కన్యాకుమారి... మూడు సముద్రాల కలయికను, ఒకేప్రదేశంలో సూర్యోదయ సూర్యాస్థమయాలను వీక్షించగలిగిన ఏకైక అద్భుత ప్రదేశం...
కన్యాకుమారి భారతదేశపు ఒక చివరి సరిహద్దు గ్రామం...... ఇక్కడ విశేషమేమంటే ఈ ప్రదేశం లో మూడు సముద్రాలు ఏకమవుతాయి.. అంటే భారతదేశానికి తూర్పు హద్దుగా ఉన్న బంగాళాఖాతం, దక్షిణ సరిహద్దుగా ఉన్న హిందూ మహా సముద్రం, పశ్చిమ సరిహద్దుగా ఉన్న అరేబియా సముద్రం ఇక్కడే కలుస్తాయి... విచిత్రమేమంటే ఆయా సముద్రాలలోని నీరు(మట్టి) వేరేవేరే రంగులలో ఉండడం... ఆ మూడు సముద్రాల అలలు ఒక దానితో నొకటి ఢీకొనటం చూడడానికి చాలా చాలా బావుంటుంది..... ఆ అనుభూతులు జీవితాంతం మనకు ఖచ్చితంగా తోడుంటాయి... తూర్పు పశ్చిమాలు ఒకే దగ్గర ఉండడం వలన ఈ ప్రదేశంలో మనం సూర్యోదయ, సూర్యాస్తమయాలను ప్రత్యక్షంగా అంటే సముద్రంలోంచి సూర్యుడు వస్తున్నాడా అనేట్లు మనకు కనపడే విధంగా ఉంటాయి... సాధారణంగా ఏ సముద్రంలో నైనా సూర్యోదయం కానీ సూర్యాస్తమయం కానీ ఏదో ఒకటే చూడొచ్చు.. కానీ ఇక్కడ మాత్రమే మనం ఒకే ప్రదేశం నుండి సూర్యోదయ సూర్యాస్తమయాలను చూసే అవకాశం వీలవుతుంది... అందుకే ఈ ప్రదేశం సందర్శకులకు ప్రత్యేకమైనది... ఇక్కడినుండి కొంచెం దూరంలో వివేకానందుడు ధ్యానంచేసిన ప్రదేశం ఉంది... అదే ఒక విధంగా భారతదేశపు చివరి హద్దుగా భావించవచ్చు.. అక్కడ ధ్యానం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది.. తమిళ కవి తిరువళ్ళువార్ , మరియు వివేకానందా రాక్ అనే ప్రదేశాలు చాలా సుప్రసిద్ధమైనవి... ఇవి రెండూ కొంచెం ప్రమాదకర సముద్రం మధ్య లో ఉంటాయి.... కానీ ఆ ప్రదేశాలకు వేళ్ళేందుకు చేసే పడవ ప్రయాణం చాలా థ్రిల్లింగ్ గా .. చాలా బావుంటుంది...

No comments:
Post a Comment