1.భూమి , 2.ఆకాశము , 3.గాలి , 4.నీరు , 5.అగ్ని . అనేవి పంచభూతాలు . ఇక్కడ భూమి అంటే మట్టి - జీవి జన్మకు వేదిక . . . భూమి చుట్టూ ఉన్న శూన్యప్రదేశమే - ఆకాశము ... ఇక భూమి పైన ఉన్న ప్రకృతివాతావరణము లో ప్రతి జీవికి కావలసిన గాలి , నీరు , అగ్ని/శక్తి (ఆహారము) జీవపరిణామ క్రమములో వాటంతటవియే సమకూర్చబడ్డాయి . జీవి + పంచభూతాలు కలిస్తేనే ప్రకృతి . ఒకదానినుండి ఒకటి ఉద్భవించాయి . అలా ఉద్భవిస్తూనే ఉంటాయి . వీటికి అంతము లేదు ... అంతరాయమూ ఉండదు . భూగోళము ఉన్నంతవరకూ ఇలా జరగవలసినదే . వీటిలో ఏ ఒక్కదానికి అంతరాయము కలిగినా ప్రకృతిలో జీవి (ప్రాణి) నశించి భూమి ఉనికే ప్రశ్నార్దకము ?. పంచభూతాలలో ఎవరికి వారే గొప్ప . ఒకరు కంటే ఇంకొకరు గొప్ప , తక్కువ అని చెప్పడం అవివేకము . జీవపరిణామ క్రమములో జీవి అవసరార్దము వాటికవే జనించాయి . అందుకే వాటిని స్వయంభువులు అని అంటారు . ఒక భూతము పై ఆదారపడి ఇంకొక భూతము జనించి ఒకదాని గమనము పై ఇంకొకటి అదారపడుతూ ప్రతి జీవిలోనూ ఈ పంచభూతాలు నిలయమై ఉంటూ్ ప్రకృతి సజావుగా నడుస్తూ ఉన్నది . పంచభూతాలను దేవుడనుకోండి , దెయ్యమనుకోండి , మనిషనుకోండి , మాననుకోండి ... అంతటా , అన్నిటా ఉండేవి .. ప్రకృతికి కారకాలు ... మట్టి , గాలి ,నీరు , అగ్ని , ఆకాశము .
తొలి రోజుల్లో మానవుని విజ్ఞాన శాస్త్రము అంతగా అభివృద్ధి చెందని కాలములో అన్నింటిని అతీత శక్తులు గాను , దైవాలుగాను భావించి పంచభూతాలను లింగాలుగాను , అంగాలుగాను ఊహించి పూజించి మనోశక్తిని , మానసిక ఉల్లాసాన్ని పొందేవాడు . ఆ కోవలోనివే ఈ పంచభూత లింగాలు .
పంచభూత లింగములు : పృధ్వీ లింగము, జల లింగము, తేజొ లింగము , ఆకాశ లింగము, వాయు లింగము వీటిని పంచభూత లింగములు అంటారు .
1. పృధ్వీ లింగము :
తమిళనాడులో (కంచి) లో ఏకాంబరనాధ లింగము (పృధ్వీ లింగము) పంచ లింగాలలో ఒకటి. ఈ కాంచీపురంను కంజీవరం అని కూడా అంటారు . కాంచీపురంలో విష్ణు కంచి , శివ కంచి అని రెండు భాగాలుగా ఉంది . అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి అయిన కంచి కామాక్షి అమ్మవారు ఉన్నారు .
2. జల లింగము :
తమిళనాడులోని జంబుకేశ్వరమున జలలింగము ఉంది. ఈ జలలింగము జంబుకేశ్వరస్వామిగా పిలవబడును. జంబుకేశ్వరం తిరుచునాపల్లికి చాలా దగ్గరలో ఉంది. జంబుకేశ్వరము పురాతన కాలము నాటి శివ క్షేత్రము. ఈ గుడిలో నిరంతరం ఊరే నీటి వూట ఉంది . ఇక్కడున్న నేరేడు చెట్టుని జంబువృక్షమని అంటారు. జంబుకేశ్వరంనుండి శ్రీరంగం సుమారు 01కి. మీ దూరం . కావేరి నది శ్రీరంగం , తిరుచునాపల్లి నగరం చుట్టూ ప్రవహిస్తుంది .
3. తేజో లింగము :
తమిళనాడులో (అరుణాచలం) తేజోలింగము ఉంది . ఈ స్వామి "అరుణాచలే్శ్వర స్వామి"అని పిలుస్తారు. పార్వతీ దేవి ఇక్కడేతపస్సు చేసి, శివునికి అర్థ భాగమైనదని ప్రతీతి. ఈ తిరువణ్ణామలై మద్రాసుకు 165కి. మీదూరంలో ఉంది. విల్లు పురం నుంచి కాట్పాడికివెళ్లే మార్గంలో ఉంది . విల్లు పురం నుంచి 68కి. మీ .
4. ఆకాశ లింగము :
తమిళనాడులో మద్రాసుకు సుమారు 240కి. మీ దూరంలో ఆకాశలింగము ఉంది. శివుడు ప్రళయ రుద్రతాండవం చేస్తున్న విగ్రహం అతి పెద్దది (నటరాజ స్వామి). ఈ చిదంబర క్షేత్రంలో మహావిష్ణువుఆలయం మరియు శివాలయం (నటరాజ స్వామి) ఒకే చోట కనపడతారు . విల్లుపురం నుంచి తంజావూరు వెళ్లే మార్గంలో ఉంది .విల్లుపురం నుంచి చిదంబరం దూరం 83కి. మీ మాత్రమే.
5. వాయు లింగము :
ఆంధ్రప్రదేశ్ లో తిరుపతికి సుమారు 37కి.మీ దూరంలో శ్రీ కాళహస్తి యందు వాయులింగము ఉంది. ఈ స్వామిని సాలెపురుగు, కాళము, హస్తిలు అకుంఠిత భక్తితో పోటాపోటీగా ఆర్చించి చివరకి మోక్షము పొందాయి .

No comments:
Post a Comment