నివేదన , నైవేద్యము భేదం

నివేదన అన్న మాట పర్యాయ పదమే నైవేద్యము ,సాధారణముగా మనము నైవేద్యము అనేటువంటిది చెయ్యకుండా ఉండం ,ఎందుకంటే పంచ ఉపచారములు తప్పకుండా ఇంట్లో జరగాలి ,గంధ ,పుష్ప ,ధూప ,దీప ,నైవేద్యములు ఈ ఐదు జరగకపోతే అది క్రుతగ్నతతో లేని గృహముగా గుర్తిస్తారు ,ఈ ఐదు జరగాలి . ఇంట్లో గంధము ఈశ్వరుడికి అలంకరించాలి ,పుష్ప పువ్వు వెయ్యాలి ,పువ్వు లేకపోతే అక్షిత అన్నా వెయ్యాలి ,ధూప ఈశ్వరుడికి ధూపము వెయ్యాలి ,దీప ,దీపము పెట్టాలి ,నైవేద్య ,నైవేద్యము పెట్టాలి . ఇవి ఎందుకు చేస్తున్నావు ఆయనే మనలని నిలబెడుతున్నాడన్న సాత్వికమైన బుద్దితో పూజ చేసావు ,ఆయనే మనలని కాపాడుతున్నాడు ,మన ఇంద్రియాలికి శక్తిని ఇస్తున్నాడు ,సత్వ గుణముతో చేస్తున్నాడు కాబట్టి సాత్విక పదార్దముతో నైవేద్యం చేస్తారు ,మధుర పదార్దాలు ,పళ్ళు ఇటువంటివి నైవేద్యం పెడతారు . నైవేద్యము అన్న మాట ,నివేదన అన్న మాట కేవలం పూజలో ఒక భాగముగ మాత్రమే కాదు ,అది ఎక్కడికి వెళ్ళాలి అంటే జీవితమే నివేదనగా మారిపోవాలి ,ఎలా నివేదన అంటే మీకు గురువుగారు ఒక మాట చెప్తారు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ,ఒక విగ్రహం దగ్గర కూర్చున్నామన్న భావన కాదు ,భగవంతుడు విగ్రహముగా ఉన్నాడు అని గుర్తించాలి . వాడు పిల్లవాడు కాదు ,నా మనమడు పిల్లవాడిగా ఉన్నాడు ,అప్పుడు కదా ప్రేమ ,విగ్రహము కాదు పరమేశ్వరుడు అలా ఉన్నాడు ,ఆ రూపములో అక్కడ కూర్చున్నాడు ,ఇప్పుడు నివేదన అంటే నా కష్టం ,నా సుఖం ,నా భావాలు అన్ని కూడా ఆయనతో చెప్పుకోవాలి అందుకే నివేదన రెండు కింద వెళిపోతుంది జీవితములో ,ఒకటి నాకు తోడ్పడమని అడుగుతూ ఉంటాడు ,ఈశ్వర నేను సాత్వికముగా ప్రవర్తిన్చాలనుకుంటున్నాను ,భక్తితో ఉండాలని ఉంది ,ఎప్పుడు ఎవరి జోలికి వెళ్ళకూడదు ,గురువుగారు చెప్పిన మంచి మాటలు ,గురువుగారు మంచి మాటలే చెబుతారు ,గురువు గారు చెప్పిన మాటలు జీవితములో అనుష్టాన పర్యన్తములోకి తెచ్చుకోవాలి కోరికుంది కాని మనసు అటూ ,ఇటూ లాగేస్తుంది ,స్వార్ధం వైపుకి లాగేస్తుంది కాబట్టి మీరు నా మనసు నిలకడగా నిలబడేటట్టు నేను ధార్మికముగా బ్రతికేటట్టు నన్ను అనుగ్రహించండి ,ఇప్పుడు తినమని ఆపిల్ పండు ఒకటే పెట్టాడ తన కష్ట సుఖాలు ఈశ్వరునితో చెప్పుకున్నాడ , చెప్పుకున్నాడు అది నివేదన ,అలా చెప్పుకోవడము ఒకటి ఒచ్చింది అనుకోండి అనుబంధం ఒకటి ఏర్పడుతుంది మీకు ,కాకినాడ పట్టనములోనే చలపతి రావు గారు అని ఒక ఆయన ఉన్నారు ,కాకినాడ సస్తంగం లో ,ఆయన ఎప్పుడైనా పండగ వచ్చిందనుకోండి బట్టలు కొనడానికి వెళ్తాడు ,బట్టలు కొనడానికి వెళ్తే ఆయన , ఆయన ,ఆయన భార్య ,ఆయన కూతుళ్ళు ,ఆయన అల్లుళ్ళు ,ఆయన మనవలు తో బాటు ఒక పంచ ,ఒక చీర కొంటాడు ,ఒక సారి మనవి చేసారు , అవి స్వామికి మన ఇంట్లో సింహసనములో ఉన్నారు కదండీ ,పండగ ఆయనికి కూడా కదా ,ముందు ఆయనికి కొన్నానండి ,పెద్దాయన కదా ,తల్లి ,తండ్రి కదండీ ,ఆయనికి పెట్టి ,అయన కట్టుకుంటాడు ,మేము కట్టుకుంటాము అన్నాడు .
భావన మాత్ర సంతుష్టాయే నమోనమః !!
ఆయన నమ్మాడు ఉన్నాడు మా ఇంట్లో అని ,లక్ష్మీ నారాయణులు అనండి ,పార్వతీ పరమేశ్వరులు అనండి మా ఇంట్లో ఉన్నారు సింహసనములో వాళ్ళు కూర్చుంటారు ఎప్పుడు నా యోగ క్షేమాలు చూస్తారు ఎప్పుడును ,వాళ్ళకు కొనద్దు బట్టలు అందుకని ముందు కొన్నాడు ,వాళ్ళ ఇద్దరికీ బట్టలు కొని ,అందరికి వాళ్ళ కుటుంబ సభ్యుల బట్టల చూపిస్తూ ,ఇవీ చూపిస్తుంటాడు . పండగొస్తే స్నానం చేసి ముందు వాళ్ళ ఇద్దరి దగ్గర పెడతాడు ,ఇద్దరు కట్టుకోండి అంటాడు . వాళ్ళు ఇద్దరు కట్టుకుంటే ఎలా ఉందో మనసుతో భావన చేసి ,చూసి పొంగిపోతాడు ,హా అమ్మా బలే ఉందమ్మా ఈ ఆకుపచ్చ పట్టుచీర నీకు ,స్వామి తెల్ల పంచ చాలా బాగుంది ,ఆ పాదాలకి నమస్కారములు చేస్తారు . ఇప్పుడు అక్కడ పెట్టిన బట్టలు ఈశ్వరుడి గా కట్టుకోమని ఒక బ్రాహ్మణునికి ఇచ్చేస్తాడు . ఆయనికి ఒక కష్టం వచ్చిందనుకోండి పూజ గదిలోకి వెళ్లి స్వామి ఏమిటో ఇలా ఇబ్బంది వచ్చింది ,చాల మనక్లేశ్యం పడుతున్నానండి అని చెప్తాడు . ఆయనకో సుఖం వచ్చిందనుకోండి కొడుకు ఎంసెట్ పరీక్షకి వెళ్తుంటే కాపాడమని దండం పెట్టి ,కొడుక్కి మంచి రాంక్ వస్తే మాత్రం భావమరిది కి ఫోన్ చేయడు ,మల్లీ మంచి రాంక్ వచ్చిందని ముందు వెళ్లి పరమేశ్వరునికే చెప్తాడు ,స్వామి వెళ్ళే ముందు మిమ్మల్ని అడిగాను కదా ఎంత అనుఘ్రహించారు ,మంచి రాంక్ వచ్చింది స్వామి కృతజ్నుడుని ,నా బిడ్డని అలాగే కాపాడండి అని నమస్కారము పెడతాడు తప్ప ,వెళ్ళే ముందు ఈశ్వరుడు ,ర్యాంకు వచ్చినపుడు భావుమరిది ఏమి భక్తి అది . నివేదన అంటే వాడు ముందు గుర్తుకు వచ్చుట ,కష్టం నందు, సుఖము నందు కూడా ,అన్ని ఆయనతో పంచుకోవడము అలవాటు అయిపొయింది , అప్పుడు ఏమవుతుంది . భక్తీ పూజ గదికి పరిమితం కాదు ,విశ్వవ్యాప్తమైంది ,నీకు అంతటా భగవంతుడే ఉన్నాడు ,ఒక వేల అది జరుగలేదు ,నువ్వు అనుకున్న పని అవలేదు ,ఇప్పుడు బెంగ పెట్టుకోడు ,ఈశ్వర ఎందుకలాచేసావో ,అది జరిగితే ఏదో ప్రమాదం ఉండేదన్నమాట ,జరగకుండా చేసావు ధన్యుడిని , ఒక ఉదాహరణ ,ఒకప్పుడు తెలిసిన వాళ్ళు అందరు ఒక పెళ్ళికి వెళ్లారు ,ఒక ఆయన మాత్రం ఏవండి ఆయన చాల తెలుసున్నాయన అండి కానీ పెళ్ళికి భోజనానికి వెల్లలేకపోతున్ననండి ,పొద్దునే వెళ్ళి ఏదో ఒకసారి అభినందిచేసి కానుకిచ్చేసాను ,చాల తెలుసున్నాయన కానీ ఏమ్చేస్తానండి చాలా అకస్మాత్తు ప్రయాణము వచ్చింది ,సాయంకాలము వెళ్ళాలి ,పెళ్ళికి వెళ్ళలేక పోతున్నాను అని బెంగ పెట్టుకుని వెళ్ళిపోయాడు . ఈ పెళ్ళికి వెళ్ళిన వాళ్ళు అందరూ భోజనము చేసారు ,అందులో ఎలా కలిసిపాయినదో ,ఆహారములో విషము కలిసి పోయింది ,వీళ్ళందరినీ hospitalize చేసేసారు ,కన్యాదాతలుతో కలిపి ,మగ పెళ్లి వారితో కలిపి , ఈయన ఒక్కడు రైలేక్కిపోయాడు కాబట్టి బ్రతికిపోయాడు . ఆ అన్నం తినకముందు అన్నాడు ,తినలేక పోతున్నానండి ,పెళ్లి భోజనానికి వెళ్ళటము లేదు ,పెళ్ళికి ఉండడం లేదు అన్నాడు ,ఇది ఫోన్ లో విని అన్నాడు ఈశ్వరుడు నాకు ఎంతటి అదృష్టం ఇచ్చావు , రైలు ఏ పదింటికో అయితే అక్కడే పడిపోతే ఎంత ముఖ్యమైన పనిమీద వెల్లాల్లండి , ఏమైపోవును నా జీవితం అన్నాడు . అది జరగనప్పుడు నీకు తెలియలేదు ,ఎందుకు జరగలేదో కానీ ఆ జరగకుండా ఉన్నది ,ఎందుకు జరగలేదో తెలిసినప్పుడు మాత్రం నమస్కారము చేస్తావు . అన్ని వేళలా తెలియాలని ఏమి నియమము లేదు . అన్ని వేళలా తెలియక్కరలేదు . ఈశ్వరుడు వైద్యుడు లాంటి వాడు మనము జబ్బు ఒకటే చెప్తాం . డాక్టర్ గారు ఇంత మందిస్తాడు ,మూడు పూటలా వేసుకోండి అంటాడు . నా లోపల ఏ సూక్ష్మజీవులు ఉన్నవి ,ఏవి చేయుచున్నవి ,ఎందువలన జబ్బు వచ్చినది ,ఇందులో ఏమున్నది ,అవి లోపలికి వెళ్లి ఎట్లు పోరాడును ,ఎట్లు చంపును ,చెప్తే వేసుకుంటాను అంటే ఛి అవతలపో అంటాడు . ఆయన చెప్పాడు నువ్వు వేసుకో ,ఎందుకంటే ఈశ్వరుడు .
వైద్యో నారాయణో హరిహి !!
భగవంతుడు కూడా అంతే ఆయనని నమ్ము ,నువ్వు ఉపద్రవాలలో పడిపోకుండా ఆయన చూసుకుంటాడు . ఒక వేల నీకేదో కష్టం వచ్చింది వెనక ఏదో ఉంది ,ఈశ్వరుడి యొక్క ఆలోచన ,ఏదో కారణం లేకుండా ఆయన ఏది చెయ్యడు . కాబట్టి అందులో కూడా నీపట్ల ఏదో అనుగ్రహం ఉందని ఎప్పుడో చూపిస్తాడు ,అప్పుడు నువ్వు సంతోషిస్తావ్ ,తొందరపడి ఈశ్వరుని నింద చేయకూడదు . నివేదన ,పట్టికెళ్ళి అరటిపండి ,ఆపిల్ పండు పెట్టడముతో సరిపోదు ,ఎప్పుడు వాడు నా ప్రక్కన ఉన్నాడు అనుకుని ,వాడితో చెప్తుండడం అందుకే ,సఖ్య భక్తి అని నవవిధ భక్త్తుల్లో ఒకటి ఉంది ,సఖ్య భక్తి అంటే ఏమ్చేస్తం పక్కనే నాతో ఉంటాడు ఎప్పుడు ఒక ఆయన ,గోపాలకృష్ణ గారు ఉన్నారు ఎప్పుడు గురువు గారితో ఉంటారు . గురువు గారు విమానం ఎక్కుతున్నారు ,ఆయన ఎక్కుతారు ,రండి గోపాలకృష్ణ ,స్నేహితుడు పట్ల ప్రవర్తించినట్టు ప్రవర్తించడం , ఇరువరి అనుభందం వేరు కానీ ,స్నేహితుడికి ఉదాహరణగా చెప్తున్నారు ,అలా భగవంతుడితో స్వామి ఆఫీసు కి వెళ్దాం బయలుదేల్తారా ,ఆయన వస్తాడు ,కూర్చోండి ,ఆయన కూర్చుంటాడు ,అయ్యా మీ అనుగ్రహం పని మొదలు పెడుతున్నాను ,భోజనానికి వెళ్దాం బయలుదేల్తారా ,మహా నైవేద్యం స్వామి మీ అనుగ్రహం లేకపోతె ఇది ఎక్కడ నుంచి వస్తుంది నాకు తినడానికి , ఆయనికి ఏదైనా ఆయనికి చెప్తున్నావు ,మనసులో అది ,పైకి అంటే కానీ ఏదో అస్తమాను పైకి మాట్లాడుకుంటే బాగుండదు . లోపల ప్రతిదానికి ఈశ్వరుడు తో సమన్వయము అవుతావు ,ఆకరున ఊపిరి అందదు ,అయిపొయింది ఎనబై యెల్లో ,తొంబై ఎల్లో అయిపోయాయి ,ఊపిరి అందట్లే ఎవరికీ చెప్పుకోవాలి ,అలవాటు అయిపోయింది ,స్వామి ఏమిటో చాల బాధగా ఉంది ఊపిరి అందడం లేదు ,చమటలు పట్టేస్తున్నాయి ,బెంగ పెట్టుకోకురా నేనున్నానురా అని కనపడుతాడు ఆయన ,అనుగ్రహిస్తాడు ,తేలికగా వదిలేస్తాడు . అస్తమానం ఆయన్నే పట్టుకోవడం అలవాటు అయిన వాడికి చిట్ట చివర ఎవరిని పట్టుకుంటాడు ఆయన్నే పట్టుకుంటాడు . పట్టుకుంటే ఏమవుతుంది ఆయనలోనే కలిసిపోతాడు . కాబట్టి నివేదన కేవలం ఒక పదార్దం పెట్టడం కాదు ,నివేదన జీవితములో అన్ని విషయములందు విస్తరించాలి . చిట్టచివరికి జీవితమే నివేదన ,వాడి జీవితం అంతా ఈశ్వరుని తో సమన్వయము ,ఇది ఎందుకు చేయవయ ,ఆయన ఉన్నాడండి ,ఆయన చూస్తాడు ,ఎందుకండి నాకా తప్పు నేను చేయను ,ఇది ఎందుకు చేస్తావయ అలాగా ,చేదస్తం కాదండి ఆయన చేయమన్నాడు ,ఆయన చేయమన్నది నేను చేస్తా ,ఇప్పుడు నీకు ఈశ్వర ప్రోక్తము ,విహితం ఈశ్వరుడు చెప్పనిది నిషిద్దము ,ఇదే ధర్మము . కాబట్టి ఇప్పుడు నివేదన కేవలము ఒక పదార్ధము పెట్టడము కాదు . నివేదన జీవితము నందు విస్తరించవలసినటువంటి విషయము.

No comments:

Post a Comment