చిత్+ముద్ర. పరలోకాన్నిసూచించే చిహ్నము. చూపుడువ్రేలును బొటనవ్రేలు క్రింద భాగానికి చేర్చి మిగిలిన మూడు వ్రేళ్ళను విడిగా ఒక ప్రక్కకి పెట్టి చూపించే ముద్ర. బొటన వ్రేలు దైవాన్ని, చూపుడు వ్రేలు ఆత్మను, మిగిలిన మూడు వ్రేళ్ళలో మధ్య వ్రేలు అహంకారమును, ఉంగరపు వ్రేలు కర్మను, చిటికిన వ్రేలు మాయను సూచిస్తాయి. మూడింతలుగా పెరిగి నిలిచిన ఆత్మకృంగి దైవాన్ని చేరి సచ్చిదానంద సాగరంలో ఓలలాడడమే ఈ ముద్రలోని అంతరార్థం.
No comments:
Post a Comment