శిరప్పులి నాయనారు-నాయనార్ల (శివభక్తులు) చరిత్రలు

చోళదేశంలో తిరువాకూరులో నివసించే బ్రాహ్మణ కులజుడు శిరప్పులి నాయనారు. శివునియందు శివభక్తులయందు గాఢమైన భక్తి ప్రపత్తులు కలవాడు. వారిని పూజించి, చిత్తశుద్ధితో వారల సేవలు చేసేవాడు. పంచాక్షరీమంత్రముతో భావయుక్తంగా పగలు రాత్రి నిరంతరము జపించేవాడు. పరమశివునకు యజ్ఞయాగాదులు గూడా చేశాడు. ఈ పనులు శివుని మురిపించినవి. శిరప్పులినాయనారుకు శివానుగ్రహము పూర్తిగా లభించింది.

ఈ నాయనారు భక్తి నిరంతర ఓం నమఃశివాయ పంచాక్షరి జపంలో కనిపిస్తుంది. అత్యంత సులభమైన ఈ నిత్యపంచాక్షరీ జపము అనంతమైన ఫలితానిస్తుంది. అయినా అజ్ఞానంతో, మాయలో కప్పబడి మానవులు ఈ ప్రక్రియనవలంభించరు. మనసు అలా చేయనీయదు.

ఈ మంత్రానుష్టానము నిరంతర ప్రక్రియగా కొనసాగినచో అది మానసిక ప్రవృత్తనే తత్త్వాన్నే మార్చి వేయగలదు. ఆ జపము దివ్యచలన తరంగాలకు కారణమవుతాయి. ఆధునిక శాస్త్ర పరిజ్ఞానము సమూహానికి సంఖ్యామాణానికి విలువ నియటంలేదు. శాస్త్రజ్ఞాణము ఏమీలేని పామరుడు గూడా అణువులోని, కణములోని మహత్యము గుర్తెరుగుతున్నాడు. శబ్దతరంగాల విశిష్టత, మానసిక ఆలోచనా తరంగాలు తెలిసికొనలేకపోయినచో అది బుద్ధిహీనతే అవుతుంది. అవి మనుజులలో భౌతికంగా, మానసికంగా ఆధ్యాత్మికంగాను విశిష్టమైన మార్పులు తెస్తాయి.

ప్రతిక్షణము దేవుని జ్ఞాపకముంచుకొని - నిరంతరం ఆయన నామము జపించుట ఉత్తమమైన యోగ ప్రక్రియ.
Photo: శిరప్పులి నాయనారు-నాయనార్ల (శివభక్తులు) చరిత్రలు

No comments:

Post a Comment