త్రయంబకుడు అంటే త్రయాణాం, లోకానాం, అంబకపితాః అని అమరకోశం చెబుతుంది. మూడు కన్నులున్న వాడు త్రయంబకుడు. ఈ జగత్తుకంతటికీ తల్లీ, తండ్రీ అయినటువంటి వాడు త్రయంబకుడు. నారాయణుడు, త్రయంబకుడు ఒకరే. పరమేశ్వరుడే నీల మేఘశ్యాముడై శంఖ చక్ర గదా పదమాలను పట్టుకుంటే స్థితికారుడైన దామోదరుడు. ఆ పరమేశ్వరుడే తెల్లగా మెరిసిపోతూ 'స్ఫటిక మణినిభం పార్వతీశం నమామి' అన్నట్లు కూర్చుంటే శంకరుడు. "శాకంబరీతి శశిశేఖర వల్లభేతి గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి" అంటారు శంకరాచార్యుల వారు. ఎవరికీ ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఆ వేషం పరమేశ్వరుడు కడుతూ ఉంటాడు. అమ్మవారి రూపం దాలుస్తాడు. చదువు కావాలని అడిగితే ఆమె వీణ పట్టుకు కూర్చుంటుంది. భక్తి భావం పడుతుంటే పద్మంలో కూర్చుని అభయ హస్తాన్ని చూపిస్తుంది. శరీర పటుత్వం కావాలి అని అడిగితే ఆమె రుద్రాణి స్వరూపిణియై మన ముందు కూర్చుంటుంది. ఏది కావాలని కోరుకుంటే దానికి అనువైన రూపాన్ని దాలుస్తుంది.
ఇప్పుడు ఒక లౌకికమైన ఉదాహరణ చెబుతాను. ప్రభుత్వం అంటే ఏమిటి? దానికి ఒక రూపం ఉండదు.
రేషన్ కార్డు ఇవ్వాలంటే ఎం.ఆర్.ఒ గా కూర్చుంటుంది. ఇంట్లో దొంగలు పడితే పోలీస్ ఆఫీసర్ అవుతుంది. పుస్తకాలు కొనుక్కోలేక పోతే లైబ్రరీ రూపంలో కూర్చుంటుంది. బతకటానికి ఆధారం లేకపోతే రెండెకరాలు భూమి ఇచ్చే కలెక్టర్ అవతారమెత్తుతుంది. కానీ ప్రభుత్వం ఏదీ, ఎక్కడుంది అని అడిగితే కనపడదు. అయితే ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. అన్ని శాఖలు ప్రభుత్వమే కదా...అని ఇంట్లో దొంగలు పడితే ఎం.ఆర్.ఒ. ఆఫీస్ కు వెళ్ళకూడదు. పోలీస్ స్టేషన్ కు వెళ్ళాలి. ఇదే విధంగా ఏ కాలంలో ఏ రూపాన్ని ఆరాధిస్తే భగవంతుడు అనుగ్రహిస్తాడో దానిని గ్రహించాలి. ఇది తెలుసుకున్న రోజు త్రయంబక స్వరూపం, దామోదర రూపం ఒకటేనని తెలుస్తుంది. దానిని ఆరాధిస్తే చాలు. అందుకే శివానందలహరిలో శంకరాచార్యుల వారు -
పటుర్వా గేహీ వా యతిరపి జటీ వా తదితరో
నరో వా యః కశ్చిద్ భవతు భావ! కిం తేన భవతి
యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే
తదీయస్త్వం శంభో! భవసి భవ భారం చ వహసి!!
అంటారు. నువ్వు గృహస్థువా, బ్రహ్మచారివా, యతివా, సంయాసివా, అనేది ఎవడిక్కావాలి? ఈ ఆశ్రమాల గురించి నాకు చెప్పకు. నీ మనసన్న పద్మాన్ని ఇక్కడ పెట్టావా చెప్పు. చెప్తే ఆయన వెంట పడతాడు.

No comments:
Post a Comment