తప్పకుండా గుర్తుపెట్టుకిని తాను జరుపుకోవల్సినవి కొన్ని ఉంటాయి అందులో
పుట్టినరోజు ఒకటి . నేను నా పుట్టినరోజు చేసుకోనండి అనకూడదు . తన పుట్టిన
రోజు తాను చక్కగా జరుపుకోవాలి ,అలా జరుపుకోడానికి శాస్త్రం ఒక విదిని
నిర్ణయించింది . పుట్టినరోజును ఎలా పడితే అలా జరుపుకోకూడదు . పుట్టినరోజు
జరుపుకునేటతువంటి వ్యక్తి ఆరోజు తెల్లవారుజామున లేచి అభ్యంగన స్నానం చేయాలి
, అంటే ఒంటికి నూనె రాసుకుంటే అలక్ష్మి పోతుంది ఆ నూనె అలదుకుని తల స్నానం
చేస్తారు . చేసే ముందు పెద్దవాళ్ళు తల మీద చేయి పెట్టి ఆశీర్వాదం చేసి
వెన్నుపాము నిమరడం ఆచారముగా వస్తుంది . ఆ స్నానం చేసిన తర్వాత ఇష్ట దేవతని
ఆరాధన చేయాలి ,ఇంట్లో కుల దైవం ,ఇష్ట దైవం ఉంటారు . ఆ కుల దైవాన్ని ,ఇష్ట
దైవాన్ని ఆరాదన చేయాలి . చేసిన తర్వాత ఆవు పాలలో బెల్లం ముక్క ,నల్ల
నువ్వులు ఈ మూడు కలిపినటువంటి పదార్ధాన్ని మౌనముగ తూర్పు దిక్కుకు తిరిగి
కూర్చుని మూడు మార్లు చేతిలో ఆచమనం చేస్తే ఎలా తింటామో అలా మూడు మార్లు
తీసుకుని లోపలికి పుచ్చుకోవాలి , ఎందుచేత అంటే నల్ల నువ్వులు ,బెల్లం ,ఆవు
పాలు కలిసినటువంటి పదార్దాన్ని మూడు మార్లు పుచ్చుకుంటే వచ్చే పుట్టినరోజు
కు ఏదైనా గండ కాలం ఉంటె తొలగిపోతుంది . కాబట్టి ఈ మూడు పదార్దములు
కలిసినటువంటి దానిని చేతిలో వేసుకుని మూడు మార్లు పుచ్చుకోవాలి .
పుచ్చుకున్న తర్వాత ఏడుగురు చిరంజీవులు ఉంటారు అంటే వారు పుట్టుక చేతనే
చిరంజీవత్వాన్ని పొందారు . ఇంక కొంత మంది చిరంజీవత్వాన్ని
సాదించుకున్నవాళ్ళు ఉన్నారు . సాదించుకున్నవాళ్ళు కాదు పుట్టకతో చిరంజీవులు
అయిన వారు అశ్వర్దమా ,బలి ,వ్యాసుడు ,హనుమంతుడు ,విభీషణుడు ,కృపాచార్యుడు
,పరశురాముడు వీరు ఏడుగురు కూడా పుట్టుకతో చిరంజీవులు ,ఈ ఏడుగురు పేర్లు
మనసులోనన్న స్మరించాలి ,పైకన్న చెప్పాలి ,ఆ రోజున తల్లిదండ్రులకి ,గురువు
గారికి తప్పకుండ నమస్కారం చేసి ,వాళ్ళ ఆశీర్వచనం అందుకోవాలి . మీ ఇంటికి
దగ్గరలో ఏ దేవాలయం ఉందో ఆ దేవాలయాన్ని దర్శనం చేయాలి ,చక్కగా ముష్నన్న
భోజనము చేయొచ్చు ,రాత్రి మాత్రం బ్రహ్మచర్యాన్ని పాటించాలి పుట్టినరోజుని .
పుట్టినరోజున బ్రహ్మచర్య దీక్షకి విరుద్దమైన సంసారికమైన కార్యక్రమాలని
నిర్వహించకూడదు అలా ఉంటె ఆ రోజుని పుట్టినరోజుని సక్రమముగా చేసుకున్నాడు
అని చెప్తారు . తన శక్తి కొలది దాన ధర్మాలు నిర్వహించాలి . తనకి ఐశ్వర్యం
ఉందా దానం చేస్తాడు . తనకి ఐశ్వర్యం లేదు గో గ్రాసం అంటారు , చేతి నిండా
కసన్ని పచ్చగడ్డి పట్టుకుని ఒక ఆవుకి తినిపించి ప్రదక్షిణం చేసి
నమస్కరిస్తే చాలు ,ఇవి పుట్టిన రోజు నాడు తప్పకుండా జ్ఞాపకం పెట్టుకుని
చేయవల్సినవంటి పనులు ,వీటికి విరుద్ధముగా పుట్టిన రోజులు మాత్రం
చేసుకోవద్దు . అది కేవలం ఏదో సరదా కోసం ,వినోదం కోసం చేసుకునేది కాదు ,అది
ఆయుర్దాయ సంబందమైనటువంటిది . ఆ రోజు దీపం చాల ప్రదానం పొరపాటున కూడా
అక్కరలేని విషయాలు పిల్లలకి నేర్పితే అవే విశుమ్కత్వాన్ని పొందుతాయి
రేపోద్దిన ,ఎన్నో ఏడు పుట్టిన రోజు చేసుకుంటున్నాడో అన్ని కొవ్వుత్తులు
,దీపాలు వెలిగించడం ఉఉప్ అని ఉదుతు దీపాలు అర్పేయడం పరమ అమంగాలమైనటువంటి
విషయం ,దీపాలు ఆర్పి చేతితో కత్తి పట్టుకుని ఏదో నిన్న రాత్రో ,మొన్న
రాత్రో తయారు చేసిన ఒక పదార్దం , ఎవరు చేసిన ఆశీర్వాదం అర్ధం కాదు
రంగురంగులుగా రాసిన హ్యాపీ birthday ,అర్ధం లేకుండా అందరు చేస్తున్న
తప్పట్లు ,వీటి మద్యలో కత్తితో కోసి నిర్లజ్జగా భార్య నోటిలో సబాముఖంగా
పెట్టడం ,ఇలాంటి పిచ్చ పనులు చేయమని శాస్త్రములో లేదు . దీపాన్ని గౌరవించు
,దీపాన్ని వెలిగించు ,దీపం దగ్గర మట్టు మీద ఒక అక్షితో ,పువ్వో వేసి
నమస్కారం చేయి . అది నీ ఇంట కాంతి నింపుతుంది . నీ జీవితాన్ని నిలబెడుతుంది
.. గురువు గారికి నమస్కారం చేయి ,తల్లిదండ్రులకి నమస్కారం చేయి ,పెద్దలికి
నమస్కారం చెయి వాళ్ళ నోటితో వాళ్ళు ఆశీర్వదించాలి "శతమానం భవతి శతాయు;
పురుషహ శతెన్ద్రియహ అయూశెవెన్ద్రియె ప్రతితిష్టతి . "చక్కగా అలా
దేవాలయానికి వెళ్లి నీ పేరు మీద పూజ చేయించు ,ఈశ్వరుడి అర్చన చేయి ,అపముత్య
దోషం కబలించకుండా ఉండడానికి ఆవు పాలు ,నువ్వులు ,బెల్లం కలిపిన
పదార్దాన్ని మూరు మాట్లు స్వీకరించు ,సప్త చిరంజీవుల పేర్లు మనసులో
స్మరించడం లేదా పైకి చెప్పడం ,ఒక వేల నీకు చేతకాకపోతే కనీసం అది గుర్తున్న
వాళ్లతో సంప్రదించి ,లేదా కనీసం వ్రాసుకో అక్కర్లేని విషయాలు ఎన్నో
వ్రాసుకున్నావు , వ్రాసుకుని జ్ఞాపకం పెట్టుకుని నీ పుట్టిన రోజు నాడు
,ఇంట్లో వాళ్ళ పుట్టిన రోజు నాడు ఆ ఏడుగురు పేర్లు చెప్పు . అది పుట్టిన
రోజు చేసుకునేటటువంటి విదానం .
No comments:
Post a Comment