శ్రీ మాత్రే నమః


Photo: ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్ఛాయై ముఖైస్త్రీ క్షణైః యుక్తా మిందు నిబద్ధ రత్న మకుటాం తత్త్వార్ధ వర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకశాశ్శుభ్రం కపలాంగదాం శంఖం చక్రమధార వింద యుగళం హసైర్వహం తీం భజే సకల వేద స్వరూపం గాయత్రి దేవి ! అన్ని మంత్రాలకు మూల శక్తి ఈ తల్లి ! ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖములతో , శంఖం ,చక్రం, గద, అంకుశం ధరించి దర్శన్మిస్తుంది. ఆది శంకరులు గాయత్రి దేవిని అనంత శక్తి స్వరూపిణి గా అర్చించారు. ప్రాతః కాలంలో గాయత్రిగాను, మధ్యాన్న కాలంలో సావిత్రి గాను ఈమే ఉపాసకులతో ఆరాధనలు అందుకుంతుంది. ముఖం లో అగ్ని, శిరశ్శు లో బ్రహ్మ , హృదయంలో విష్ణువు , శిఖపై రుద్రుడు కొలువు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈమెను ధ్యానిస్తే అనంత మంత్రశక్తి కలుగుతుంది . సకల దురిత ఉపద్రవాలు శాంతిస్తాయి. బ్రహ్మ ఙ్ఞానము కలుగుతుంది.త్రిలోకాలలో, త్రికాలాలలో, అవస్థాత్రయంలో, స్థూల సూక్ష్మ కారణ శరీరత్రయంలో, అకార ఉకార మకారత్మక ప్రణవంలో, ఋగ్యజుస్సామాత్మక త్రయీ(వేద) విద్యలో, గార్హపత్య ఆహవనీయ దక్షిణాగ్నులలో, త్రిమూర్తులలో, త్రిశక్తులలో వ్యాపించిన శివచైతన్యమే శ్రీ బాలా మహా త్రిపుర సుందరీ...

కరడుకట్టిన అఙ్యానమనే భండాసురుని సమ్హరించిన చైతన్య స్వరూపిణి!
భండునితో యుద్ధ సందర్భములో ఆ రాక్షసుని సేనలకు జగదంబ లలితాంబ పలు రూపాలతో ఎదురుకొన్నది!

స్యామ(మంత్రిణి), వారాహి( దండిని) మొదలు అయిన రూపాలతో విశుక్ర, విషంగాది భండ సహచరుల్ని సమ్హరించింది.

ఆ సమయములో భండపుత్రులు విజృభించినప్పుడు, అమ్మవారి హృదయం నుండి బాలా మహా త్రిపుర సుందరిదేవి ఆవిర్భవించింది,ఆ దనుజుల్ని పరిమార్చింది.

అమ్మవారి హృదయంలోని దయ, ఇచ్చా, ఙనాది శక్తులే బాల త్రిపుర సుందరి. ఇది దివ్య స్వరూపం.

శ్రీ కృష్ణోపాసనలో బాలకృష్ణుని ఆరధన ఎలాంటిదో, శ్రీ విద్యోపాసనలో బాలా మహా త్రిపుర సుందరి సమర్చన అటువంటిది.

సర్వ బ్రహ్మాండనాయకి అయిన జగదంబిక మనకు అందుబాటలోకి ఒదిగి వచినట్లుగా బాలా రూపములో అవతరించింది.

అమ్మ హృదయంలోని వాత్సల్యము, కారుణ్యము మూర్తిభవించి బాలంబికగా ప్రభవించినది ఎమొ !

అరుణ కిరణ జాలై రంచితాశవకాశా
విధృత జపపటీకా పుస్తకభీతి హస్తా
ఇతరకరవరాఢ్యా ఫుల్లకల్హార సంస్థా
నివసతు హృది బాల నిత్య కల్యాణ శీలా

ఇది అమ్మ రూప లావణ్యము !

శ్రీ మాత్రే నమః

No comments:

Post a Comment