భీమశంకర జ్యోతిర్లింగము


ఢాకినీ - మహారాష్ట్రలోని ఖేడ్ ప్రాంతము.
యం ఢాకిని శాకినికా సమాజైః, నిషేవ్యమాణం పిశితాశనైశ్చ |
సదివ భీమాది పద పరసిద్ధం, తం శంకరం భక్తహితం నమామి ||
మాంసము తినే ఢాకిని శాకినీ సమూహముల చేత సేవింపడుతూ, భీముడు (లేక భయంకరుడు) అని పేరుతో ప్రసిద్ధుడైన, భక్తులకు శుభములను కలిగించు శంకరునకు నమస్కరిస్తున్నాను.
ఇక్కడి అమ్మవారిని బ్రహ్మ కమలముతో పూజించుట చేత "కమలజ" అని పిలువబడుతోంది.
పురాణగాథ :
ప్రస్తుత పూనా నగరమునకు సుమారు 100 మైళ్ళ దూరంలో గల సహ్యపర్వత మండలి ఢాకినీ శిఖర ప్రాంతమున పూర్వము కర్కటుడనే రాక్షసుడు "పుష్కసి" అను పేరు గల భార్య మరియు "కర్కటి" అనే కుమార్తెతో నివసిస్తూ ఉండేవాడు. కర్కటి భర్త అయిన 'విరాధుడు'ని శ్రీరాముడు చంపటంతో, తల్లిదండ్రుల దగ్గరే ఉంటోంది.
ఢాకినీ శిఖరము నుండి పుట్టిన భీమానది యందు స్నానము చేయుటకు అగస్త్య మహర్షి సిషుడైన 'సుతీక్షణుడు' రాగా, అతనిని కర్కట-పుషసులు చంపబోగ, ఆ ముని వారిని తన తపోబలముచే భస్మము చేయుట కూతురైన కర్కటి చూస్తుంది. అలా ఒంటరిగా సహ్యాది పర్వతమున ఒక్కతే ఉండగా, రావణుని సోదరుడైన కుంభకర్ణుడు అక్కడికి వచ్చినప్పుడు, ఆమెను చూసి బలత్కరించి, కొన్నాళ్ళు విహరించి గర్భవతియైన కర్కటిని విడిచి లంకకు తిరిగి పోతాడు. పుట్టిన కొడుకుకు కర్కటి భీముడని పేరు పెట్టింది. పెద్దవాడైన భీముడు, సమీప ప్రజలను నానాహింసలు పెట్టేవాడు. ఒకనాడు, తన తండ్రి ఎవరని ప్రశ్నించగా, కర్కటి, తన మొదటి భర్త గురించి మరియు కుంభకర్ణుని వల్ల వాని జన్మవృత్తాంతము చెబుతుంది, రామ-రావణ యద్ధంలో కుంభకర్ణాదుల మరణము చెబుతూ, మూల్లోకాలనూ జయించి, వారి కీర్తిని నెలబెట్టమని కోరుతుంది. నాటినుండి ఆశ్రమ వాసులను, విష్ణు భక్తులను హింసించి, అక్కడే బ్రహ్మకి తపమాచరించి కావలసిన వరములను పొందుతాడు.
వర గర్వముతో, భీమాసురుడు దేవతలను, ఇంద్రుడిని, దిక్పాలకులను జయించి, మర్త్యలోకంలో -- భూలోకంలో -- కామరూప (నేపాల్) దేశమును పరిపాలిస్తున్న గొప్ప శివ భక్తుడైన సుదక్షిణ్యుడనే రాజును ఓడించి, కరగన బంధిస్తాడు. అయినాను, ఆ శివభక్తుడు, ఒక పార్థివలింగమును చేసి, దానిని పూజింపసాగాడు. అది తెలిల్సికొని, చూసి, వారిని పరిహసిస్తూ దూషించాడు. దానికి సుదక్షిణుడు మందలించేసరికి, కోపంతో తన చేతిలో ఉన్న కత్తిని అక్కడ ఉన్న పార్థివలింగం పైకి విసిరాడు. దాంతో శివిడు ఆ పార్థివలింగంనుండి ఉద్భవించి, తన మూడవ కంటితో భీమాసురిని మరియు అక్కడ ఉన్న రాక్షస గణములను భస్మము చేశాడు. సుధక్షిణ మహారాజు, ఇంద్రాది దేవతలు, నారద మహర్షులు శివుని స్తుతుంచి కోరగా, అక్కడ భీమశంకర జ్యోతిర్లింగముగా వెలసి సకల శుభాములనిచ్చి భక్తులను రక్షింస్తానని వరములిస్తాడు. రాక్షస మమూహములు భస్మము చేహయడిన ఆ బూడిద కాలాంతరమున ఓషధములుగా రూపొందాయి.

భీమాశంకరుడను పేరుగల శివలింగములు పైన తెలిపిన ఖేఢ్ ప్రాంతమునే గాక:
(1) ఉత్తరప్రదేశ్ లో నైనితాల్ కి 20 కే.మీ.లో ఉజ్జనాక్ అనే గ్రామంలో
(2) అస్సాంలోని గౌహతిలో బ్రహ్మపుర పర్వతంపై
(3) ఆంద్రప్రదేశ్ లో, తూర్పుగోదావరి జిల్లాలోని దక్షారామమున
కూడా ఉన్నాయి.
చరిత్ర:
శివాజీ తర్వాత మహారాష్ట్రను పాలించిన పీష్వాలలో నానా ఫడ్నీస్ అనునతడు శ్రీ స్వామి వారికి అందమైన ఆలయాన్ని నిర్మించి ఈ క్షేత్రాబి వృద్ధికి చాలా కృషి చేసాడు.

No comments:

Post a Comment