చాలా కాలం క్రితం భరతఖండములో పుణ్యాత్ముడైన చిత్రవర్మ అనే రాజుండెను. ఆయనకు పుత్రులు అనేకులు ఉండిరి. పుత్రిక కొరకు పార్వతిని ప్రార్ధించగా ఆడపిల్ల జన్మించెను. సర్వగుణ సంపన్నురాలైన ఆ శిశువునకు పదునాల్గవ సంవత్సరమున వైధవ్యము ఖచ్చితముగా ప్రాప్తించును. అని జ్యోతిష్కులు తెలిపిరి. అంతట రాజు దుఃఖితుడయ్యెను. శోకంతో పీడింపబడుతున్న రాజునకు జ్యోతిష్కులు దీనికి పరిహారం తెలిపిరి.
రాజకుమార్తె అయిన సీమంతిని పూర్ణచంద్రుని వలె పెరుగుచుండును. యుక్త వయస్సు వచ్చిన తరువాత ఆమెను రాజకుమారుడైన చంద్రాంగదున కిచ్చి చిత్రవర్మ వివాహం చేసెను. ఇల్లరికము వచ్చిన అల్లునితో రాజుకు కాలము సంతోషముగా గడుచుచుండెను. ఇట్లుండగా ఒక రోజున చంద్రాంగదుడు జలక్రీడ కోరి యమునానది కేగెను. దురదృష్ట వశమున నది యందలి సుడి గుండంలో చిక్కుకుపోయెను. రాజు పరివారమునకు ఎనలేని దుఃఖము కలిగెను. సీమంతిని కూడా సహగమనమునకు సిద్ధపడెను. అంతట యాజ్ఞవల్క్య మహాముని భార్యయైన మైత్రేయి అచటకు వచ్చి, " పుత్రీ ! చింతించవలదు. నేను నీకొక వ్రతమును ఉపదేశించెదను. దానివలన వైధవ్యము నుండి నీకు నివృత్తి కలుగగలదు". అని చెప్పి పదహారు సోమవారాల వ్రతము ఉపదేశించెను.
మైత్రేయి ఉపదేశించిన ప్రకారము చెప్పినది చెప్పినట్లుగా సీమంతిని కూడా భక్తితో వ్రతమును ఆచరించెను. నాగలోకమునకు చేరిన చంద్రాంగదుడు నాగరాజుచే సన్మానింపబడి సురక్షితంగా రాజధానికి మరలివచ్చెను. అందరూ సంతోషించి ఈ విధంగా ఎడబాసిన పతీ పత్నులు వ్రత మహిమచే మరలా ఒకటయ్యారు.

No comments:
Post a Comment