భోగి పండుగ

దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు - భోగిమంటలు.భోగి రోజు సాయంత్రం పిల్లలకు పోసే భోగి పళ్ళు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి దివ్యమైన ఆశీస్సులు.
ఈ పండుగనాడు సంక్రాంతి సంబరమంతా పిల్లలదే. తెల్లవారు ఝామునే లేచి భోగిమంటలు వేయటం, సాయంత్రం భోగి పండ్లు పోయించుకోవడంతో హుషారుగా ఉంటారు.
"భగ" అనే పదం నుండి "భోగి" అన్నమాట పుట్టిందని చెబుతారు. భగ అంటే మంటలు లేదా వేడిని పుట్టించడం అని అర్ధం. దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు - భోగిమంటలు.
కుప్పలు నూ ర్పిడి అవగానే మిగిలిన పదార్ధాలను మంటగా వేయటం వలన పుష్యమాస లక్షణమైన చలి తగ్గి వాతావరణం కొంచెము వేడెక్కుతుంది.
భోగి పళ్ళు
భోగి పండుగ అంటే సూర్యభగవానునికి ఎంతో ఇష్టమైన పండుగ. భోగి పండ్లు అంటే రేగుపండ్లు. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన ఫలం. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపళ్ళతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. దీనినే భోగి పళ్ళు పోయడం అంటారు. సూర్యభగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో భోగిపళ్ళు పోస్తారు. అమ్మమ్మలు, తాతయ్యలు, తల్లిదండ్రులు, పెద్దమ్మ, పెద్దనాన్న, అత్తా, మామ ఇలా ఇంటిల్లిపాది అంతా కలిసి భోగిపళ్ళుతో చిన్నారులను దీవిస్తారు. సకల సౌభాగ్యాలతో, నిండు నూరేళ్ళూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భోగి పళ్ళు పోస్తూ పాటలు పాడతారు.

No comments:

Post a Comment