Srimadramayanam - Manaveeya Sambhandhalu

)

Srisaila Mahatyamu

<iframe width="420" height="315" src="//www.youtube.com/embed/P5UESfWTuHk" frameborder="0" allowfullscreen></iframe>

Kasi Yatra Pravachanam by Sri chaganti - kasi vishishta

<iframe width="560" height="315" src="//www.youtube.com/embed/B5AmVITcooU" frameborder="0" allowfullscreen></iframe>

How to Celebrate our BIRTHDAY

<iframe width="560" height="315" src="//www.youtube.com/embed/u8M28wan7Ek" frameborder="0" allowfullscreen></iframe>

పంచభూత లింగములు

పంచభూత లింగములు : పృధ్వీ లింగము, జల లింగము, తేజొ లింగము ,ఆకాశ లింగము, వాయు లింగము వీటిని పంచభుత లింగములు అంటారు .

1. పృధ్వీ లింగము :

తమిళనాడులో (కంచి) లో ఏకాంబరనాధ లింగము (పృధ్వీ లింగము) పంచ లింగాలలో ఒకటి. ఈ కాంచీపురంను కంజీవరం అని కూడా అంటారు . కాంచీపురంలో విష్ణు కంచి , శివ కంచి అని రెండు భాగాలుగా ఉంది . అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి అయిన కంచి కామాక్షి అమ్మవారు ఉన్నారు .

2. జల లింగము :

తమిళనాడులోని జంబుకేశ్వరమున జలలింగము ఉంది. ఈ జలలింగము జంబుకేశ్వరస్వామిగా పిలవబడును. జంబుకేశ్వరం తిరుచునాపల్లికి చాలా దగ్గరలో ఉంది. జంబుకేశ్వరము పురాతన కాలము నాటి శివ క్షేత్రము. ఈ గుడిలో నిరంతరం ఊరే నీటి వూట ఉంది . ఇక్కడున్న నేరేడు చెట్టుని జంబువృక్షమని అంటారు. జంబుకేశ్వరంనుండి శ్రీరంగం సుమారు 01కి. మీ దూరం . కావేరి నది శ్రీరంగం , తిరుచునాపల్లి నగరం చుట్టూ ప్రవహిస్తుంది .

3. తేజో లింగము :

తమిళనాడులో (అరుణాచలం) తేజోలింగము ఉంది . ఈ స్వామి "అరుణాచలే్శ్వర స్వామి"అని పిలుస్తారు. పార్వతీ దేవి ఇక్కడేతపస్సు చేసి, శివునికి అర్థ భాగమైనదని ప్రతీతి. ఈ తిరువణ్ణామలై మద్రాసుకు 165కి. మీదూరంలో ఉంది. విల్లు పురం నుంచి కాట్పాడికివెళ్లే మార్గంలో ఉంది . విల్లు పురం నుంచి 68కి. మీ .

4. ఆకాశ లింగము :

తమిళనాడులో మద్రాసుకు సుమారు 240కి. మీ దూరంలో ఆకాశలింగము ఉంది. శివుడు ప్రళయ రుద్రతాండవం చేస్తున్న విగ్రహం అతి పెద్దది (నటరాజ స్వామి). ఈ చిదంబర క్షేత్రంలో మహావిష్ణువుఆలయం మరియు శివాలయం (నటరాజ స్వామి) ఒకే చోట కనపడతారు . విల్లుపురం నుంచి తంజావూరు వెళ్లే మార్గంలో ఉంది .విల్లుపురం నుంచి చిదంబరం దూరం 83కి. మీ మాత్రమే.

5. వాయు లింగము :

ఆంధ్రప్రదేశ్ లో తిరుపతికి సుమారు 65కి.మీ దూరంలో శ్రీ కాళహస్తి యందు వాయులింగము ఉంది. ఈ స్వామిని సాలెపురుగు, కాళము, హస్తిలు అకుంఠిత భక్తితో పోటాపోటీగా ఆర్చించి చివరకి మోక్షము పొందాయి .

కాలభైరవ జయంతి

దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్ |
నారదాదియోగిబృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౧ ||

భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౨ ||

శూలటంకపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ |
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౩ ||

భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోకవిగ్రహమ్ |
నిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౪ ||

ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |
స్వర్ణవర్ణకేశపాశశోభితాంగనిర్మలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౫ ||

రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్ |
మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రభూషణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౬ ||

అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం దృష్టిపాత్తనష్టపాపజాలముగ్రశాసనమ్ |
అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౭ ||

భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం కాశివాసిలోకపుణ్యపాపశోధకం విభుమ్ |
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౮ ||

కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం జ్ఞానముక్తిసాధకం విచిత్రపుణ్యవర్ధనమ్ |
శోకమోహలోభదైన్యకోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్ |

శ్రీకృష్ణ లీలలు - ధేనుకాసుర సంహారము

బలరామకృష్ణులు వివిధ వర్ణముల గోవులను చక్కగా అలంకరించి చూచువారి కన్నులపండగుగా ఆలమందలను తోలుకొని పోయేవారు. పవిత్రమైన గోధూళి తనపై పడాలని నందకిశోరుడు ఆలమందల వెనుక నడచుచుండెడివాడు. కానీ భక్తి అనే అమృతమును హృదయముల నిండా నింపుకొన్న గోమాతలకు పచ్చికబయళ్ళకన్నా పరమాత్మ సందర్శనమే మిక్కిలి ప్రీతిని కల్గించుచుండెడిది. కావున గోమాతలు పరమాత్ముడైన యశోదాతనయుని చూడకపోతే అడుగులు ముందుకు వేసేవి కావు. అందుకని ఆ లీలామానుషవేషధారి తానే ఆలమందల ముందు నడుమ , వెనుక ఉండి అందరికి ఆనందమును అందించెడివాడు. భక్తునికి భగవంతునికి గల సంబంధము అవ్యక్తమధురము కదా!

మధురానగరములో తీయ్యని తాటిపండ్లు గల తాళవనము ఒకటి ఉన్నది. కానీ ఆ వనములో నివసించు ధేనుకాసురునికి భయపడి గోపబాలురు ఆ వనములోకి మునుపెన్నడూ ప్రవేశించలేదు. శ్రీకృష్ణుని శక్తిపై పరిపూర్ణ విశ్వాసమున్న గోపబాలురు బలరామకృష్ణులను తాటిపండ్లు ఇప్పించమని కోరిరి. నిజభక్తుల కోరికలు స్వామి తీర్చకుండునా? వెంటనే బలరామకృష్ణులు తాళవనములో ప్రవేశించి తాళవృక్షములను గట్టిగా వూపిరి. తాళఫలములు క్రిందపడిన ధ్వనులు విని ధేనుకాసురుడు బలరామకృష్ణులను చూచినాడు. బలముగా తన వెనుకకాళ్ళతో బలరామదేవుని నాలుగుక్రోసుల దూరము పడునట్లుగా తన్నెను. చలించని బలదేవుడు వానిని తాళవృక్షమునకేసి కొట్టెను. కుపితుడై ఆ ధేనుకుడు గోపబాలుల వెంటబడెను. నందకిశోరుడు విసిరిగొట్టగా ధేనుకుడు గోవర్ధనిగిరి వద్ద పడి మూర్ఛిల్లెను.

కొంతసేపటికి తేరుకొని ధేనుకుడు నందనందనుని ఆకాశములోకి గొనిపోయి పోరుసల్పెను. పరమాత్మ వానిని నేలపైకి విసిరిగొట్టెను. గోవర్ధనగిరిని బంతివలె ధేనుకాసురునిపైకి విసిరెను. ధేనుకుడు ఆ గిరిని తిప్పికొట్టెను! శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని యథాస్థానములో ప్రతిష్ఠించి బలరామునికి సైగచేసెను. అంతట బలరాముడు పడికిలి బిగించి ధేనుకుని పొడిచెను. రక్కసుడు మరణించెను. వాని తేజము పరమాత్మలో లీనమయ్యెను.

ధేనుకాసురుని వృత్తాంతము:

పరమ విష్ణుభక్తుడైన బలిచక్రవర్తి యొక్క కుమారుడు సాహసికుడు. అహంకారి అయిన సాహసికుడు ఒకనాడు పవిత్రమైన గంధమాదన పర్వతములపై పదివేలమంది వనితలతో విహారములు చేసినాడు. ఆ పవిత్ర ప్రదేశములో ఘోరతపస్సు చేసుకొంటున్న దుర్వాసమహర్షికి సాహసికుని వలన తపోభంగమైనది. మహర్షి “ఓరీ! ఏమాత్రమూ వినయవిధేయతలు లేకుండా గార్దభమువలె ప్రవర్తించినావు. పవిత్రమైన ఈ పర్వతముపై విలాసవిహారములు చేసి నా తపస్సును భంగపఱచినావు. గార్దభమువై జన్మించు” అని సాహసికుని శపించెను. చేసిన తప్పుకు పశ్చాత్తాపపడి మహర్షిని శరణువేడినాడు సాహసికుడు. కరుణించి మహర్షి “నాయనా! అహంకారముతో మనసుకు నచ్చినట్లు చేయుట వివేకవంతుల లక్షణముకాదు. ఉత్తముడైన వాడు ధర్మబద్ధమైన కార్యములనే చేస్తాడు. కాబట్టి ఎప్పుడూ వినయమును కలిగి ధర్మమార్గముననే నడువవలెను. నీవు చేసిన తప్పుకు ఫలితమును అనుభవించిన తరువాత ద్వాపరయుగములో బలరాముని చేతిలో మరణించి ముక్తిని పొందుతావు” అని ఆశీర్వదించెను. ఆ సాహసికుడే ధేనుకుడు. పూర్వం ప్రహ్లాదుని కాచినపుడు స్వామి ప్రహ్లాదుని వంశమువారిని సంహరించనని వరమిచ్చెను. అందుకనే బల
రామునికి ధేనుకాసురిని సంహరించమని సైగచేసెను.

త్రిశంకు స్వర్గం -శ్రీ మహాభారతంలో కథలు

విశ్వామిత్ర మహారాజు ఒకసారి సపరివారంగా అరణ్యానికి వేటకు వెళ్ళాడు. చాలా సేపు ఏకాగ్రంగా వేటాడి అలసిపోయి చివరకు వశిష్టుని ఆశ్రమం చేరుకున్నాడు. మహర్షి ఆయనకు ఘనంగా స్వాగతం చెప్పి అతిథి సత్కారాలు చేసాడు.

విశ్వామిత్రుడు కొంచెం సేద తీరాకా "మహారాజా! మీరు , మీ పరివారమూ బాగా డస్సినట్టున్నారు. త్వరగా స్నానాదికాలు కానివ్వండి. భోజనం చేద్దురుగాని" అన్నాడు వశిష్టుడు.

మహారాజు, ఆయన సేవకులు స్నానాలు పూర్తిచేసి వచ్చేసరికి రకరకాల పిండివంటలతో విందు సిద్ధంగా ఉంది. స్వల్ప వ్యవధిలో యిన్ని వంటకాలు యీ మహర్షి ఎలా తయారు చేయించాడా అని విశ్వామిత్రుడు విస్తుపోయాడు. రుచికరమైన ఆ విందు భోజనం పూర్తయ్యే సమయానికి రాజుగారి విస్మయం మరింతగా పెరిగిపోయింది. తరువాత వశిష్టుడు దగ్గరకు వెళ్ళి " స్వామీ! షడ్రసోపేతమైన ఇంత కమ్మటి విందు క్షణాల్లో ఎలా తయారు చేయించారు?" అని అడిగాడు.

తాపసి చిరునవ్వు నవ్వి తన ఆశ్రమంలోని "నందిని" అనే కామధేనువు తను కోరినవన్నీ ఇస్తుందని చెప్పాడు.

విశ్వామిత్రుడికి పేరాస కలిగింది.

ఆ కామధేనువును తాను స్వంతం చేసుకోవాలనుకున్నాడు. " విరాగీ! నీ కామధేనువును నాకివ్వు. బదులుగా నీకు శ్రేష్ఠమైన కోటి పాడి ఆవుల్ని ఇస్తాను" అన్నాడు విశ్వామిత్రుడు. వశిష్టుడు రాజుగారి కోరికను మృదువుగా తోసిపుచ్చాడు. విశ్వామిత్రుడికి కోపం వచ్చి " రాజ్యంలోని సమస్త వస్తువులూ సకల సంపదలూ మహారాజుకే చెందుతాయి. రాజే అన్నిటికీ అధిపతి" అన్నాడు. వశిష్టుడు ఆ మాటను కూడా లెక్క చేయలేదు. దానితో విశ్వామిత్రుడు మండిపడి కళ్ళేర్రజేసి బలవంతంగా నందినిని తీసుకు వెళ్ళబోయాడు. వశిష్టుణ్ణి వదలి వెళ్ళటం ఇష్టంలేని నందిని తోక ఝళిపిస్తూ , కొమ్ములు విసురుతూ, ముంగాళ్ళపై భయంకరంగా నిలబడింది. దాని శరీరం నుండి అనేల వందల మంది యోధులు బయటకు ఉరికి ఘోరయుద్ధం చేశారు. ఆ యుద్ధంలో విశ్వామిత్రుడి సైన్యం మట్టికరిచింది. ఓడిపోయారు. ఇక లాభం లేదనుకుని విశ్వామిత్రుడే స్వయంగా వశిష్టుడితో యుద్ధానికి తలపడ్డాడు. విశ్వామిత్రుడు గుప్పించిన బాణాలన్నీ వశిష్టుణ్ణి చేరగానే పరిమళ పుష్పాలుగా మారిపోయాయి. మహర్షి తపశ్శక్తి ముందు మహారాజు శౌర్యం , అధికారం, అంగబలం, ఆయుధబలం అన్నీ నిష్ప్రయోజనమయ్యాయి. విశ్వామిత్రుడు పూర్తిగా పరాజితుడై , ఖిన్నుడై రాజనగరుకు తిరిగి వెళ్ళిపోయాడు. అయితే అప్పటినుంచీ ఆయనలో వశిష్టుడి మీద ద్వేషం పెరుగుతూనే ఉంది కాని లేశమైనా తగ్గలేదు. ప్రతీకారం కోసం చేయని ఆలోచన , అన్వేషించని మార్గాలూ లేవు.

రాజుకన్నా, రాజ్యాధికారంకన్నా తపశ్శక్తి గొప్పదని , తాపసులు దైవసమానులనీ, మహర్షులు తలచుకుంటే యీ పృద్వ్హీ మీద సాధ్యం కానిదేదీ లేదని విశ్వామిత్రుడు తెలుసుకున్నాడు. రాజ్యాన్ని బంధువులకు అప్పగించి అరణ్యాలకు వెళ్ళి ఆశ్రమాన్ని నిర్మించుకుని దీక్షతో తపస్సు చేయటం ప్రారంభించాడు. నిశ్చలధ్యానంతో మహాజ్ఞానాన్నీ , అద్భుతశక్తుల్నీ సంపాదించాడు. తపశ్శక్తి పెరుగుతున్నకొద్దీ వశిష్టుడి మీద పగ, ప్రతీకారం కూడా పెరుగుతూనే వచ్చాయి. ఇద్దరి మధ్య అగాధం ఎక్కువైంది.

సూర్యవంశానికి చెందిన త్రిశంకు మహారాజు శరీరంతోనే స్వర్గం చేరాలనుకుని వశిష్టుణ్ణి ఆశ్రయించాడు. అది సాధ్యం కాదని మహర్షి చెప్పాడు. ఈ విషయం విశ్వామిత్రుడికి తెలిసి శరీరంతోనే స్వర్గం చేరుస్తానని రాజుకు హామీ ఇచ్చాడు. దానికోసం ఆయన ఒక బ్రహ్మండమైన యాగాన్ని కూడా నిర్వహించాడు. అయితే వశిష్టుడు ఆజ్ఞాపించినందువల్ల మునులెవరూ ఆ యాగంలో పాల్గొనలేదు. విశ్వామిత్రుడొక్కడే యాగాన్ని పూర్తిచేసి తన శక్తిని నిరూపించుకున్నాడు. అదే తపశ్శక్తితో త్రిశంకుణ్ణి మెల్లగా శరీరంతో పైకి తీసుకువెళ్ళాడు.

తీరా త్రిశంకుడు స్వర్గం చేరుబోతుండగా మానుషమాత్రుడెవరో సశరీరుడై స్వర్గద్వారం దాటి వస్తున్నాడని దేవతలు గ్రహించి పరుగు పరుగున ఇంద్రుడి దగ్గరకు వెళ్ళారు. ఇంద్రుడు జరిగినదంతా తెలుసుకుని , కోపగించి, త్రిశంకుణ్ణి కిందకు ఒక్కతోపు తోయగానే అతడు తలక్రిందులుగా నేలమీదకు వచ్చిపడుతూ "విశ్వామిత్రా రక్షించు" అని బిగ్గరగా ఆర్తనాదాలు చేశాడు. విశ్వామిత్రుడు ఆ కేకలు విని ఆకాశం నుంచి కిందకు తలక్రిందులుగా వస్తున్న త్రిశంకుణ్ణి మంత్రశక్తితో అలాగే నిలిపివుంచి , అతడి కోసం మరో స్వర్గాన్ని సృష్టించాడు. కొత్తగా నెలకొల్పిన స్వర్గం కోసం విశ్వామిత్రుడు మరో ఇంద్రుణ్ణీ, దేవతలనూ సృష్టించ బోయాడు. దేవతలు భయపడిపోయి సమాంతర దేవతలను సృష్టించవద్దని విశ్వామిత్రుణ్ణి అర్థించవలసిందిగా ఇంద్రుణ్ణి కోరారు. ఇంద్రుడు విశ్వామిత్రుడి దగ్గరకు వెళ్ళి త్రిశంకుడికి తన స్వర్గంలోనే స్థానం కల్పిస్తానని మాట ఇచ్చిన మీదట విశ్వామిత్రుడు ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. ఇంద్రుడు తక్షణమే బంగరు విమానాన్ని తీసుకు వచ్చి త్రిశంకుణ్ణి స్వర్గానికి తీసుకువెళ్ళాడు.

ముక్కోటిఏకాదశి


‘ముక్కోటిఏకాదశి’ వైషవాలయాల్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ముక్కోటి ఏకాదశి నాడు అన్ని వైష్ణవాలయాల్లో ఉత్తరంవైపు ఉండే వైకుంఠ ద్వారాన్ని తెరుస్తారు.

ఈ ద్వారం ద్వార స్వామిని దర్శించుకోవడం పుణ్యప్రదం. శ్రీమహావిష్ణువుతో బాటు ముక్కోటి దేవతలు ఈ రోజున భువికి దిగివస్తారని శాస్త్రవచనం. దక్షియణాయానంలో దివంగతులైన పుణ్యాత్ములు ఈ రోజున వైకుంఠ ద్వార౦ ద్వారా స్వర్గానికి చేరుకుంటారు.
ఈ రోజు ఏకాదశి వ్రతం చేసి, విష్ణువుని పూజించి, ఉపవాసం, జాగరణ పాటించడ౦ వల్ల పుణ్యఫలితాలు లభిస్తాయి. ఏకాదశి ఉపవాస తిథి విష్ణు స్వరూపమైనది. ఈ వైకుంఠ ఏకాదశీనే ‘పుత్రదా ఏకాదశి’ అని అంటారు. ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. దశమి రాత్రి కూడా భుజించకూడదు.
ద్వాదశినాడు ద్వాదశి ఘడియలు వెళ్ళకముందే పారణం (భోజనం) చేయాలి. దేవతలకు ఆరునెలలు పగలు, ఆరునెలలు రాత్రి. దక్షిణాయానం రాత్రికాలం. ఈ చీకటి తొలగి దేవతలు వెలుగులోకి వస్తారు. అంటే వారికి పగలు ప్రారంభమైనట్టు.

అందుకే ఆ రోజు ఉపవాసం పుణ్యప్రదం. బ్రహ్మ స్వేదబిందువు నుండి రాక్షసుడు జన్మించాడని, బ్రహ్మ ఆజ్ఞతో ముక్కోటి ఏకాదశీ నుండి అన్నంలో నివసిస్తాడని పురాణ కథనం. అందుకే ఆ రోజున భోజనం మాని ఉపవాసం ఉండాలంటారు. ఏడాదిలో 24 ఏకాదశుల్లో ఉపవాశం ఉంటే వచ్చే మొత్తం ఫలితం ముక్కోటి ఏకాదశి రోజున లభిస్తుంది.

ఖాండవ దహనం-శ్రీ మహాభారతంలో కథలు

చాలా ఏళ్ళ క్రితం శ్వేతకి అనే రాజుగారు దుర్వాసమహర్షి పర్యవేక్షణలో ఒక బృహత్తర యజ్ఞాన్ని నిర్వహించాడు. వందేళ్ళపాటూ సాగి దిగ్విజయంగా ముగిసిన ఆ యజ్ఞం వల్ల దేవతలందరూ సంతోషించారు. కాని నిత్యం హోమగుండంలో ఆజ్యం పోయడం వల్ల అగ్నిదేవుడికి అజీర్తి చేసింది. మొహం పాలిపోయింది. సన్నబడ్డాడు. ఆహారం పట్ల విముఖత ఏర్పడింది. ఇక లాభం లేదనుకుని అగ్ని బ్రహ్మను అర్చించి తన వ్యాధి గురించి వివరించి తరుణోపాయం చెప్పమని వేడుకున్నాడు. " ఖాండవ వనంలో అనేక దివ్య ఓషధులు ఉన్నాయి. దేవతలకు శత్రువులైన రకరకాల జంతువులు ఉన్నాయి. నీ ప్రతాపంతో అ వనాన్ని దహించి ఆ ఓషధుల్ని స్వాహాచేసి జంతువుల్ని భక్షించు. నీ ఆరోగ్యమూ కుదుటపడుతుంది. శత్రు సంహారమూ జరుగుతుంది" అని అగ్నికి సలహ ఇచ్చాడు.

సరేనని అగ్ని ఖాండవ వనానికి వెళ్ళాడు. ఆ వనంలో ఇంద్రుడి స్నేహితుడు తక్షకుడు భార్యాబిడ్డలతో వుంటున్నాడు. ఖాండవ వనాన్ని దహించడానికి అగ్ని వచ్చాడని తెలుసుకుని తన స్నేహితుడ్ని ఎలాగైనా సరే రక్షించాలనుకున్నాడు ఇంద్రుడు.

అగ్ని వనదహనం ప్రారంభించగానే ఇంద్రుడు కుండపోతగా వర్షం కురిపించాడు. అంతటితో అగ్ని ప్రయత్నం విఫలమైంది. కోపంతో కణకణలాడిన అగ్నిదేవుడు ఆ వనన్ని ఎలాగైనా స్వాహా చేయాలన్న నిశ్చయంతో వరుసగా ఏడు రోజులూ కాపు కాసాడు. ఏడు రోజులూ ఇంద్రుడు అడ్డుకున్నాడు. లాభం లేక అగ్ని వెళ్లి మళ్ళీ బ్రహ్మ దగ్గర మొరపెట్టుకున్నాడు.

"నరనారాయణులు భూమిపై కృష్ణార్జునులుగా జన్మిస్తారు. అప్పుడు ఖాండవ వనాన్ని దహించే అవకాశం నీకు లభిస్తుంది. అప్పటి వరకూ వేచివుండు" అని బ్రహ్మ ఉపాయం చెప్పాడు.

పాండవులు ఇంద్రప్రస్థంలో ఉంటున్నప్పుడు ఒకసారి అర్జునుడు కృష్ణుణ్ణి తోడు తీసుకుని ఖాండవ వనానికి వెళ్ళాడు.

యమునా తీరాన బావమరుదులిద్దరూ చల్లగాలికి సేద తీరుతుండగా అగ్ని ఒక ముసలి బ్రాహ్మణుడి వేషంలో వెళ్ళి తన వ్యాధి గురించి చెప్పుకుని సహాయం కోసం అర్థించాడు. వారు సరేనన్నాకా అసలు రూపంలో ప్రత్యక్షమై ఖాండవ వనాన్ని దహించాలనే కోరికను వెళ్ళబుచ్చాడు. కృష్ణార్జునులు సహాయం చేస్తామని వాగ్దానం చేశారు. అయితే ఆ సమయంలో వాళ్ళ దగ్గర ఆయుధాలు సిద్ధంగా లేవు. అది గమనించి అగ్ని వరుణదేవుణ్ణి ప్రార్థించాడు. వరుణుడు ప్రత్యక్షమై అగ్నిదేవుడి అభ్యర్ధన మేరకు అర్జునుడికి 'చంద్రధనస్సు ' (గాండీవం) ఇచ్చాడు. చిత్రమేమిటంటే దానికి అక్షయ తూణీరం ఉన్నది. ఎన్ని బాణాలు తీసివేస్తున్నా అది ఖాళీ కాదు. ఎప్పుడూ శరసమృద్ధమై ఉంటుంది. దానికి తోడు కపిరాజుచిత్తరువుతో వున్న ధ్వజాన్ని అమర్చిన ఒక దివ్యరథాన్ని అర్జునుడికి ఇచ్చాడాయన. ఆ రథానికి బలిష్టమైన నాలుగు తెల్లగుర్రాలు పూంచి ఉన్నాయి. నాలుగిటికీ కళ్ళేలుగా నాలుగు బంగారపు గొలుసులు ఉన్నాయి. బ్రహ్మానందం పొందిన అర్జునుడు వరుణదేవుడికి వినమ్రుడై నమస్కరించి వాటిని స్వీకరించాడు.

కృష్ణార్జునులు ఖాండవ వన సరిహద్దుల్లో నిలబడి లోపలి ప్రాణులు బయటకు రాకుండా కాపలాకాస్తూ, వనాన్ని దహించమని అగ్నికి అనుమతి ఇచ్చారు. అడవిలో జంతువులు అటూ , ఇటూ పరిగెత్తి ఎటూ పోలేక అగ్ని జ్వాలలకు తట్టుకోలేక ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. అక్కాడ తపస్సు చేసుకుంటున్న మహర్షులు ఎటూ పోలేక తమను రక్షించమని దేవేంద్రుణ్ణి వేడుకున్నారు. క్షణంలో ఆకాశం మేఘావృతమైంది. ఉరుములూ, మెరుపులతో ధారాపాతంగా వర్షం మొదలైంది. ఆ వెంటనే అర్జునుడు ఆకాశంలోకి అంబులు విడిచి అగ్ని దహిస్తున్నంత మేరా ఒక్క వానచినుకు రాలకుండా శరచత్రం ఏర్పరిచాడు. సంతోషించిన అగ్ని మళ్ళీ విజృంభించాడు.

ఆ సమయానికి తక్షకుడు లేడక్కడ. కురుక్షేత్రం వెళ్ళాడు. తక్షకుడి కొడుకు అశ్వసేనుడు మంటల్లో చిక్కుకుని గిలగిల్లాడసాగాడు. కొడుకును మంటల నుంచి రక్షించేందుకు తల్లి అతన్ని ఆసాంతం గుటుక్కున మింగి ఖాండవ వనానికి దూరంగా ఉమ్మి వేయాలనుకుంది. అర్జునుడు అది పసిగట్టాడు. కోపంతో అశ్వసేనుడి తల నరకబోయాడు. వెంటనే ఇంద్రుడు గాలి దుమ్ము రేపాడు. కళ్ళల్లోకి ధుళి పోవడం వల్ల అర్జునుడి గురితప్పింది. అశ్వసేనుడి ప్రాణాలు నిలిచాయి.

అది గ్రహించి కృష్ణార్జునులు మండిపడ్డారు. అశ్వసేనుడు తలదాచుకునేందుకు మరెక్కడా చోటు లభించరాదని అగ్ని, కృష్ణార్జునులు శపించారు. పాండవమధ్యముడు ఖాండవ వనంలో కనిపించిన ప్రతీ ప్రాణినీ నిర్దాక్షిణ్యంగా సంహరించసాగాడు.

బాణాల గొడుగు చాటున అగ్ని ఖాండవవనాన్ని దహిస్తున్నాడు. అతిప్రయాసతో తప్పించుకుని బయటకు రాగలిగిన పాముల్ని, డేగల్ని అర్జునుడు ముక్కలు చేస్తున్నాడు. మరో పక్క కృష్ణుడు అసురుల్ని మట్టికరిపించాడు. చివరకు ఇంద్రుడే ఐరావతాన్ని ఎక్కి వచ్చి స్వయంగా కృష్ణార్జునులతో తలపడ్డాడు. దేవతలందరూ యుద్ధంలో ఇంద్రుడికి సహాయపడినా ఫలితం లేకపోయింది. దేవేంద్రుడు ఓడిపోయాడు. కృష్ణార్జునులు విజయం సాధించారు. ఖాండవ వనాన్ని సమూలంగా స్వాహా చేసిన అగ్ని తిరిగి ఉజ్జ్వలంగా ప్రకా
శించాడు

ఆష్ఠ వింసతి విష్ణు నామ స్తొత్రం


మత్స్యం కూర్మ వరహంచ, వామనాంచ జనార్ధనం ,
గొవిందం ఫుండరీకాక్షం మాధవం మధు సూధనం .

పద్మనాభం, సహస్రాక్షం, వనమాలం, హలాయుధం,
గొవర్ధనం, ౠషికేసం, వైకుంటం, పురుషొతమం .

విశ్వరూపం, వాసుదేవం, రామం నారయణం హరిం,
దామొధరం, శ్రిధరాంచ వేదాంగం, గరుడ ద్వజం.

ఆనంతం, క్రిష్ణ గొపాలం, జాపతొ నాస్తి పతకం.
గవం కొటి ప్రాధనశ్య, అస్వమేధ సతాస్య చ

కన్య ధాన సహస్రనాం, ఫలం ప్రప్నొతి మనవ,
ఆమయాం వా పౌర్ణమాస్యం, ఎకదశ్యం తదివ చ.

సంధ్య కాలే స్మరనిత్యం, ప్రాతకాలే తదైవ చ,
మధ్యహ్నే చ జప నిత్యం సర్వపాపై ప్రాముచ్యతే.

మయూరధ్వజుడు -శ్రీ మహాభారతంలో కథలు

ధర్మరాజు అశ్వమేధయాగం చేసి హయాన్ని వదిలాడు. యాగాశ్వాన్ని ఎవరైనా పట్టుకుంటే వారు యజ్ఞం చేసే చక్రవర్తి అధికారాన్ని ఎదిరించినట్లే!పాండవులు వదిలిన యాగాశ్వాన్ని మయూరధ్వజుడనే రాజు బంధించాడు. అది తెలిసి కృష్ణార్జునులు అతని నగరం చేరుకున్నారు.మయూరధ్వజుడు కృష్ణభక్తుడనీ, అతనితో యుద్ధం చేసేటప్పుడు అప్రమత్తంగా వుండాలని కృష్ణుడు అర్జునుడితో చెప్పాడు. సరేనన్నాడు పాండవమధ్యముడు.

మయూరధ్వజుడు అద్భుత పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ యుద్ధం చేశాడు. సవ్యసాచి అతన్ని సంబాళించలేక పోయాడు. విధి లేక శౌరి సాయం ఆర్థించాడు. పార్థసారథి కూడా యుద్ధంలోకి దిగాడు. మయూరధ్వజునికి తన ఆరాధ్యదైవంతో పోరాడటం ఇష్టం లేదు. కాని రణరంగంలో వెనుదీయడం క్షత్రియధర్మం కాదని తలచి "కృష్ణా! కృష్ణా!" అని నామస్మరణం చేస్తూ బాణాలు గుప్పించడం మొదలు పెట్టాడు. ఆ శరాల ధాటికి ఆ మహాయోగి కూడా చలించాడు.

"బావా! ఎందుకు సంకోచిస్తావు. నీ చక్రంతో మయూరధ్వజుని చంపలేవా?" అన్నాడు అర్జునుడు. పద్మనాభుడు మందహాసంతో "పార్థా! నీ గాండీవం గాని, నా సుదర్శనం గాని ఆ మహాభక్తుని మీద పనిచేయవు" అన్నాడు.

'మయూరధ్వజుడు అంతటి భక్తుడా!' అని గాండీవి విస్తుపోయాడు. మాధవభక్తులలో తనను మించిన వారు లేరని కృష్ణసఖునికి కించిత్తు గర్వముంది. అది మునుపే ఎరిగిన కృష్ణుడు మయూరధ్వజుని భక్తి ఎంత గొప్పదో అర్జునుడికి చూపించాలనుకున్నాడు. ఇద్దరూ అనాటికి యుద్ధం చాలించారు.

మరునాడు కృష్ణార్జునులు బ్రాహ్మణ వేషాలు ధరించి మయూరధ్వజుని మందిరానికి అతిథులుగా వెళ్ళారు. విప్రుల రాక గమనించి ఆ రాజు వారికి ఎదురేగి గౌరవ పురస్కారంగా మర్యాద చేశాడు.

"అయ్యా! మీరు నా ఆతిథ్యం స్వీకరించి నన్ను ఆశీర్వదించండి" అని ప్రార్థించాడు. "రాజా! నీ ఇంట భుజించడానికి మాకు వ్యవధి లేదు. మాకొక పెద్ద ఆపద వచ్చిపడింది. అది తీరితేగాని మేము మరొక విషయం ఆలోచించలేము" అన్నాడు మాయారూపంలో ఉన్న కృష్ణుడు.

"స్వామీ! మీకు కలిగిన విపత్తేమిటో చెప్పండి. నా శాయశక్తులా తీర్చడానికి ప్రయత్నిస్తాను. అవసరమైతే నా ప్రాణమైనా ఇస్తాను" అన్నాడు మయూరధ్వజుడు.

"రాజా! మేము అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు నా కుమారుణ్ణి ఒక పులి పట్టుకుంది. అది ఆ పసివాడి శరీరాన్ని సగం తిన్న తరువాత "మయూరధ్వజ మహారాజు శరీరంలో సగభాగాన్ని తెచ్చి ఈ పులికి అప్పగిస్తే నీ బిడ్డ బతుకుతాడు" అని అశరీరవాణి పలికింది. అందుకని నాకు పుత్ర భిక్ష పెట్టవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను" అన్నాడు విప్రుని వేషంలో ఉన్న కృష్ణుడు.

"ఆహా! నా జన్మ తరించింది. ఒక పసిబిడ్డ ప్రాణాలు కాపాడేందుకు నా శరీరం ఉపయోగపడుతోంది. ఇంతకంటే ఏం కావాలి. అయ్యా! సందేహించకండి. వెంటనే నా శరీరంలో సగభాగాన్ని తీసుకుని వెళ్ళి పులికి ఆహారంగా ఇవ్వండి" అని వారిని అర్థించాడు మయూరధ్వజుడు. వెంటనే భార్యాబిడ్డల్ని పిలిచి తన శరీరాన్ని రెండు భాగాలుగా కోయమన్నాడు.

మయూరధ్వజుడు ఏదో మహత్తర కార్యక్రమానికి తన శరీరాన్ని వినియోగించబోతున్నాడని వారికి అర్థమైంది. మారుమాట్లాడక రాజుగారి శరీరాన్ని చేదించడం ప్రారంభించారు.

కృష్ణార్జునులు అనిమిషులై ఈ దృశ్యాన్ని చూస్తున్నారు. అలా చూస్తుండగా వారికొక వింత కనిపించింది.

మయూరధ్వజుని ఎడమ కంటి నుండి నీటి చుక్కలు రాలసాగాయి. అప్పుడు కృష్ణుడు తెచ్చిపెట్టుకున్న కఠిన్యంతో "రాజా! బాధపడుతూ నువ్వేమీ నీ శరీరాన్ని నాకివ్వనవసరం లేదు. మనస్ఫూర్తిగా , సంతోషంగా చేస్తేనే ఏదైనా త్యాగమవుతుంది. ఎదుటివాడి కష్టాన్ని చూసి కన్నీరు కార్చడంలో దివ్యత్వముంటుంది. మనల్ని చూసి మనం దుఃఖించడం నైచ్యమౌతుంది. మనమీద వున్న మమకారాన్ని మనం చంపుకోలేక పోవడం దీనికి కారణం. నీ కిష్టం లేని పనిని నీవు చెయ్యవద్దులే" అని వెనుదిరిగాడు.

మయూరధ్వజుడు కృష్ణుని చేతులు పట్టుకుని, "అయ్యా! నా శరీరం అర్పిస్తున్నానని నాకు బాధలేదు. మనస్ఫూర్తిగా ఇస్తున్నాను. నాకే నిజంగా బాధ వుంటే రెండు కళ్ళూ కూడా నీరు కార్చాలి కదా! ఒక కంటి నుండి మాత్రమే నీరు వస్తోంది. ఎందుకో ఆలోచించారా? నా శరీరంలో కుడిభాగం ఆర్తరక్షణకు అర్పితమవుతున్నదనీ , వామభాగానికి ఆ భాగ్యం కలగలేదని ఎడమకన్ను దుఃఖిస్తోంది. ఒంటరిగా మిగిలిపోయిన తాను ఏ పరమార్థాన్నీ సాధించకుండానే, ఎవరికీ ఎట్టి ప్రయోజనాన్నీ కలిగించకుండానే ఖిలమైపోవాలి కదా అని చింతిస్తోంది" అన్నాడు.

ఈ మాటలు విని కృష్ణుడు అర్జునుడి వైపు చూశాడు. అర్జునుడికి అంతా అర్థమైంది. ఇదంతా తనకు గర్వభంగం చేయడానికి అచ్యుతుడు ఆడిన నాటకమని గ్రహించి సిగ్గుపడ్డాడు.

పునీతుడైన ప్రియబాంధవునితో సహా కృష్ణుడు తమ నిజరూపాలు తెలియజెప్పి మయూరధ్వజుని దీవించాడు. ఆ రాజు శరీరానికి పూర్వపు స్థితిని కలుగచేశాడు.

మయూరధ్వజుడు యాగాశ్వాన్ని అర్జునునికి అప్పగించి మాధవుడికి పాదాభివందనం చేశాడు.

ముగ్గుకున్న ప్రాధాన్యత ఏమిటి ? ఏ ముగ్గును ఎక్కడ, ఎప్పుడు వేయాలి ?


ఇంటి / గడప/ గేటు ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంటిలోనికి దుష్టశక్తులను రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళకుండా చూస్తాయి.

ముగ్గువేసి దానికి నాలుగువైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభాకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు. పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వేయాలి. ఏ దేవతపూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా, నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పక గీయాలి.

నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత, ప్రేత, పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది. అంతేకాదు, మనం వేసే పద్మాలు, చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి. అవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా. యంత్ర,తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డశక్తులను దరిచేరనీయవు. అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు.

తులసి మొక్క దగ్గర అష్టదళపద్మం వేసి దీపారాధాన చేయాలి. యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులేయాలి. దైవకార్యలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి.

నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుప్రక్కల లతలు, పుష్పాలు, తీగలతో కూడిన ముగ్గులు వేయాలి.

దేవతా రూపాలను, ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు. ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు.

ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ, అమ్మవరు, శ్రీ మహావిష్ణు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో, ఆ స్త్రీకి 7 జన్మలవరకు వైదవ్యం రాదని, సుమంగళిగానే మరణిస్తుందని దేవి భాగవతం, బ్రహ్మాండపురాణం చెబుతున్నాయి.

పండుగ వచ్చిందా కదా అని, నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు.

అంతేకాదండోయ్! మనం ముగ్గులు రోజు వేయలేక పేంట్ పెట్టస్తాం. దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు. ఏ రోజుకారోజు బియ్యపుపిండితో ముగ్గు పెట్టాలి.

నిత్యం ఇంటి ముందు, వెనుక భాగంలో, తులసి మొక్క దగ్గర, దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి. ముగ్గు పాజిటివ్ / దైవ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది.

ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి. పూర్వం రోజూ సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ఇల్లిల్లూ తిరిగి బిక్ష అడిగేవారు. ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వేళ్ళేవారు కాదు. వారే కాదు అడ్డుక్కునేవారు కూడా ముగ్గు లేని ఇళ్ళకు వెళ్ళి అడ్డుక్కునే వారు కాదు. ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు. అందుకే మరణించినవారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటిముందు ముగ్గు వేయరు. శ్రాద్ధకర్మ పూర్తైన వెంటనే, అది మధ్యాహ్నమైనా ముగ్గు వేస్తారు.

ముగ్గులు వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి. మన ఆచరించే ఏ ఆచారమూ మూఢనమ్మకం కాదు. మన ఆచార, సంప్రదాయాలన్నీ అనేకానేక అర్ధాలు, పరమార్ధాలతో కూడినవి.

మాఘమాసం విశిష్టత

చంద్రుడు మఘ నక్షత్రాన ఉండే మాసం మాఘం. 'మఘం' అంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్ఠమైనదిగా భావించేవారు. ఈ మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం గనుక మాఘమాసమైంది.

మాఘ స్నానం పవిత్రస్నానంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం. మాఘస్నానాలు సకల కలుషాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం. మాఘస్నాన మహాత్మ్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటోంది. మృకండుముని మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథనం. మఘం అంటే యజ్ఞం. కల్యాణ కారకమైన ఈ మాసంలో చేసే స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం.

మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి. ఆ సమయంలో సూర్య కిరణాల్లో ఉండే అతినీల లోహిత, పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులొస్తాయి. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం జనవరి 20నుంచి మార్చి 30వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని, వేగంగా ప్రవహించే నీళ్లలో చేసే స్నానాలు శ్రేష్ఠమని పేర్కొంటున్నారు. ఈ స్నానాలకు అధిష్ఠానదైవం సూర్య భగవానుడు. స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం.

మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహస్నానంతోనైనా ఆరు సంవత్సరాల అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుందంటారు. బావినీటి స్నానం పన్నెండేళ్ల పుణ్యఫలాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీస్నానం చాతుర్గుణం, మహానదీ స్నానం శతగుణం, గంగాస్నానం సహస్ర గుణం, త్రివేణీ సంగమ స్నానం నదీశతగుణఫలాన్ని ఇస్తాయని పురాణవచనం. మాఘ స్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాపవినాశనం కోరుతూ స్నానం చేయడం సంప్రదాయం. స్నాన సమయంలో 'ప్రయాగ'ను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం.
మాఘ పూర్ణిమను 'మహామాఘం' అంటారు. ఇది ఉత్కృష్టమైన పూర్ణిమ. స్నానదాన జపాలకు అనుకూలం. ఈ రోజున సముద్రస్నానం మహిమాన్విత ఫలదాయకమంటారు.

తిరుమల వేంకటేశ్వరుని ఐదు రూపాలు,

తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలో మూలవిరాట్టు కాకుండా, మరో నాలుగు మూర్తులు ఉన్నాయి. ఈ మూర్తులు వరుసగా - భోగ శ్రీనివాసమూర్తి, ఉగ్ర శ్రీనివాసమూర్తి, మూలమూర్తి, కొలువు శ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వాములు. ఏయే రూపాల ప్రాధాన్యత ఏమిటో

మూలమూర్తి (ధ్రువబేరం)
నిత్యం లక్షలాదిమంది భక్తిప్రపత్తులతో దర్శించుకునే మూలవిరాట్టును ధ్రువబేరం అంటారు. ధ్రువ అంటే స్థిరంగా ఉండేది అని అర్ధం. ధృవబేరం అంటే నేలలో స్తంభం పాతుకున్నట్లు స్థిరంగా ఉండే విగ్రహమూర్తి. మూలవిరాట్టు అయిన ధ్రువబేరానికి తెల్లవారుజామున సుప్రభాతసేవ మొదలు, అర్ధరాత్రి ఏకాంతసేవ వరకూ రోజంతా ఆరాధనలు జరుగుతాయి. ఈ మూలవిరాట్టు సాలగ్రామమూర్తి. మూలమూర్తి శిరస్సు నుండి పాదం వరకూ ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుంది. ''వీరస్థానక'' పద్ధతిలో నిలబడి ఉన్న మూలవిరాట్టు పక్కన శ్రీదేవి, భూదేవి విగ్రహాలు ఉండవు. నిత్యం లక్షలాదిమంది భక్తులు తిరుమలేశుని దివ్య మంగళ దర్శనం కోసం ఎదురుచూస్తారు కనుక ఈ మూలవిరాట్టును (ధృవబేరం) దర్శించుకోడానికి రెండు క్షణాల కంటే సమయాన్ని కేటాయించలేరు.

భోగ శ్రీనివాసమూర్తి (కౌతుక బేరం)
ఒక అడుగు ఎత్తులో ఉండే భోగ శ్రీనివాసమూర్తిని వ్యవహారంలో భోగ శ్రీనివాసుడు అంటారు. ఇంకోరకంగా కౌతుక బేరం లేదా పురుష బేరం అంటారు. నిత్యం జరిపే దీపారాధన, నైవేద్యం, అభిషేకం, ఏకాంత సేవలు భోగ శ్రీనివాస మూర్తికి జరిపిస్తారు. ఈ వెండి శ్రీనివాసుని విగ్రహాన్నిక్రీస్తుశకం 614లో పల్లవ మహారాణి సామవాయి పేరిందేవి ఆలయానికి సమర్పించినట్లు శాసనాల్లో ఆధారాలు లభించాయి. మహారాణి ఈ శ్రీనివాసమూర్తిని సమర్పించిన నాటి నుండి నేటివరకూ ఎన్నడూ ఆలయం నుండి విగ్రహాన్ని ఆలయం నుండి తొలగించలేదు. ఆగమ శాస్త్రాన్ని అనుసరించి మూలవిరాట్టుకు చేసే సేవలు భోగ శ్రీనివాస మూర్తికి అందుతాయి.

ఉగ్ర శ్రీనివాసమూర్తి (స్నపన బేరం)
ఉగ్ర శ్రీనివాసమూర్తిని స్నపన బేరం అంటారు. ఈ మూర్తి శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉంటుంది. నిజానికి శ్రీనివాసమూర్తి రూపం 11వ శతాబ్దం వరకూ ఉత్సవ విగ్రహంగా ఉండేది. క్రీస్తుశకం 1330లో ఒకసారి ఉత్సవ విగ్రహంగా ఊరేగింపు జరుపుతుండగా అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో, అది ఉగ్ర శ్రీనివాసుని రూపానికి సంకేతంగా భావించారు. అప్పటినుంచి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప రూపాన్ని ఉత్సవ విగ్రహంగా రూపొందించారు. ఆవిధంగా అగ్ని ప్రమాదం జరిగినప్పటినుంచి ఉగ్ర శ్రీనివాస మూర్తిని సంవత్సరానికి ఒకసారి సూర్యోదయానికి ముందు సర్వ అలంకారాలతో సుందరంగా తీర్చిదిద్ది ఊరేగింపుకు తీసుకెళ్ళి, తిరిగి అంతరాలయానికి తీసుకొస్తారు.

శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి (ఉత్సవబేరం)
13వ శతాబ్దంలో ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఊరేగింపుకు తీసికెళ్ళడం మానేసిన తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిని ఉత్సవ వేడుకల్లో ఊరేగిస్తున్నారు. ఈ శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిని ఉత్సవబేరం అంటారు. ఈ మూర్తి మూడు అడుగుల ఎత్తు ఉంటుంది. బ్రహ్మోత్సవాలతో సహా ప్రతి ఉత్సవంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామినే ఊరేగిస్తారు.

కొలువు శ్రీనివాసమూర్తి (బలిబేరం)
గర్భగుడిలో మూలవిరాట్టు పక్కన ఉండే మరొక చిన్న విగ్రహాన్ని కొలువు శ్రీనివాసమూర్తి అంటారు. ఆగమ పరిభాషలో బలిబేరం అంటారు. మూలవిరాట్టుకు తోమాలసేవ నిర్వహించిన తర్వాత కొలువు శ్రీనివాసుని బంగారు సింహాసనంపై ఉంచి పంచాంగ శ్రవణం చేస్తారు. తిరుమలలో ఆవేళ జరిగే ఉత్సవ వేడుకలు ఏమైనా ఉంటే వాటి వివరాలను తెలియజేస్తారు. శ్రీవారి హుండీలో గతరోజు వచ్చిన కానుకల వివరాలను, ఆదాయ, వ్యయాలను తెలియజేస్తారు

శివుడి పుష్పార్చన ఎలా చేయాలి? ఫలితం ఏమిటి?

నిత్యం మనం భగవంతునికి చేస్తున్న పూజలలో పుష్పాలదే అగ్రస్థానం. ఏ స్వామి పూజ అయినప్పటికీ, ఏ తల్లి పూజ అయినప్పటికీ, వారి వారి పూజలలో పుష్పాలకే ప్రాముఖ్యత. ఎన్నో పూజా ద్రవ్యాలుండగా, పుష్పాలకే ఎందుకు ఇంత ప్రాముఖ్యత అని అనిపించవచ్చు. పుష్పం యొక్క ముఖ్యత్వాన్ని అనేక గ్రంథాలు పేర్కొన్నాయి.

పుష్పామూలే వసేద్బ్రహ్మ మధ్యేచ కేశవః
పుష్పాగ్రేచ మహాదేవః సర్వదేవాః స్థితాదలే

పుష్పం మొదట్లో బ్రహ్మ, పుష్పమధ్యమంలో కేశవుడు, పుష్పపు కొనలో మహాదేవుడు నివశిస్తుంటారు. పుష్ప దళాలలో సర్వదేవతలుంటారని ప్రతీతి.

పరంజ్యోతిః పుష్పగతం పుష్పేణైవ ప్రసీదతి
త్రివర్గ సాధనం పుష్పం పుష్టిశ్రీ స్వర్గమోక్షదమ్

పువ్వులలో ఉన్న పరమాత్మ పువ్వులతోనే ప్రసన్నుడవుతుంటాడు. కాబట్టి పుష్పం త్రివర్గ సాధనం. అంటే సంపదలను, స్వర్గాన్ని, మోక్షాన్ని కలిగిస్తుంది.

పుష్పైర్దేవాః ప్రసీదంతి పుష్పేదేవాశ్చ సంస్థితాః
కించాతి బహునోక్తెన పుష్పస్యోక్తి మత్రంద్రికామ్.

పుష్పాలతో దేవతలు ప్రసన్నులవుతుంటారు. ఎందుకంటే వారు పుష్పాలలో నివశిస్తుంటారు. ఇంకా చెప్పాలంటే పుష్పాలలో చైతన్యం ఉంటుంది.

ఇక, మన పురాణాలలో ఒక్కొక్క దేవతకు ఇష్టమైన పువ్వులను గురించి కూడ ప్రస్తావించబడింది. విష్ణువుకు, దుర్గాదేవికి, వినాయకుని రకరకాల పుష్పాలతో పూజించ వచ్చని పేర్కొనబడగా, శివునికి మాత్రం మారేడు ప్రతిచాలన్నట్లుగా చదువుతుంటాం. ఈ విషయాన్నే శ్రీనాథ మహాకవి వర్ణించాడు.

శివుని శిరమున కాసిన్ని నీళ్ళుజల్లి
పత్తిరిసుమంత నెవ్వాడు పారవైచు
కామధేను వతడింట గాడిపసర
మల్ల సురశాఖి వానింట మల్లెచెట్టు

శివలింగంపై కాసిని నీళ్ళు చల్లి, మారేడు ప్రతిని శివలింగంపై పడవేసినప్పటికీ, ఆ భక్తుని ఇంట కామధేనువు ఇంటిపశువుగా ఉంటుంది. ఆ భక్తుని ఇంట కల్పతరువు మల్లెచెట్టుగా ఉంటుంది. అంతటి దయాసముద్రుడు శివుడు. మరి, అంతటి బోళాశంకరునికి మారేడు దళాలు తప్ప మరే పుష్పాలతో పూజించే అవకాశం లేదా?!

ఈ ప్రశ్నకు సమాధానం శివధర్మసంగ్రాహం, శివరహస్యఖండం, లింగపురాణం, కార్తీకమాహాత్మ్యం గ్రంథాలు చెబుతున్నాయి. శివునికి ఇష్టమైన పువ్వుల గురించి ఆ గ్రంథాలు ఇలా చెబుతున్నాయి.

శివుని పుష్పాలతో పూజిస్తే, పది అశ్వమేధ యాగాలు చేసిన ఫలం లభిస్తుంది. ఎవరైతే కనీసం ఎనిమిది పుష్పాలతో శివుని పూజిస్తారో వారికి కైలాసప్రాప్తి కలుగుతుంది. శివుని పూజకు ఉపయోగించే పువ్వులు వాదిపోయినవిగా ఉండ కూడదు. కీటకాడులతో కొరకబదినవిగా ఉండేవి శివ పూజకు పనికిరావు. అలాగే ఇతరుల పూదోటలో పూచిన పువ్వులను దొంగతనంగా తీసుకువచ్చి పూజిస్తే ఫలితం కనిపించదు. ఇంకా పాపం కలుగుతుంది.

శివపూజకు అరణ్యంలో పూచిన పువ్వులకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. గన్నేరు, పొగడ, జిల్లేడు, ఉమ్మెత్త, కలిగొట్టు, పెద్దములక, తెల్లదింటెన, కట్లతీగ పువ్వులు, అశోకపువ్వు, మందారం, విష్ణుక్రాంత, జమ్మి, గులాబి, నెమ్మిపూలు, ఉత్తరేణి, తామర, జాజి, చెంగలువ, సంపెంగ, వట్టివేరు పూలు, నందివర్థనం, నాగకేసరం, పొన్న, పచగోరింట, తుమ్మి, మేడి, జయంతి, మల్లె, మోదుగ, మారేడు దళాలు, కుసుమపూవు, కుంకుమపూవు, ఎర్రకలువలు, నీలిపూలు శివపూజకు ప్రశస్తమైనవి. ఈ పుష్పాలతో ఏ పుష్పాన్ని సమర్పించినప్పటికీ శివ పరమాత్మ ఆనందంతో స్వీకరిస్తాడు. ఈ విషయాన్ని స్వామివారే ఉమాదేవికి చెప్పినట్లు పురాణవాక్కు.

అదేవిధంగా శివుని ఏయే మాసాలలో ఏయే పూలతో పూజిస్తే ఏయే ఫలితం ఉంటుందన్న విషయాన్ని గురించి కూడ చెప్పబడింది. చైత్రమాసంలో శంకరుని నృత్యగీతాలతో సేవిస్తూ, దర్భ పువ్వులతో పూజిస్తే బంగారం వృద్ధి చెందుతుంది. వైశాఖమాసంలో శివుని నేతితో అభిషేకిస్తూ తెల్లని మందారాలతో పూజిస్తే వారికి అశ్వమేధఫలం కలుగుతుంది.

జ్యేష్ఠ మాసంలో పెరుగుతో అభిషేకిస్తూ తామరపువ్వులతో పూజించిన వారికి పరమగతి కలుగుతుంది. ఆషాఢమాసంలో కృష్ణ చతుర్ధశినాడు స్నానం చేసి శివునికి గుగ్గిలంతో ధూపం వేసి తొడిమల తోడిమాలతో కూడిన పుష్పాలతో అర్చించినవారికి బ్రహ్మలోకాన్ని పరమపదం లభిస్తుంది. శ్రావణమాసంలో ఒంటి పూట భోజనం చేస్తూ గన్నేరుపూలతో శివుని పూజించినవారికి వేయిగోదానముల ఫలం లభిస్తుంది. భాద్రపద మాసంలో శివుని ఉత్తరేణి పూలతో పూజించిన వారు హంసధ్వజంతో కూడిన విమానంలో పుణ్యపదానికి చేరుకుంటారు. ఆశ్వయుజమాసంలో పరమశివుని జిల్లేడుపూలతో పూజించినవారు మయూర ధ్వజంతో కూడిన విమానంలో దివ్యపదాన్ని చేరుతారు.

కార్తీకమాసంలో శివుని పాలతో అభిషేకించి జాజిపూలతో పూజించినవారు శివపదాన్ని దర్శించుకుంటారు. మార్గశిర మాసంలో శివుని పొగడపూలతో పూజించినవారు, ముల్లోకాలను దాటి తామున్నచోటికే తిరిగిరాగలరు. పుష్యమాసంలో శివుని ఉమ్మెత్త పూలతో పూజించినవారు పరమ పదాన్ని పొందగలరు. మాఘ మాసంలో శివదేవుని బిల్వదళాలతో అర్చించినవారు, లేత సూర్యుడు, చంద్రుడులున్న విమాన,లో పరమపదానికి వెళతారు. ఫాల్గుణమాసంలో శివుని సుగంధజలంతో అభిషేకించి తుమ్మిపూలతో పూజించినవారికి ఇంద్రుని సింహాసనంలో అర్ధభాగం దక్కుతుంది.

ఇక, శివపూజలో ఒక్కొక్క పువ్వుతో పూజిస్తే, ఒక్కొక్క ఫలితం కలుగుతుంటుంది. శివుని రోజూ జిల్లేడు పువ్వులతో అర్చించేవారు బంగారాన్ని దానం చేసిననంత ఫలితాన్ని పొందుతారు.

శివపూజకు సంబంధించినంత వరకు వేయి జిల్లేడు పువ్వుల కంటే ఒక గన్నేరు పువ్వు ఉత్తమం.
వేయి గన్నేరు పూల కంటే ఒక మారేడు దళం ఉత్తమం.
వేయి మారేడు దళాలకంటే ఒక తామరపువ్వు ఉత్తమం.
వేయి తామరపువ్వుల కంటే ఒక పొగడపువ్వు ఉత్తమం.
వేయి పొగడపువ్వుల కంటే ఒక ఉమ్మేత్తుపువ్వు ఉత్తమం.
వేయి ఉమ్మెత్త పువ్వుల కంటే ఒక ములక పువ్వు ఉత్తమం.
వేయి ములక పూవుల కంటే ఒక తుమ్మిపూవు ఉత్తమం.
వేయి తుమ్మిపూవులకంటే ఒక ఉత్తరేణు పువ్వు ఉత్తమం.
వేయి ఉత్తరేణు పువ్వుల కంటే ఒక దర్భపువ్వు ఉత్తమం.
వేయి దర్భపూల కంటే ఒక జమ్మిపువ్వు శ్రేష్ఠం.

వేయి జమ్మి పువ్వుల కంటే ఒక నల్లకలువ ఉత్తమం అని సాక్షాత్తు శివ పరమాత్మే చెప్పాడు. శివపూజకు పువ్వులన్నింటిలోకి నల్లకలువపువ్వు ఉత్తమోత్తమమైనది. శివునికి వేయినల్ల కలువలతో మాలను అల్లి సమర్పించినవారు, శివునితో సమమయిన పరాక్రమంగలవారై వందల, వేలకోట్ల కల్పాలు నిత్యకైలాసంలో నివశిస్తారు. ఈ పుష్పమాలతో కాక మిగతా పుష్పాలతో పూజించే భక్తులు కూడా ఆయా పుష్పాలకు సంబంధించిన ఫలితాలను పొందుతారు.

పరమశివునికి పొగడపూలంటే అమితమైన ఇష్టం. ఆ స్వామిని ప్రతిదినం ఒక పొగడపువ్వుతో అర్చించే భక్తుడు వేయిగోవులను దానం చేసిన ఫలితాన్ని పొందుతాడు.
ఒక నెలపాటు పొగడపూలతో పూజించినవారు స్వర్గ సుఖాలను పొందుతారు. రెండునెలలపాటు పూజించిన వారు యజ్ఞం చేసినంత ఫలితాన్ని పొందుతారు. మూడు నెలల పాటు పొగడపూలతో అర్చించినవారికి బ్రహ్మలోక ప్రాప్తి. నాలుగు నెలలు పూజించినవారికి కార్య సిద్ధి. ఐదు నెలలు పూజించినవారికి యోగసిద్ధి. ఆరు నెలలు పూజించినవారికి రుద్రలోక ప్రాప్తి కలుగుతుంది.

సాధారణంగా శివునికి బిల్వపత్రాలే ప్రీతిపాత్రమైనవి. మిగతా పత్రాలు ప్రీతికరం కావని అనుకుంటుంటాం. లింగపురాణం ఆ స్వామికి ఇషామైన మరిన్ని పత్రాలను గురించిన వివరాలను అందిస్తోంది. మారేడు, జమ్మి, గుంట గలగర, అడ్డరసము, అశోకపత్రాలు, తమాలము, చీకటి చెట్టు, ఉలిమిడి, కానుగు, నేల ఉసిరి, మాచీపత్రి, నల్ల ఉమ్మెత్త, తామరాకు, నీతికలువ, మెట్టకలువ ఆకులు, సంపెంగ పత్రి, తుమ్మి, ఉత్తరేణి ఆకులను పత్రాలను పూజలో ఉపయోగించవచ్చు. అంటే, ఆయా పుష్పాలు లభించనపుడు, ఆయా పత్రిని ఉపయోగించవచ్చు.

ఇక పుష్పదానానికి సంబంధించినంతవరకు, పుష్పాన్ని గాని, ఫలాన్నిగాని దైవానికి నివేదిస్తున్నప్పుడు ఆ పుష్పం ముఖం బోరగిలబడకూడదు. అలా చేయడంవల్ల దుఃఖం కలుగుతుంది. అయితే ఆ పుష్పాలను లేక పత్రిని దోసిట్లో పెట్టుకుని నివేదించేటప్పుడు బోర్లాపడినప్పటికీ దోషం కాదు. ఉమ్మెత్త, కడిమిపువ్వులను శివునికి రాత్రివేళ సమర్పించాలి. మిగిలిన పూలతో పగిటిపూట. మల్లెలతో రాత్రివేళ, జాజి పూలతో మూడవజామున, గన్నేరుతో అన్నివేళలా పూజించవచ్చు.

ఇప్పటివరకు మనం ఏయే పూలతో శివుని పూజిస్తే ఏయే ఫలితాలు కలుగుతాయో తెలుసుకున్నాం. అయితే మన మనసులోని కోరికననుసరించి కూడ శివునికి పువ్వులను సమర్పించవచ్చు. ఉదాహరణకు ధనం కావాలను కున్నవారు శివుని గన్నేరుపూలతో, మోక్షం కావాలంటే ఉమ్మెత్తపూలతో, సుఖశాంతుల కోసం నల్లకాలువతో, చక్రవర్తిత్వం కోసం తెల్లతామరలతో, రాజ్యప్రాప్తి కోసం ఎర్రతామరలతో, నాగకేసరం, కేసరీపుష్పాలతో అనుకున్న కోరికలు నెరవేరుతాయట. గన్నేరు, అశోకం, ఊడుగు, తెల్లజిల్లేడులతో పూజించిన వారికి మంత్రసిద్ధి, రోజాపుష్పాలతో లాభాసిద్ధి, దంతి ప్రత్తి పూలతో సౌభాగ్యం కలుగుతుంది. కోరుకున్న కన్యను పొందాలంటే శివుని సన్నజాజి పూలతో పూజించాలి. సంతానం కావాలనుకునేవారు శివుని మొల్లపువ్వులతో పూజించాలి. దర్భపూలతో ఆరోగ్యం, రేలపూలతో ధనం, తుమ్మిపూలతో వశీకరణం, కడిమిపూలతో శత్రుజయం కలుగుతుంది. బిల్వదళ పూజ దారిద్ర్యాన్ని తొలగిస్తుంది. శివుని మరువంతో పూజిస్తే సుఖం, లోద్దుగపూలతో పూజిస్తే గోసంపద కలుగుతుంది. మోదుగ, బూరుగు పూలతో పూజిస్తే ఆయుర్వృద్ధి కలుగుతుంది.

ఇక, శివపూజకు పనికిరాని పువ్వుల గురించి మన పురాణ గ్రంథాలు పేర్కొన్నాయి.

మొగిలి, మాధవి, అడవిమల్లి, సన్నజాజి, దిరిసెన, సాల, మంకెన పువ్వులు శివార్చనకు పనికిరావు. బావంచి ఆకులు, పువ్వులు, కానుగపూలు, తాండ్ర ఆకులు, దాసాని, ఎర్రమద్ది, మందార, విషముష్టి, అడవిమొల్ల, తెల్ల విష్ణుక్రాంత, ఎర్ర, తెల్ల గులాబీలు, దిరిసెన పువ్వులు శివపూజకు పనికిరావు. వేప, వెలగ, గురివింద పూలు కూడా శివపూజకు అర్హం కావు.

దశసౌగంధికం పుష్పం నిర్గంధియది భామిని
శాతసాహస్రి కామాలా అనంతం లింగపూజసే

పది సుగంధపుష్పాలతో (ఒకవేళ పరిమళం లేకపోయిన వైనప్పటికీ) శివలింగాన్ని పూజిస్తే, శతసహస్రమాలలతో పూజించిన అనంత పుణ్యఫలం లభిస్తుందని శివధర్మ సంగ్రహం చెబుతోంది

ఆహార నియమాలు ......

దేవుడికి నివేదన చేయడానికి ముందు విస్తట్లో ఉప్పు వడ్డించకూడదని పండితులు చెబుతున్నారు. స్వామికి సమర్పించే విస్తట్లో ఉప్పు మాత్రం ప్రత్యేకంగా వడ్డించకూడదని వారు అంటున్నారు.

ఇక యోగశాస్త్రం ప్రకారం మనుష్యుని శ్వాసగతి 12 అంగుళాల దాకా ఉంటుంది. భోజనం చేసేటపుడు 20 అంగుళాల దాకా ఉంటుంది. మాట్లాడితే శ్వాసగతి ఎక్కువవుతుంది. కాబట్టి ఆయుష్షు తగ్గుతుంది. కనుక ఆహారం తీసుకునేటప్పుడు మాట్లాడకూడదు.

అలాగే త్రయోదశినాడు వంకాయ తినకూడదు. అష్టమి నాడు కొబ్బరి తినకూడదని, పాడ్యమినాడు గుమ్మడికాయ తినకూడదని, పురాణాలు చెబుతున్నాయి. దొండకాయ తింటే వెంటనే బుద్ధి నశిస్తుంది.

రాత్రి అన్నం తినేటపుడు దీపం ఆరిపోతే విస్తరాకునుగాని, పాత్రనుగాని చేతులతో పట్టుకొని సూర్యుణ్ణి స్మరించాలని దీపాన్ని చూసి మిగిలినది తినాలని అప్పుడు మరోసారి వడ్డించుకోవద్దని పెద్దలంటారు.

రాత్రి తింటూ ఉన్నప్పుడు తుమ్మితే నెత్తిపై నీళ్ళు చల్లడం, దేవతను స్మరింపచేయడం ఆచారంగా ఉంది. రాత్రి పెరుగు వాడకూడదు. ఒకవేళ వాడితే నెయ్యి, పంచదార కలిపివాడవచ్చు. ఇలా చేస్తే వాతాన్ని పోగొడుతుంది.

రాత్రిళ్లు కాచిన పెరుగును మజ్జిగపులుసు మొదలైనవి) వాడకూడదు. ఆవునేయి కంటికి మంచిది. ఆవు మజ్జిగ చాలా తేలికైనది. అందులో సైంధవలవణం కలిపితే వాతాన్ని పోగొడుతుందని, పంచదార కలిపితే పిత్తాన్ని పోగొడుతుందని, శొంఠికలిపితే కఫాన్ని పోగొడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

నలుగురు కూర్చొని తింటూ ఉన్నప్పుడు మధ్యలో లేవకూడదు. తేగలు, బుర్రగుంజు, జున్ను, తాటిపండు మొదలైనవి వేదవేత్తలు తినరు. మునగ, పుంస్త్వానికి (మగతనానికి) మంచిదంటారు.

దృష్టిదోషం పోవడానికి ఇది చదవాలి.

అన్నం బ్రహ్మ రసోవిష్ణు: బోక్తా దేవో మహేశ్వర: ఇతి సంచింత్య భుంజానం దృష్టిదోషో నబాధతే అంజనీగర్భంసంభూతం కుమారం బ్రహ్మచారిణం దృష్టిదోషవివానాశాయ హనుమంతం స్మరామ్నహం||

అనగా అన్నం బ్రహ్మం, అన్నరసం విష్ణురూపమై ఉన్నది. తినువాడు మహేశ్వరుడు, ఇట్లా చింతిస్తే దృష్టిదోషం ఉండదని పండితులు అంటున్నారు.

ఐశ్వర్యాన్ని ఇచ్చే గణేశ మంత్రం

గణేశమేక దంతంచ
హేరంబం విఘ్ననాయకం
లంబోదరం శూర్పకర్ణం

గజవక్త్రం గుహాగ్రజం!!


ఎనిమిది వినాయకస్వామి నామాలతో కూడిన ఈ శ్లోకాన్ని ప్రతి రోజు ఉదయం సాయంత్రం పఠిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.

ఆంజనేయుడికి ఇష్టమైన పుష్పాలు?

వైశఖమాసి కృష్ణాయాం - దశమ్యాం మందవాసరే!
పూర్వాభాద్రాభ్య నక్షత్రే - వైధ్రుతౌ హనుమా నభూతే||
ఆంజనేయ స్వామి వసంతఋతువు, వైశాఖ మాసం కృష్ణపక్షంలో, దశమి తిథి, శనివారం, పూర్వాభాధ్రా నక్షత్రంలో, వైధృతౌ మధ్యాహ్న కాలంలో అంజనీదేవికి జన్మించాడు. ఆంజనేయుడు అంజనాదేవి, కేసరుల ముద్దుబిడ్డ. సదా రామనామామృతపాలన సేవితుడై గంధమాధశైలి యందు వసించు చిరంజీవి. ఆంజనేయ నామమహిమ అనితరమైనది.

అలాంటి మృత్యుంజయుడైన ఆంజనేయుని పొన్నపువ్వు, మొగలి, పొగడ, నంధివర్ధనం, మందారం, కడిమి, గజనిమ్మ, పద్మం, నల్లకలువ, మద్ది, సువర్ణ పుష్పం, గౌరీ మనోహరం, ఎర్ర గన్నేరు, కనకాంబరం, ములుగోరిట, మెట్ట తామర, పొద్దు తిరుగుడు, మంకెన, బండికెరి వెంద, అడవిమల్లె, కొండగోగు దింటెన, సన్నజాజి, మల్లె, గులాబి, మోదుగ, సంపంగి, జిల్లేడు, చంధ్త్ర కాంత, సురపున్నాగ, కుంకుమ పువ్వు మొదలైన పుష్పాలు అంటే ఇష్టం.

అలాగే తులసి, మాచిపత్రి, ఎర్రకలువ, గోరింట, ఉత్తరేణి, పసుపు, అక్షింతలు, తిరుమారేడు, నేరేడు, తమలాపాకులు కూడా ఆంజనేయునికి ప్రీతికరమైనవి అని పైన వివరించవడిన పుష్పాలు, పత్రాలతో స్వామివారి పూజిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి అని పండితులు అంటున్నారు.

ప్రతి మాసంలో వచ్చే అమావాస్యరోజున హనుమంతున్ని పూజిస్తే?


ప్రతి మాసంలో వచ్చే అమావాస్య రోజున హనుమంతునిని ప్రార్థిస్తే ... సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయుడిని సింధూరంతో అర్చించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. ముఖ్యంగా హనుమంతుని జయంతిని చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు వైభవంగా జరుపుకుంటారు. శ్రీరామనవమితో పాటు కొందరు హనుమంత జయంతిని జరుపుకుంటారు. ఈ పండుగను జరుపుకోలేని వారు ప్రతి మాసంలో వచ్చే అమావాస్య రోజున నిష్టతో ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించుకోవడం ద్వారా అనుకున్న కార్యాలను దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం. అందుచేత అమావాస్య సాయంత్రం పూట మహిళలు, పురుషులు ఆంజనేయ స్వామికి నేతితో దీపమెలిగించి.. హనుమంతుడి ఆలయాన్ని 18 సార్లు ప్రదక్షిణ చేయడం ద్వారా మనోధైర్యం, సకలసంపదలు, ఉన్నత పదవులు లభిస్తాయని పండితులు అంటున్నారు.

ఇంకా…

“అసాధ్య సాధక స్వామిన్
అసాధ్యమ్ తవకిన్ వధ
రామదూత కృపా సింథో
మత్‌కార్యమ్ సాధయ ప్రభో”

- అనే మంత్రాన్ని 9 సార్లు పఠించి.. కర్పూర హారతులు సమర్పించుకున్న వారికి ఈతిబాధలు, గ్రహదోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం


సౌరాష్ట్రదేశే విశదేతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకలావతంసం
భక్తి ప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రప్రద్యే
శ్రీశైల శృంగే విబుధాతింసంగే తులాద్రితుంగే పి ముదావసంతం
త మర్జునం మల్లిక పూర్వమేకం నమామి సంసార సముద్ర సేతు
అవంతికాయం విహాతావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానాం
అకాల మృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశం
కావెరికా నర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ
సదైవ మాంధాతృపురే వసంతమోంకార మీశం శివమేకమీడే
పూర్వోత్తరే ప్రజ్జ్వలికా నిధానే సదా వసంతం గిరిజాసమేతం
సురాసురాధిత పాదపద్మం శ్రీవైద్యనాథం తం మహం నమామి
యామ్యే సదంగే నగరేతి రమ్యే విభూషి తాంగం వివిధైశ్చభోగైః
సద్భక్తిముక్తి ప్రదమీశ మేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే
మహాద్రిపార్శ్వే చ తటేరమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రైః
సురాసురైర్యక్ష మహోరగాద్వైః కేదారమీశం శివమేకమీడే
సహ్యద్రిశీర్షే విమలే వసంతం గోదావరీతీర పవిత్ర దేశే
యద్దర్శనా త్పాతకమాశునాశం ప్రయాతి తం త్ర్యంబకమీశమీడే
సుతామ్రపర్ణీ జలరాశియోగే నిబధ్యసేతుం విశిఖై రసంఖ్యైః
శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి
యం ఢాకినీ శాకినికా సమాజే నిషేవ్యమాణం పిశితాశనైశ్చ
సదైవ భీమాది పద ప్రసిద్ధం తం శంకరం భక్తిహితం నమామి
సానంద మానంద వనే వసంత మాననందకందం హతపాపబృందం
వారాణసీనాథ మనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే
ఇలాపురే రమ్యవిశాలకేస్మిన్ సముల్లసంతం చ జగద్వరేణ్యం
వందే మహోదారతర స్వభావం ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే
జ్యోతిర్మయ ద్వాదశాలింగకానాం శివాత్మనాం ప్రోక్తమిదం క్రమేణ
స్తోత్రం పఠిత్వామనుజోతి భక్త్యాఫ్లం తదాలోక్య నిజం భజేచ్ఛ

జ్యోతిస్వరూపుడైన మహేశుడు ఈ పవిత్ర భారతావనిలో పన్నెండుచోట్ల జ్యోతిర్లింగ స్వరూపంలో వెలసి భక్తులను కరుణిస్తున్నాడు. భారతదేశంలోని నాలుగుదిక్కులలో పన్నెండు జ్యోతిర్లింగాలున్నాయి. సముద్రపు ఒడ్డున రెండు (బంగాళాఖాతతీరంలో రామేశ్వరలింగం, అరేబియా సముద్రతీరాన సోమనాథలింగం) పర్వత శిఖరాలలో నాలుగు (శ్రీశైలంలో మల్లిఖార్జునుడు, హిమాలయాలలో కేదారేశ్వరుడు, సహ్యాద్రి పర్వతాలలో భీమశంకరుడు, మేరుపర్వతాలపై వైద్యనాథలింగం) మైదాన ప్రదేశాలలో మూడు (దారుకావనంలో నాగేశ్వరలింగం, ఔరంగాబాద్ వద్ద ఘృష్ణేశ్వర లింగం, ఉజ్జయినీ నగరంలో మహాకాళేశ్వర లింగం) నదుల ఒడ్డున మూడు (గోదావరీతీరాన త్ర్యంబకేశ్వర లింగం, నర్మదాతీరానా ఓంకారేశ్వరుడు, గంగానదీతీరాన విశ్వేశ్వరుడు). ఇలా మొత్తం పన్నెండు జ్యోతిర్లింగ రూపాలలోనున్న ఈ లింగాలు పరమశివుని తేజస్సులు. ఇవి ద్వాదశాదిత్యులకు ప్రతీకలు. పదమూడవ లింగం కాలలింగం. తురీయావస్థను పొందిన జీవుడే కాలలింగము. తైత్తీరీయోపనిషత్తుననుసరించి 1. బ్రహ్మ 2. మాయ 3. జీవుడు 4. మనస్సు 5. బుద్ధి 6. చిత్తము 7. అహంకారము 8. పృథ్వి 9. జలము 10.తేజస్సు 11. వాయువు 12. ఆకాశం – ఈ పన్నెండు తత్త్వాలే పన్నెండు జ్యోతిర్లింగాలు. ఇవన్నీ ప్రతీకాత్మకంగా మన శరీరంలో ఉన్నాయి. ఖాట్మండులోని పశుపతినాథలింగం ఈ పన్నెండు జ్యోతిర్లింగాలకు శిరస్సు వంటిది. ఈ జ్యోతిర్లింగాలలొ ఒక్కొక్క జ్యోతిర్లింగానికి ఒక్కొక్క మహిమ ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించినా, స్పృశించినా అనేక మహిమలు మన జీవితాలలొ ప్రస్ఫుటమవుతుంటాయి. పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకోలేనివారు, కనీసం ఒక్క లింగాన్నైనా దర్శించగలిగితే అనంతకోటి పుణ్యం లభిస్తుందనేది పెద్దలవాక్కు.

1. శ్రీ సోమనాథ జ్యోతిర్లింగం

సౌరాష్ట్రదేశే విశదేతి రమ్యే, జ్యోతిర్మయం చంద్రకలవతంసం
భక్తిప్రదానాయ క్రుపావతీర్థం, తం సోమనాథం శరణం ప్రపద్యే

స్వామి సోమనాథునిగా వెలసిన కథ స్కాంద పురాణంలో ఉంది.

బ్రహ్మదేవుని మానసపుత్రుడైన దక్షప్రజాపతికి అశ్విని నుంచి రేవతి వరకు 27 కుమార్తెలున్నారు. తన కుమార్తెలను చంద్రునికి ఇచ్చి ఘనంగ వివాహం జరిపించాడు దక్షుడు. అయితే చంద్రుడు రోహిణిని మాత్రం అనురాగంతో చూస్తూ, మిగిలినవారిని అలక్ష్యం చేయసాగాడు. మిగిలినవారు తండ్రితో ఈ విషయాన్నీ మొరపెట్టుకోగా, దక్షుడు అల్లుడైన చంద్రుడిని మందలిస్తాడు. అయినప్పటికీ, చంద్రుని ప్రవర్తనలో మార్పురాకపోవడంతో, క్షయరోగగ్రస్తుడవు కమ్మని చంద్రుని శపిస్తాడు దక్షుడు. ఫలితంగా చంద్రుడు క్షీణించసాగాడు. చంద్రకాంతి లేకపోవడంతో ఔషధాలు, పుష్పాలు ఫలించలేదు. ఈ పరిస్థితిని చూసిన సమస్తలోకవాసులు, తమ కష్టాలు తీరేమార్గం చూపమని బ్రహ్మ దేవుని ప్రార్థించారు. బ్రహ్మ ఆదేశాన్ననుసరించి ప్రభాసక్షేత్రంలో మహామృత్యుంజయ మంత్రానుష్ఠానంగా శంకరుని ఆరాధించిన చంద్రుడు, పార్థివలింగాన్ని ప్రతిష్టించి పూజించగా, శంకరుడు ప్రత్యక్షమై, చంద్రుని రోగ విముక్తుని గావించి, కృష్ణపక్షంలో చంద్రకళలు రోజు రోజుకీ తగ్గుతాయనీ, శుక్లపక్షంలో దిన మొక కళ చొప్పున పెరుగుతుందని అనుగ్రహించాడు. ఆనాటి నుండి చంద్రుని కోరిక మేర, అతని కీర్తిదిశదిశలా వ్యాపించేందుకై చంద్రుని పేరుతో సోమనాథునిగా, కుష్టు వంటి మహా రోగాలను తగ్గించే సోమనాథ్ జ్యోతిర్లింగరూపునిగా పార్వతీదేవిసమేతంగా వెలసి భక్తులను కరుణిస్తున్నాడు.

2. శ్రీ మల్లిఖార్జున జ్యోతిర్లింగం

శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే, శేషాద్రి శృంగేపి సదావసంతం
తమర్జునం మల్లికపూర్వ మేనం, నమామి సంసార సముద్రసేతుం
శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి కోపోద్రిక్తుడై తల్లిదండ్రులను వదలి, క్రౌంచపర్వతానికి చేరుకోగా, కుమారుని వదలి ఉండలేని పార్వతీపరమేశ్వరులు ఈ ప్రాంతంలోనే ఆగిపోయారని పురాణ కథనం. అందుకే "శ్రీశైల శిఖరాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండద"ని అంటారు. అలాగే పర్వతుడనే ఋషి తపఃఫలంగా పరమశివుడు ఇక్కడ లింగరూపంలో ఆవిర్భవించాడని మరోకథనం.

కాశ్యాంతు మరణాన్ముక్తిః స్మరణా దరుణాచలే
దర్శనాదేవ శ్రీశైలే పునర్జన్మ న విద్యతే

కాశీ క్షేత్రంలో మరణం, అరుణాచలంలో భగవన్నామస్మరణం, శ్రీశైలంలో లింగ దర్శనం ముక్తిదాయకాలు. కృతయుగంలో హిరణ్యకశిపుడు, త్రేతాయుగంలో రావణ సంహారానంతరం శ్రీరామచంద్రుడు, ద్వాపరయుగంలో అరణ్యవాసానంతరం పాండవులు, శ్రీశైలానికి వచ్చి భ్రమరాంబ సమేత మల్లిఖార్జునస్వామివారిని దర్శించుకున్నట్లు పురాణ కథనం. సీతారాముల రామసహస్రలింగం, సీతాసహస్రలింగాలను ప్రతిష్టించినట్లు ప్రసిద్ధి. ఈ కలియుగంలో ఆదిశంకరాచార్య, ఆచార్యనాగార్జునుడు, కృష్ణదేవరాయలు, ఛత్రపతి శివాజీ వంటివారెందరో స్వామిని దర్శించుకుని పూజలు జరిపించారు.

3. శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం

విహితావతారం, ముక్తిప్రదానాయచ సజ్జనానాం
అకాల మ్రుత్యోహ పరిరక్షనార్థం, వందే మహాకాల మహం సురేశం

పరమేశ్వరునికి స్మశానమంటే అత్యంత ఇష్టం. ఈ భూమిపైనున్న సిద్ధక్షేత్రాలలో నైమిశారణ్యం – పుష్కరం – కురుక్షేత్రం ముఖ్యమైనవి. కురుక్షేత్రం కంటే పదిరెట్లు కాశీ పుణ్యప్రదమైనది. కాశీ కంటే మహాకాలవనం పదిరెట్లు గొప్పది. తీర్థాలలో అత్యుత్తమైనది ప్రభాసం – శ్రీశైలం – దారుకావనం. వీటన్నికంటే మహాకాలవనం గొప్పది. ఎందుకంటే, స్మశానం – ఎడారి – పాలంపీఠం – అరణ్యం అంటూ ఐదు ఒకేచోట ఉన్న ప్రదేశం ఉజ్జయిని. పూర్వం వేదప్రియుడనే శివభక్తునికి దేవ ప్రియుడు, ప్రియమేధుడు, సుకృతుడు, ధర్మవాహి అనే నలుగురుకుమారులుండేవారు. ఈ నలుగురు కూడా శివభక్తులే. ఇదిలా ఉండగా, రత్నమాల పర్వతంపై నివసిస్తున్నా దూషణాసురుడనే రాక్షసుడు, వీరి పూజలకు ఆటంకాన్ని కలిగిస్తూ, అందరినీ హింసిస్తూండేవాడు. ఆ రాక్షసుని బాధలను తట్టుకోలేని అన్నదమ్ములు పార్థివలింగాన్ని ప్రతిష్టించి పూజించాగా, శివుడు మహాకాలుడై ఆవిర్భవించి, దూషణాసురుని,అతని సైన్యాన్ని భస్మం చెసాడు. అప్పట్నుంచి ఉజ్జయినీ నగరంలో విలసిల్లుతున్న మహాకాలేశ్వరుడు త్రిభువన లింగాలలో ప్రసిద్ధునిగా వెలుగొందుతున్నాడు.

4. శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం

కావేరికా నర్మదయోహ పవిత్రే, సమాగమే సజ్జనతారనాయ
సదివ మాదాత్రుపురే వసంత, మొన్కారమీశం శివమేకామీడే
ఒకసారి వింధ్యపర్వతం తనకంటే గొప్పవారేవారూ లేరని విర్రవీగుచుండగా, నీకంటే మేరుపర్వతం గొప్పదని నారదమహర్షి చెప్పగా, కుపితుడై, ఓంకార క్షేత్రానికెళ్ళి శివదేవుని పార్థివలింగాన్ని భక్తితోపూజిస్తూ తపస్సు చేసాడు. శివుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకొమ్మనగా, వింధ్యుడు ‘స్వకార్యాన్ని సాధించుకునే శక్తిని ప్రాదించమని’ వేడుకున్నాడు. శివుడు ఆ వరాన్ని అనుగ్రహించాడు. అప్పుడు సమస్త దేవతలంతా స్వామివారిని ఓంకారేశ్వరంలో కొలువై ఉండమని ప్రార్థించారు. వారి కోరికను మన్నించిన స్వామి ప్రణవాకారంలో ఓంకారేశ్వరునిగా కొలువైయ్యాడు. ఇదిలా ఉండగా, శివుని నుంచి వరాన్నిపొందిన వింధ్యుడు, వరగర్వంతో ఎంతో ఎత్తుకు పెరిగి సూర్యచంద్రుల గమనానికి కూడా అడ్డుతగలసాగాడు. వింధ్యుని చేష్ట వలన సమస్తలోకాలు అంధకారంలొ తల్లడిల్లాయి. అప్పుడు దేవతల మొరలను ఆలకించిన పరమేశ్వరుడు వింధ్యుని గర్వమణచమని అగస్త్యమునిని పురమాయించాడు. అగస్త్యుని రాకను గమనించిన వింధ్యుడు మర్యాద పూర్వకంగా తన ఎత్తును తగ్గించి గౌరవించగా, తాను తిరిగి వచ్చేంతవరకు ఎత్తు పెరగకుండా ఉండమని దక్షిణాదికి వెళ్ళి మరల ఉత్తరాదికి వెళ్ళలేదు అగస్త్యుడు. ఫలితంగా వింధ్యుడు ఎత్తు పెరలేదు.

5. శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగం

పూర్వోత్తరే పారలికాభిదానే, సదాశివం తం గిరిజాసమేతం
సురాసురారాదిత పాదపద్మం, శ్రీ వైద్యనాథం సతతం నమామి
వైద్యానాథ జ్యోతిర్లింగ విషయంలో అనేక భేధాభిప్రాయాలున్నాయి. మహారాష్ట్ర పర్లీ గ్రామంలోనిదే అసలైన జ్యోతిర్లింగమని, గంగా ఖేడలోనిలింగం, పంజాబ్ కీరగ్రామం లోని లింగం, హిమాచల్ ప్రదేశ్ లోని పఠాన్ కోట్ కు సమీపంలోని లింగం, కర్ణాటకలోని గోకర్ణ లింగం…ఇవన్నీ శివుని ఆత్మలింగాలేనన్న వాదన బలంగా ఉంది. అయితే జార్ఘండ్ వైద్యనాథంలో వెలసినదే అసలైన జ్యోతిర్లింగమని విజ్ఞుల వాదన. పూర్వం రావణాసురుడు కఠోరనియమాలతో, ఒక చెట్టుకింద అగ్ని గుండాన్ని ఏర్పరచి, పార్థివలింగాన్ని, ప్రతిష్టించి, శివపంచాక్షరీమంత్రంతో, హవన కార్యక్రమంతో నిష్ఠతో ప్రార్థించగా,శివుడు రావణుని కోరికననుసరించి తన ఆత్మలింగాన్ని ప్రసాదించాడు. అయితే ఆ లింగాన్ని భూమికి తాకించిన వెంటనే అక్కడే స్థిరపడుతుందని హెచ్చరించాడు. ఆత్మలింగంతో లంకానగరాంకి తిరుగు ప్రయాణమైన రావణుడు సంధ్యావందనం చేసేందుకు ఒక పశువుల కాపరికి (దేవతల కోరికపై వినాయకుడు ఈ వేషాన్ని ధరించాడు) లింగాన్ని ఇవ్వగా, ఆ కాపరి ఆత్మలింగాన్ని కిందపెడతాడు. ఫలితంగా ఆ లింగం అక్కడే స్థిరపడుతుంది. రవణుడు ఎంతగా ఆత్మలింగాన్ని పెకలించి లంకానగరానికి తీసుకెళదామని ప్రయత్నించినప్పటికీ ఫలితం ఉండదు. వైధ్యనాథ్ దేవాలయంలో ఒక విశేషం ఉంది. సాధారణంగా శివాలయ మందిర శిఖరంపై త్రిశూలం ఉంటుంది కానీ, ఈ ఆలయ మందిర శిఖరంపై పంచశూలం ఉంది. మరి ఏ ఇతర జ్యోతిర్లింగ ఆలయాలలో ఇలాంటి అమరిక లేదు. పంచాక్షరీమంత్రంగా కలిగిన పంచముఖ శివునకు పంచప్రాణాలు అంతర్నిహితంగా కలిగిన శివతత్త్వమే ఇందులోని గూఢార్థం.

6. శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం

అమర్తసంజ్నే నగరేచ రంయే, విభూశితంగం వివిధైశ్చ భోగైహి
సాధ్భుక్తి ముక్తిప్రదమీశ మేకం, శ్రీ నాగానాతం శరణం ప్రపద్యే

పశ్చిమ సముద్ర తీరాన, దారుకుడనే రాక్షసుడు, ‘దారుక’ అనే తన భార్యతో కలిసి ప్రజలను చిత్రహింసలు గురిచేయసాగాడు. యజ్ఞయాగాదులను నాశనం చేస్తూ, ముని జనులను హింసించసాగారు. వీరి హింసను తట్టుకోలేని ఋషులు ఔర్వమహర్షికి విన్న వించుకున్నారు. ఔర్వమహర్షి ఆ రాక్షస దంపతులను సతీసమేతంగా మరణించునట్లుగా శపించాడు. ఆ మునిశాపం భూమి పైనే పనిచేస్తుంది. కనుక, రాక్షదంపతులు సముద్రమధ్యంలో నివాసమేర్పరుచుకుని సముద్రయానం చేశేవారిని పీడించసాగారు. ఇలా కనబడిన ప్రయాణీకులందరి ధనవస్తువులను అపహరిస్తూ చెరసాలలో బంధించసాగారు. అలా బంధింపబడినవారిలో సుప్రియుడోకడు. ఇతడు పరమ శివభక్తుడు. రాక్షసబాధలను తట్టుకోలేక సుప్రియుడు ఆర్తనాదం చేయగా, దివ్యతేజః పుంజము కళ్ళు మిరిమిట్లు గొలుపునట్లు ప్రకాశించింది. ఆ కాంతికి దారుకునితోపటు సమస్త రాక్షసులు నేలకొరిగారు. అక్కడ పరమశివుడు నాగరూపమై జ్యోతిర్లింగమైవెలిసాడు. ఈ స్వామికి దర్శించి, సేవించుకున్నవారికి శాశ్వత పుణ్యలోకవాసం సిద్ధిస్తుందని ప్రతీతి.

7. శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం

మహాద్రిపార్శ్వేచ తటే రామంతం, అమ్పూజ్యమానం సతతం మునీన్ద్రైహి
సురాసురైర్యక్ష మహోరగాద్యైహి కేదారమీశం శివమేకమీడే

ఒకప్పుడు బదరికావనంలోని నరనారాయణులు అరీంత్యంత నిష్ఠాగరిష్ఠులై తపస్సు చేయసాగారు. వారు కేదారక్షేత్రానికెళ్ళి మందాకినిలో స్నానం చేస్తూ, పార్థివలింగాన్ని ప్రతిష్టించి పూజ చేయసాగారు. వారి తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మనగా, జ్యోతిర్లింగ రూపంలో వెలసి, జనులను గర్భవాసనరకమునుంచి తొలగించి ముక్తిని ప్రసాదించమని ప్రార్థించారు. ఈ క్షేత్రం అత్యంత ప్రాచీనమైనది. నరనారాయణులు, పంచపాండవులు, ఉపమాన్యుమహర్షి, ఆదిశంకరులవారు ఈ దివ్య క్షేత్రాన్ని దర్శించుకున్నట్లు ఆధారాలున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఏడవదిగా ప్రసిద్ధి పొందిన ఈ కేదారేశ్వరలింగం హిమాలయాలపై సముద్రమట్టానికి 11,760 అడుగుల ఎత్తులో ఉంది. కేదారేశ్వర జ్యోతిర్లింగం లింగాకారంగాకాక పట్టక రూపంలో ఉంటుంది. స్వామిని భక్తులు తాకి అభిషేకాలు చేస్తుంటారు. వైశాఖ శుద్ధ పాడ్యమి మొదలు ఆశ్వయుజ బహుళ చతుర్దశి వరకు ఆరుమాసాలు మాత్రమే ఆలయ తెరచి ఉంటుంది. దీపావళి రోజునస్వామికి నేటితోవెలిగించిన దివ్యజ్యోతి ఆరుమాసాల తరువాత తెరచినప్పటికీ వెలుగుతూకనిపిస్తుంది. ఆరునెలల పాటూ ఆలయం మూసి ఉన్న సమయంలో కొండదిగువన ఉర్విమఠంలో స్వామి కొలువై భక్తులకు దర్శన మిస్తుంటాడు. ఇక్కడ స్వామి అర్చనకై బిల్వ దళాలు దొరకనందున రుద్రప్రయాగ నుండి బ్రహ్మకమలాలను తెప్పించి పూజ చేస్తారు. ఇక్కడ అమ్మవారైన కేదారగౌరి ఆలయానికి దక్షిణం వైపు సింహాద్వారముంది. ఆలయ సభామంటపంలో నంది, పాండవులు, ద్రౌపది, కుంతి, శ్రీకృష్ణ భగవానుని విగ్రహాలున్నాయి. దేవాలయం పైభాగంలో కనిపించే మూడు శిఖరాలు త్రిశూలాన్ని తలపిస్తాయి. దేవాలయానికి ఎనిమిది దిక్కులలో రేతకుండం, శివకుండం, భృగుకుండం, రక్తకుండం, వహ్ని కుండం, బ్రహ్మతీర్థం, హంసకుండం, ఉదకకుండం అంటూ అష్టతీర్థాలున్నాయి. స్వామికి అభిషేకం చేసేందుకు ఇక్కడ గంగనీరు దొరకదు. కాబట్టి, భక్తులు హరిద్వార్, రుద్రప్రయాగ వంటి చోట్ల నుండి సీసాలలో గంగను పట్టుకెళ్ళి స్వామికి అభిషేకం చేయిస్తుంటారు.

8. శ్రీ త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగం

సింహాద్రి పార్శ్వేషి తటే ర మంతం , గోదావరీ తీర పవిత్ర దేశే
యద్దర్శనాత్పాతక జాతనాశః , ప్రజాయతే త్రయంబక మీశమీడే

ఈ క్షేత్రాన్ని త్రిసంధ్యాక్షేత్రమని కూడా పిలుస్తుంటారు. త్ర్యంబకేశ్వరుడు స్వయంభువుడు. అమ్మవారు త్ర్యంబకేశ్వరి. స్వామివారి ఆకృతి విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ పానవట్టం మధ్యలో లింగం ఉండదు. ఆ స్థానంలో రుబ్బురోలు లోపలిభాగంవలె గుంటతో లోతుగా ఉంటుంది. పరమశివుడు తిమూర్త్యాత్మకంగా, త్రిగుణాత్మకమన్నట్లు మూడు భాగాలుగా ఉంటుంది. వనవాసంలోనున్న శ్రీరామచంద్రులవారు సీతా, లక్ష్మణ సేమేతంగా పంచవటిలో పర్ణశాలను నిర్మించుకుని ఉంటుండగా, లంకేశ్వరుని సోదరి శూర్పణక శ్రీరాముని కామించాగా, అందుకు తగిన ప్రాయశ్చిత్తంగా లక్ష్మణుడు ఆమె ముక్కుచెవులను కోసి, ఇంటిదారి పట్టించాడు. శూర్పణఖ ముక్కు (నాసిక) కోసిన ప్రాంతమే నేడు ‘నాసిక్’గా పిలువబడుతోంది. ఇక్కడే గోదావరి పుట్టింది. ఇక్కడ బ్రహ్మగిరి అనే పర్వతం ఉంది. ఈ పర్వత శిఖరాగ్రాన గౌతమమహర్షి అహల్యసమేతంగా తపస్సు చేస్తున్న సమయం. జనహితం కోరి, గౌతమ ముని ద్వారా దివి నుంచి గంగను భూమికి రప్పించాలని నిర్ణయించిన మునులు అందుకు తగిన పథకాన్ని రచించారు. గౌతమమహర్షి తన ఆశ్రమంలో వరిపైరును సాగుచేస్తున్నాడు. ఆ వరి పైరు పైకి దర్భతో సృష్టించిన ఆవుదూడలను పంపించారు ఆ మునులు. తపస్సులో నున్న గౌతమ మహర్షి ఒక దర్భతో వాటిని తోలగా, దర్భ తాకినంతనే అవి చనిపోయాయి. మునుల పన్నాగం ఫలించింది. గోహత్యాపాతకం నుంచి బయటపడాలంటే గంగను భూమికి రప్పించి, ప్రాయశ్చిత్తంగా స్నానం చేయమన్నారు. వెయ్యేళ్ళు శివుని ప్రార్థించి గంగను భూమికి రప్పించాడు గౌతమ మహర్షి. గౌతమ మునీంద్రుల తపస్సువలన భూమికి తీసుకురాబడి నందున కారణంగా ‘గౌతమీనది’ అని, గోవు ప్రాణం వదిలిన ప్రదేశం నుంచి ప్రవహించిన కారణంగా ‘గోదావరి’ అని ప్రఖ్యాతి చెందింది. ఈ పుణ్య గోదావరీ నది దీనజనోద్ధరణ నిమిత్తమై దారణా, ప్రవరా, అజంతా, ఎల్లోరా గుహలను దాటుకుంటూ ప్రాణహిత, చంద్రావతీ, శబరిప్రాంతాలలో ప్రవహిస్తూ, దక్షిణ వాహినిగా మారి సుమారు 900 కి.మీ. ప్రయాణం చేసి మహరాష్ట్రంలో కోటిపల్లి దగ్గర సాగరుని చేరుకుంటుంది. గౌతమీనది పుట్టిన త్ర్యంబకంలో స్వయంభువునిగా వెలసిన స్వామి, భక్తులను తన కరుణాపూరిత దృక్కులతో కాపాడుతున్నాడు.

9. శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం

శ్రీ తామ్రామపర్నీ జలరాశియోగే, నిబధ్యసేతుం నిషి బిల్వపత్రైహి
శ్రీ రామచంద్రేన సమర్చితం , తం రామేశ్వరాఖ్యం సతతం నామామి

రానణాసురుని వధించిన శ్రీరామచంద్రుడు సీత,లక్ష్మణ హనుమత్సమేతంగా పుష్పక విమానంలో అయోధ్యానగరానికి తిరిగి వస్తూ, గంధమాదవ పర్వతంపై కాసేపు విమానాన్ని ఆపాడు. అక్కడున్న మునివరులను బ్రహ్మవంశానికి చెందిన రావణుని చంపిన పాపాన్నుండి బయటపడే మార్గాన్ని చెప్పమని అడుగుతాడు. అప్పుడు ఆ మహర్షులు, శివలింగాన్ని ప్రతిష్టించి, పూజించడం కంటే ఉత్తమమైన మార్గం లేదని చెబుతారు. శ్రీరాముడు శివలింగాన్నొకటి తీసుకురమ్మని హనుమను పురమాయించగా, శివలింగాన్ని తెచ్చేందుకు కైలాసానికి బయలుదేరుతాడు ఆంజనేయుడు. అయితే శివలింగాన్ని ప్రతిష్టించేందుకు ముహూర్తం సమీస్తున్న కొలదీ హనుమ రాక ఆలస్యమైంది. వేరే మార్గం లేక మునివరుల సలహాననుసరించి సీతచే సైకత లింగాన్ని (ఇసుకలింగాన్ని) ప్రతిష్టింపజేస్తాడు శ్రీరాముడు. ఈలోపు కైలాసం నుంచి శివలింగంతో తిరిగి వచ్చిన హనుమంతుడు, శివలింగ ప్రతిష్ట జరిగిందని తెలుసుకొని పరిపరి విధాలుగా చింతిస్తాడు. ఆంజనేయుని బాధను గమనించిన శ్రీరాముడు సైకతలింగాన్ని తొలగించి, రాజతాచలంనుంచి తను తీసుకువచ్చిన లింగాన్ని ప్రతిష్టంచమని చెబుతాడు. రాముని మాటలను విన్న ఆంజనేయుడు ఉత్సాహముతో ఇసుకలింగాన్ని తొలగించడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించి విఫలుడవుతాడు. చివరకు తోకతో లింగాన్ని పెకిలించడానికి ప్రయత్నిస్తాడు. ఆంజనేయుని అవస్థలను గమనించిన శ్రీరామచంద్రుడు, సుమూహుర్త బలం, మంత్రబలం సైకత లింగానికి మహత్యాన్ని కలిగించాయని, కాబట్టి కైలాసం నుంచి తీసుకువచ్చిన లింగాన్ని సైకత లింగం పక్కన ప్రత్రిష్టించమని చెప్పాడు. అలా శ్రీరాముడు ప్రతిష్టించిన లింగం రామేశ్వరలింగమని, హనుమంతుడు ప్రతిష్టించిన లింగం హనుమదీశ్వరలింగమని పూజలందుకొంటున్నాయి. రామేశ్వరలింగాన్ని పూజించినవారికి బ్రహ్మహత్యాది దోషాలు తొలగిపోతాయి. కాశీయాత్ర చేసినవారు గంగాజలంతో రామేశ్వరలింగాన్ని అభిషేకిస్తే ఈశ్వరానుగ్రహం కలుగు తుందని ఋషివాక్కు, సమస్త ఐశ్వర్యసిద్ధి కలుగుతుంది.

10. శ్రీ భీమశంకర జ్యోతిర్లింగం

యో డాకిని శాకినికా సమాజే, నిషేవ్యమానం పిశితాశానైశ్చ
సదైవ భీమాది పద ప్రసిద్ధం, తం శంకరం భక్తహితం నామామి

త్రేతాయుగంలో భీమాసురుడనే రాక్షసుడు సహ్యాద్రిపై తల్లి కర్కటితో కలిసి జీవిస్తూ, ప్రజలను పీడిస్తూండేవాడు. కర్కటి, పుష్కసి – కర్కటుల కూతురు. లేక లేక పుట్టిన కూతుర్ని అత్యంత గారాబంగా పెంచసాగారు ఆ రాక్షసదంపతులు. యుక్తవయస్కురాలైన కర్కటిని విరాధునికి ఇచ్చి పెండ్లి చెసారు. ఆ విరాధుడు, శ్రీరామునిటొ జరిగిన యుద్ధంలో మరణించగా, మరలా కర్కటి తల్లిదండ్రులను ఆశ్రయించింది. ఒకరోజు అగస్త్యుని శిష్యుడైన సుతీక్షణుడు భీమానదిలో స్నానం చేస్తుండగా, కర్కటి తల్లిదండ్రులు అతనిని కబళీంచేందుకు ప్రయత్నించి, అ ముని శాపానికి గురై భస్మమయ్యారు. తల్లిదండ్రులను కోల్పోయిన కర్కటి అనాథగా ఆ మిగిలింది. అనాథగా సహ్యపర్వతంపై తిరుగుతున్న కర్కటిని చూసి, మోహావేశుడైన రావణుని సోదరుడు కుంభకర్ణుడు, ఆమెను బలాత్కరించి, లంకా నగరానికి వెళ్ళిపోయాడు. ఫలితంగా కర్కటి గర్భనతై భీమాసురునికి జన్మనిచ్చింది. తన తల్లి కథను విన్న భీమాసురుడు, దీనంతాటికి కారకుడు రామావతారం ధరించిన విష్ణువేనని, విష్ణువుపై తన పగను తీర్చుకోవాలని, వేయి సంవత్సరాలపాటు బ్రహ్మ గురించి తపస్సుచేసి వరాలను పొందాడు. ఎల్లలోకవాసులను గడగడలాడించిన భీమాసురుడు కామరూప దేశాధిపతి సుదక్షిణుని ఓడించి కారాగృహంలో బంధించాడు.అతని భార్య సుదక్షిణాదేవిని కూడ బంధిస్తాడు. కారాగారంలో సంకెళ్ళతో బంధింపబడినప్పటికీ ఆ దంపతులు, మానస గంగాస్నానం చేస్తూ, ఇసుకలింగాన్ని చేసి ఆరాద్ హించసాగారు. వారి పూజలను చూసిన భీమాసురుడు ఈ లింగం మిమ్ములను రక్షిస్తుందా అంటూ తన కరవాలాన్ని విసురుతాడు. రాక్షసుని కత్తి పార్థివలింగాన్ని తాకినంతనే కోటి సూర్యప్రభలతో స్వామి జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి, త్రిశూలంతో రాక్షస సంహారం గావించాడు. సకలలోకవాసులు సంతోషించారు. అప్పట్నుంచి స్వామి లోకకళ్యాణార్థం అక్కడనే ఉంటూ భక్తజనా వళిని కరుణిస్తున్నాడు. ఎందరో భక్తుల కోరికలను ఈడేరుస్తున్నాడు.

11. శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం

సానంద మానంధవనే వసంత , మానంధకంధం హతపాప బృందం
వారానసీనాథ మనాతనాతం, శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే

ఈ సృష్టికి ముందునుంచే కాశీపురం పరమ పవిత్రమై విరాజిల్లుతోంది. ఇక్కడ పరమశివుడు సగుణరూపాన్ని ధరించాడు. ఆ స్వరూపం శివశక్తి సమ్మేళనం. స్త్రీ, పురుష రూపాలకు భిన్నంగా ఉన్న ఆ రూపం ప్రకృతి,పురుషులు ఉదయించారు. పరమాత్మ తన నుండి తేజాన్ని వెలువరించి ఐదుక్రోసులమేరగల ఒక మహాపట్టణాన్ని ప్రకృతి పురుషులు తపస్సు చేయడానికి నిర్మించారు. అదే కాశి పట్టణం. పరమాత్మ అదేశానుసారం పురుషుడు సృష్టి నిర్మాణ సామార్థ్యాన్ని పొందేందుకు ఘోర తపస్సు చేసాడు. పరమపురుషుడైన శ్రీమహావిష్ణువు తపస్సు చేస్తుండగా, ఆ తపస్సు వేడికి అతని శరీరం నుండి నీరు కాలువలై ప్రవహించసాగాయి. ఆ జల ప్రదేశాన్ని చూసి ఆది నారాయణుడు ఆశ్చర్యచకితుడై తల ఊపాడు. ఆ ఊపుకు మణులతో కూడిన చెవి కమ్మ ఊడి ఒకచోట పడింది. ఆ చెవి పోగు ఊడి పడిన స్థలమే ‘మణికర్ణి’గా ప్రసిద్ధమైంది. అనంతమైన జలరాశినుండి కాశీపట్టణాన్ని పరమశివుడు తన శూలాగ్రంతో ధరించి కాపాడాడు. జాలం పైభాగంలో యోగనిద్రాపరవశుడైయున్ననారాయణుని నాభికమలం నుండి బ్రహ్మ ఉదయించి, శివాజ్ఞను అనుసరించి సృష్టి చేయడానికి ఉద్యుక్తుడయ్యాడు. ముందుగా బ్రహ్మ పంచాశత్కోటి యోజన పరిమితమగు బ్రహ్మాండాన్ని సృజించి, నాలుగు వైపులా పద్నాలుగు భువనాలను నిర్మించాడు. ఆ బ్రహ్మాండం మజ్జిగలో వెన్నముద్ద వలె తేలియాడసాగింది. ఐరావతాదులతో బ్రహ్మాండం సుస్థిరంగా నిలిచి ఉంది. ఈ బ్రహ్మాండంలో సగం మధ్య భాగం, మిగిలిన సగభాగంలో సగం ఊర్థ్వభాగం, ఇక మిగిలిఉన్న పాతికభాగం అథోలోకమని చెప్పబడుతోంది. అప్పుడు దేవతలంతా పరమశివుని ప్రార్థించి, భూలోక వాసులను కాపాడేందుకు ఇక్కడే శాశ్వతంగా ఉండమని విన్నవించుకున్నారు. వారి మొరలను ఆలించిన పరమశివుడు విశ్వేశ్వరనామంతో జ్యోతిర్లింగమై కాశీ పట్టణంలో వెలసి భక్త

విభూతి మహిమ

గంగాధరుని పాలభాగంపై విబూధి రేఖలు. జీవాత్మ-ఆత్మ-పరమాత్మలకు సంకేతాలు. జీవాత్మ తనలోని ఆత్మ స్వరూపాన్ని తెలుసుకొని పరమాత్మతో కూడి ఉండాలన్నదానికి నిదర్శనం. జీవాత్మే-పరమాత్మ అన్న సత్యాన్ని, జ్ఞానాన్ని తెలియజేసేదే త్రినేత్రం... అది మనపాలిట జ్ఞాననేత్రం. వేదములు, పురాణములు ఏకకంఠముతో విభూతి యొక్క మాహిమను చాటుచున్నవి. భస్మస్నానము చేసినవారు సర్వతీర్ధాలు చేసినవారితో సమానము. భస్మధారణ చేసిన వారికి దుష్ట గ్రహములు, పిశాచములు, సర్వరోగములు, పాపములు సమీపించవు. ధర్మబుద్ధి కలుగుతుంది. బాహ్య ప్రపంచజ్ణ్జానము కలుగుతుంది. విభూది నొసట ధరించి శివపంచాక్షరి మంత్రము ప్రతిదినము పఠిస్తూ వుంటే లలాటమున బ్రహ్మవ్రాసిన వ్రాత కూడా తారుమారు అవుతుంది. విభూతి (భస్మం) ధరించినప్పుడు “ఓం నమ: శివాయా'' అనే మంత్రాన్ని జపిస్తూ ధరించాలి.

విభూతి ధరించినపుడు నుదిటిపై కనుబొమ్మలు దాటి ప్రక్కలకు గాని కనుబొమ్మల క్రిందికిగాని ధరించకూడదు. విభూతిధారణ దేవతాపూజ, జపము, యజ్ణ్జము, హోమము, శుభకార్యముల్లో ధరించిన కార్యములు సిద్ధించును. తప్పక ధరించవలెను. విభూతి భస్మం, తిలకం కాని నొసట ధరించనిదే భగవంతుని తీర్ధప్రసాదములు స్వీకరించ కూడదు. భస్మము ఐదు విధముల పేర్లతో ఉన్నట్లు తెలియచున్నది.
1. భస్మం
2. విభూతి
3. భసితము
4. క్షారము
5. రక్షయని

పేర్లతో చెప్పబడుచున్నవి. 1. విభూతి కపిలవర్ణము, 2. భసితము కృష్ణ వర్ణము, 3. భస్మము శ్వేత వర్ణము, 4. క్షారము ఆకాశవర్ణము, 5. రక్ష రక్తవర్ణము కలుగి యుండును. బ్రహ్మాది దేవతలు నారదాది మహర్షులు సనక సనందనాది యోగులు బాణాసురాది దానవులు శివునిపై గల భక్తి భావములతో నిత్యం భస్మస్నానం చేసి పాప విముక్తి పొందారు. "ఓం నమ: శివాయ "అనే మంత్రముతో భస్మమును అభిమంత్రించి వంటిపై ధారణ చేయవలెను. త్రిపుండ్రములను ధరించవలెను. శిరమున, నుదుట, కర్ణమున, కంఠమునందు, భుజములందు ఈ విధముగా పదునైదు చోట్ల త్రిపుండ్రధారణ చేయవలెను. కుడిచేతి నడిమి మూడు వేళ్ళతో ఎడమ నుండి కుడివైపునకు, బొటన వేలుతో కుడినుండి ఎడమవైపునకు త్రిపుండ్రములను దాల్చ వలెను. శివపూజ సాధకులు అందరూ తప్పక ఈ విధముగా భస్మధారణ చేయవలెను.

నిత్యము ఈ విధముగా ధరించడంవలన సమస్త పాపములు నశించును. గంగా, యమున, సరస్వతి సంగమ స్నానము వలన కలుగు ఫలితములు ఈ భస్మస్నానము వలన కలుగును. బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలగు దేవతలు ఈ భస్మ స్నానము వలననే గొప్పవారైరి. త్రిపుండరేఖలలో త్రిమూర్తులు ఉన్నారు. మొదటి రేఖ బ్రహ్మ, రెండవ రేఖ విష్ణువు, మూడవ రేఖ శివుడు. కావున మూడు రేఖలను లలాటమున ధరించుట శ్రేష్టము. ఎల్లప్పుడూ కుడి చెయ్యి మధ్య మూడు వేళ్ళతో భస్మధారణ చేయవలెను. భస్మ స్నానము కంటే పవిత్ర స్నానము లేదని చెప్పుచూ శివుడు మొదట భస్మ ధారణచేసి సమస్త దేవతలకు ప్రసాదించెను. అనాటి నుండి బ్రహ్మాది సర్వ దేవతలు భస్మధారణ మహా ప్రసాదముగా స్వీకరించారు. చంద్రశేఖరుడైన శివునకు భస్మము అర్పించిన చాలా సంతసించును. యాగములు, దానములు, తపస్సు మొదలైన వానికంటే శివునకు భస్మధారణ అధిక సంతృప్తిస్తుంది. ఒకసారి మహేశ్వరుని భస్మంతో తృప్తిపరిచిన సర్వాభీష్టములు నెరవేరును.

విభూధిని ఎందుకు ధరిస్తారు?

ప్రార్థనా సమయంలో ఆ కాలంలో ప్రతీ హిందువు విభూదిని నొసటి భాగాన పులుముకునేవారు. విభూతిలో ఉన్న ఔషదీయ గుణాలు ఈ అభ్యాసాన్ని అర్థవంతం చేస్తుంది. స్వచ్చమైన విభూతికి ఎన్నో శుభలక్షణాలు ఉన్నాయి. స్వచ్చమైన విభూదిని పొందడానికి మొదట గడ్డిమాత్రమే తినే అవు పేడను సేకరించాలి. ఆ పేడను దాన్యపు పొట్టులో శివరాత్రి రోజు కాల్చాలి. కాల్చిన పేడను నీటిలో కడిగిన అనంతరం ఆరబెట్టాలి. ఆ పిమ్మట దానిని పరమేశ్వరుడికి అర్పించాలి. ఈ విభూదిని శుభ్రమైన చోటపెట్టి వాడుకోవాలి.

విభూదిని తడిపిగాని, పొడిగా గానీ వాడుకోవచ్చు. విభూది శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది. హిందువుల విశ్వాసం ప్రకారం విభూదిని ధరించడం వల్ల శివుడు ప్రసన్నుడవుతాడని విభూదిని నుదురు, మెడ, భుజాలు, చేతి మదిమలు మరియు మోచేతుల్లో ధరిస్తారు. జ్వరంతో బాధపడుతున్న వాడికి నుదిటిపై తడి విభూదిని పూస్తే శరీర ఉష్ణోగ్రత తగ్గుముఖం పడుతుంది. హోమంలో వేసిన ఔషదీయ కర్రలు మరియు ఆవు నెయ్యి పవిత్ర భస్మాన్ని మిగుల్చుతుంది. హోమభస్మం కూడా వాడవచ్చు. ఇందులోనూ అనేక ఔషదీయగునాలు ఉన్నాయి.

మహాశివరాత్రి వ్రత కథ

ఒకనాడు కైలాసపర్వత శిఖరముపై పార్వతీపరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా పార్వతి శివునితో అన్ని వ్రతములలోను ఉత్తమమగు వ్రతమును భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలుపమని కోరెను. అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమనుదాని విశేషాలను తెలియజేస్తాడు. దీనిని మాఘబహుళచతుర్దశి నాడు ఆచరించవలెనని, తెలిసికాని, తెలియకగాని ఒక్కమారు చేసినను యముని నుండి తప్పుంచుకొని ముక్తి పొందుదురని దాని దృష్టాంతముగా ఈ క్రింది కథను వినిపించెను.
ఒకప్పుడు ఒక పర్వతప్రాంతమున హింసావృత్తిగల వ్యాధుడొకడు వుండెను. అతడు ప్రతి ఉదయం అడవికి వేటకు వెళ్ళి సాయంత్రం ఏదేని మృగమును చంపి తెచ్చుచు కుటుంబాన్ని పోషించేవాడు. కానీ ఒకనాటి ఉదయమున బయలుదేవి అడవియంతా తిరిగినా ఒక్క మృగము కూడా దొరకలేదు. చీకటిపడుతున్నా ఉత్తచేతులతో ఇంటికి వెళ్ళడానికి మనస్కరించక వెనుతిరిగెను. దారిలో అతనికొక తటాకము కనిపించెను. ఏవైనా మృగాలు నీరు త్రాగుట కోసం అచ్చటికి తప్పకుండా వస్తాయని వేచియుండి వాటిని చంపవచ్చునని ఆలోచించి దగ్గరనున్న ఒక చెట్టెక్కి తన చూపులకు అడ్డముగా నున్న ఆకులను, కాయలను విరిచి క్రింద పడవేయసాగెను. చలికి "శివ శివ" యని వణుకుచూ విల్లు ఎక్కిపెట్టి మృగాల కోసం వేచియుండెను.
మొదటిజామున ఒక పెంటిలేడి నీరు త్రాగుటకు అక్కడికి వచ్చెను. వ్యాధుడు దానిపై బాణము విడువబోగా లేడి భయపడక "వ్యాధుడా! నన్ను చంపకుము" అని మనుష్యవాక్కులతో ప్రార్ధించెను. వ్యాధుడు ఆశ్చర్యపడి మనుష్యులవలె మాట్లాడు నీ సంగతి తెలుపుమని కోరెను. దానికి జింక "నేను పూర్వజన్మమున రంభయను అప్సరసను. హిరణ్యాక్షుడను రాక్షసరాజును ప్రేమించి శివుని పూజించుట మరచితిని. దానికి రుద్రుడు కోపించి కామాతురయైన నీవు, నీ ప్రియుడును జింకలుగా పన్నెండేళ్లు గడిపి ఒక వ్యాధుడు బాణముతో
చంపనుండగా శాపవిముక్తులౌదురని సెలవిచ్చెను. నేను గర్భిణిని, అవధ్యను కనుక నన్ను వదలుము. మరొక పెంటిజింక ఇచటికి వచ్చును. అది బాగుగా బలిసినది, కావున దానిని చంపుము. లేనిచో నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువుల కప్పగించి తిరిగివస్తాను" అని అతన్ని వొప్పించి వెళ్ళెను.
రెండవజాము గడిచెను. మరొక పెంటిజింక కనిపించెను. వ్యాధుడు సంతోషించి విల్లెక్కుపెట్టి బాణము విడువబోగా అదిచూచిన జింక భయపడి మానవవాక్కులతో "ఓ వ్యాధుడా, నేను విరహముతో కృశించియున్నాను. నాలో మేదోమాంసములు లేవు. నేను మరణించినా నీ కుటుంబానికి సరిపోను. ఇక్కడికి అత్యంత స్థూలమైన మగజింక యొకటి రాగలదు. దానిని చంపుము, కానిచో నేనే తిరిగివత్తును" అనెను. వ్యాధుడు దానిని కూడా విడిచిపెట్టెను.
మూడవజాము వచ్చెను. వ్యాధుడు ఆకలితో జింక కోసం వేచియుండెను. అంతలో ఒక మగజింక అక్కడికి వచ్చెను. వింటితో బాణము విడువబోగా ఆ మృగము వ్యాధుని చూచి మొదటి రెండు పెంటి జింకలు తన ప్రియురాలుల్ని తానే చంపెనా అని ప్రశ్నించెను. అందుకు వ్యాధుడు ఆశ్చర్యపడి రెండు పెంటిజింకలు మరలివచ్చుటకు ప్రతిజ్ఞచేసి వెళ్ళినవి, నిన్ను నాకు
ఆహరముగా పంపుతాయని చెప్పాయని అన్నాడు. ఆ మాట విని "నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చెదను నా భార్య ఋతుమతి. ఆమెతో గడిపి బంధుమిత్రుల అనుజ్ఞపొంది మరలివత్తును అని ప్రమాణములు చేసి వెళ్ళెను.
ఇట్లు నాలుగు జాములు గడిచి సూర్యోదయ సమయంలో వ్యాధుడు జింకల కొరకు ఎదురుచూచుచుండెను. కొంతసేపటికి ఆ నాలుగు జింకలును వచ్చి నన్ను మొదట చంపుము, నన్నే మొదట చంపుమని అనుచు వ్యాధుని ఎదుట మోకరిల్లెను. అతడు మృగముల సత్యనిష్టకు ఆశ్చర్యపడెను. వానిని చంపుటకు అతని మనసు ఒప్పలేదు. తన హింసావృత్తిపై జుగుప్స కలిగెను.
"ఓ మృగములారా ! మీ నివాసములకు వెళ్ళుము. నాకు మాంసము అక్కరలేదు. మృగములను బెదరించుట, బంధించుట, చంపుట పాపము. కుటుంబము కొరకు ఇక నేనా పాపము చేయను. ధర్మములకు దయ మూలము. దమయు సత్యఫలము. నీవు నాకు గురువు, ఉపదేష్టవు. కుటుంబ సమేతముగా నీవు వెళ్ళుము. నేనిక సత్యధర్మము నాశ్రయించి అస్త్రములను
వదలిపెట్టుదును." అని చెప్పి ధనుర్బాణములను పారవేసి మృగములకు ప్రదక్షిణ మాచరించి నమస్కరించెను.
అంతలో ఆకాశమున దేవదుందుభులు మ్రోగెను. పుష్పవృష్టి కురిసెను. దేవదూతలు మనోహరమగు విమానమును తెచ్చి యిట్లనిరి : ఓ మహానుభావా. శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించినది. ఉపవాసము, జాగరమును జరిపితివి, తెలియకయే యామ, యామమునను పూజించితివి, నీవెక్కినది బిల్వవృక్షము. దానిక్రింద స్వయంభూలింగమొకటి గుబురులో మరుగుపడి
యున్నది. నీవు తెలియకయే బిల్వపత్రముల త్రుంచివేసి శివలింగాన్ని పూజించితివి. సశరీరముగా స్వర్గమునకు వెళ్ళుము. మృగరాజా! నీవు సకుటుంబముగా నక్షత్రపదము పొందుము."

ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతితో నిట్లనెను: దేవీ! ఆ మృగకుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిర నక్షత్రము. మూడు నక్షత్రములలో ముందున్న రెండూ జింకపిల్లలు,
వెనుకనున్న మూడవది మృగి. ఈ మూడింటిని మృగశీర్ష మందురు. వాని వెనుక నుండు నక్షత్రములలో ఉజ్జ్వలమైనది లుబ్ధక నక్షత్రము

మహాశివరాత్రి అహోరాత్ర వ్రతము

రాత్రి వ్రతములు కొన్ని ఉంటాయి. దినావ్రతములు కొన్ని ఉంటాయి. మహాశివరాత్రి అహోరాత్ర వ్రతము. శివరాత్రి అనడంలోనే రాత్రి పాధాన్యం గురించి చెప్పబడుతున్నది. పైగా అమ్మవారికి కూడా మనం నవరాత్రులు అని చేస్తాం. రాత్రి అంతర్ముఖ స్థితికి సంకేతం. ఆ సమయంలో చేసే ఆరాధనలు ధ్యానానికి, జ్ఞానానికి ప్రధానమైనవి. కర్మకు ప్రధానమైన వ్రతాలు పగటియందు చేస్తారు. లింగోద్భవ కాలం, తురీయ సంధ్యాకాలంలో ఒక మహాగ్ని లింగంగా తన ఆదిమద్యాంతరహితమైన తత్త్వాన్ని ప్రకటించాడు గనుక ఆ రాత్రికి ప్రాధాన్యమున్నది. అది జరిగినది మాఘబహుళ చతుర్దశి అర్థరాత్రి సమయం గనుక ఈ రాత్రిని మనం శివరాత్రి వ్రతంగా చేస్తున్నాం. ప్రతి ఆరాధనకీ ఉన్న నియమాలే శివారాధనలో కూడా ఉన్నాయి. వాటితో పాటు మరికొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఏ ఆరాధనకైనా ముందు ఉండవలసినది శుచి. దానినే సదాచారం అంటాం. "ఆచారహీనం నపునంతి వేదాః" అని శాస్త్రం. ఎంత వేదపండితుడైనా ఆచారపాలన లేనప్పుడు వాడు తరించడు. "ఆచార ప్రభవో ధర్మః ధర్మస్య ప్రభురచ్యుతః" అని విష్ణుసహస్రనామం చెబుతున్నది. సూర్యోదయాత్పూర్వం నిద్రలేవడం, బ్రాహ్మీ ముహూర్తంలో ధ్యానం చేయడం, స్నానసంధ్యాది నిత్యకృత్యముల తర్వాత శివారాధన చేయాలి. శివారాధనలో ప్రధానమైనది శివధర్మములు కొన్ని చెప్పబడుతున్నాయి. శివధర్మములు అనగా శివుని ఉద్దేశించి చేసే కర్మలు. పూర్ణిమ, అమావాస్యలయందు సముద్రం ఎలా వృద్ధిచెందుతుందో అలా ఆ కర్మలు వృద్ధిచెందే కాలం శివరాత్రి. అలాగే శివధర్మములు కొద్దిపాటి చేసినప్పటికీ గొప్ప ఫలితాలుంటాయి. శివాభిషేకం, నామస్మరణ ఇత్యాదులు. మహాశివరాత్రి నాడు ఆ కర్మలు చేస్తే కొద్దిపాటి చేసినప్పటికీ అధికఫలాన్నిస్తాయి పర్వకాల సమయంలో సముద్రం వలె అని పరమేశ్వరుడు చెప్పినట్లుగా శివపురాణంలోని వాక్యం. స్నానం శరీరానికి కేవలం బాహ్యశుద్ధిని మాత్రమే కలిగిస్తుంది. పూర్ణశుద్ధి కావాలి అంటే భస్మధారణవల్ల శుద్ధి అవుతున్నది. అందువల్ల త్రిపుండ్రములుగా నుదుటియందు, కంఠమునందు, భుజములయందు, చేతులయందు, వక్షస్థలములయందు భస్మాన్ని ధరించాలి అని శాస్త్రం. భస్మధారణ, రుద్రాక్షధారణ, పంచాక్షరీ మంత్రాన్ని జపించడం ఈమూడూ శివధర్మానికి ప్రధాన నియమాలు. స్వామికి ఇష్టమైన బిల్వదళములు, తుమ్మిపూవులు, ద్రోణ కుసుమములు(ఉమ్మెత్త పువ్వులు), వాటితో ఆరాధన చేయాలి. పంచబిల్వములు - తులసి, మారేడు, ఉసిరి, నిర్గుండి(వావిలి), నిమ్మ వీటితో అర్చించడం పరమేశ్వరునికి ప్రీతి. షట్కాల శివపూజ అని నాలుగు గంటలకొకమారు అభిషేకాదులు చేయాలి. అభిషేకప్రియః శివః అని అభిషేకానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అర్హులు మంత్రసహితంగా, తెలియని వారు శివాయ నమః అనే నామం అంటూ అభిషేకం చేసినా చాలు. భక్తికి పరవశించే స్వామి పంచాక్షరితో చేసే పూజకే చాలా సంతోషిస్తాడట. వివిధ ద్రవ్యాలతో శివభిషేకం: భగవదుపచారములలో ఒక్కొక్క ఉపచారానికీ ఒక్కొక్క ఫలితాన్ని చెప్పారు. పరమేశ్వరునికి అభిషేకం అత్యంత ప్రీతిపాత్రమైనది. "అభిషేకాత్ ఆత్మశుద్ధిః" అని శాస్త్రం చెబుతోంది. అభిషేకం వల్ల ఆత్మశుద్ధి కలుగుతుంది. ఆత్మ అనగా చిత్తము. అంతఃకరణం శుద్ధికావాలి. చిత్త శుద్ధి లేని శివపూజ లేలరా? తో పాటుగా శివపూజ లేనిదే చిత్తశుద్ధి రాదయా అని కూడా ఉంది. అందుకని చిత్తశుద్ధి కోసం శివపూజ చేయాలి. తరువాత చిత్తశుద్ధితో శివపూజ చేయాలి. శుద్ధికి గొప్ప సాధనం అభిషేకం. ప్రతిదానికీ ప్రధాన, అవాంతర ప్రయోజనాలు లభిస్తాయి. ప్రధానమైనది ఆత్మశుద్ధి. అవాంతర ప్రయోజనాలు - ఐశ్వర్యం లభించడం, రోగాలు పోవడం, జ్ఞానం రావడం, మొ!!వి. పరమేశ్వరుడు త్రిగుణాతీతుడు, శుద్ధ సత్త్వ స్వరూపుడు. అందువల్ల ఆరాధనలో సాత్త్విక పదార్థాలను వినియోగించాలి. వాటిలో క్షీరము ప్రధానమైనది. శుద్ధజలం క్షీరం కంటే ప్రధానమైనది. శుద్ధజలంతో అభిషేకం చేయడం ఆయనకి అత్యంత ప్రీతిపాత్రం. గోక్షీరమే అభిషేకానికి వినియోగించాలి. వేరేవాటిలో గోక్షీరం కలపడం కూడదు. కొందరు ఆవుపాల ప్యాకెట్లు చించి నేరుగా అభిషేకం చేస్తారు. అలా చేయరాదు. మరికొందరు కొబ్బరికాయ కొట్టి నేరుగా అభిషేకం చేస్తారు. అది కూడా మహాదోషం. వాటిని వేరే పాత్రలోకి తీసుకొని అభిషేకం చేయాలి. క్షీరాభిషేకం వెండి పాత్రలోనే చేయాలి. రాగి, కంచు ఇత్యాది పాత్రలలో చేయరాదు. రాగి, కంచు పాత్రలతో తీర్థాన్ని కూడా పుచ్చుకోరాదు. అలా చేయడం వల్ల కల్లుపుచ్చుకున్న దోషం వస్తుంది. క్షీరంతో అభిషేకం చేస్తే అమృతంతో చేసిన గొప్ప ఫలం వస్తుంది. అపమృత్యు వంటి దోషాలు పోతాయి. క్షీరజన్యమైన దధితో అభిషేకం చేయడం కూడా ముఖ్యమైన అంశం. ఇది కూడా అమృతత్వాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. గోఘృతం (ఆవునెయ్యి)తో అభిషేకం చేయడం వలన యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది. తేనెతో అభిషేకం చేయడం వల్ల వాక్శక్తి, జ్ఞానశక్తి లభిస్తాయి. శుద్ధజలాభిషేకం ఆత్మశుద్ధికి హేతువవుతుంది. పైగా గంగాజలంతో అభిషేకం చేయడం ప్రత్యేకమైన విధి. గంగాజలంతో అభిషేకం చేయడంవల్ల తత్త్వజ్ఞానం లభిస్తుంది. భస్మంతో అభిషేకం మోక్షహేతువు. వివిధ ఫలరసములతో అభిషేకం అభీష్టసిద్ధినిస్తుంది. పసుపునీటితో అభిషేకం అమంగళములను తొలగించి మంగళములను, శుభాలను కలిగిస్తుంది. కుశజలం (దర్భలు ముంచిన నీరు), మారేడు తులసీదళములు నీటిలో వేసి ఆనీటితో అభిషేకం చేయవచ్చు. ఈ దళములను వేయడం వల్ల ఆజలము ఔషధంగా మారి అన్ని రోగాలను పోగొట్టగలుగుతుంది. ఐశ్వర్యాలొస్తాయి. సుగంధద్రవ్యములు కలిపిన జలం, వట్టి వేళ్ళు కలిపిన జలముతో అభిషేకం తాపహరం, రోగహరం.

ఏకాదశరుద్రులు


సకల శుభస్వరూపుడైన పరమశివుడు అవసరమైనప్పుడు సాకార రూపంలో
ప్రత్యక్షమై కరుణిస్తూంటాడు. నిరాకారుడైన ఆ మహాదేవుడు పదకొండు రుద్రస్వరూపులుగా భాసిస్తుంటాడని వేదాలుబోధిస్తున్నాయి."శివ, శంభు, పినాకి, స్థాణు, భర్గ, గిరీశ సదాశివ, హర, శర్వ,కపాలి, భవ'' ఇవి ఏకాదశరుద్రుల నామాలు.

శివ : సృష్టి ఆదిలో ఓంకార నాదంతో, తెజోమూర్తిగా, దిగంబరంగా భాసించే వాడే "శివుడు''. దిక్కులే అంబరములు [వస్త్రములు]గాగలవాడు కనుక ఆయన దిగంబరుడు.

శంభు : రుద్రమాయకులోనైన బ్రహ్మ, విష్ణువులు తమ జన్మకు కారణంతెలుసుకునే ప్రయత్నం చేయగా వారిముందు జ్యోతిర్లింగ రూపంలో ప్రత్యక్షమై, సృష్టి క్రమాన్ని వివరించినవాడే "శంభుడు''.

పినాకి : చతుర్వేదాలయందు శబ్దబ్రహ్మలా తేజరిల్లేవాడే"పినాకి''.

స్థాణు : పరిపూర్ణ నిష్కామునిగా, సమాధిస్థితిలో నిమగ్నమై జగత్కల్యాణ కాంక్షతో తపస్సు చేసేవాడే "స్థాణుడు''.

భర్గ : క్షీరసాగరమధనవేళ జనించిన హాలాహలాన్ని తన కంఠమునందు నిలిపి గరళకంఠుగా ప్రఖ్యాతి నొందినవాడే "భర్గుడు''.

గిరీశ : కైలాసగిరిపై పార్వతీదేవితో కొలువై భక్తుల కోర్కెలుతీర్చేవాడే "గిరీశుడు''.

సదాశివ : నిరాకార పరబ్రహ్మగా, సర్వరూపాత్మకంగాక్ శుభస్వరూపంగా సకల లోకాలను పాలించేవాడే "సదాశివుడు''.

హర : సర్పాలంకార భూషితుడై, ధనుస్సును ధరించి పాపాలను హరించేవాడే "హరుడు''.

శర్వ : ఇంద్రచాపాన్ని ధరించి, పృధ్వీరధికుడై, త్రిపురాసురసంహారం చేసినవాడే "శర్వుడు''.

కపాలి : దాక్షాయణీ వియోగంతో క్రోధతామ్రాక్షుడై దక్షయజ్ఞ ధ్వంసం చేసియన్ శూలపాణే, "కపాలి''.

భవ : రురు, దధీచి, అగస్త్య, ఉపమన్యుడు మొదలైన భక్తులకు యోగశాస్త్రాన్ని బోధించిన ఆదిగురువే "భవుడు''.

ఇలా ఏకాదశరుద్రులుగా లోకహితం కోరే పరమేశ్వరుడు అష్టమూర్తిగా విశ్వసంరక్షణ చేస్తూంటాడని శివపురాణం చెబుతుంది."శర్వుడు''గా జీవుల మనుగడకోసం భూమిని అధిష్టించి -"భవుడు''గా జగానికి అత్యంతావశ్యకమైన జలాన్ని ఆశ్రయించి -"రుద్రుడు''గా దుఃఖనివారకుడైన అగ్నిని అధిష్టించి -"ఉగ్రుడు'గా జగత్తు కదలికలకు కారకుడైన వాయువును అధిష్టించి-"భీముడు''గా గ్రహనక్షత్ర మండలాలకు ఆధారం కలిగించడానికి ఆకాశాన్ని ఆశ్రయించి -"పశుపతి''గా జీవులను కర్మపాశ విముక్తులను గావించడానికి జీవాత్మను అధిష్టించి -"ఈశానుడు''గా ఈ చరాచర జీవులకు ప్రాణశక్తిగా, సూర్యుని అధిష్టించి -"మహాదేవుడు''గా తన శీతల కిరణాలలో ఓషధీరూపంతో జీవులను పాలించే చంద్రుని అధిష్టించి -లోకపాలన చేసే పరమేశ్వరుని అనంత కళ్యాణ గుణగణాలను వర్ణించి, విశ్లేషించి, వివరించడానకి వేదాలకే సాధ్యంకాదు. ఇక మనమెంత.ఇంతటి మహోన్నత చరిత్రుడు కనుకనే జగజ్జనని అయిన పార్వతి, పరమేశ్వరుని వలచింది. ఆయనను భర్తగా పొందాలని తహతహలాడింది."అపర్ణ''యై పంచాగ్నిమధ్యంలో తపస్సు చేసింది. తత్ ఫలితంగా ఆ జగత్పితను వరించింది. శివనామ భాగయై వినుతికెక్కింది

లలితాసహస్రనామం

లలితా సహస్రనామ స్తోత్రం వ్యాస ప్రోక్తం కాదు. అది సాక్షాత్తు లలితాదేవి యొక్క అనుగ్రహం చేత ఆమె యొక్క ఆజ్ఞ చేత వశిన్యాది దేవతలు పలికితే ఈ స్తోత్రం ప్రచారం లోకి వచ్చింది. ఈ నామాలని ఎవరు అనుసంధానం చేస్తారో ఎవరు ప్రతిరోజు ఈ లలిత సహస్రణం స్తోత్రాన్ని చదువ్తూ ఉంటారో వారి యందు నాకు ప్రీతీ కలిగి వారికి సంభందించిన సమస్త యోగక్షేమాలను తానే విచారణ చేస్తాను అని అమ్మవారు ఆనాడు ప్రతిన పూనింది. కాబట్టి కలియుగంలో మనకి లలిత సహస్రనామం వంటి సహస్రనామ స్తోత్రం లభించడం కేవలం భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణం తప్ప అన్యము కాదు. ఇది తల్లి యొక్క పూర్ణానుగ్రహముగా మనకు అందినటువంటి స్తోత్రం.

నామము అంటే పేరు. లలితా సహస్రనామ స్తోత్రము అని ఒక మాట అంటున్నాం.....కాని బాహ్యం లో అది రహస్య నామా స్తోత్రం అనే విషయాన్ని కాసేపు పక్కన పెట్టండి. లలితా సహస్రనామ స్తోత్రం అని అవసరం అవతుందా!!! ఆవిడ పేరు లలిత అయతే ఆవిడని సహస్రము అంటే అనంతము అని పేరు. అనంతము అంటే లేక్కపెట్టలేనన్న్ని. "సహస్ర శీర్ష వాదనా సహస్రాక్షీ సహస్రపాత్" అంటే ఖచితంగా లేకపెట్టడానికి 1000 తలకాయలు ఉన్నది అని కాదు దాని అర్ధం. అనంతమైన తలలు కలిగినది అని. అనంతమైన నామములు ఎందుకు ఉండాలి?? ఒక రూపం ఏర్పడితే ఆ రూపాన్ని గుర్తుపట్టి పిలవడానికి ఒక నామం అవసరo. భగవంతుడు/భగవతి ఒక సాకారమును దాల్చింది. అది దేవతల అదృష్టం, దేవతల వలన మనం పొందిన అదృష్టం. ఒకవేళ అమ్మవారి దగ్గరకు వెళ్లి పేరు పెట్టి అదే పనిగా లలితా.....లలితా.....లలితా..... అన్నామనుకోండి మనకి ఆవిడ గురించి ఏమైనా తెలుస్తుందా!!! తెలియదు. అలా ఒక 1000సార్లు లలితా.....లలితా.....లలితా..... అంటే ఏమైనా ఉపయోగం ఉంటుందా!!! లేకపోతే అమ్మవారికి కొన్ని పేర్లు చెప్తే ఏమైనా తెలుస్తుందా... అంటే ఇది లౌకికంగా పేర్లు పెట్టి పిలవడం కాదు స్తోత్రము. నామములు గౌనములు. లలితా సహస్రనామ స్తోత్రం చదవడం అంటే లలితా సహస్రనామ స్తోత్రం కొన్నాళ్ళకి నోటికి వచ్చేసి అప్పచెప్పేయడము కాదు. లలితా సహస్రనామ స్తోత్రం చదివేటప్పుడు ఒక్కొక్క నామం చెప్తున్నప్పుడు ఒక్కొక్క గుణంప్రకాశించినటువంటి కారణం చేత మననస్సును హత్తుకుని నిలబడి పోవాలి. ఎదో ఒక నామం దగ్గర ఒంటి మీద వెంట్రుకలు నిక్కపోడుచుకుని కన్నుల నీరు వచ్చి”అమ్మా!! ఇంత దయ కలిగిన దానివా తల్లీ.....ఇన్ని గుణములా..... ఈ గుణములన్ని మమల్ని అనుగ్రహించడం కోసమని ప్రకాశించినటు వంటి గుణములా....లేకపోతే అసలు గుణముల యెక్క అవసరం అసలు నీకేంటి....నీవు గుణాతీతమైనటువంటి వ్యక్తివి....నీవు అటువంటి తల్లివి. గుణములను ప్రకాశించేటట్టుగా అవసరం ఇచ్చారు”. పిల్లాడికి అజ్ఞానం లేకపోతే, మన్నిoచేటటువంటి గుణం అమ్మదెలా ప్రకాశిస్తుంది. పిల్లాడికి అజ్ఞానం ఉంది కాబట్టే అమ్మ దగ్గర దయా అనే గుణం ప్రకాశించింది. పిల్లవాడి దగ్గర అవిద్య ఉంది కాబట్టి అమ్మవారు వాడ్ని జ్ఞానమంతుడ్ని చేయగలిగినటువంటి ఔదార్యము, అటువంటి శక్తి అమ్మవారి యందు ప్రకాశించింది. గుణంగా అమ్మవారి యందు ప్రకాశించిన గుణములు మమల్ని ఉద్దరించడానికి పనికి వచ్చింది తప్ప అమ్మవారి యందు ప్రకాశించినటువంటి గ్గుణములు అమ్మవారిని ఉద్దరిచుకోవడానికి పనికి వచ్చేవి కాదు

అక్షతల పరమార్థం



వివాహ శుభకార్యంలో జీలకర్ర, బెల్లం పెట్టే వేళ, మాంగల్యధారణ వేళ, వధూవరులపై ఆహుతులు అక్షతలు చల్లి ఆశీర్వదించడం మన హిందూ సంప్రదాయం. వివాహ శుభకార్యాల్లోనే కాదు, ప్రతి శుభకార్యంలోనూ పెద్దలు, పిన్నలకు అక్షతలు వేసి ‘దీర్ఘాయుష్మాన్‌ భవ, చిరంజీవి భవ, సంతాన ప్రాప్తిరస్తు, ఆరోగ్య ప్రాప్తిరస్తు, సుఖజీవన ప్రాప్తిరస్తు’ అంటూ ఆశీర్వదిస్తారు. ఇక దైవసన్నిధిలో సరే సరి, పూజారైతే మంత్రాక్షతలతో అందరినీ దీవిస్తారు. ‘అక్షతలు’ అనే మాట నుంచి వచ్చిందే ‘అక్షింతలు’. క్షతం కానివి అక్షతలు. అంటే రోకలి పోటుకు విరగని, శ్రేష్ఠమైన బియ్యం అన్నమాట. అలాంటి బియ్యాన్ని పసుపు లేక కుంకుమతో, నేతితో కలిపి అక్షతలు తయారు చేస్తారు. నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కో ధాన్యాన్ని దానవస్తువుగా పేర్కొంటారు. ఆ రకంగా నవగ్రహాలలో చంద్రుడికి ప్రీతి కరమైన దానవస్తువు బియ్యం. జ్యోతిషశాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధినాయకుడు. మనిషి మనసు, బుద్ధి, గుణము, తల్లి, వ్యసనము ఇత్యాదులన్నీ చంద్ర కారకాలే అని అన్నారు పెద్దలు. అందుకే మనిషిపై చంద్రుడి ప్రభావం ఎక్కు వగా ఉంటుంది. ఆ చంద్రుడికి సంకేతమైన బియ్యం కూడా మనిషి మన స్సుపై ప్రభావం చూపుతుంది. మనోధర్మాన్ని నియంత్రిస్తాయి.

శాస్ర్తీయంగా చూస్తే, మనిషి దేహం ఓ విద్యుత్‌ కేంద్రం. విద్యుత్‌ సరఫరాల్లో హెచ్చుతగ్గులు సాధారణం. ఈ వ్యత్యాసాలు మనిషి మనస్సు మీద, ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయి. మనుషుల్లో తమో, రజో, సాత్త్యికాలనే త్రిగుణాలకూ కారకము. పెద్దలు వధూవరులపై అక్షతలు చల్లి ఆశీర్వదించే సమయంలో, దేహంలోని విద్యుత్తులో కొంత బాగం ఈ అక్షతలను తాకుతాయి. ఆశీస్సులు ఇచ్చే వాళ్ల నుంచి, పుచ్చుకొనే వాళ్లకి కొంత విద్యుత్‌ బదిలీ అవుతుంది. ఈ కారణంగా అక్షతల ద్వారా పెద్దలలో ఉండే సాత్విక గుణం పిన్నలకు లభిస్తుందనేది మన నమ్మకం. పెద్దలు, విద్వాంసులు, గురువులు, తల్లిదండ్రులు, అత్తమామలు వివాహ సమయంలో, శుభకార్యాలలో మనకు అక్షతలు వేసి శిరస్సును తాకి ఆశీర్వదించడంలోని ఆంతర్యం, పర మార్థం ఇదే!

మరో సిద్ధాంతం ప్రకారం చూస్తే మనిషి దేహంలో విద్యుత్‌ కేంద్రాలు ఇరవై నాలుగు ఉంటాయట. వాటిలో ప్రధానమైనది శిరస్సు. ఇది విద్యుదుత్పత్తి కేంద్రమే కాదు. విద్యుత్‌ ప్రసార కేంద్రం కూడా. తలపై అక్షింతలు వేయడం ద్వారా వాటిలోని విద్యుత్‌ను గ్రహించి దేహానికి ప్రసారం చేస్తుంది శిరస్సు. అక్షతలుగా ఉపయోగించే బియ్యానికి పసుపు కుంకుమలు కలపడం ఎందుకు? ఆయుర్వేదం ప్రకారం, చర్మ సంబంధ రోగాల్ని అడ్డుకునే శక్తి పసుపుకు ఉంది. పసుపు నుంచి తయారయ్యే కుంకుమకూ ఈ శక్తి ఉంది. అక్షతలు వేసే వారికి ఎలాంటి రోగ సమస్యలున్నా, పుచ్చు కొనే వాళ్ళకి అవి సోకకుండా ఈ పసుపు కుంకుమలు నివారిస్తాయట. అంతేకాక పసుపు కుంకుమలు శుభానికి సంకేతాలు కూడా. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే జీవుడికి సంకేతం బియ్యం.

భగవద్గీతలో

‘అన్నాద్భవన్తి భూతాని’ అని మూడవ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. జీవులు అన్నం చేత పుడతారట. ఈ అన్నం తయారీకి మనం ఉపయోగించే ధాన్యం బియ్యం. భగవంతునిపై అక్షతలు వేసి నమస్కరించడం అంటే, జీవుడు ఈ అన్నంలో పుట్టీ, తిరగి ఈ జీవుడిని భగవంతుడిలోకి చేర్చడమే. అక్షతలలో ఇంతటి పరమార్థం గోచరిస్తుంది.
తెలుగులో ఈ అక్షతలని తలంబ్రాలు లేదా తలబ్రాలు అని కూడా అంటారు.

తలను = తల యందు పోయబడే, ప్రాలు = బియ్యం అని అర్థం.

పూర్వం వధువు ధాన్యలక్ష్మిగా చెప్పబడింది. ఈ తలంబ్రాల కార్యక్రమంలో బియ్యానికి ఒక ప్రత్యేకత ఉంది. ‘ఓ వధువా! నీవు మా ఇంటికి వచ్చాక, మన ఇంట ధాన్యం ఇలా కుప్పతెప్పలుగా విరివిగా ఉండి, మన జీవనానికి’ ఆధారభూతమైన ధాన్యంతో మనం నిత్య సంపదల వాళ్ళమై తులతూగుతూ ఉండాలి’ అనే భావానికి అనుగుణంగా ఈ తలంబ్రాల కార్యక్రమం సాగుతుంది. వరుడు, వధువు శిరస్సులపై తలంబ్రాలు పోసుకొనే దానికి ముందు, వరుడు ముందుగా వధువు చేతిని దర్భతో తుడిచి, దోసిలిలో రెండు మార్లుగా బియ్యాన్ని వేసి, ఆ మీదట పాలని కొద్దిగా చల్లి తలంబ్రాలకి సిద్ధం చేస్తాడు. తలంబ్రాలు వేసాక వధువు ఇలా చెయ్యాలని ఒక పద్ధతి చెప్తుంది. ఈ కాలంలో పురోహితులే చేయించి పోయిస్తున్నారు. ‘ఈ కన్య వంశాన్ని తరింపజేయుగాక పుణ్యం వృద్ధి చెందుగాక. శాంతి, పుష్టి, సంతోషం, అభివృద్ధి, విఘ్నాలు లేకపోవడం, ఆయురారోగ్యాలు అన్నీ వీరికి కల్గుగాక!’ అని చదువుతూ అక్షతారోపణం (తలంబ్రాలు పోయించడం) చేయిస్తారు. ఈ చేసిన వివాహకర్మ మొత్తం అక్షతము (నాశనము లేనిది) అగుగాక! అని దీని భావం.

అక్షతలలో, తలంబ్రాలలో ఇంతటి పరమార్థం గోచరిస్తుంది. మన పూర్వీకులు ఈ వివాహ శుభకార్యాలలో, ఇతర శుభకార్యాలలో ఏర్పాటు చేసిన సంప్రదాయాల్లో, ఆచారాల్లో ఇంత గూఢార్థం ఉంది. వివాహ సమయంలో నవదంపతులు కలిసి జీవించి ఉండాలనీ, ఆదర్శ దంపతులుగా మెలగాలనీ, వధూవరులపై ఆహుతులు అక్షంతలు చల్లి ఆశీర్వదించడమే అక్షతల కార్యక్రమంలోని అర్థం, పరమార్థం. దాన్ని తెలుసుకుని అందుకు అనుగుణంగా మెలగాలి.

సీతమ్మ రాముణ్ణి తలచుకొని దుఃఖించుట-శ్రీ రామాయణం

సీతమ్మ హనుమంతుడున్న చెట్టుకిందకి వచ్చి కూచొనుట
అంతటితో వూరుకోక, ఆ రాక్షసాంగనలు "సీత! రావణుని అంతఃపురం సర్వలోకాల్లోనూ సాటిలేనిది. అందులో సుఖించాలని నీకెందుకు తోచడంలేదు? నువ్వు మనుష్యస్త్రీవి కనుక మనుష్యునికే భార్యవై వుండడం మంచి దనుకుంటున్నావు. ఇక ఆ ఆశ విడిచిపెట్టు. త్రిలోక సంపద అంతా అనుభవిస్తున్న రావణుణ్ణి పరిగ్రహించి సుఖపడు. రాముడు రాజ్యభ్రష్టుడు. అతన్ని మరిచిపో" అని చెప్పారు. ఇది విని సీతమ్మ కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుని, " మీరు చెప్పేది లోకవిరుద్ధం. ఇలా చెప్పడం పాపం అని మీకు తోచడం లేదా? మనుష్య స్త్రీ మనుష్యుని భార్య అవడం ధర్మం. నేను మీరు చెప్పినట్లు చెయ్యను. మీరు నన్ను తినాలని వుంటే తినెయ్యండి, నా అభ్యంతరం లేదు. నా భర్త రాజ్యభ్రష్టుడైనా నాకు చింతలేదు. అతనే నాకు ప్రభువు. నేను ఇక్ష్వాకువంశోద్దారకుడైన రాముణ్ణే అనుసరించి బతుకుత్రాను," అని దృఢంగా చెప్పేసింది.

ఇది విని ఆ రాక్షసాంగనలు లందరూ క్రోధపరవశులయిపోయి పరుష వాక్కులతో సీతను తర్జన భర్జన చేశారు. అదంతా వుంటూనూ, చూస్తూనూ హనుమంతుడు ఆ శిశుపాలవృక్షం మీదే వుండిపోయాడు. వాళ్ళిలా అంటుండగా చేసేదిలేక సీతమ్మ ఏడుస్తూ కూర్చుంది.

సీతమ్మ తనకు మరణమే శ్రేయస్సని నిశ్చయించుకొనుట

రాముడు ప్రమత్తుడై వున్న సమయం చూసి, నేనెంత మొత్తుకుంటున్నా , కామరూపి అయిన రావణుడు నన్ను తీసుకువచ్చాడు. ఇలాగ రాక్షసాంగనలు తర్జనభర్జన చేస్తూ వుంటే నేను బతకలేను. మహా రథుడైన రాముణ్ణి బాసి యిలాగ క్రూరరాక్షసుల మధ్య పడివున్న నాకు నగలెందుకు, నాణేలెందుకు, అసలు బతుకు మాత్రం యెందుకు? నా హృదయం నల్లరాయి అయివుంటుంది. అదవా, దీనికి జరామరణాలు లేనట్టయినా భగవంతుడు నిర్మించి వుంటాడు. లేక, నేనింత దుఃఖిస్తున్నా యిది బద్దలయిపోకుండా యెలా వుందీ? నేను ఆర్యజాతిలో పుట్టలేదు. సతిని కూడా కాను; లేకపోతే రాముణ్ణి విడిచి నేనెలా బతికివుంటానూ? నా భర్త చతుస్సముద్రముద్రిత మైన భూమండలానికి ప్రభువు. అతణ్ణి బాసి వున్న నాకు బతుకుమీద ఆశ యెందుకూ? నన్ను కొయ్యండి, తినేయ్యండి, ఏమయినా నేను బతికి వుండలేను. ఈ దుఃఖం కూడా నేనిక సహించలేను. నేను రావణుణ్ణి యెడమకాలితో నయినా తాకను, ఈ రావణుడు నేను తనని తిరస్కరించడం గుర్తించకుండా వున్నాడు. తా నేమయిపోతాడో తన కులం యేమయిపొతుందో కూడా గుర్తించుకోకుండా వున్నాడు. అంచేతనే నన్ను కోరడం. నన్ను నరకండి. చీల్చండి. ఏమయినా నేను రావణుణ్ణి అంగీకరించను. రాముడు విశ్వవిఖ్యాతుడు. ప్రాజ్ఞుడూ. కృతజ్ఞుడు, దయాపరుడు. అయినా నా దౌర్భాగ్యం వల్ల యిప్పుడు కాఠిన్యం వహించినట్టు కనబడుతోంది. లేకపోతే, జనస్థానంలో వేలకొద్దీ రాక్షసుల నొక్కబాణంతో కూలగొట్టినవాడు నన్నెందు కుపేక్షిస్తున్నాడు? నన్ను ఇలా నిరోధిస్తున్న యీ రావణుడు నిస్తేజుడు. నా రాముడు రావణుణ్ణి నిముషంలో సంహరించగలడు. నా రాముడు విరాధుణ్ణి చంపాడే. నా కోసం యెందుకు రాడూ? సముద్రం మధ్యగా వుంది కనుక , యీ లంక సాధారణంగా అసాధ్యమే; కాని యిక్కడ రామబాణాలడ్డుకొదగ్గది యేమీ లేదు. తాను మహాపరాక్రమశాలి అయివుండిన్నీ తన భార్య అయిన నన్ను రావణు డపహరించి తేగా వూరుకున్నాడే, దీని కేమి కారణము? ఒకవేళ రాముడు నేనిక్కడ వుండినట్టు ఎరెగడేమో? ఎరిగివుంటే మాత్రం క్షణం అయినా వూరుకోడు. నన్ను రావణు డెత్తుకుపోతూ వుండడం జటాయువు చెబుతాడేమో అనుకుంటే అతను రావణుని చేతిలో కూలిపోయే. వృద్ధుడయ్యుండిన్నీ నన్ను రక్షించడం కోసం రావణుణ్ణి ఎదిరించి, అతను చేసిన పని మాత్రం చాలా గొప్పది. నే నిక్కడ వుండినట్టు తెలిస్తే రాముడు భూమండలం అంతా అరాక్షసం చేసి పారేస్తాడు. లంక కాల్చేస్తాడు. రాముడూ లక్ష్మణుడూ లంక అంతా వెతికి వెతికి రాక్షసులను చంపేస్తారు.

ఈ లంకఅంతా నిమిషంలో చితులతోనూ, గద్దలతోనూ, మహాశ్మశానం అయిపోతుంది. మీ దుష్టత్వం వల్ల రాక్షసకులం అంతా నాశనం అయిపోతుంది. ఇందుకు తగ్గట్టు అనేక దుర్నిమిత్తాలు కనబడుతున్నాయి. యీ లంక త్వరలో నాశనం అయిపోతుంది తప్పదు. నా విషయమై క్రూరుడైన రావణుడు పెట్టిన గడువు సమీపించింది. పాపాత్ములైన యీ రాక్షసులకు మంచి చెడ్డలు తెలియవు. ఈ రాక్షసులకు ధర్మాధర్మాలు తెలియవు. రావణుడు నన్ను ప్రాతఃకాల భోజనంలో తినేస్తాడు, తప్పదు. రాముణ్ణి విడిచి వుండి నేనేమి చెయ్యగలనూ? రామునకు నేనిక్కడ బతికివుండిన సంగతి తెలిసివుండదు. తెలిస్తే నన్ను వెతక్కుండా వుండడు. నా రాముణ్ణి విడిచి వుండడం కంటే నేను చనిపోవడమే మంచిది. లేకపోతే, రామలక్ష్మణులు, అస్త్రసన్యాసం చేసి కందమూలాలు తింటూ మునివృత్తి అవలంబించారేమో? ఏమయినా కాలం యిలా వుంది కనుక నేను బతికి వుండలేను. ఇలాంటి స్థితిలో నాకు మరణం తటస్థించకుండా వుంది. జితాత్ములై మనస్సు స్వాధినం చేసుకుని, యిష్టమో, అనిష్టమో అనేది లేకుండా వుండే మహామునులు ధన్యులు. ప్రియమైనదానివల్ల దుఃఖం రాదు. అప్రియమైన దానివల్ల భయం సంభవిస్తుంది. అలాంటి ప్రియాప్రియాలు పాటించని మహాత్ములకు నమస్కారం. రాముణ్ణి విడిచి వుండడమే కాక, రావణుని వశంలో కూడా పడి వున్నాను కనుక నేనిక ప్రాణాలు విడిచిపెట్టేస్తాను సీత యిలా చెప్పగా, యీ సంగతి రావణునకు చెప్పడానికి కొందరు రాక్షసాంగనలు బయలుదేరారు.

యదువంశ విస్తరణ-శ్రీ విష్ణు పురాణము

పూర్వమొకప్పుడు హిరణ్యకశిపుడను రాక్షసరాజుగా పుట్టి, నరసింహావతార ఘట్టమున స్రీహరిచే చంపబడిన రాక్షసుడే చేదిరాజైన దమఘోషునికి శిశుపాలుడుగా జన్మించాడు. కరూష దేశాధీశుడైన వృద్ధ ధర్మునికి దంతవక్త్రుడు జన్మించాడు. వీడే పూర్వజన్మలో హిరణ్యాక్షుడు. వీరు ఈ జన్మలతో గూడ హరిపై ద్వేషముపూని, చివరికి ఆ హరిచేతనే నిర్జించబడ్డారు. పగచేత అయినా గానీ, కీర్తింపబడి - స్మరించబడినచో భగవంతుడు అట్టివారికైనా విష్ణుసాయుజ్యమిస్తాడని వీరి చరిత్రలు తెల్పుతాయి.

అసలు ఈ శ్రీకృష్ణుని జననమే అత్యంత ఆశ్చర్యాతిశయముతో కూడినట్టిది.

ఈ పుండరీకాక్షుడు అవతరిస్తుండగా, సూర్యచంద్ర గ్రహాలన్నీ సుప్రసన్నమయ్యాయి. జగత్తంతా అధర్మాలకు దూరంగా - భయరహితంగా ఉంది. అతడు జన్మించిన మరుక్షణం నుంచే ఈ జగత్తును సన్మార్గంలో పెట్టసాగాడు.

మానుషవేషధారి అయిన ఆ లీలావిగ్రహానికి 16, 100 మంది భార్యలు. వారుగాక అష్టసంఖ్యలో పట్టపురాణులు. అనాది అయిన ఆ దేవదేవునికి ఒక లక్షా ఎనబైవేలమంది సంతానం. వీరిలో ప్రధానంగా ప్రద్యుమ్నాదులు 13 మంది. అనేక శతసహస్తపురుషసంఖ్యాక మీ యదుకులం. హరివంశ విస్తరణవర్ణనకు నూరేళ్ల కాలపరిమితి కూడా సరిపోదు.

ఇటుపై - మహానందులు, శిశునాగవంశం వారు మొదలగు భవిష్యద్రాజులను గూర్చి తెలుపబడింది.

(మౌర్య, శుంగ, ఆంధ్ర, ఆభీర, నాగవంశాలను గూర్చి తెలిపే 24వ అధ్యాయంలోని భవిష్యద్రాజుల చరిత్రం ఆనాడే కథితమైంది. విశేషలు ఇవ్వబడ్డాయి.)

సేనాధిపతి అయి నపుష్యమిత్రుడు తన ప్రభువునే చంపి రాజవుతాడు. అతని పుత్రుడు అగ్నిమిత్రుడు, సుజ్యేష్ఠుడు, వసుమిత్రుడు, ఉదంకుడు, పుళిందకుడు, ఘోషవసువు, వజ్రమిత్రుడు, భాగవతుడు, దేవభూతి ఈ క్రమంలో శుంగవంశపు రాజులు 112 ఎళ్లు ఉంటారు. అటుపైన కాణ్వరాజులు ఈ భూమిని పాలిస్తారు.

శుంగరాజు దేవభూతి వ్యసనపరుడైనందున, అతని మంత్రి కాణ్వవసుదేవుడు అతడ్ని చంపి రాజవుతాడు. ఇతని పుత్రుడు భూమిత్రుడు, నారాయణుడు, సుశర్మ, వీరు 40 ఏళ్లు..సుశర్మను అతని సేవకుడు బలిపుచ్ఛకుడనేవాడు చంపి ప్రభువవుతాడు. తదుపరి వీడి తమ్ముడు కృష్ణుడనేవాడు రాజవుతాఅడు. తర్వాత ఆంధ్రరాజులపరిపాలన (458 సం||లు) ముప్పయిమంది ద్వారా సాగుతుంది. తరువాత వీరిభృత్యులు ఏడుగురు అభీరాదులు, పదిమంది గద్దభులు రాజులు, ఆ తర్వాత 16 మంది రాజులు.

అటుపైన ఎనిమిది మంది యవనరాజులు, 14 మంది తురుష్క రాజులు, 13 మంది ముండులు, 11 మంది మేనులు భూమిని దాదాపు వెయ్యేళ్లకు పైన 90 సంవత్సరములు పరిపాలిస్తారు. (ఇంతవరకు పేర్లు చెప్పబడి, ఇటుపైన పేర్లు చెప్పక కేవలం సంఖ్య మాత్రమే చెప్పబడటం గమనార్హం!) అటుపైన మూడువందల సంవత్సరాలు పౌరరాజులు పాలిస్తారు.

ఆ తరువాత కైంకిలురనే యవనులు పట్టాభిషేక రహితులు భూమిని పాలిస్తారు. వారి సంతతి 106 సంవత్సరాలు. ఆ పైన వారి పుత్రులు 13 మంది, బాహ్లికులు ముగ్గురు, పుష్యమిత్ర వటుమిత్రాదులు పదమూడుమంది. ఏకలులు ఏడుగురు ఆంధ్రులు, కైవర్త పటుపుళింద బ్రాహ్మణులును రాజులవుతారు.

ఈ క్షాత్రులనందరినీ లేవగొట్టి నవనాగులు; పద్మావతీపురం రాజధానిగా గయనుంచి, గంగా ప్రయాగ పర్యంతం గల భూమినంతటినీ మాగధేయులు అనుభవిస్తారు. కోసల, ఆంధ్ర, పుండ్ర, తామ్రలిప్త పురాలను దేవరక్షితుడు పాలిస్తాడు.

కళింగ, మాహిష, మాహేంద్ర, భౌమములను గుహులను రాజులు అనుభవిస్తారు. నైషధ, నైమిష, కకాల, కోశకాది జనపదాలను మణిధాన్యక వంశీయులు అనుభవిస్తారు. సౌరష్ట్ర, అవంతిక, శూద్ర, అభీర రాజ్యాలను వ్రాత్యద్విజులు ఏలుతారు. సింధునదీతీరం, కాశ్మీరం వరకు గల దేశాన్ని వ్రాత్యమ్లేఛ్ఛ శూద్రాదులు పరిపాలిస్తారు. (పంచుకొంటారు) సమకాలీన ప్రభువులు వీరు.

ఈ రాజులలో అధికబాగం స్త్రీ, బాల, గోవధ, పరధనాపహరణాది అకృత్యాలపట్ల ఆసక్తిగలవారు. అధర్మపరాయణులు. దయ కొంచెంగా - కోపం అధికంగాగలవారు వీరు. అల్పసారంగలవారు, అల్పాయుష్కులు. లుబ్ధులు. కోరికలు అధికం. బలవంతులు. మ్లేచ్ఛాచారులు, ఇష్టానుసార వర్తనులై సంచరిస్తూంటారు.

శాప - ప్రతిశాప శరాఘాతాలు-శ్రీ శివ మహాపురాణము

శివుని ప్రవర్తన, మహావమానకరంగా తోచింది - దక్షుడికి. ఇందరు తనని మన్నిస్తూంటే, రుద్రుడు అలా స్థాణువులా వుండిపోయాడూ అంటే ఏమిటి అర్థం?! అందుకే శివుణ్ణి శపించడానికి వెనుకాడలేదు.

"రుద్రా! నీ అవిధేయతకు ఇదే నాశాపం! ధర్మ బహిష్కృతుడివైన నీకు నేటి యజ్ఞమందు, హవిర్భాగములు అందుకొను అర్హత పోవుగాక!" అన్నాడు దక్షప్రజాపతి.

దీనికి వెంటనే స్పందించాడు రుద్రవాహక శ్రేష్ఠుడు నందీశ్వరుడు.

"ఏమేమీ? దక్షా! ఈ వాచాలత్వమేల?! ఎవరి స్మరణమాత్రాన ఈ యాగాదులన్నీ సఫలీకృత మవుతున్నాయో, అట్టి పరమేశ్వరుని శపించ సాహసించిన నీ దుర్మదాంధత నేమని నిందింతును?" అన్నాడు.

"ఓరీ! వాహనమాత్రుడా! నువ్వా నన్ను నిందచేయు ధీశాలివి? మహర్షి సంప్రదాయాలకు దూరులై, వేదమార్గ వర్జితులై,శిష్టాచార విమూఢులై, జటాభస్మలేపనమాత్రులై మీ రుద్రగణాలన్నీ నీతో సహా చరించెదరుగాక!" అని శాపం పెట్టాడు దక్షుడు.

నందికేశ్వరుడు రంకెవేస్తూ తన ధాటి ఎటువంటిదో చూపించాడు. "సాక్షాత్తు పరమశివధ్యాస తప్ప మరొకటి లేని నా వంటి భక్తి తత్పరుని, ఓ జంతువును చూసినట్టుగా చూస్తావా? నీ ఈ పశుబుద్ధికి నువ్వే పశుప్రాయుడివై అజముఖుడివై పోదువుగాక!

నేటినుండి శివుని సర్వేశ్వరునిగా గాక, త్రిమూర్తులలో ఒకడు మాత్రమే అని భావించేవారికి తత్త్వ జ్ఞానశూన్యత సంప్రాప్తించుగాక! అంతేకాదు ! ఇటుపై నీవు ఆత్మజ్ఞాన రహితుడవై, కేవల కర్మపరుడిగానే మిగిలెదవు గాక! అని త్రివిధ లక్షణ యుక్తంగా ప్రతిశాపం దయచేశాడు దక్షుడికి.

ఈ శాప - ప్రతిశాప శరాఘాతలకు, యాగదిదృక్షాయుతులై వచ్చిన దిగ్దంతులే దిగ్గురనే గుండెలతో దద్దరిల్లిపోయారు.

తన పుత్రుడి నిర్వాకమే తప్పు అని, దక్షుడ్ని మందలించాడు బ్రహ్మ. 'పెద్దా చిన్నా తారతమ్యాలు చూడకుండా అంతలేసి పరుష పదజాలం వాడేస్తావాపశువా?' అని నంది చెవి మెలిపెట్టాడు శివుడు.

ఏదో విధంగా యజ్ఞం అయిందనిపించి ఎవరి నిజస్థానాలకు వారు వెళ్లిపోయారు.

రుద్రుడనే పదంలోనే రౌద్రం ఉంది తప్ప, నిజానికి శాంత స్వభావుడూ - కరుణా సముద్రుడూ ఐన శివుడూ; అతని అనుచరులూ ఆ సంగతి అక్కడితో వదిలి పెట్టేశారు.

దక్షుడు మాత్రం తనకు కలిగిన అవమానం మర్చిపోలేకపోయాడు. పరమేశ్వరుడంతటి వాడిని పరాభవించ నిశ్చయించుకొని, ఎన్నెన్నో ఆలోచన్లు చేశాడు. కూతురును ఇచ్చినచోట, కొన్ని కృత్యాల విషయంలో పునరాలోచించి తమాయించుకుని, గట్టి ఊహ నొక్కటి మాత్రం అమలుచేయ పూనుకున్నాడు.

ఇళోపాఖ్యానం-శ్రీ మహాభాగవతము

వైవస్వత మనువుకి పుత్రసంతానం కలుగకముందు వశిష్టుని దగ్గరకు వెళ్లి తన కష్టం చెప్పుకున్నాడు. ఆ మనువు కోరిక తీర్చడానికి వశిష్టుడు , తనే స్వయంగా బ్రహ్మగా మిత్రావరుణమనే యాగం చేయించ సిద్ధమయ్యాడు. ఐతే , యాగం చేసేముందు ఆ మనువు భార్య శ్రద్ధ , యాగం జరిపించే బ్రాహ్మణునితో తనకు కుమార్తె కావాలని వేడుకుంది. అందుకు అంగీకరించి , ఆ బ్రాహ్మణుడు చేసాడు. అందుచేత మనువుకి ఇళ అనే కుమార్తె పుట్టింది. అప్పుడు ఆ మనువు గురువుగారి దగ్గరకు వెళ్ళి , " ఇదేమీ విపరీతం? నే కొడుకుని కావాలని యాగం చేస్తే , ఆడపిల్ల పుట్టడమేమిటి? మీ నోట అసత్యం రాదు. మరైతే ఎందుకిలా అయింది?" అని అడిగాడు. వశిష్టుడు జరిగినది గ్రహించి, "నీ భార్య యాగక్రియ జరిపించిన బ్రాహ్మణుడికి కుమార్తె కావాలని కోరితే , అతడదే ధ్యానిస్తూ హోమం చేసాడు కనుక అలా అయింది. పోనీలే, నా తపోమహిమతో ఆ ఆడపిల్లను మగవానిగా మార్చేస్తాను" అని భగవంతుని ధ్యానిస్తూ , తన మంత్రం వేయగా ఆ ఇళ , సుద్యుమ్నుడనే పురుషునిగా మారిపోయింది.

ఆ సుద్యుమ్నుడు రాజ్యమేలుతుండగా ఒక నాడు తన మంత్రులు , పరిచారకులనూ, తీసుకుని వేటకని బయలుదేరాడు. అతను ఉత్తర దిక్కు అలా వెళ్తూ, మేరు పర్వత ప్రాంతంలో ఉన్న ఒక అడవిలోకి ప్రవేశించాడు. అందులో కాలుపెట్టగానే అతడు మళ్ళీ ఆడమనిషైపోయాడు. అంతేకాదు, అతని గుర్రం ఆడదిగానూ, అతని అనుచరులు అందరూ ఆడవారిగానూ , మారిపోయారు. ఎందుకని అంటే , అది శివుడు పార్వతికిచ్చిన మాట!

పూర్వమదే అడవిలో పార్వతి శివుడు తొడ మీద కూర్చుని ప్రేమకలాపం జరిపిస్తుండగా, కొందరు మునులు అటేపోతూ, కానవచ్చారు. ఆ మునులు వారిని చూడగానే కనులు తిప్పుకుని తిరిగి వెళ్ళిపోయారు. అప్పుడు శివుడు పార్వతికి ఇకమీదెప్పుడూ అలాంటి సిగ్గుపడే అవస్థ రాకూడదని , ఆ వనంలోకి యెవరు అడుగు పెట్టినా వారు ఆడవారిగా మారిపోదురు గాక అని శపించాడు.

ఆ సుద్యుమ్నుడు ఆడరూపంలో తన పరిచారికలతో అలా అలా వనాలలో తిరుగుతూన్నపుడు , చంద్రుని కొడుకు బుధుడు ఆమెను చూసి మోహించాడు. ఆమె కూడా అందుకు అంగీకరించి అతనితో సుఖంగా జీవిస్తుండగా వారికి పురూరవుడు అనే కొడుకు పుట్టాడు. కొన్నాళ్లకి తన పాత చరిత్ర గుర్తుకొచ్చి , చాలా విచారించి, సుద్యుమ్నుడు తన గురువైన వశిష్టుని ప్రార్థించగా , అతను వాడి అవస్థకి విచారించి, దాని పరిహారార్థమై , శంకరుని తపస్సు చేసాడు. శంకరుడు వశిష్టుని తపస్సుకి మెచ్చి , "ఓ వశిష్టా, నీ తపోమహిమ వలన అతడు తిరిగి ఒక నెల పురుషరూపం, మరో నెల స్త్రీరూపం పొందుతూ ఉంటాడు" అని వరమిచ్చాడు.

సుద్యుమ్నుడు ముసలివాడవగానే తన కుమారుడు పురూరవుని రాజు చేసి, వానప్రస్థాశ్రమం తీసుకున్నాడు.