ాంతంగా తపస్సు చేసుకుందామని ఒక అడవికి వెళ్ళి అక్కడ తపోనిష్ఠతో విష్ణుధ్యానం చేస్తున్నాడు. అప్పుడు అగస్త్యముని తన శిష్యులతో ఆ అడవికి వచ్చాడు. ఎదురుగా వచ్చినా తపస్సులో ఉన్న ఇంద్రద్యుమ్నుడు ఆ మునిని చూడలేదు. లేచి నమస్కరించలేదు. అగౌరవం చేసాడు అని అగస్త్యునికి రాజుపై కోపం వచ్చి , " మదించి ఉన్నట్లున్నావు. అందుచేత నువ్వు ఒక మదపుటేనుగువై పోదువుగాక" అని రాజుని శపించాడు.
అదంతా తన ప్రారబ్ధకర్మ, అనుభవించ వలసినదే అని రాజు మాట్లాడలేదు. తక్షణమే ఇంద్రద్యుమ్నుడు త్రుకూట పర్వత సమీపంలో ఉండే అడవిలో తిరిగే ఏనుగు రాజయిపోయాడు. ఆ ఏనుగురాజెంత బలంగా ఉండేవాడంటే , వాడిని చూడగానే సింహాలు, పులులు , కూడా పరుగెత్తి పారిపోయేవి. ఒక నాడు ఆ యేనుగులరాజు తన గుంపుతో పసందైన ఆకులన్నీ తింటూ తిరిగి తిరిగి , అలసిపోయాడు. గొప్ప దాహమయింది. త్రికూట పర్వతం నుండి చల్లని మలయమారుతం వస్తుంది. ఆ వైపు ఏనుగులరాజు దారి తీసాడు. అలా అలా వెల్లగా ఒక సరోవరం కనిపించగానే ఆనందంగా దాహం తీర్చుకుని , తన గుంపుతో జలక్రీడలాడుకోడం మొదలు పెట్టాడు.
ఆ సరోవరరంలోనే శాపవశాన్న మొసలిగా మారిన గంధర్వుడు ఉన్నాడు. ఆ మొసలి చట్టున వచ్చి , ఏనుగురాజు కాళ్ళు పట్టుకుంది. అకస్మాత్తుగా వచ్చిన ఆ మొసలి నుంచి విడిపించుకుందామని గజేంద్రుడు యెంతో ప్రయత్నించాడు. కష్టమవుతుంటే మిగతా ఏనుగులుకూడా సాయం చేయవచ్చాయి. కాని లాభం లేకపోయీంది. హోరా హోరీగా ఆ రెండూ వేయేళ్లు పోరాడుకున్నాయి. ఈ భయంకరమైన పోరాటం చూడడానికి దేవతలందరూ వచ్చి యేమవుతుందో అని కుతూహలంతో కళ్లప్పగించి ఉండిపోయారు.
క్రమంగా ఏనుగు అలసిపోయి , మొసలిదే పైచేయి అవవచ్చింది. గజేంద్రుడికి మరి తన శక్తితో లాభం లేదని తెలిసిపోయింది. పూర్వజన్మ వాసన వలన దైవచింత వచ్చింది. అందరినీ రక్షించే ఆ దేవుడే నన్ను కాపాడాలి అని ఆలోచించి , " నేనింక పోరాడలేను. ఎవరి ఆజ్ఞచేత యీ ప్రపంచమంతా నడుస్తుందో, ఎవరు తానే సర్వమయి అంతటా ఉన్నాడో , అతడైన నీవే , తండ్రీ , నా దిక్కు" అని దేవుని పార్ధించడం మొదలు పెట్టాడు గజరాజు .
తమని పేరుపెట్టి పిలవలేదని బ్రహ్మ , శివుడు దాని ప్రార్ధనలు పట్టించుకోలేదు. ఏమేమని దేవుని వర్ణించి ప్రార్ధించాడో అవి తనకే చెల్లుతాయి అని శ్రీహరి పరుగుపరుగున గరుడవాహనుడై , అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఏనుగు తొండమెత్తి మొక్కుతూండగా , తన చక్రం వేసి , ఆ మొసలిని చంపేసాడు. శాపవశాన్న మొసలి అయిన గంధర్వుడు శ్రీ హరి చక్రంతో శాపవిముక్తుడై , తన యథారూపంలో లేచి వచ్చి , విష్ణుమూర్తికి నమస్కరించిన తరువాత తన లోకానికి వెళ్లిపోయాడు. గజరాజు మొక్కుతూండగా ఆ గజేంద్రమోక్షణం వింతగా చూడవచ్చిన దేవతలందరూ పుష్పవర్షం కురిపించారు.

No comments:
Post a Comment