సువాసినీలు చేసే శ్రావణ మంగళవారం చాలా చాలా అద్భుతమైన పరమ ప్రఖ్యాతమైన నోముగా/వ్రతంగా పరిగణింబడుతుంది. ఈ ఉపాసన పెళ్ళిలో ప్రారంభం అవుతుంది. కన్యాదాత చేయిస్తాడు. సర్వమంగళా దేవత అని మంగళసూత్రానికి పూజచేస్తారు. అది మామూలు సూత్రం కాదు. సూత్రం అంటే తాడు. అది మామూలు తాడు కాదు. అది సర్వమంగళములకు కారణము. ఆ తాడులోకి అమ్మవారిని ప్రవేశ పెడతారు. శతమానములని పెడతారు. వాటిలోకి అమ్మవారిని ఆవాహన చేస్తారు. పార్వతీ దేవికి సర్వమంగళా అని పేరు. భాగవతంలో నిరూపించింది ఆవిడ. పరమశివుడు హాలాహల భక్షణం చేయడానికి బయలుదేరాడు. దేవతలందరూ భయపడిపోయారు. ఆ హాలాహలం దగ్గరికి వెళితే కాల్చేస్తుంది. కానీ శివుడు మాత్రం నిర్భయంగా నిన్ను నేను తినేస్తాను అని నోట్లో పెట్టుకున్నాడు. పెట్టుకునే ముందు అమ్మవారిని అడిగాడు.
కంటే జగముల దుఃఖము
వింటే జల జనిత విషము వేడిమి ప్రభువై
యుంటకు నార్తుల యాపద
గెంటింపగ ఫలము గాదె కీర్తి మృగాక్షీ!!
పార్వతీదేవి సరేనంది. అదేమైనా మధురపానీయమా? కొబ్బరినీళ్ళా? దానికి ఎదురొస్తే కాలిపోయారు. అది పుచ్చుకుంటే పరమశివునికి ఏమైనా అయితే? ఆడదానికి అయిదోతనం కన్నా గొప్పదేముంటుంది? అటువంటిది తన సౌభాగ్యానికి కారణమైన పరమశివుని ప్రాణాలని లోకాల మర్యాదకోసం పణంగా పెట్టిందా? ఎలా త్రాగమంది అన్నాడు పరీక్షిత్తు. అప్పుడు శుకమహర్షి
మ్రింగెడి వాడు విభుండని.
మ్రింగెడిదియు గరళ మనియు మేలని ప్రజకున్.
మ్రింగుమనె సర్వ మంగళ
మంగళసూత్రమ్మునెంత మది నమ్మినదో!! తన మంగళ సూత్రం మీద ఆవిడకి అంత నమ్మకం. లోకంలో ఏ ఆడదాని మెడలోనైనా మంగళసూత్రం నిలబడితే అది అమ్మవారి అనుగ్రహం చేత.

No comments:
Post a Comment