"కార్తీక మాసానికి సమమైన మాసం లేదు"

ఈ మాసము పూర్ణిమ " కృత్తికా" నక్షత్రంతో ఉంటుంది కనుక " కార్తీక మాసమని" పేరు.
"న కార్తీక సమో మాసః" - "కార్తీక మాసానికి సమమైన మాసం లేదు"
అని అత్రి మహర్షి అగస్త్యులవారితో అన్నారు. " నవమ్యాం శుక్ల పక్షస్య కార్తీకే నిరగాత్కృతః - కార్తీక మాసంలో శుద్ధ నవమిన, కృతయుగారంభమయ్యెను. అదియే " అక్షయ నవమీ" వ్రతముగా, మరియు " విష్ణు త్రిరాత్రి వ్రతం" అని జరుపుకొందురు. కలియుగకాలం 4,32000 సంవత్సరాలు. దీనికి నాలుగింతలుగా 17,28000 సంవత్సరాలు. కృతయుగ కాలపరిమితి.
కృతయుగమును సత్యయుగమును, నిత్యయుగమని ,ఆది యుగమని అంటారు. ఈ యుగమును నాలుగు పాదాలతో నిండిన ధర్మయుగమని, అట్టి ధర్మము నాచరించిన యుగమని అంటారు. కృత అనే శబ్దానికి " నాలుగు" అని అర్ధం.
అగ్నిదేవతాకమైన కృత్తిక నక్షత్రము కూడా అగ్నితోడైతే, ఇక ఈ కార్తీకములో అగ్ని మరింత ప్రజ్వరిల్లుతుంది. అందుచేతనే కాలకూట విషాగ్ని పొందిన శివుడిని ఈ కార్తీక మాసంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకములొనర్చడం శివానుగ్రహమునకు పాతృలగుదురు. అందుకే శివుడిని
" అభిషేక ప్రియ శ్శివః " అని, కాలాగ్ని రుద్రుడని స్తుతిస్తాము. అదేగాక స్వామి ఫాల భాగాన అగ్నినేత్రంతో, ఆ ఫాల భాగము అగ్నిక్షేత్రముగా నుండుటచే ఆయన శిరస్సునున్న చంద్రుడు అగ్నిని కొంత చల్లబరుస్తుంది.
అటులే " కృత్తికా వైష్ణవీ స్మ్ర్తా" అనే సౌర పురాణం చెప్పును.ఈ కృత్తిక నక్షత్రం అమ్మవారి స్వరూపాలలో ఒకటి అయిన " వైష్ణవిమాత" స్వరూపము. దాంతో " సోమో విష్ణు సమో దేవః " అని కూడా " సౌర పురాణం" లో వ్యాసులవారు చెప్పారు. అనగా చంద్రుడును భగవంతుడుగా చెప్పబడెను. విష్ణు స్వరూపుడైన చంద్రుడు, వైష్ణవీ స్వరూపిణియైన కృత్తికా నక్షత్రంలో ప్రవేశించగా కార్తీక మాసమని చెప్పబడెను.

Photo: ఈ మాసము పూర్ణిమ " కృత్తికా" నక్షత్రంతో ఉంటుంది కనుక " కార్తీక మాసమని" పేరు.

No comments:

Post a Comment