మనకు వర్షమునకు రెండు లేక మూడు భోగములు వరి ధాన్యం పండుతుంది. పండిన ధాన్యమును దంపి శివాలయములో దేవునికి అన్నాభిషేకము చేసి ఆ అన్నమును బీదలకు పంచడం ఒక ఆచారముగా వస్తూ వుంది. మనకు లభ్యమైన దానిని దేవునికి సమర్పించితే మనకు మరల అనేక రెట్లు ఎక్కువగా లభ్యమగును.
అన్నాభిషేకము అన్ని శివాలయములలో జరుగుతుంది. దానిని మనము ప్రత్యక్షముగా వీక్షించినచో మనకు ఆ వత్సరమంతా అన్నానికి లోటులేకుండా సమృద్ధిగా లభ్యమవుతుంది.
ఆగ్రాయని హోమము
ఇది యజుర్వేదాన్తర్గతమైన ఒక హోమము. దీవిని కార్తీక పౌర్ణమి, కార్తీక అమావాస్య లేక మార్గశిర పౌర్ణమి రోజులలోనో లేక ఏదైనా ఒక రోజో మనకు లభించిన కొత్త వరి దంపి బియ్యమును హవిస్సుగా వండి దానితో దేవునికి హోమములో సమర్పించడం ఒక పరిపాటి. దీనివల్ల మనకు వత్సరాంతము సమృద్ధిగా అన్నము లభ్యమగుటయే కాకుండా మనము సమర్పించే హవిస్సు దేవతలు గైకొని మనకు సమృద్ధిగా వర్షములు కురిపించుతారు. అందువల్ల మనకు మంచి సస్య వృద్ది జరిగి ఆహారమునకు లోటు లేకుండా వుంటుంది. ఇది ఒక చక్ర ప్రక్రియ. మనము కూడా ఇలా చేసి లబ్ది పొందుదము.

No comments:
Post a Comment