కోవెల మరియు ఇంటిలో చెయ్యకూడనివి

పుణ్య తీర్థములలో రాగానే మొదట కాళ్ళు నీటిలో పెట్టకూడదు. 
తీర్థం తలలో ప్రోక్షించుకొని కాళ్ళు కడుక్కొని నీటిలో దిగవలెను. 
నీటిలో రాళ్ళు విసరకూడదు.
పూజ వేళలలో స్త్రీలు దీపాన్ని ఆర్పకూడదు.
గుమ్మడి కాయను స్త్రీలు పగలకోట్టకూడదు.
కోవెలలో వేగముగా ప్రదక్షిణము చేయరాదు.
కోవెలలో ఎవ్వరితోను అనావస్యముగా మాటలాడకూడదు.
తాంబూలము వేసుకొని కోవెలకు వెళ్ళకూడదు.
కోవెలలో మూర్తులను తాకడమో లేక మూర్తి పాదాలవద్ద కర్పూరం వెలిగించడం చేయకూడదు.
స్వామికి నివేదనం చేసేటప్పుడు చూడకూడదు.
వస్త్రము భుజముపై కప్పుకొని జపమో, ప్రదక్షిణమో, నమస్కారమో, పూజయో, హోమమో, చేయకూడదు.
వస్త్రము నడుముకు కట్టుకొని చేయవలసి వుంటుంది.
గోవుకు బ్రాహ్మణుడికి మధ్య, బ్రాహ్మణుడికి అగ్నికి మధ్య, దంపతుల మధ్య, దేవతలకు బలిపీఠమునకు మధ్య, గురు శిష్యుల మధ్య, లింగము నందికి మధ్య, వెళ్ళకూడదు.
అన్నం, ఉప్పు, నేయి చేతితో వడ్డించ కూడదు.
ఒకే మారు రెండు చేతులతో తల గీరుకోకూడదు.
తన వయస్సు, వస్తువులు, ఇంటి గుట్టు, మంత్రము, సంగమము, సేవించే మందులు, సంపాదన, దానము, అవమానము మొదలైన తొమ్మిదింటిని ఇతరులకు తెలియనివ్వకూడదు.
సంధ్య వేళలో తినడం, నిద్ర, సంగమం,అధ్యయనం, చేయకూడదు.
ఒక్క దీపావళి పండుగ తప్ప మిగతా రోజులలో సూర్యోదయాత్పూర్వం అభ్యంగనము కూడదు.
ఎడమ చేతితో నీరు తాగకూడదు.

No comments:

Post a Comment