కార్తిక మాసంలో నదీ స్నానం చేసి తీరాలి. నదీ స్నానం అన్నప్పుడు ఒకమాట గుర్తు పెట్టుకోవాలి. కార్తీకమాసంలో నదీస్నానం చేయడమంటే పక్కన ఉన్న నదిని వదిలిపెట్టి ఎక్కడో ఉన్న మరో నదిలో స్నానానికి వెళ్ళకూడదు. ఉదాహరణకు, కార్తిక మాసంలో గంగా స్నానం చేయాలనుకుంటే ముందు దగ్గరగా ఉన్న నదీ స్నానం చేయాలి. ఆ తర్వాతే గంగా స్నానం చేయాలి. ఎందుకంటే మనకు అన్నం పెట్టేది పక్కర ఉండే నదే! ఎప్పుడైనా ప్రవహించే నదిని గమనిస్తే అది రకరకాల శబ్దాలు చేస్తూ సూక్ష్మంగా తిరుగుతూ రాళ్ళకి గుద్దుకుంటూ, పైనుంచి పడుతూ, పైకి ఎక్కుతూ వెళుతుంది. ఆ సమయంలో అది చేసే ధ్వనులు చిత్రవిచిత్రంగా ఉంటాయి. అలా వెళ్ళిపోయే నది నీరు చంద్రుడి శక్తిని పుచ్చుకుంటుంది.
శాస్త్రాల ప్రకారం ఈ లోకాన్ని అమ్మవారే ఉద్ధరిస్తూ ఉంటుంది. ప్రమాదాలు ఎక్కడున్నాయో ముందే హెచ్చరిస్తుంది. ఆవిడ కార్తీక మాసంలో చంద్రకిరణ రూపంలోనూ, ఉసిరిచెట్టు రూపంలోనూ ఈ ప్రపంచాన్ని ఆడుకుంటూ ఉంటుంది. అందుకే కార్తిక మాసంలో ఉసిరికాయ పచ్చడి తినడం, వనభోజనానికి వెళ్లి ఉసిరిచెట్టు కింద కూర్చోవటం మంచిదంటారు. కార్తీకమాసంలో చంద్ర కిరణాల రూపంలో ఉన్న అమ్మవారు నీటిని అమృత ధారగా మారుస్తుంది. అందువల్ల అభిముఖంగా నదిలో నిలబడి పరమేశ్వరుని నమస్కారం చేసి మజ్జనం చేయాలి. మజ్జనం అంటే మూడుమార్లు తల ముంచి పైకి లేవాలి. అలా స్నానం చేస్తే శరీరానికంతా చంద్రకిరణాల వల్ల అమృత స్పర్శ కలుగుతుంది. చంద్ర కిరణాల వల్ల ఓషధీశక్తి శరీరంలో ప్రవేశిస్తుంది. అంటే శరీరానికి అనారోగ్యాలు కలుగకుండా కాపాడుతుందన్న మాట.
అంతేకాక, చంద్రస్పర్శ కలిగిన తరువాత మనసు సాత్వికమై, పరమేశ్వరారాధనలో సాత్వికమైన బుద్ధితో తేజోవంతమై నిలబడుతుంది. మనసంటే చంద్రుడే. మనసు మీద చంద్ర ప్రభావమే ఉంటుంది. ఈ రెండు సాధనాలను ఏకకాలంలో పొందడానికి కార్తీకమాసంలో నదీస్నానం ఉపయోగపడుతుంది. ఈ నదీ స్నానం చేయడానికి కూడా కొన్ని నిబంధనలున్నాయి. నదీ స్నానం చేసేటప్పుడు సంకల్పం లేని స్నానం చేయకూడదు. "నేను ఫలానా చోట ఉండి పూజ చేస్తున్నాను. ఆ విషయం ఈశ్వరుడికి తెలియదా? నేను ఎక్కడ ఉండి స్నానం చేస్తున్నానో తెలుసుకోలేని వాడికి నేను పూజ చేయడమేంటి? వాడు సర్వజ్ఞుడేంటి?" అని కొందరు అనుకోవచ్చు. అందుకే సంకల్పం చెప్పేటప్పుడు ఏ పేరెత్తితే పాపనాశనం అవుతుందో పరమేశ్వరుడు దానినే పలికిస్తాడు. అందుకే - "గంగా కావేరీయోః మధ్య దేశస్థే, గంగా గోదావరీయోః మధ్య దేశస్థే" అని సంకల్పం చెప్పిస్తారు. ఎందుకంటే ఆ నదుల పేరెత్తితే చాలు పాపలు నశిస్తాయి. అంత గొప్పదైన నదికి అభిముఖంగా నిలబడి సంకల్పంతో నదీ స్నానం చేస్తే, అది తప్పకుండా రక్షిస్తుంది. అయితే స్నానం చేసి వెళ్ళిపోతే సరిపోదు. బయటకు వచ్చిన తర్వాత పుణ్య కర్మాచరణ చేయాలి. అంటే దానమో, ధర్మమో ఏదో ఒకటి తప్పనిసరిగా చేయాలి.

No comments:
Post a Comment