దామోదర

కృష్ణునికి అనేక పేర్లు ఉన్నాయి. అందులో దామోదర ఒకటి. ఇది మహా మంత్రం. విష్ణు షట్పదీ స్తోత్రంలో శంకరుల వారు "దామోదర! గుణమందిర సుందరవదనారవిందగోవిందా" అన్నారు. మొట్టమొదటే దామోదరా అని కీర్తించారు. ఒక నామానికి కథలో ఒక అర్థం ఉంటుంది. వేదం ప్రకారం మరొ అర్థం ఉంటుంది.
కథ ప్రకారము అర్థము: దామము అంటే తాడు; ఉదరము అంటే పొట్ట. అంటే తాడుతో కట్టబడిన ఉదరము కలవాడు అని లీలార్థం.
కానీ కృష్ణుడిగా పుట్టక ముందే ఆ నామము ఉంది ఆయనకి. వేదాలలోనే ఉన్నది. సంస్కృతంలో ఒక శబ్దానికి అనేక అర్థములు ఉంటాయి. దామములు అంటే లోకములు. ఉదరము అంటే లోపలిభాగము. అంటే లోకములన్నీ తన లోపల కలిగిన వాడు అని పరమార్థం. రెండవ అర్థం శాశ్వతం, ఎప్పుడూ ఉన్నది.
మొదటి అర్థం కృష్ణావతారంలో మాత్రమే ఉన్నది. ఇదే ఈ అవతారంలోని చమత్కారం. వేదంలో ఉన్నవాడు దిగి వచ్చాడు. ఆ పేర్లూ ఇక్కడ ఉన్నాయి. అక్కడ ఒక అర్థంలో ఉన్నాయి. ఇక్కడ మరొక అర్థంలో ఉన్నాయి. అందుకు లీలార్థం, పరమార్థం అని రెండు అర్థాలు వెతుక్కోవాలి కృష్ణ నామంలో. అందుకే పోతనగారు పరమార్థాన్ని ముందే అందిస్తూ "జగజ్జాలములున్న బొజ్జ గట్టన్ వశమే?" అన్నారు. ఈ రూపాన్ని ధ్యానించడం ఒక గొప్ప విషయం.
పురాణాలలో కథ కాదు ఇది. కొద్ది శతాబ్దాల క్రితం జరిగిన చరిత్ర. ఒకప్పుడు సత్యవ్రతుడు అను సిద్ధపురుషుడు బృందావనంలో కూర్చొని కార్తీకమాసంలో కృష్ణ పరమాత్మను ధ్యానం చేస్తున్నాడు.
ఏకాదశీ వ్రతాలు చేసేటప్పుడు మార్గశిర మాసంనుంచి మొదలుపెట్టాలి. కార్తీకమాసానికి ఒక సంవత్సరం అవుతుంది. అప్పుడు సంవత్సర వ్రతం పూర్తి అయిందని ఉద్యాపన చేసుకుంటారు. ఆ వ్రతం చేసేటప్పుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క పేరుతో కృష్ణుణ్ణి పిలవాలిట. మార్గశిరమాసంలో మొదలుపెట్టినప్పుడు కేశవ, పుష్యామాసంలో నారాయణ, అలా వరుసగా అంటూ ఉంటే కార్తీకం వచ్చేసరికి దామోదరనామం వస్తుంది. అందుకే కార్తీక దామోదర అంటారు.
కార్తీకమాసంలో దామోదర నామాన్ని ధ్యానించాలి. ఈ సత్యవ్రతుడు బృందావనంలో కార్తీకవ్రతం చేశాడట. కార్తీకమాసం బృందావనంలో వ్రతం చేయాలని చెప్పారు పెద్దలు. దామోదరుణ్ణి ధ్యానిస్తున్నాడు గనుక ఆ సమయంలో సత్యవ్రతునికి రోటికి కట్టబడి దొంగ ఏడుపు ఏడుస్తూ వెళుతున్న కృష్ణుడు కనిపించాడట. ఈ ఘట్టం అర్థం ఏమిటంటే కృష్ణలీలలు ఎప్పుడో జరిగిపోయాయి అని అనుకోవద్దు. భక్తుడు పిలిస్తే ఆ భక్తునికోసం ఇప్పుడు కూడా జరిపిస్తాడు. అది ఆయన లీలలో ఉన్న ఆంతర్యం. అందుకే కృష్ణలీలలు నిత్యలీలలు. నేటికీ బృందావనంలో భక్తులకి ఈ లీలలు చూపిస్తాడట. అలాంటి భవ్యమైన బృందావనంలో ఈ స్వరూపాన్ని ధ్యానం చేసుకోవచ్చు. ఈ రూపాన్ని ధ్యానించిన వారికి ఉన్న కర్మ బంధములు, అజ్ఞాన బంధనాలు త్రెంచి మోక్షమును, జ్ఞానాన్ని ప్రసాదిస్తారు స్వామి. తిన్నగా రోటిని కదిలించుకుంటూ వెళ్ళి రెండు మద్ది చెట్లను కూల్చాడు.

Photo: కృష్ణునికి అనేక పేర్లు ఉన్నాయి. అందులో దామోదర ఒకటి.  ఇది మహా మంత్రం. విష్ణు షట్పదీ స్తోత్రంలో శంకరుల వారు "దామోదర! గుణమందిర సుందరవదనారవిందగోవిందా" అన్నారు. మొట్టమొదటే దామోదరా అని కీర్తించారు. ఒక నామానికి కథలో ఒక అర్థం ఉంటుంది. వేదం ప్రకారం మరొ అర్థం ఉంటుంది.
కథ ప్రకారము అర్థము: దామము అంటే తాడు; ఉదరము అంటే పొట్ట. అంటే తాడుతో కట్టబడిన ఉదరము కలవాడు అని లీలార్థం. 
కానీ కృష్ణుడిగా పుట్టక ముందే ఆ నామము ఉంది ఆయనకి. వేదాలలోనే ఉన్నది. సంస్కృతంలో ఒక శబ్దానికి అనేక అర్థములు ఉంటాయి. దామములు అంటే లోకములు. ఉదరము అంటే లోపలిభాగము. అంటే లోకములన్నీ తన లోపల కలిగిన వాడు అని పరమార్థం. రెండవ అర్థం శాశ్వతం, ఎప్పుడూ ఉన్నది. 
మొదటి అర్థం కృష్ణావతారంలో మాత్రమే ఉన్నది. ఇదే ఈ అవతారంలోని చమత్కారం. వేదంలో ఉన్నవాడు దిగి వచ్చాడు. ఆ పేర్లూ ఇక్కడ ఉన్నాయి. అక్కడ ఒక అర్థంలో ఉన్నాయి. ఇక్కడ మరొక అర్థంలో ఉన్నాయి. అందుకు లీలార్థం, పరమార్థం అని రెండు అర్థాలు వెతుక్కోవాలి కృష్ణ నామంలో. అందుకే పోతనగారు పరమార్థాన్ని ముందే అందిస్తూ "జగజ్జాలములున్న బొజ్జ గట్టన్ వశమే?" అన్నారు. ఈ రూపాన్ని ధ్యానించడం ఒక గొప్ప విషయం. 
పురాణాలలో కథ కాదు ఇది. కొద్ది శతాబ్దాల క్రితం జరిగిన చరిత్ర. ఒకప్పుడు సత్యవ్రతుడు అను సిద్ధపురుషుడు బృందావనంలో కూర్చొని కార్తీకమాసంలో కృష్ణ పరమాత్మను ధ్యానం చేస్తున్నాడు. 
ఏకాదశీ వ్రతాలు చేసేటప్పుడు మార్గశిర మాసంనుంచి మొదలుపెట్టాలి. కార్తీకమాసానికి ఒక సంవత్సరం అవుతుంది. అప్పుడు సంవత్సర వ్రతం పూర్తి అయిందని ఉద్యాపన చేసుకుంటారు. ఆ వ్రతం చేసేటప్పుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క పేరుతో కృష్ణుణ్ణి పిలవాలిట. మార్గశిరమాసంలో మొదలుపెట్టినప్పుడు కేశవ, పుష్యామాసంలో నారాయణ, అలా వరుసగా అంటూ ఉంటే కార్తీకం వచ్చేసరికి దామోదరనామం వస్తుంది. అందుకే కార్తీక దామోదర అంటారు. 
కార్తీకమాసంలో దామోదర నామాన్ని ధ్యానించాలి. ఈ సత్యవ్రతుడు బృందావనంలో కార్తీకవ్రతం చేశాడట. కార్తీకమాసం బృందావనంలో వ్రతం చేయాలని చెప్పారు పెద్దలు. దామోదరుణ్ణి ధ్యానిస్తున్నాడు గనుక ఆ సమయంలో సత్యవ్రతునికి రోటికి కట్టబడి దొంగ ఏడుపు ఏడుస్తూ వెళుతున్న కృష్ణుడు కనిపించాడట. ఈ ఘట్టం అర్థం ఏమిటంటే కృష్ణలీలలు ఎప్పుడో జరిగిపోయాయి అని అనుకోవద్దు. భక్తుడు పిలిస్తే ఆ భక్తునికోసం ఇప్పుడు కూడా జరిపిస్తాడు. అది ఆయన లీలలో ఉన్న ఆంతర్యం. అందుకే కృష్ణలీలలు నిత్యలీలలు. నేటికీ బృందావనంలో భక్తులకి ఈ లీలలు చూపిస్తాడట. అలాంటి భవ్యమైన బృందావనంలో ఈ స్వరూపాన్ని ధ్యానం చేసుకోవచ్చు. ఈ రూపాన్ని ధ్యానించిన వారికి ఉన్న కర్మ బంధములు, అజ్ఞాన బంధనాలు త్రెంచి మోక్షమును, జ్ఞానాన్ని ప్రసాదిస్తారు స్వామి. తిన్నగా రోటిని కదిలించుకుంటూ వెళ్ళి రెండు మద్ది చెట్లను కూల్చాడు.

No comments:

Post a Comment