గడిపాడు. సంసార లంపటుడై ఆనందంలో మైమరచాడు. ఆ మురిపాలన్నీ ముగిసి ముసలివాడైపోయాడు.
మలినమైన మనస్సు ఎప్పటికైనా నిర్మలమవుతుందన్నట్లుగా అజామిళుని నల్లని వెంట్రుకలు తెల్లబడినాయి. మోహబంధాలు జారిన రీతిగా బలం సన్నగిల్లి అవయవాలు పట్టుదప్పి వ్రేలాడాయి. ఇంద్రియ వాంఛలు ఇక నాకు అక్కరలేదు అన్నట్లు తల అడ్డంగా వణకసాగింది. కామోద్రేకం వయస్సుతో పాటు తరిగిపోయిన విధంగా కంటిచూపు కుంటుపడింది. రొప్పు పుట్టింది, పండ్లు ఊడిపోయాయి. దగ్గు, ఆయాసం పెచ్చరిల్లాయి. తలనొప్పి మొదలయింది. మనస్సు చెదిరిపోయింది. ముసలితనం ముంచుకు వచ్చింది. ఆ బ్రాహ్మణునికి ఎనభై ఎనిమిదేండ్లు నిండటం వల్ల మతి చలించింది. అయినా భ్రాంతి పోలేదు.
అతని చిన్నకొడుకు పేరు నారాయణుడు. అతడంటే అజామిళుడికి ప్రాణం. పుత్రవాత్సల్యం ఆత్మలో పొంగి పొరలాగా అజామిళుడూ అతని భార్యా ఆ కుమారుణ్ణి సదా ముద్దుచేస్తూ ఉండేవారు. నారాయణుడు ప్రక్కన కూర్చుండనిదే భోజనం చేయదు. నీళ్ళు తాగడు. ఆటపాటలలో సైతం వాడితో కలిసి ఆడుతూ పాడుతూ కాలం గడపసాగాడు. ఆ పారవశ్యంలో అజామిళుడు రాబోవు మరణాన్ని కూడా తెలుసుకోలేక పోయాడు. అలా కాలక్షేపం చేస్తూండగా అతడికి భయంకరమైన మరణకాలం ప్రాప్తించింది. అప్పుడు అతడు ప్రేమాతిశాయంతో తన కుమారుణ్ణి తలచుకొని "నారాయణా" అంటూ పెద్దగా కేక పెట్టాడు. ఆ సమయంలో అత్యంత పాపాత్ములను పట్టి బంధించి బాధించటానికి వచ్చిన సకలలోక భయంకరులైన యమకింకరులు అతడికి కన్పించారు. వాళ్ళను చూడగానే గుండెలు చెదిరిపోయాయి. ఇంద్రియాలు పట్టు తప్పాయి. ప్రాణాలు కంపించాయి. నిలువు గ్రుడ్లు పడ్డాయి. అతడి ఆత్మ గిలగిలలాడింది. ఆ క్షణంలో దూరంగా ఆడుకొంటూ ఉన్న అతడి చిన్న కుమారుడు అతడి హృదయ సీమలో గోచరించాడు. వెంటనే "నారాయణా! నారాయణా! నారాయణా!" అంటూ తన కుమారుణ్ణి పిలిచాడు. ఆవిధంగా అజామిళుడు మరణ సమయంలో నారాయణ నామస్మరణ చేస్తూండగా ఆ పరిసరాలలో తిరుగుతున్న దేవదూతలు తమ ప్రభువు నామాన్ని విన్నారు. మిక్కిలి వేగంతో అక్కడికి వచ్చారు. వికృత వేషాలతో అధికరోషాలతో పెద్దగా కేకలు వేస్తున్న యమకింకరులను అడ్డగించారు. అప్పుడు యమదూతలు
"అయ్యా! మీరెవ్వరి భటులు? మాతో కలహానికి తలపడ్డారెందుకు? మాచేతిలో చిక్కిన వానిని వీరావేశంతో విడిపించారు. ప్రపంచంలో ఇక యముని శాసనాలు నవ్వులాటకే అన్నమాట! ఇంతకూ మీరెవరు? మీరు యమధర్మ రాజు దూతలైన మమ్ములను అడ్డగించడానికి కారణమేమి? అని ప్రశ్నించారు. యమ దూతలను చూచి చిరునవ్వు నవ్వి గోవిందులు దూతలు మేఘ గంభీర భాషణాలతో ఇలా అన్నారు. "అయితే మీరు పరేత నాయకుడైన యముని కింకరులన్నమాట. అలా అయితే పుణ్య లక్షణాలనూ పాప స్వరూపాన్నీ వివరించండి. ఎవరు దండింప దగినవారో ఎవరు కారో తెలపండి.అని అన్నారు.
దానికి యమభటులు వేదాలలో ఏది కర్తవ్యమని చెప్పబడిందో అదే అందరికీ ఆమోదకరమైన ధర్మం. అంతకంటే
వేరైనది అధర్మం. వేదం సాక్షాత్తూ నారాయణ స్వరూపమని పెద్దలు చెప్పగా విన్నాము. అజామిళుడు కులాచార మర్యాదలను కూలద్రోశాడు, తండ్రిగారు సంపాదించిన ఆస్తినంతటినీ ఆమెపాలు చేశాడు. సాధు లక్షణాలైన సద్గుణాలను విడనాడాడు. బాగా రుచిమరిగి వాలుగన్నుల వెలయాలి అందచందాలకు లొంగిపోయాడు. ఇంటివద్ద తన భార్య ఉన్నది. ఆమె ఎంతో సౌన్దర్యవతి. సుగుణవతి, సౌభాగ్యవతి, నవ యౌవనవతి. అటువంటి అందాల రాశిని విడిచిపెట్టి ఆ పరమ మూర్ఖుడు సిగ్గుఎగ్గులు వదలి ఆ వెలయాలి ఇంటిలోనే కాపురం పెట్టాడు. చాలా కాలం ఈ ప్రకారంగా భ్రష్టాచారుడై పాప చిత్తుడై మలిన దేహుడై చెడు మార్గంలో ప్రవర్తింప సాగాడు. అందువల్ల ఆ పాపాత్ముణ్ణి మేము బలవంతంగా బంధించి తీసుకుపోతున్నాము. అని పల్కుతున్న యమభటులను నివారించి నీటి శాస్త్ర పండితులైన భగవంతుని దూతలు ఈ విధంగా అన్నారు.
"ఆహాహా! ఏమి మీ తెలివితేటలూ! మీ యుక్తాయుక్త వివేకమ్, మీ ధర్మ నిర్ణయ పాండిత్యం తెలిసిపోయింది. అదండ్యులైన పుణ్యపురుషులను దండించే మీ అజ్ఞానం వెల్లడయింది. యితడు కోతికంటే ఎక్కువ జన్మాలలో చేసిన పాప సమూహాలను ఈ జన్మలో ఇప్పుడు బుద్ధిమంతుడై పారద్రోలాడు. మరణ సమయంలో అమృతం వంటి భగవంతుని పుణ్య నామ సంకీర్తనం చేసిన మహాభాగ్యం ఇతడికి అబ్బింది. ఈతడు "నారాయణా" అని పిలిచినప్పుడు ఇతని హృదయం కుమారుని మీద ఆసక్తమై ఉన్నదని మీరు తలంప వద్దు. భగవంతుని పేరును ఏవిధంగా పలికినప్పటికీ వాసుదేవుడు రక్షకుడై అందులో ఉండనే ఉంటాడు. కుమారుని పేరు పెట్టి పిలిచినా, విశ్రాంతి వేళలోఅయినా, ఆటలోనైనా, పరిహాసంగానైనా పద్య వచన గీత భావార్థాలతోఅయినా సరే కమలాక్షుణ్ణి స్మరిస్తే చాలు, పాపం పరిహరింపబడుతుంది.భగవంతుడంటే ఏమిటో ఎరుగని బాలుడు కూడా హరిభక్తులలో జేరి హరిహరి అని పలుకుతూ ఉంటే చాలు అగ్ని గాలితో కూడి గడ్డిని కాల్చివేసినట్లు హరి నామ స్మరణం పాపాలన్నింటినీ పటాపంచలు చేస్తుంది. సారవంతమైన ఔషధం అనుకోకుండా పొరపాటున సేవిన్చినప్పటికీ దాని గుణం వృధా పోదు. దాని ప్రభావం రోగాలను పోగొట్టి తీరుతుంది. అదేవిధంగా పరమ పావనుడైన భగవంతుని నామం తెలియక పలికిననూ, తిరస్కార భావంతి పలికిననూ దాని ప్రభావం ఊరకే పోదు. దాని మహత్తర గుణాన్ని అది తప్పకుండా చూపించి తీరుతుంది.
అంత్య కాలం సమీపించి ధైర్యం సన్నగిల్లినప్పుడు ఏదో పూర్వ జన్మ విశేషం ఉంటేనే గాని పరాత్పరుడు మనస్సులోకి రాదు. ఇక ఈ అజామిళుడు మరణకాలంలో శ్రీహరి నామస్మరణం అనే అమృతాన్ని ప్రత్యక్షంగానే ఆస్వాదించాడు. శాశ్వతమైనదీ, నిర్దోషమైనదీ, సమస్తమైన చైతన్యానికి ఆలవాలమైనదీ అయిన నారాయణ నామస్మరణం వ్యర్థంగా ఎందుకు పోతుంది?అని వెంటనే ఆ బ్రాహ్మణుణ్ణి పరమ భయంకరమైన యమపాశాలనుండి విముక్తుణ్ణి చేశారు. అజామిళుడు ఎదుటనున్న విష్ణుదూతలకు ఎంతో ఆనందంతో చేతులెత్తి నమస్కరించాడు. శ్రీమన్నారాయణుని చరణ కమల స్మరణమనే నిర్మల జలం అతని మహాపాతక సమూహాలన్నింటినీ కడిగివేసింది. అతని హృదయం నిశ్చల భక్తికి నిలయమై క్షణ మాత్రంలో అతనికి జ్ఞానోదయ మయింది.పశ్చాత్తాపంతో ఒక నిర్ణయానికి వచ్చాడు. నేను నా చిత్తాన్ని లొంగదీసుకొని, ఇంద్రియాలను జయించి, శ్వాసను నియమించి శ్రీమన్నారాయణుని శరణు పొందుతాను అని భావించి గొప్ప తత్త్వజ్ఞానియై సంసార బంధాలన్నింటినీ పారద్రోలి గంగా ద్వారానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక దేవాలయంలో కూర్చొని యోగామార్గాన్ని ఆశ్రయించాడు.గుణాతీతుడైన తన ఆత్మను పరమాత్మలో లీనం చేశాడు. అప్పుడు అతనికి మొదట తనను రక్షించిన ఆ దివ్యపురుషులు కనిపించారు అతడు వారికి నమస్కరించి గంగాతీరంలో శరీరం విడిచాడు. వెనువెంటనే అతనికి నారాయణ పార్శ్వ చరులైన మహాభక్తుల స్వరూపం ప్రాప్తించింది. అనంతరం అతడు విశ్నుదూతలతో కలిసి రత్నాలు చెక్కిన బంగారు విమానాన్ని అధిష్ఠించి వైకుంఠ నగరంలో ప్రవేశించి శ్రీమన్నారాయణుని చరణారవిందాలను సేవించే పరిణత దశకు చేరుకున్నాడు. ఈవిధంగా అజామిళుడు సర్వధర్మాలను ఉల్లంఘించిన వాడు, దాసీపుత్రిని పెండ్లాడిన వాడూ దుష్కర్మల చేత భ్రష్టుడైన వాడూ అయి నరకంలో పడబోతూ నారాయణ స్మరణం వల్ల క్షణ మాత్రంలో మోక్షాన్ని అందుకున్నాడు. కర్మాలన్నీ విడిపోవటానికి వేరే ఉపాయం ఏదీ లేదు. చెప్పిన మాట వినకుండా ఎదురుతిరిగి మనస్సు ఎన్ని మార్గాల్లో పోయినా సర్వదా నారాయణ నామాన్ని ఉచ్చరించడమే సరైన ఉపాయం.
అజామిళుడు అవసాన కాలంలో కుమారుని పేరు పెట్టి పిలిచాడు. కానీ శ్రీహరిని పిలువలేదు. అయిననూ పుత్రుని పేరుతో విష్ణు నామాన్ని మరణకాలమందు ఉచ్చరించినందువల్ల హరి సాన్నిధ్యాన్ని చేరగలిగినాడు. ఇక భక్తి పూర్వకంగా భగవంతుని నామాన్ని పలికితే చెప్పేదేముంది?

Photo: పూర్వం కన్యాకుబ్జం అనే పట్టణంలో అజామిళుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మహా పాపాత్ముడు, పరమ దరిద్రుడు, నింద్య చరిత్రుడు, అజ్ఞాని, దురాచారపరుడు, నికృష్ట జీవనుడు. జూదాలన్నా, వివాదాలన్నా ఆదరం మెండు. దొంగతనానికి పెట్టింది పేరు. అతడు యౌవనపు మత్తులో ఒక దాసీ దానిని భార్యగా చేసుకున్నాడు. ఆమెయందు పదిమంది కొడుకులను కన్నాడు. ఆతడు ఆ వ్యామోహ సముద్రములో మునిగిపోయాడు. ఆ పిల్లల లాలన పాలనలో, ముద్దు ముచ్చట్లలో చాలాకాలం గడిపాడు. సంసార లంపటుడై ఆనందంలో మైమరచాడు. ఆ మురిపాలన్నీ ముగిసి ముసలివాడైపోయాడు.

No comments:

Post a Comment