భీష్ముని సమాధానం: రాజధర్మం అన్ని జీవులను సంరక్షించటం - ఇదే క్షత్రియ
ధర్మం. కేవలం ఖజానా నింపుకోవటం కాదు. రాజు తన నేర్పులన్నీ దాచుకుని,
సందర్భానుసారంగా వాటిని ప్రదర్శిస్తూ, అంతిమంగా, నిష్పక్షపాతంగా
ప్రజాక్షేమం కాంక్షించాలి. శత్రువు ఎంత చిన్న చిన్నవాడైనా ఉపేక్షించరాదు.
ఎందుకంటే ఒక విత్తనం నుంచి వేయి వృక్షాలు వచ్చినట్లు, ఒక అగ్గిరవ్వకు
వెన్నతోడైతే అది ఒక దావానలంగా మారి దహించినట్టు శత్రువు బలహీనుడైనా, రాజు
మీద ద్వేషం కలిగించి కీర్తిని నాశనం
చేసి, బలాన్ని తగ్గించగలడు. రాజు తన చుట్టూ స్వార్థపరులను తగిన కారణం లేక
పొగిడేవారిని ఉపేక్షించరాదు. ఈ ప్రపంచంలో ప్రతిదీ "కృషి" వలననే
సాధింపబడుతుంది అని మరువరాదు. విద్య, తపస్సు, ధనం, వంటివన్నీ కూడా కృషి
వలననే సాధించగలం. ఆ 'కృషిని' నియంత్రించేది "బుద్దే ", అయినా కృషియే
సర్వశ్రేష్ఠమైనది. ఈ దేహం 'కృషికి' కావలసిన 'శక్తి'నిస్తుంది. దేహం దేవతా
స్వరూపం కనుక తెలివిగల వాడు దేహాన్ని విస్మరించడు. దురాశాపరుణ్ణి సదా
బహుమతు ద్వారా గెలవవచ్చును. ఇటువంటివారిని మంత్రిగా కాని, ముఖ్యమైన
అధికారులుగా గాని రాజు నియమించరాదు.
No comments:
Post a Comment