"దేవతల గురువైన బృహస్పతి భార్య తార. చంద్రుడు ఒక పరి యజ్ఞం చేస్తూండగా, చూడడానికి అక్కడికెళ్లింది. మన్మధబాణ ఘాతాలు సూటిగా ఆమె ఎదను తాకి, చంద్రునిపై అపారమోహాన్ని కలిగించాయమెకు. అదేరీతిలో చంద్రునికీ తారపట్ల ప్రగాఢనురక్తి కలిగింది. కలువరేడు తన జతగాడని; ఇతరులెవ్వరూ అతని సాటి రారని ఒకే ఒక్క అభిప్రాయం ఏర్పడిపోయింది తారకు.
తారా చంద్రులు ఒండొరుల వీక్షణాలు క్షణకాలం కలుసుకుని, వారి మనసులలో ప్రేమ భావన అంకురించి స్థిరపడిపోయింది. చూపులు కలిసిన ఆ శుభవేళ ఎంతటి మహత్త్వపూర్ణమైనదో, తదుపరి వారు ఏకమయ్యాకగాని వారికి తెలియలేదు. తెలిసిన తర్వాత వారెన్నడూ ఒకర్నొకరు విడిచి ఉండలేదు.
ఆ ప్రణయజీవుల ప్రేమ వ్యవహారం ముదిరి పాకాన పడిందని, దేవగురువుకు తెలిసే సరికే చాలా కాలాతీతమైంది. చంద్రునికే తన సర్వస్వం అర్పించిన తార, అతడ్నే తన నిరంతర లగ్నమానస దైవంగా ఎంచి, బృహస్పతి పట్ల వైముఖ్యం ప్రదర్శించేసరికి ఇక రాయబారాలతో తార తన దారికి రాదని ఆయనకు అర్థమైపోయింది.
చివరికి అంతటి గురుదేవుడు, శశాంకుని గృహానికి వెళ్లి - "ఓరీ చంద్రా! శిష్యాధమా! దేవతలలో ఒకడివైనందున నిన్ను శిష్యుడిగా చెప్పుకోవలసివచ్చిందిగాని, నీవంటి నీచుడికి గురువుగా ఉండదగను. గురుపత్ని అని కూడ చూడక, నాభార్య పొందు ఆశించిన నీవు పంచమహాపాతకుడవు. పైగా యజ్ఞదీక్షపూని అందుకు విరుద్ధమైన అకార్యకరణానికి వొడిగట్టావు సరే! జరిగిందేదో జరిగింది. ఇప్పటికైనా నా భార్యను విడిచిపెట్టు" అని క్రోధావేశంతో పలికాడు.
అందుకు సమాధానంగా క్షత్రియుడైన చంద్రుడు "గురువుగారూ! తాము విప్రులు, కోపం వల్ల విప్రులు పూజ్యార్హత కోల్పోతారు. తార తనకిచ్చ వచ్చినరీతిన చరించగలదు. తక్షణం ఆమె తమ ఇంట అడుగిడకపోతేనేం? ఏదో నాటికి అక్కడుండవలసిందే!" అని రాజసంగా పలికేసరికి, ఏం చెయ్యడానికీ తోచక బృహస్పతి వెనుదిరిగాడు.
చంద్రుని పరుష ప్రేలాపనలు, శచీపతి దగ్గర చెప్పుకుని బాధపడ్డాడు. తన భార్య చంద్రునికి ప్రియురాలైపోయిన వైనం వివరించి దేవగురువు బృహస్పతి పడే బాధ చూసిన ఇంద్రునికి కూడ ఒళ్ళు మండి, చంద్రుని వద్దకు ఒక దూతను రాయబారం పంపించాడు. దౌత్యం విఫలమై దేవతలకు, చంద్రునికి యుద్ధం సంఘటిల్లింది. ఒక స్త్రీ కారణంగా దేవతల్లోనే చీలిక లొచ్చి యుద్ధం ప్రారంభమైపోయింది.
ఇద్దరు సోదరులు జగడమాడుకున్నా, అందులో అవినీతిపరుడు ఎటువైపుంటాడో అటువైపు దుష్టులు చేరి సహాయం చేస్తారన్న లోకరీతి చంద్రుని పట్ల నిజమైంది. దేవగురువు పట్ల తనకున్న ద్వేషాన్ని పురస్కరించుకుని రాక్షసగురువు శుక్రాచార్యుడు చంద్రుని దగ్గరకెళ్ళి, తన మద్దతు ప్రకటించాడు. యుద్ధంలో మంత్రశక్తి ఉపయోగించి అయిన సరే - 'నీ ఎదుటిపక్షంతో పోరు సల్పడానికి నేను బాసటగా ఉంటానన్నాడు రాక్షసగురువు. అది శివునకు ఆగ్రహం తెప్పించింది.
దేవతల మధ్య రాజుకున్న అగ్ని దేవదానవ సంగ్రామంగా పరిణమించింది. సంవత్సరాల తరబడి కొనసాగింది.
బ్రహ్మదేవుడికి ఈ పరిస్థితి గొప్ప సంకట స్థితి అయింది. ఇరుపక్షాల్లోను శాంతి నెలకొల్పడం అనివార్యమైంది. హంసవానారూఢుడై ఆకాశ మార్గాన పోరు జరుగుతున్న చోటుకు వచ్చి నిలిచాడు.
"పొరపాటు చేసి, పైగా కుట్రదారులను పోగేసి పితూరీలేవదీస్తావా చంద్రా! ఇది చాలా అన్యాయం. గురుపత్నిని ఆయనకు అప్పగించు! శుక్రాచార్యా! అందరికీ బుద్ధి చెప్పవలసినవాడివి. నువ్వే ఇలా ప్రవర్తించడం తగునా? మీ సంగ్రామం వల్ల జగత్తుకు విపత్తు ఏర్పడుతున్నదన్న కనీస జ్ఞానంతోనైనా, ఈ పోరు విరమించాల్సిందే! చంద్రా! నీ తండ్రి అత్రి మాటపై నీకేమాత్రం గౌరవం ఉన్నా, తారను ఆచార్యుల వారి సన్నిధికి చేర్చు! ఆయన అభిప్రాయం నాకు చేరింది. కనుకనే హుటాహుటిగా ఇక్కడికొచ్చాను" అని గద్దించి, "శుక్రాచార్యా! అగ్నికి ఆజ్యంపోసినట్లు యుద్ధానికి బాసటగా నిల్చావు, ఇప్పుడీ శాంతికీ నీ చేతనైనది చెయ్యి" అని పెద్దరికం ఉట్టి పడేళా చెప్పాడు పితామహుడు.
పరమేష్ఠి గద్దింపు ధోరణిలో సత్యం ఉందన్న సంగతి తెలుసు కనుక, చంద్రుడి దగ్గరకెళ్లి - బృహస్పతికి తారను అప్పగించేయమన్నాడు. కాని అప్పటికే తార గర్భవతిగా ఉంది. అదే స్థితిలో ఆమెను గురువుగారికి అప్పగించేశాడు చంద్రుడు. బృహస్పతి తారను చేకొని తననివాసానికి వెళ్లాడు.
బుధ జననం:
యుద్ధం ముగిసింది. అందరూ ఎక్కడి వాళ్లక్కడ సర్దుకున్నారు. నవమాసాలూ మోసి, తార పండంటి బిడ్డడ్ని కన్నది. బృహస్పతి ఆ పిల్లవానికి యధావిధిగా జాతకర్మలు జరిపించాడు.
పుత్రుడు జన్మించాడని తెలిసిన చంద్రుడు సంబరపడి, ఆ వెంటనే - జాతకర్మలు బృహస్పతి జరిపించడం పట్ల మండిపడ్డాడు. శాస్త్రరీత్యా ఆ శిశువునకు తాను జనకుడు గనుక, తానే చేయాల్సుంటుందన్నాడు". కాదు - కాదు, ఆ శిశువు నా కొడుకే" అంటాడు బృహస్పతి.
వివాదం ముదిరింది. మళ్లీ పెద్ద రగడ అయ్యే సూచనలు కనపడేసరికి, ముందుగానే దాన్ని వారించదలచి బ్రహ్మ మరోసారి పెద్దరికం వహించాల్సి వచ్చింది. "ఏ శిశువుకు ఎవరు తండ్రి అనేది నిర్ణయించగలది, సృష్టిలో ఒక్క తల్లి మాత్రమే! బిడ్డ పుట్టాక - అదుగో నాయనా! ఆయన మీ పితృదేవుడు అంటు తల్లి వ్రేలెత్తి ఎవర్ని చూపిస్తే ఆ బిడ్డ అతన్నే తండ్రిగా పిలవడం అనాదిగా లోకరీతి. కనుక - ఈ వివాదం తగదు. తారను రప్పించి అడిగితేసరి!" అన్నాడు బ్రహ్మ. అప్పుడా దేవతల సమక్షంలో కొచ్చిన తార, అతడు ముమ్మాటికీ చంద్రవంశాంకురమేనని వచించేసరికి బృహస్పతి ఆశ్చర్యపోయాడు.
మహదానందంగా చంద్రుడా బాలుని వెంటనిడుకుని, తన నిజ నివాసానికి వెళ్లి 'బుధుడు' అని నామకరణం జరిపించాడు.