నేటి కాలంలో మనము గమనించినట్లైతే గోవధ లేదా గోవును అకారణంగా శిక్షించడము
మనము గమనిస్తూ ఉన్నాము. మన పీథాదిపతులు అందరూ కూడా గోవధను నిర్మూలించాలి
అని, గోవును పూజించాలి అని, శిక్షించకూడదు అని పదే పదే వారి పాదయాత్రలలో
చెబుతూనే ఉన్నారు. మన వేదాలు, మన స్మృతులు కూడా ఘోషిస్తున్నాయి. దీనికి
ప్రమాణము ఏదైనా ఉందా? అంటే (మనము సంశయాత్ములము) ప్రతీదానికి మనము ఏదైనా
ప్రమాణము చూపిస్తేనే గాని, దాన్ని నిరూపిస్తేనే గాని నమ్మలేనటువంటి
స్థితికి వచ్చాము.
వసిన్యాది దేవతలు లలితాసహస్రనామ స్తోత్రం చేసేటప్పుడు అమ్మవారిని గోమాత అని సంబోధించారు. అందుకు ఆ జగన్మాత అంగీకరించింది కూడా. మాత అంటే ముఖ్యంగా రెండు లక్షణాలను కలిగి ఉండాలి. ఒకటి, తన గర్భమునందు బిడ్డను మోసి దానికి జన్మనిచ్చేదిగా అయిఉండాలి. రెండు, పుట్టినటువంటి బిడ్డకు స్తన్యమిచ్చి ఆ బిడ్డను పోషించేది అయిఉండాలి. ఈ రెండు లక్షణాలు మన గోమాతకు ఉన్నాయి. ఇంకా ఆలోచిస్తే కన్న తల్లి తన పిల్లల కొరకే కొంత ఆహారపదార్ధాలను వండి పిల్లలను పోషిస్తుంది. కాని, గోమాత అలా కాదు. తన పిల్లల కొరకే కాకుండా మన అందరి కొరకూ కూడా పాలను ఉత్పత్తి చేస్తుంది. వసిన్యాది దేవతలు, ఆవు, జంతువుల కోవకు వచ్చినప్పటికీ గోమాతగా సంబోధించారు.
గోవు చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టిలోనిది కాదు. వసువులు 365 రోజులపాటు సత్రయాగం చేశాయి. ఆ యాగంలోనుండి ఉద్భవించినటువంటిది గోవు, మరియు ఎద్దు. మామూలుగా మనము ఏ వస్తువునైనా ఎవరికైనా దానం చేశాము అంటే దానము చేసిన వారి ఖాతాలో ఆ ఒక్క వస్తువును దానం చేసినట్లుగా వేస్తారు. కాని, గోదానం అలా కాదు. ఎవరైతే సక్రమంగా సంపాదించిన డబ్బుతో సశాస్త్రీయంగా గోదానము చేస్తారో వారు వేయి గోవులను దానం చేసినట్లుగా వారి ఖాతాలో పడిపోతుంది. మరి పుచ్చుకున్నవారు కూడా వేయి గోవులను దానం పుచ్చుకున్నట్లు వారి ఖాతాలో పడుతుంది. గోదానం పుచ్చుకున్నటువంటి వారు దానం పుచ్చుకున్న వెంటనే ఆ ప్రదేశం నుండి కొంత ప్రక్కకి వెళ్లి ఒక మంత్రం చదువుకోవాలి. అలా చదువుకోవడం వలన అతను ఒక గోవును దానం పుచ్చుకున్నట్లుగా అతని ఖాతాలో పడుతుంది. గోదానం చేయడం వల్ల దానం చేసినటువంటి వారే కాక వారి వంశములోని ముందు పది తరాలవారు ఏదైనా పాపం చేసి ఉన్నప్పటికీ వారి వంశంలో ఒక్కరు గోదానం చేయడం వల్ల (సశాస్త్రీయంగా) వారు పుణ్యలోకాలలోకి పంపబడతారు.
సామాన్యంగా మనిషి తన దగ్గిర ఉన్న ఏ వస్తువును తీసుకెళ్ళినా బాధపడడు, ఒక వేళ బాధపడినా వాటిని తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ, అమ్మ అనే దాన్ని తీసుకొని వెళితే మటుకు చాలా బాధ పడతాడు. ఎందుకంటే అమ్మంత ప్రేమగా చూసేవారు కాని, మన ఉన్నతిని చూసి ఆనందించేవారు కాని, ఇంకొకరు ఉండరు. ముఖ్యంగా పండుగలప్పుడు, పుట్టినరోజునాడు, అమ్మ గుర్తుకురాని వాడు ఉండడు. అలా గుర్తుకు వచ్చినప్పుడు అమ్మ లేదు అని బాధపడనఖ్ఖర్లేదు. మన అమ్మే గోమాతగా భూమిమీద నడయాడుతోంది. అందుకని ఆ రోజు గోవులు ఉండే ప్రదేశానికి వెళ్లి ఆవుయొక్క వేనుకతట్టుకి నమస్కరించి, దానికి ఒక గడ్డిపోచ పెట్టి, ఆ ఆవుపాలతో పాయసం చేసుకుని తాగితే అమ్మ యొక్క ఆశీర్వాదము మనకు సంపూర్ణంగా లభించినట్లే. ఎందుకంటే ఆ జగన్మాతే కొన్ని సందర్భాలలో ఇలా చెప్పింది. జన్మనిచ్చింది జనకమాత. భూమి మీద ఉంటాము కాబట్టి భూమాత. ఐశ్వర్యానిచ్చేది శ్రీమాత. మన శరీరాన్ని పోషించేది గోమాత. ఒకవేళ జనకమాతను నేను తీసుకుని వెళ్ళిపోయాను అని నా బిడ్డడు (ఆవిడ జగన్మాత కదా) అడిగితే నేను ఏమి సమాధానం చెప్పాలి. అందుకే నేను ఆ బిడ్డడికి తల్లిగా ఈ నాలుగు రూపాలలో ఉంటాను అని ఆ జగన్మాతే చెప్పింది. అంటే దీన్ని బట్టి ఆ గోమాత యొక్క వైశిష్ట్యం మనకు గోచరమవుతోంది. మన కళ్ళ ఎదుట నడయాడుతున్నటువంటి అమ్మవారియోక్క రూపమే ఈ గోమాత.
మనం సామాన్యంగా గేదె పాలు తాగినట్టైతే ఆ పాలు రజోగుణాన్ని పెంచే విధంగా ఉంటాయి. అలాగే ఆ పాలు త్వరగా జీర్ణమవ్వవు. కాని ఆవు పాలు అలా కాదు. అవి చాలా తేలికగా జీర్ణమవుతాయి. తల్లి లేనటువంటి పిల్లలకి కూడా మంచి ఆహారంగా (తల్లి పాల లాగ) రోగులకి, వృద్ధులకు కూడా తేలికగా జీర్ణమవుతాయి. సన్యాసులు కూడా నిరభ్యంతరంగా తీసుకోగలిగిన పౌష్టిక ఆహారం ఆవు పాలు. దీన్ని బట్టి ఈ పాల యొక్క విశిష్టత మనకి అర్ధమవుతోంది.
మనం ఏదైనా భగవదారాధన చేస్తూ ఉంటే ఆ భగవంతునికి పుష్పాలతో అభిషేకం చేసేటప్పుడు చాలా శ్రద్ధగా, భక్తితో, మనస్ఫూర్తిగా సమర్పిస్తేనే ఆ పుష్పాలను ఆ భగవంతుడు స్వీకరిస్తాడు. కాని, ఆవుకి చక్కగా పూజ చేసి ఒక పుష్పాన్ని ఎలా సమర్పించినప్పటికీ, అది భగవంతునికి అందుతుంది. ఎందుకంటే ఆవుయొక్క శరీరంలో 33 కోట్ల మంది దేవతలు ఆవాహనై ఉంటారు. మనం సౌచంతో ఉన్నామా (స్నానము), చెప్పులేసుకుని ఉన్నామా అన్న సంశయమేమి ఉండనఖ్ఖర్లేదు. ఇలా సమర్పించినప్పటికీ ఆ భగవన్మూర్తిని ఆరాధించినట్లే. ఆవుకి ఒక గడ్డిపరక పెడితే అది స్నానం చేసిందా, మనం స్నానం చేశామా, అన్న నియమము ఏమీ లేదు. ఎలా పెట్టినప్పటికీ మనం చక్కగా సశాస్త్రీయంగా ముక్కోటి దేవతలకి మహా నివేదన నిప్పులు కడిగే మడితో పెట్టినట్లు. అంటే ఆవుని పూజించడం ఎంత శ్రేష్టమో ఆలోచించండి.
మనం చేసినటువంటి పాపాలు కొంచమైన తోలగాలంటే దేవాలయానికి వెళ్లి అక్కడ పుష్కరిణిలో స్నానం చెయ్యాలి. గర్భాలయంలో ఉన్న స్వామికి నమస్కరించాలి. మనకు ప్రత్యక్షంగా కనపడుతున్నటువంటి పుష్కరిణి గోవుయోక్క మూత్రం. గోమూత్రాన్ని మనం శిరస్సు మీద చల్లుకుంటే సమస్తమైనటువంటి పుణ్య నదుల్లో స్నానం చేసినట్లే. పిపీలకాది పర్యన్తంలో సమస్త జీవులు విసర్జించేటటువంటి మలం దుర్గంధభూయిష్టంగా ఉండి వ్యాధికారక క్రిములను వ్యాపింపచేసేవిగా ఉంటాయి. కాని, ఆవు యొక్క పేడ మాత్రము సుగంధభరితంగా ఉంటుంది. వ్యాధికారక క్రిములను అరికట్టేవిగా ఉంటుంది. అంతే కాక, ఎంతో పవిత్రమైన విభూతి భస్మను దీని నుండే తయారు చేస్తాము. ఆవుయొక్క పేడను చిన్న చిన్న పిడకలుగా చేసి అవి ఎండిన తరువాత వాటిని మంత్రయుక్తంగా కాల్చి విభూతిని తాయారు చేస్తాము. ఈ ఆవు పిడకలను యజ్ఞ, యాగాది క్రతువులయందు ఉపయోగిస్తాము. మనం చేసినటువంటి పాపాలు మరీ ఎక్కువైపోతే అవి మన దేహము లోని ఎముకలకు మరియు కండరాలకు కూడా పట్టుకుంటాయి. అందుకనే పెద్ద పెద్ద క్రతువులు నిర్వహించేటప్పుడు పంచగవ్యప్రాసన అని చేస్తాము. ఈ పంచగవ్యప్రాసన చేత మన దేహంలో అంటుకున్నటువంటి పాపాలన్నీ కూడా నిప్పు మీద నీళ్ళు చల్లితే నిప్పు ఎలా ఆరిపోతుందో మన పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. పంచగవ్యాలనగా ఆవు పాలు, ఆవు పేడ, ఆవు పెరుగు, ఆవు మూత్రము, ఆవు నెయ్యి. ఈ అయిదు కూడా ఆవు నుంచే వస్తాయి. ఆవుకి ఇంత మహత్తర శక్తి ఉంది.
ఆవు శరీరంతో ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో తనకు తానుగా శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత కూడా అంతే ఉపయోగపడుతుంది. ఎలా అంటే ఆవు యొక్క చర్మాన్ని, ఢమరుకంగా వాడుతాము. దేవాలయాల్లో ఉపయోగిస్తాము. అలాగే ఆవు యొక్క కొమ్ముకు ఒక చివర రంధ్రం చేసి పైన బంగారు తొడుగు పెట్టి రుద్రాద్యయంలో చమకంతో శివునికి అభిషేకం చేసేటప్పుడు అభిషేక ద్రవ్యాలను ఈ కొమ్ముయోక్క రంధ్రం ద్వారా శివుని మీద పడేటట్లు అభిషేకం చేస్తే శివుడు ప్రీతిపాత్రుడవుతాడు. లింగరూపంలో ఉన్న శివునికి మాత్రమే ఇలా అభిషేకం చెయ్యాలి. అలాగే ఆవు ప్రతి రోజు కూడా తాను తీసుకున్న ఆహారంలోనుండి చిన్న బిందువంత గోరోచకాన్ని తయారుచేసి తన శరీరంలో నిలువ చేస్తూ ఉంటుంది. అది తనకు తాను శరీరాన్ని వదిలిన తర్వాత దాని శరీరంలోని గోరోచకాన్ని గుర్తించి వెలికి తీసి గర్భాలయంలో దానిని వెలిగిస్తే చక్కటి సువాసనను అది వెదజల్లుతుంది. ఆవు చనిపోయిన తరువాత కూడా ఇన్ని రకాలుగా ఆవు భగవంతునికి సేవ చేసుకుంటున్నది.
మనము కావాలని ఆవుని చంపితే కన్న తల్లిని చంపి ఆ మాంసాన్ని వండుకుని తిన్నంత మహా పాపం. మనది కర్మ భూమి. మనది ఆర్ష్య ధర్మం. మనది వేద భూమి. వేదాలుకూడా ఏమి చెప్పాయంటే మొదలు గోవులను భద్రంగా చూడాలి. తరువాతే బ్రాహ్మణులను అని స్మృతులు మాట్లాడాయి. దీన్నిబట్టి గోవుయోక్క విశిష్ట స్థానం తెలుస్తోంది.
మన పురాణాలను పరిశీలించినప్పటికి ఇక్ష్వాకు వంశంలోని దిలీప మహారాజుకు సంతానం లేకపోతే కామధేనువు యొక్క సంతానమైన శబళని పూజించి సంతానాన్ని పొందారు. అతని పేరు రఘుమహారాజు. రఘుమహారాజు కీర్తివలన ఇక్ష్వాకు వంశము రఘువంశముగా కీర్తి గాంచింది. అలాగే విశ్వామిత్రుడు మహారాజుగా ఉన్న కాలంలో కామధేనువును వసిష్ఠ మహర్షి దగ్గిర చూసి, దాన్ని పొందాలని బ్రహ్మర్షిగా పూజ్య గురువులయ్యారు. ఇలా పురాణాలలోనే కాకుండా మన కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి తనకి సుప్రభాతసేవ అనంతరం ఇచ్చే నైవేద్యం ఆవుపాలే. ఆయన మనకి నేర్పుతున్నది కూడా గోసంరక్షణే. అనాది కాలంగా గోసంరక్షణకే ప్రాముఖ్యత ఇచ్చారని మనకి అర్ధమవుతోంది.
ఇన్ని రకాలుగా విశిష్ట లక్షణాలు కలిగిన గోవును అకారణంగా హింసించడం, దాన్ని కొట్టడం, చంపడం మహా పాపం. చేతనైతే ఒక గడ్డిపరక తినిపించడం, పితృదేవతలు తరించాలంటే వారి పేరు మీద దేవాలయాలకి అనుసంధానమై ఉన్న గోశాలలలో ఆవు గంగడోలు దురద పుడితే గోక్కొవడానికి ఒక గరకురాయి పెట్టిస్తే, మహా పుణ్యం. మీరు ఒక్కసారి ఆవు యొక్క గంగడోలును నిమిరినట్టైతే చక్కటి సువాసన వస్తుంది. కాబట్టి మనం నేర్చుకోవలసినది ఏమిటంటే గోరక్షణ, గోసంరక్షణ, గోపోషణ ప్రతి ఒక్కరి బాద్యత మరియు కర్తవ్యం. దానిని కనక మనం విస్మరిస్తే కన్న తల్లిని విస్మరించినట్లే.
లోకాసమస్తా సుఖినో భవంతు.

No comments:
Post a Comment