నాగపంచమి(అక్టోబర్ 28, 2014, మంగళవారం)

నాగ జాతి జనము :
కశ్యప ప్రజాపతికి , కద్రువ దంపతులకు .. అనంతుడు ,తక్షకుడు , వాసుకి , ననినాగుడు , శంఖుడు , కర్కోటకుడు , ఉగ్రకుడు పిందారకుడు , హహుషుడు , ఐరావతుడు మొదలగు వారు జన్మించి కనబడిన వారినల్లా కాతువేస్తూ భయభ్రాంతులను చేయసాగారు .

దాంతో సకల దేవతలు అంటా బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి గురై వారంతా నశిస్తారని శపించాడు . అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాత ముందు వినమ్రులై " మమ్మల్ని మీరే సృస్తించి మాకీ విధంగా శాపమివ్వడం న్యాయమా " అని వేడుకున్నారు .

"విషయుక్తం గా పుట్టినంత మాత్రాన అందర్నీ కాటువేసి ప్రాణికోటిని నశింప జేయడం తప్పు కదా ' నిష్కారణం గా ఏ ప్రాణినీ హిమ్సించరాడు . గరుడ మంత్రం చదివే వారిని , ఔషధ మని సమేతులను తప్పించుకు తిరగండి .దేవతా విహంగ గణాలకు , జ్ఞాతులైన మీరు మీమీ స్థాన గౌరవాలను నిలిపుకోండి . వాయుభాక్షకులై సాదుజీవులు గా మారండి . మీ నాగులంతా ఆటలా వితల పాతాళ లలో నివాసం చేయండి" అని బ్రహ్మ శాసించగా వారంతా ఆయన ఆజ్ఞను శిరసావహించారు .

దాంతో డేవాగానామంతా నాగులను ప్రశంసించారు . భూలోక వాసులంతా ప్రార్ధనలు చేశారు నాగులకు . దివ్య ప్రభావ సంపన్నమయిన నాగజాతికి కృతజ్ఞతాపూర్వకం గా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున వారిని పూజచేయడం మొదలు పెట్టారు .

వైదిక కాలం నుండి కార్తీక మాసం ఐదవ రోజు పంచమి ఉత్సవాలు జరుపుకునే సంప్రదాయం దేశమంతా ఉంది . పుట్టలో ఆవుపాలు , వడపప్పు , చలిమిడి , అరటిపండ్లు , కోడి గ్రుడ్లు జారవిడిచి నైవేద్యం గా సమర్పిస్తారు .

పార్వతీ దేవికి పరమేశ్వరుడు చెప్పినట్లు గా పురాణాలులో చెప్పడం జరిగినది .
ఓ పార్వతీ దేవి... శ్రావణ మాస శుక్ల పంచమినాడు నాగారాధన చేయడం అత్యంత శ్రేష్టమైనది. ఈ నాగపంచమినాడు ద్వారానికి ఇరువైపులా సర్వ చిత్రాలను గోమయంతో రాసి పూజ చేయడం ఎంతో శుభప్రదం. చతుర్థి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి పంచమి రోజున బంగారం వెండి, కర్రతోగానీ, లేదా మట్టితోగానీ వారి వారి తాహతుని అనుసరించి ఐదు పడగల పామును చేయించాలి. లేదంటే పసుపు, చందనంతోగానీ ఏడు తలల పాము చిత్ర పటములు గీచి ఆ రూపాలకు జాజి, సంపెంగ, గన్నేరు ఇత్యాది పుష్పాలతో పూజించాలి. పాయసము, పాలు నివేదన చేయాలని పరమేశ్వరుడు వివరించాడని పురాణాలు చెబుతున్నాయి.

శ్రావణమాసం, శుక్లపక్షంలోని పంచమి తిథి నాడు నాగపంచమి పండుగ వస్తుందని శాస్త్ర వచనం. ఇదేవిధంగా కార్తీక మాసంలో వచ్చే శుక్లపంచమినాడు జరుపుకునే నాగ పంచమి కూడా ఈ సంప్రదాయానికి చెందినదేనని పండితులు అంటున్నారు.

వేయి పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తి కి పానువు . వాసుకి పరమేస్వరుడి కన్టాభరణమ్ . వినాయకుడు నాగ యజ్ఞోప వీతుడు .

నాగ పంచమి వ్రత కద :
పూర్వము ధనవంతురాలైన ఒక గృహిణి వుడేది ... ప్రతిరోజూ సర్పాలు అనేకం వచ్చి తనను కాటు వేస్తున్నట్లు గా ఆమెకు కలలు వస్తుదేవి , దానితో ఆమె భయకంపితురాలైంది . ఒక రోజున వారి కులగురువు వారి ఇంటికి వచ్చి ఆమె దీన గాధను విన్నారు . విని "అమ్మా " నువ్వు గతజన్మలో పుట్టలో పాలు పోసేవారిని చూసి ఎగతాళి చేశావు , అందువలన నీకు ఈ జన్మలో ఈ జాడ్యము సంక్రమించినది అని చెప్పి నివారణకోసం నాగపంచమి నోము నోయమని , పాముల భయం తొలగి పోతుందని చెప్పెను . ఆమె అట్లాగే నోచి ఆ స్వప్నాల భయం నుండి విముక్తురాలైనది . నాగపంచమి వ్రత కధల్లో ఇది ఒకటి .
 — with Anitha Mallela and 2 others.
Photo: నాగపంచమి(అక్టోబర్ 28, 2014, మంగళవారం)

సక్కియ నాయనారు-నాయనార్ల (శివభక్తులు) చరిత్రలు

సక్కియనాయనారు తిరుచంగమంగయిలోని వెల్లాల కులజుడూ. ఆయనకు ఇహలోక వ్యాపకాలన్న అయిష్టత ఏర్పడింది. మోక్షమును పొందదలచాడు. మోక్షమునకు ఉత్తమమైన మంచి మార్గ మభిలషించాడు. బౌద్ధుల ప్రచారము వలలోపడి బౌద్ధ మతావలంబి అయ్యాడు. బౌద్ధమును స్వీకరించినా అది ఈయనకు ఎక్కువ కాలము సంతృప్తి నీయలేదు.

శైవమతమునకు ఆకర్షితుడయ్యాడు. బాహ్య చిహ్నములేవైనా, బాహ్య ప్రవర్తనమేదైనా దేవునియందు అచంచల భక్తి ప్రపత్తులున్నచో మోక్షమునందగలడు అని నాయనారు మనస్సుకు గాఢంగా తట్టింది. బాహ్యంగా బౌద్ధమత చిహ్నాలు వీడకపోయినా ఆయన మనస్సులో శివునియందు అచంచలమైన భక్తి ప్రపత్తులు నెలకొన్నవి. శివుని గాఢంగా ప్రేమించాడు.

ఒకరోజున శివాలయములో బయట కూర్చుని శివలింగము గూర్చిన తలంపుతో మైమరిచిపోయాడు. ఆ స్థితిలో శివలింగముపై తాను రాయిని వుంచుట తటస్థించింది. మరునాడు దేవాలయమునకు వెళ్ళి వెనుకటి దినమున తానేమి చేసాడో ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. భక్తుడు భక్తితో ఏమి సమర్పించినా దేవుడు స్వీకరిస్తాడు. ఈ రోజు కూడా శివునిపై రాయిని వేశాడు. రోజూ ఈ విధమైన పూజ జరిగింది. ఈ పని చేయనిదే ఆహారము గూడ తీసుకునే బుద్ధయ్యేదికాదు. ఒకరోజున భోజనానికి కూర్చోగానే తాను రోజూ చేసే పూజ చేయలేదని జ్ఞాపకానికి వచ్చింది. ఆకలిని గూడ మరచి దేవాలయమును దర్శించి భక్తితో శివునిపై రాయి నుంచాడు. తక్షణమే పరమశివుడు ప్రత్యక్షమై ఆసీర్వదించి కైలాసానికి తీసుకుని వెళ్ళాడు.
Photo: సక్కియ నాయనారు-నాయనార్ల (శివభక్తులు) చరిత్రలు

శిరప్పులి నాయనారు-నాయనార్ల (శివభక్తులు) చరిత్రలు

చోళదేశంలో తిరువాకూరులో నివసించే బ్రాహ్మణ కులజుడు శిరప్పులి నాయనారు. శివునియందు శివభక్తులయందు గాఢమైన భక్తి ప్రపత్తులు కలవాడు. వారిని పూజించి, చిత్తశుద్ధితో వారల సేవలు చేసేవాడు. పంచాక్షరీమంత్రముతో భావయుక్తంగా పగలు రాత్రి నిరంతరము జపించేవాడు. పరమశివునకు యజ్ఞయాగాదులు గూడా చేశాడు. ఈ పనులు శివుని మురిపించినవి. శిరప్పులినాయనారుకు శివానుగ్రహము పూర్తిగా లభించింది.

ఈ నాయనారు భక్తి నిరంతర ఓం నమఃశివాయ పంచాక్షరి జపంలో కనిపిస్తుంది. అత్యంత సులభమైన ఈ నిత్యపంచాక్షరీ జపము అనంతమైన ఫలితానిస్తుంది. అయినా అజ్ఞానంతో, మాయలో కప్పబడి మానవులు ఈ ప్రక్రియనవలంభించరు. మనసు అలా చేయనీయదు.

ఈ మంత్రానుష్టానము నిరంతర ప్రక్రియగా కొనసాగినచో అది మానసిక ప్రవృత్తనే తత్త్వాన్నే మార్చి వేయగలదు. ఆ జపము దివ్యచలన తరంగాలకు కారణమవుతాయి. ఆధునిక శాస్త్ర పరిజ్ఞానము సమూహానికి సంఖ్యామాణానికి విలువ నియటంలేదు. శాస్త్రజ్ఞాణము ఏమీలేని పామరుడు గూడా అణువులోని, కణములోని మహత్యము గుర్తెరుగుతున్నాడు. శబ్దతరంగాల విశిష్టత, మానసిక ఆలోచనా తరంగాలు తెలిసికొనలేకపోయినచో అది బుద్ధిహీనతే అవుతుంది. అవి మనుజులలో భౌతికంగా, మానసికంగా ఆధ్యాత్మికంగాను విశిష్టమైన మార్పులు తెస్తాయి.

ప్రతిక్షణము దేవుని జ్ఞాపకముంచుకొని - నిరంతరం ఆయన నామము జపించుట ఉత్తమమైన యోగ ప్రక్రియ.
Photo: శిరప్పులి నాయనారు-నాయనార్ల (శివభక్తులు) చరిత్రలు

కార్తీక పంచమి - జ్ఞాన పంచమి - లక్ష్మీ పంచమి

ఈ రోజు అలిమేలు మంగతాయారు పుట్టిన రోజు::
స్థల పురాణం ప్రకారం భృగు మహర్షి ఆగ్రహంతో విష్ణుభగవానుడి హృదయం మీద తంతాడు... తన నివాస స్థలమైన ప్రదేశంలో తన్ని తనను తన భర్తను అవమానించినా... శ్రీహరి భృగు మహర్షిని ఏమీ అనకుండా మిన్నకుండడం.. శ్రీలక్ష్మీదేవికి అవమానంగా అనిపిస్తుంది.. అందుకే
(పతికి/ గురువుకీ అవమానం జరిగిన చోట ఒక్క క్షణం ఉండరాదని ధర్మం) బాధపడి పాతాళానికెళ్ళిపోయిందనీ, శ్రీ లక్ష్మీదేవిని తిరిగి చేరడానికి శ్రీమహావిష్ణువు చేసిన తపస్సుకు ఫలితంగా సువర్ణముఖరీ నదీతీరంలో (ఇప్పటి తిరుచానూరు ) లో ఉన్న పద్మ సరస్సులో ఉన్న పద్మాల మధ్యలోంచి సువర్ణపద్మంలోంచి కార్తీక శుక్ల పంచమి ఉత్తరాషాడ నక్షత్రంలో అమ్మవారు తిరిగి ఆవిర్భవించి, కలువపూల దండలు స్వామికి సమర్పించి తిరిగి స్వామిని చేరిందని అలా ఒకరినొకరు అనుగ్రహించుకున్నారనీ స్థలపురాణంలో ప్రతీతి. పద్మ సరస్సు ఒడ్డున సూర్యభగవానుడు తపస్సు చేసిన స్థలం సూర్య ఆలయం ఇప్పటికీ మనం చూడవచ్చు.
పంచమీ తీర్థోత్సవం అని తిరుచానూరులో ఇప్పటికీ ప్రత్యేక వైభవోత్సవం చేస్తారు. అమ్మవారు అయ్యని తిరిగి చేరిన రోజు .. ఈరోజు అమ్మవారు, అయ్యవారలు పరమ కరుణాదృష్టితో ఉంటారు.. ఈ రోజు తిరుమల/తిరుచానూరు స్వామి వార్లను దర్శించడం చాలా ఉత్తమం....ఈరోజు తిరుమలనుంచి వచ్చే ప్రత్యేక సారెను ఏనుగులపై ఊరేగించి తీసుకొచ్చి అమ్మవారి(తిరుచానూరు)కి సమర్పిస్తారు .
ఈ కార్తీక శుక్ల పంచమి రోజున లక్ష్మీ ప్రీతిగా లక్ష్మీనారాయణులను ప్రత్యేకంగా అర్చించటం విశేష అభిషేక అర్చనాదులు నిర్వహించడం పరిపాటి. లక్ష్మీ మంత్ర దీక్ష ఉన్నవారు ప్రత్యేకంగా ఈ రోజు అనుష్ఠానాదులు పెంచుకుంటారు. గురువుల అనుగ్రహంతో కొత్తగా ఆదీక్ష తీసుకునేవారు కూడా ఈ నాడు తీసుకుంటూంటారు.
తన పతి ఏ చోట అవమానింపబడ్డాడో ఆ చోటు విడిచింది అమ్మవారు, అంటే ఆది లక్ష్మియైనా సరే పతినింద, గురునింద తట్టుకోలేదన్నమాట. విష్ణుమూర్తే భృగుమహర్షితో అనునయంగా మాట్లాడినా తన భర్తకు జరిగిన అవమానాన్ని తాను భరించలేకపోయింది (మనకీ గురునింద వినరాదు, గురునింద జరిగేచోటునుండి వెంటనే వెళ్ళిపోవాలి అని శాస్త్రాలు/పెద్దలు చెప్తారు)కాబట్టి అయ్యవారిని విడిచి కాకుండా అమ్మవార్ని సంతుష్టురాల్ని చేయటానికి ’అయ్యవార్ని అమ్మవార్ని’ కలిపి పూజించండి. వీలైతే విష్ణు సహస్రనామం/ గోవిందనామాలు పారాయణ చేసి అమ్మవారి అష్టోత్తరనామాలతో పూజించుకోవడం శ్రేష్ఠం. వేదాంతర్గత సూక్త పారాయణ చేయగలిగేవారు పురుష సూక్త, శ్రీ సూక్తపారాయణలు అర్చనలు చేసుకోవచ్చు. లేదా హయిగా దేవాలయంలో దర్శనం చేసుకొని అర్చనాదులు చేయించుకోవడం ఉత్తమం. , ఇతర లక్ష్మీ దేవి స్తోత్రాలూ పూజలో అనుసంధానం చేసుకోవచ్చు.
ఇక ఈ పంచమిని జ్ఞాన పంచమి అని కూడా పిలుస్తారు, ఈ రోజు సుబ్రహ్మణ్యారాధన వలన జన్మ్యాంతరంలో సుబ్రహ్మణ్యానుగ్రహం వలన శుద్ధజ్ఞానం కలుగుతుందని నమ్మకం.

పంచభూత లింగములు.

1.భూమి , 2.ఆకాశము , 3.గాలి , 4.నీరు , 5.అగ్ని . అనేవి పంచభూతాలు . ఇక్కడ భూమి అంటే మట్టి - జీవి జన్మకు వేదిక . . . భూమి చుట్టూ ఉన్న శూన్యప్రదేశమే - ఆకాశము ... ఇక భూమి పైన ఉన్న ప్రకృతివాతావరణము లో ప్రతి జీవికి కావలసిన గాలి , నీరు , అగ్ని/శక్తి (ఆహారము) జీవపరిణామ క్రమములో వాటంతటవియే సమకూర్చబడ్డాయి . జీవి + పంచభూతాలు కలిస్తేనే ప్రకృతి . ఒకదానినుండి ఒకటి ఉద్భవించాయి . అలా ఉద్భవిస్తూనే ఉంటాయి . వీటికి అంతము లేదు ... అంతరాయమూ ఉండదు . భూగోళము ఉన్నంతవరకూ ఇలా జరగవలసినదే . వీటిలో ఏ ఒక్కదానికి అంతరాయము కలిగినా ప్రకృతిలో జీవి (ప్రాణి) నశించి భూమి ఉనికే ప్రశ్నార్దకము ?. పంచభూతాలలో ఎవరికి వారే గొప్ప . ఒకరు కంటే ఇంకొకరు గొప్ప , తక్కువ అని చెప్పడం అవివేకము . జీవపరిణామ క్రమములో జీవి అవసరార్దము వాటికవే జనించాయి . అందుకే వాటిని స్వయంభువులు అని అంటారు . ఒక భూతము పై ఆదారపడి ఇంకొక భూతము జనించి ఒకదాని గమనము పై ఇంకొకటి అదారపడుతూ ప్రతి జీవిలోనూ ఈ పంచభూతాలు నిలయమై ఉంటూ్ ప్రకృతి సజావుగా నడుస్తూ ఉన్నది . పంచభూతాలను దేవుడనుకోండి , దెయ్యమనుకోండి , మనిషనుకోండి , మాననుకోండి ... అంతటా , అన్నిటా ఉండేవి .. ప్రకృతికి కారకాలు ... మట్టి , గాలి ,నీరు , అగ్ని , ఆకాశము .

తొలి రోజుల్లో మానవుని విజ్ఞాన శాస్త్రము అంతగా అభివృద్ధి చెందని కాలములో అన్నింటిని అతీత శక్తులు గాను , దైవాలుగాను భావించి పంచభూతాలను లింగాలుగాను , అంగాలుగాను ఊహించి పూజించి మనోశక్తిని , మానసిక ఉల్లాసాన్ని పొందేవాడు . ఆ కోవలోనివే ఈ పంచభూత లింగాలు .

పంచభూత లింగములు : పృధ్వీ లింగము, జల లింగము, తేజొ లింగము , ఆకాశ లింగము, వాయు లింగము వీటిని పంచభూత లింగములు అంటారు .

1. పృధ్వీ లింగము :
తమిళనాడులో (కంచి) లో ఏకాంబరనాధ లింగము (పృధ్వీ లింగము) పంచ లింగాలలో ఒకటి. ఈ కాంచీపురంను కంజీవరం అని కూడా అంటారు . కాంచీపురంలో విష్ణు కంచి , శివ కంచి అని రెండు భాగాలుగా ఉంది . అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి అయిన కంచి కామాక్షి అమ్మవారు ఉన్నారు .

2. జల లింగము :
తమిళనాడులోని జంబుకేశ్వరమున జలలింగము ఉంది. ఈ జలలింగము జంబుకేశ్వరస్వామిగా పిలవబడును. జంబుకేశ్వరం తిరుచునాపల్లికి చాలా దగ్గరలో ఉంది. జంబుకేశ్వరము పురాతన కాలము నాటి శివ క్షేత్రము. ఈ గుడిలో నిరంతరం ఊరే నీటి వూట ఉంది . ఇక్కడున్న నేరేడు చెట్టుని జంబువృక్షమని అంటారు. జంబుకేశ్వరంనుండి శ్రీరంగం సుమారు 01కి. మీ దూరం . కావేరి నది శ్రీరంగం , తిరుచునాపల్లి నగరం చుట్టూ ప్రవహిస్తుంది .

3. తేజో లింగము :
తమిళనాడులో (అరుణాచలం) తేజోలింగము ఉంది . ఈ స్వామి "అరుణాచలే్శ్వర స్వామి"అని పిలుస్తారు. పార్వతీ దేవి ఇక్కడేతపస్సు చేసి, శివునికి అర్థ భాగమైనదని ప్రతీతి. ఈ తిరువణ్ణామలై మద్రాసుకు 165కి. మీదూరంలో ఉంది. విల్లు పురం నుంచి కాట్పాడికివెళ్లే మార్గంలో ఉంది . విల్లు పురం నుంచి 68కి. మీ .

4. ఆకాశ లింగము :
తమిళనాడులో మద్రాసుకు సుమారు 240కి. మీ దూరంలో ఆకాశలింగము ఉంది. శివుడు ప్రళయ రుద్రతాండవం చేస్తున్న విగ్రహం అతి పెద్దది (నటరాజ స్వామి). ఈ చిదంబర క్షేత్రంలో మహావిష్ణువుఆలయం మరియు శివాలయం (నటరాజ స్వామి) ఒకే చోట కనపడతారు . విల్లుపురం నుంచి తంజావూరు వెళ్లే మార్గంలో ఉంది .విల్లుపురం నుంచి చిదంబరం దూరం 83కి. మీ మాత్రమే.

5. వాయు లింగము :
ఆంధ్రప్రదేశ్ లో తిరుపతికి సుమారు 37కి.మీ దూరంలో శ్రీ కాళహస్తి యందు వాయులింగము ఉంది. ఈ స్వామిని సాలెపురుగు, కాళము, హస్తిలు అకుంఠిత భక్తితో పోటాపోటీగా ఆర్చించి చివరకి మోక్షము పొందాయి .

శివాభిషేక ఫలములు

1 గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
2 నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
3 ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.
4 పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
5 ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును
6 చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
7 మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును.
8 మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
9 తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
10 పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
11 కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
12 రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
13 భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
14 గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
15 బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.
16 నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.
17 అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు - పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు - ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన).
18 ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.
19 ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.
20 నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
21 కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.
22 నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.
23 మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.
24 పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును - శుభ కార్యములు జరుగ గలవు

శివాభిషేకము

కార్తీక పురాణము 6వ అధ్యాయము (దీపదానవిధి - మాహాత్మ్యం)

ఓ రాజశ్రేష్ఠుడా! ఏ మానవుడు కార్తీకమాసము నెలరోజులూ పరమేశ్వరుని, శ్రీమహావిష్ణువును, పంచామృత స్నానంచేయించి కస్తూరి కలిపిన మంచిగంధపు నీటితో భక్తిగా పూజించునో, అట్టివానికి అశ్వమేథయాగము చేసినంతపుణ్యము దక్కును. అటులనే యే మానవుడు కార్తీకమాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును. దీపదానం చేయుట యెటులన పైడిప్రత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరచి, వత్తులు చేయవలెను. వరిపిండితోగాని, గోధుమపిండితోగాని ప్రమిదవలె చేసి వత్తులు వేసి, ఆవు నెయ్యి వేసి, దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యవలెను. శక్తికొలది దక్షిణకూడా యివ్వవలెను. ఈ ప్రకారముగా కార్తీకమాసమందు ప్రతిదినము చేసి ఆఖరిరోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవునెయ్యి నిండుగా పోసి వెనుకచేసిన ప్రకారముగా గోధుమపిండితో ప్రమిదను చేసి ఆవునెయ్యి పోసి దీపం వెలిగించి యీ నెలరోజులూ దానముచేసిన బ్రాహ్మణునకే యిదికూడా దానమిచ్చిన యెడల సకలైశ్వర్యములు కలుగుటయేగాక మోక్షప్రాప్తి కలుగును. దీపదానం చేయువారు యిట్లు వచింప వలెను.

శ్లో|| సర్వజ్ఞాన ప్రదం దివ్యం సర్వసంప త్సుఖావహం
దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ||

అని స్తోత్రంచేసి దీపదానం చేయవలెను. దీని అర్ధమేమనగా, "అన్నివిధముల జ్ఞానం కలుగచేయునదియు, సకల సంపదల నిచ్చునదియునగు యీ దీపదానము చేయుచున్నాను. నాకు శాంతి కలుగుగాక!" యని అర్థము. ఈ విధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధాన చేయవలెను. శక్తిలేని యెడల పదిమంది బ్రాహ్మణులకైననూ భోజనమిడి దక్షిణ తాంబూలముల నివ్వవలెను. ఈ విధంగా పురుషులు గాని, స్త్రీలుగాని యే ఒక్కరు చేసిననూ సిరిసంపదలు, విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు. దీనిని గురించి ఒక యితిహాసం గలదు. దానిని వివరించెద నాలకింపుమని వశిష్ఠుడు జనకునితో యిట్లు చెప్పసాగెను.

లుబ్ద వితంతువు స్వర్గమున కేగుట

పూర్వకాలమున ద్రవిడదేశమునం దొకగ్రామమున నొక స్త్రీ గలదు. ఆమెకు పెండ్లి అయిన కొలదికాలమునకే భర్త చనిపోయాడు. సంతానముగాని, ఆఖరికి బంధువులుగాని లేరు. అందుచే ఆమె యితరుల యిండ్లలో దాసిపని చేయుచూ, అక్కడనే భుజించుచు, ఒకవేళ వారి సంతోషము కొలది యేమైనా వస్తువులిచ్చిన యెడల ఆ వస్తువులను యితరులకు హెచ్చుధరకు అమ్ముకొనుచు అవిధముగా తన వద్ద పోగయిన సొమ్మును వడ్డీలకు యిచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు, దొంగలు దొంగిలించి తీసుకువచ్చిన వస్తువులను తక్కువధరకు కొని యితరులకు యెక్కువ ధరకు అమ్ముకొనుచు - సొమ్ము కూడబెట్టుకొనుచుండెను.

ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల యిండ్లలో దాసీపనులు చేస్తూ, తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను. ఎంత సంపాదించిననేమి! ఆమె ఒక్కదినము కూడ ఉపవాసముగాని, దేవుని మనసారా ధ్యానించుటగాని చేసి యెరుగదు. పైగా వ్రతములు చేసేవారిని, తీర్థయాత్రలకు వెళ్లేవారిని జూచి అవహేళనచేసి, యే ఒక్క భిక్షగాడికిని పిడికెడు బియ్యము పెట్టక, తాను తినక ధనమును కూడ్బెట్టుచుండెడిది.

అటుల కొంతకాలము జరిగెను. ఒకరోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగనాయకులను సేవించుటకు బయలుదేరి, మార్గమధ్యమున ఈ స్త్రీయున్న గ్రామమునకు వచ్చి, ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేసెను. అతడా గ్రామములోని మంచిచెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకుని ఆమె కడకు వెళ్లి "అమ్మా! నా హితవచనము లాలకింపుము. నీకు కోపము వచ్చినాసరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపుము. మన శరీరములు శాశ్వతముకావు. నీటి బుడగలవంటివి. ఏ క్షణములో మృత్యువు మనలను తీసుకొనిపోవునో యెవరూ చెప్పలేరు. పంచభూతములు, సప్తధాతువులతో నిర్మించబడిన యీ శరీరములోని ప్రాణము - జీవము పోగానే చర్మము, మాంసము కుళ్లి దుర్వాసనకొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి యీ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడిన దురాఅలోచన. తల్లీ! నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూచి మిడత దానిని తినేద్దామని భ్రమించి, దగ్గరకు వెళ్లి భస్మమగుచున్నది. అటులనే మానవుడు కూడా యీ తనువు శాశ్వతమని నమ్మి, అంధకారములో బడి నశించుచున్నాడు. కాన, నా మాట లాలకించి నీవు తినక, ఇతరులకు పెట్టక, అన్యాయముగా అర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దానధర్మములు చేసి, పుణ్యమునుసంపాదించుకొనుము. ప్రతి దినము శ్రీమన్నారాయణుని స్మరించి, వ్రతాధికములు చేసి మోక్షము నొందుము. నీ పాపపరిహారార్థముగా, వచ్చే కార్తీక మాస మంతయు ప్రాతఃకాలమున నదీస్నానమాచరించి, దానధర్మముల జేసి, బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగల" వని వుపదేశమిచ్చెను.

అ వితంతురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటినుండి దానధర్మములు చేయుచు కార్తీకమాస వ్రతమాచరించుటచే జన్మరాహిత్యమై మోక్షము నొందెను. కావున కార్తీకమాసవ్రతములో అంత మాహత్మ్యమున్నది.

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహాత్మ్యమందలి ఆరవ యధ్యాయము
ఆరవ రోజు పారాయణము సమాప్తము.
 
Photo: కార్తీక పురాణము 6వ అధ్యాయము (దీపదానవిధి - మాహాత్మ్యం) 

శివకేశవార్చన

వశిష్ఠులవారు జనకునకు ఇంకనూ ఇటుల బోధించిరి. 'ఓ రాజా! కార్తీకమాసము గురించి, దాని మహత్య్మము గురించి ఎంత చెప్పినా, వినిననూ తనివి తీరదు. ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్రకలశములతో పూజించినవారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా ఉండును. తులసీ దళములతో గానీ బిల్వ పత్రములతో గానీ సహస్రనామ పూజ చేసినవారికి జన్మరాహిత్యము కలుగును. కార్తీక మాసమునందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామముంచి భక్తితో పూజించినచో కలుగు మోక్షమింతింత కాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనము పెట్టి తాను తినిన సర్వపాపములు పోవును. ఈ విధముగా కార్తీక స్నానములు, దీపారాధనలు చేయలేని వారు ఉదమయున, సాయంకాలమున యే గుడికైననూ వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైననూ చేసినా వారి పాపములు నశించును.'
సంపత్తి గలవారు శివకేశవుల ఆలయమునకు వెళ్ళి భక్తితో దేవతార్చన, హోమాదులు, దానధర్మములు చేసినచో అశ్వమేథ యాగము చేసినంత ఫలము దక్కుటయే గాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. శివాలయమునగాని, విష్ణాలయము నందుగాని జెండా ప్రతిష్టించినచో యమకింకరులు దగ్గరకు రాలేరు సరికదా, పెనుగాలికి ధూళిరాసులెగిరిపోయినట్లే కోటి పాములైననూ పటాపంచలైపోవును.
ఈ కార్తీక మాసములో తులసికోటవద్ద ఆవుపేడతో అలికి, వరి పిండితో శంఖు, చక్ర ఆకారములతో ముగ్గులు వేసి నువ్వులు, దాన్యము పోసి వాటిపై ప్రమిద నిండా నువ్వుల నూనె పోసి, వత్తిని వేసి వెలిగించవలెను. ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలెను. దీనినే నందా దీపమందురు. ఈ విధముగా చేసి, నైవేద్యము పెట్టి, కార్తీక పురాణమును చదినచో హరిహరాదులు సంతసించి కైవల్యమొసంగెదరు.
అటులనే కార్తీక మాసములో ఈశ్వరుడుని జిల్లేడు పూలతో అర్చించిన ఆరోగ్యం సిద్ధించును. సాలగ్రామమునకు ప్రతినిత్యము గంధము పట్టించి, తులసీదళములతో పూజించవలెను. ఏ మనుజుడు ధనముండీ కార్తీక మాసమందు పూజాదులను చేయడో ఆ మానవడు మరు జన్మలో శునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును. కావున కార్తీక మాసము నెలరోజులూ పూజలు చేయలేనివారు ఒక్క సోమవారమైననూ చేసి శివకేశవులను పూజించినా మాస ఫలము కలుగును.
కనుక 'ఓ రాజా! నీవు కూడా ఈ వ్రతమాచరించి తరింపుము' అని వశిష్ఠులవారు చెప్పెను.
Photo: శివకేశవార్చన:

అయ్యప్ప స్వామి

ఈయనను హరిహరసుతుడని, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది. అయ్య విష్ణువు), అప్ప శివుడు) అని పేర్ల సంగమం తో 'అయ్యప్ప' నామం పుట్టింది. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలై లో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శశబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. బరిమలైలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలున్నాయి. కేరళలోనే "కుళతుపుళ"లో ఇతనిని బాలుని రూపంలో అర్చిస్తారు. "అచ్చన్ కోవిల్"లో పుష్కల, పూర్ణ అనే దేవేరులసమేతుడైన అయ్యప్పను పూజిస్తారు. శబరిమలైలోని అయ్యప్ప సన్నిధికి యేటా ఐదుకోట్లమంది భక్తులు దర్శనార్ధులై వెళుతుంటారు

జనన కారణము :
అయ్యప్ప జననము సరిగా ఎవరికీ తెలీదు . ఎన్నో కధలలో కొన్నింటిని మతపెద్దలు ప్రచారములో పెట్టేరు .
1.క్షీరసాగరమధనం అనంతరం దేవతల కు, రాక్షసుల కు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం దరించి కార్యం నిర్వహిస్తాడు. తరువాత అదేరూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు.
2. భస్మాసురుడు అనే రాఖసుడు శివుని కై తపస్సు చేసి ... తానూ ఎవరి తలపై చేసి వేస్తే వారు భస్మము అయిపోయేతట్లు వారము పొంది ... తాను పొందిన వరకు పనిచేయునది , లేనిది పరీక్ష నిమిత్తము శివుని తలపై నే చేయి వేయుటకు పూనుకొనగా చావు భయము తో శివుడు పారిపోయి గురివింద గింజ లో దాక్కోనెను . శివుని రక్షించే కార్యములో విష్ణువు 'మోహినీ ' రూపము ఎత్తి భస్మాసుర వధ గావించెను .
ఏది ఏమైనా ... వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము, 30వ రోజు శనివారం, పంచమి తిధి, ఉత్తరా నక్షత్రం వృశ్చికా లగ్నమందు శాస్త(అయ్యప్ప) జన్మించాడు. ఇతడు శైవుల కు, వైష్ణవుల కు ఆరాధ్య దైవం. తండ్రియైన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంపా సరోవర తీరప్రాంతంలో మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరించాడు ధర్మశాస్త. అయ్యప స్వామి . ఇలా హరి హరులకు బిడ్డ పుట్టుటకు కారణముంది . మహిష ను సంహరించాదానికే ... ఈ మహిష ఎవరు ? .

పూర్వము త్రిమూర్తుల అంశ తో జన్మించిన దత్తాత్రేయుడు .. ఆ త్రిమూర్తుల భార్యలైన - సరస్వతి ,లక్ష్మీ , పార్వతి ల అంశతో జన్మించిన 'లీలావతి'ని పెళ్లి చేసుకుంటాడు . లోకోద్ధారణ ముగిశాక అవతారము చాలిద్దామని దత్తాత్రేయుల వారు అంటే ... మరికొంతకాలము ఇక్కడే సుఖిద్దామని భార్య కోరగా , దత్తు నకు కోపము వచ్చి" మహిషి " గా జన్మించమని శపిస్తాడు . శక్తి స్వరుపిని అయిన లీలావతి భర్తను "మహిష " గా పుట్టుడురుగాక అని ప్రతి శాపముతో ఇద్దరు ... రంబాసురుడు అనే రాక్షసుడు కి యక్షకి దత్తుడు మహిషాసురుడు గాను , కరంబాసురుడు అనే రాక్షసుడుకి లీలావతి మహిషి గాను జన్మించిరి . మహిసాసుర మర్దిని తో (దుర్గాదేవి ) మహిసాసురుడు చనిపోగా మహిష తపమాచరించి బ్రహ్మ వద్ద ఎన్నో వరాలు పొంది చివరికి చావు ఉండకూడదని వారము అడుగుతుంది . పుట్టిన వానికి గిట్టక తప్పదు ... అని ఇంకో వారము కోరుకోమంటాడు బ్రహ్మ . హరి హర సుతుని చేతిలో తప్ప మరెవరి చేతి లో చావు లేకుండా వరము కోరిననది . హరి హరులు వివాహమాడారు గదా .. వారికి బిడ్డ పుట్టాడనే తెలివితో కోరుకున్నదీ వరము . తీరా అయ్యప్ప జన్మతో మహిష మరణిస్తుంది .
మహిషి వధ

అడవిలో నారదుడు మహిషిని కలిసి అయ్యప్పను గురించి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడు అని హెచ్చరిస్తాడు. మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి వెళుతుంది. వీరి యిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించేందుకు సమస్త దేవతలు అదృశ్యరూపంలో వస్తారు. ఈ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చూస్తూ మహిషిని ఎదిరించాడు. అయ్యప్ప మహిషిల మద్య జరిగే భీకరయుద్ధంలో చివరిగా మహిషిని నేలపై విసిరికొడతాడు ఆ దెబ్బకి గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది. దేవతలంతా ఆయనను స్తుతిస్తూ ఆయన ముందుకు వస్తారు. అప్పుడు శ్రీ అయ్యప్ప ఇంద్రునితో దేవేంద్రా! నేను చిరుతపులి పాలు తెచ్చే నెపంపై యిలా వచ్చాను. కాబట్టి మీరందరూ చిరుతలై నాకు తోడ్పడండి అని అడుగుతాడు. ఆయన కోరికపై అందరు చిరుతపులులుగా మారిపోయారు. ఇంద్రుడు స్వయంగా అయ్యప్పకు వాహనమైన చిరుతగా మారిపోయాడు. చిరుతల దండుతో అయ్యప్ప తన రాజ్యం చేరుతాడు.

అయ్యప్ప చరితము :
హరి హర పుత్రుడైన అయ్యప్ప పందల రాజ్యాన్ని పాలించే "రాజషేఖరపాన్ద్యుడు "నకు పంపానదీ తీరాన లభిస్తాడు . సర్పం నీడన పవళించి ఉన్న అతనికి " మణికంఠుడు " అని పేరు పెట్టి విద్యా బుద్దులు నేర్పిస్తాడు .

మనికంటుడు అనగా మన అయ్యప్ప స్వామి .. గురుకులం లో చదువుకునే రోజుల్లో వారి గురువు ఎడల్ అత్యంత భక్తీ శ్రద్దలతో వుండేవాడు . సాక్షాత్తు భగవంతుడైనప్పటికీ గురువు ద్వార సకల విద్యలు నేర్చుకున్నాడు . అయితే గురుదక్షిణగా గురువు కోరికపై అంధుడు , ముగావాడైన ఆయన పుత్రునికి మాట , ద్రుష్టి ప్రసాదించి తన గురుభక్తిని చాటుకున్నాడు . ప్రజలను భయభ్రాంతులకు లోను చేస్తున్న "వానరుడనే " బందిపోటు దొంగను ఓడించి అతనికి దివ్యత్వాన్ని బోధించాడు .

తండ్రి అప్పజేప్పబోయిన సింహాసనాన్ని త్యజిస్తాడు మనికంటుడు . ఆయన కోరికమేర తను బాణం వేసిన చోట ఓ ఆలయం నిర్మించి ఇచ్చేందుకు ఒప్పుకుంటాడు తండ్రి . అదే శబరిమల ఆలయము . అందులో మనికంటుడు అయ్యప్ప స్వామి గా అవతరిచాడు .

ఎవరైతే నియమ నిష్టలతో సేవించి "పదునేట్టాంపడి " నెక్కి దర్శిస్తారో వారికి ఆయురారోగ్య ఇష్వర్యాలను పర్సాదిస్తాడు . మాటలు రాణి వారికి మాటలు వచ్చే మహిమాన్వితమైన ప్రదేశమిది . చూపులేనివారికి చూపునిచ్చే కన్నుల పండువైన ప్రదేశమిది . భగవంమహిమ కలిగిన శబరిమలై లో గల దివ్య ఔషధాల వనములికా పరిమళ ప్రభావం తో కూడిన ప్రాణవాయువును పీల్చగానే ఎంతటి అనారోగ్యమైనా చక్కబడుతుంది . సంతానము , సౌభాగ్యము , ఆరోగ్యము , ఐశ్వర్యము మొదలైన కోరిన వరాలనిచ్చే స్వామి అయ్యప్ప .

Photo: అయ్యప్ప స్వామి

శబరిమలై ఆలయము

ఈ ఆలయము ఇదు శాస్త్రాలయాల తో ప్రసిద్ధిచెందినది . అరణ్యాల మధ్య లో శబరిమలైకి ఎదురుగా ఉన్న" పొన్నంబల " మేడలో అయ్యప్ప స్వామి " జీవన్ముక్తుని " గా ఉంటాడు .
శబరిమలై

శబరిమలై అంటే శబరి యొక్క పర్వతము అని అర్ధం.

దేవాలయ నిర్మాణము
అంతట అయ్యప్ప ఈ పర్వతముపై కల అయ్యప్పస్వామి దేవాలయము భారతదేశ ప్రసిద్ది చెందిన, అధిక జనసమ్మర్ధం కలిగిన దేవాలయాలలో ఒకటి. ఈ దేవాలయమునకు మాలధారణ చేసుకొని నలుభైఒక్క రోజు నియమాలను పాటించిన భక్తులు కార్తీకమాసం మరియు సంక్రాంతి సమయాలలో విపరీతంగా వస్తారు.

నిత్య పూజా క్రమంలో గాని, దేవాలయానికి వెళ్ళి గాని అయ్యప్పను దర్శించుకోవడం ద్వారా గాని అయ్యప్పను పూజించడం సాధారణంగా ఇతర దేవుళ్ళ పూజలాగానే ఉంటుంది. అయితే దీక్ష తీసుకొని అయ్యప్ప దర్శనం కోసం వెళ్ళడానికి కఠినమైన నియమాలను అనుసరిస్తూ ప్రతిదినమూ చేసే భజన పూజాది కార్యక్రమాలలో కొంత వైశిష్ట్యం కనిపిస్తుంది.
దీక్ష, మాల, నియమాలు

భక్తులు కార్తీకమాసం నుండి దాధాపు మార్గశిర పుష్య మాసాల వరకు దృఢమైన నియమాలను ఆచరిస్తూ ఉంటారు. ఐహికమైన సౌఖ్యాలను పరిత్యజించడం, మద్య మాంస ధూపమపానాది వ్యసనాలకు దూరంగా ఉండడం, స్వామి చింతనలో స్వామి భక్తులతో సమయం గడపడం, సాత్విక జీవనం అవలంబించడం ఈ దీక్షలో ముఖ్య లక్షణాలు. వీరి దినచర్య తెల్లవారు ఝామున లేచి చన్నీటి స్నానం చేయడంతో మొదలవుతుంది. నల్లని వస్త్రాలు, తులసిమాల, నుదుట విభుదిపై గంధం బొట్టు ధరిస్తారు. దినంలో అధిక భాగం పూజ భజనాది కార్యక్రమాలలో గడుపుతారు. కటికనేల మీద పడుకొంటారు. అందరినీ "స్వామి" అని సంబోధిస్తారు. దుర్భాషణాలకు దూరంగా ఉంటారు. ఇలా ఒక మండలం పాటు నియమాలతో గడుపుతారు. ఇలా అయ్యప్ప స్వామి దీక్షకు ఒక స్పష్టమైన, కొంత క్లిష్టమైన విధానం రూపు దిద్దుకొంది.

దీక్ష తీసుకోవాలనుకొనే భక్తుడు గురుస్వామి వద్దనుండి ఉపదేశంతో మాలను ధరిస్తాడు. మాలా ధారణ అనంతరం తన మనస్సునూ, శరీరాన్ని భగవంతునికి అంకితం చేయాలి. అందరినీ భగవంతుని రూపాలుగా భావించాలి. అయ్యప్ప శరణు ఘోషను విడువకూడదు. నిత్యం భజన కార్యక్రమంలో పాల్గొనాలి.
భజన
పడిపూజ
హరివరాసనం
అయ్యప్ప పూజ చివరిలో "హరివరాసనం" లేదా "శ్రీ హరిహరాత్మజాష్టకం"గానం చేయడం ఒక సంప్రదాయం. శబరిమల ఆలయంలో రాత్రిపూట మందిరం మూసేముందు ఈ స్తోత్రాన్ని పాడుతారు. ఇదే విధానాన్ని ఇతర ఆలయాలలోను, ఉత్సవాలలోను, పూజలలోను పాటిస్తున్నారు. ఈ స్తోత్రాన్ని "కుంబకుడి కులతూర్ అయ్యర్" రచించాడు. 1955లో స్వామి విమోచనానంద ఈ స్తోత్రాన్ని శబరిమలలో పఠించాడు. 1940, 50 దశకాలలో ఇది నిర్మానుష్యమైన కాలంలో వి. ఆర్. గోపాలమీనన్ అనే భక్తుడు సన్నిధానం సమీపంలో నివశిస్తూ ఉండేవాడు. మందిరంలో హరివరాసనాన్ని స్తోత్రం చేస్తూ ఉండేవాడు. ఆ అరణ్యప్రాంతంలో వన్యమృగాలకు భయపడేవాడు కాదు. అప్పట్లో "ఈశ్వరన్ నంబూద్రి" అనే అర్చకుడు ఉండేవాడు. తరువాత గోపాలమీనన్ శబరిమల నుండి వెళ్ళిపోయాడు. అతను మరణించాడని తెలిసినపుడు చింతించిన ఈశ్వరన్ నంబూద్రి ఆరోజు ఆలయం మూసివేసే సమయంలో "హరివరాసనం" స్తోత్రం చదివాడు. అప్పటినుండి ఈ సంప్రదాయం కొనసాగుతున్నది.

హరవరాసనం చదువుతున్నపుడు గర్భగుడిలో ఒక్కొక్కదీపం కొండెక్కిస్తారు. చివరికి ఒక్క రాత్రిదీపం మాత్రం ఉంచుతారు. ఈ శ్లోకం నిద్రపోయేముందు అయ్యప్పకు జోలవంటిది. శ్లోకం అయిన తరువాత నమస్కారం చేయవద్దని, "స్వామి శరణు" అని చెప్పుకోవద్దని చెబుతారు. ఈ స్తోత్రంలో 8 శ్లోకాలున్నాయి. మొదటి శ్లోకం -

హరివరాసనమ్ విశ్వమోహనమ్
హరిదధీశ్వరమ్ ఆరాధ్యపాదుకమ్
అరివిమర్దనమ్ నిత్యనర్తనమ్
హరిహరాత్మజమ్ దేవమాశ్రయే

శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా

శబరిమల యాత్ర :
దీక్ష స్వీకరించి నియమాలతో మండలం గడిపిన భక్తులు శబరిమలై యాత్ర చేస్తారు. ఈ దీక్ష స్వామి సన్నిధాన సందర్శనంతో ముగుస్తుంది. శబరిమల కేరళలోని పత్తినంతిట్ట జిల్లాలో పశ్చిమ కనుమల్లో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతం క్రిందకు వస్తుంది. గుడి సముద్ర మట్టం నుంచి సుమారు 3000 అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు మరియు 18 కొండల మద్య కేంద్రీకృతమై ఉంటుంది.ఇక్కడికి యాత్రలు నవంబర్ నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తాయి. మండల పూజ (నవంబర్ 17), మకరవిళక్కు (జనవరి 14) ఈ యాత్రలో ప్రధాన ఘట్టాలు. జనవరి 14 వ రోజును ఆలయంలో మకర జ్యోతి దర్శన మిస్తుంది. మిగతా అన్ని రోజుల్లోనూ గుడిని మూసే ఉంచుతారు. కానీ ప్రతీ మళయాళ నెలలో ఐదు రోజుల పాటు తెరచియుంచుతారు.

ఎరుమేలి
శబరిమలై యాత్ర "ఎరుమేలి"తో మొదలవుతుంది. ఎరుమేలిలో "వావరు స్వామి"ని భక్తులు దర్శించుకొంటారు. (అయ్యప్ప పులిపాలకోసం అడవికి వెళ్ళినపుడు అతనిని అడ్డగించిన ఒక దొంగ అనంతరం స్వామి సన్నిహిత భక్తునిగా మారాడు. అతడే వావరు స్వామి. "నన్ను దర్శించుకోవాలని వచ్చిన భక్తులు ముందుగా నిన్ను దర్శించుకొంటారు" అని అయ్యప్ప వావరుకు వరమిచ్చాడట. ఈ వావరు స్వామి ఒక ముస్లిం కులస్తుడు. ఈ వావరు ఇక్కడ కొలువున్నది కూడా ఒక మసీదులోనే) దర్శనానంతరం భక్తులు వావరుస్వామి చుట్టూ రకరకాల వేషధారణతో "పేటై తులాల" అనే నాట్యం చేస్తారు. (మహిషితో యుద్ధం చేసేటపుడు అయ్యప్ప చేసిన తాండవం పేరు "పేటై తులాల"). ఈ ఎరుమేలి వద్ద ఉన్న "ధర్మశాస్త" ఆలయంలో అయ్యప్ప స్వామి ధనుర్బాణధారియై ఉంటాడు. ఇక్కడ వినాయకుడు కూడా కొలువై ఉంటాడు. ఈయనను "కన్నెమూల గణపతి" అని అంటారు. ఇక్కడ భక్తులు కొబ్బరికాయ కొడతారు.

పాదయాత్ర
ఇక్కడినుండి భక్తుల పాదయాత్ర మొదలవుతుంది. పాదయాత్రకు రెండు మార్గాలున్నాయి. "పెద్ద పాదం" అనేది కొండలమధ్య దట్టమైన అరణ్యంలో ఉన్న కాలిబాట. ఇది ఎనభై కిలోమీటర్ల దారి. దారిలో పెరుర్‌తోడు, కాలైకట్టి అనే స్థలాలున్నాయి. (మహిషితో అయ్యప్పస్వామి యుద్ధం చేస్తుండగా కాలైకట్టివద్దనుండి శివకేశవులు యుద్ధాన్ని చూశారట). ఇక్కడికి కొద్ది దూరంలోనే అళదా నది (మహిషి కార్చిన కన్నీరు నదీరూపమైందట) ఉంది. ఈ నదిలో స్నానం చేసి భక్తులు నదినుండి ఒక రాయిని తీసుకు వెళతారు. ఆ రాతిని "కళిద ముకుంద" (మహిషి కళేబరాన్ని పూడ్చిన చోటు) వద్ద పడవేస్తారు. తరువాత యాత్ర ముందుకు సాగి పెరియానపట్టమ్, చెరియానపట్టమ్ అనే స్థలాలగుండా పంబ నది చేరుకొంటుంది. అక్కడే "పంబ" అనే గ్రామం కూడా ఉంది. ఇక్కడినుండి స్వామి సన్నిధానానికి ఏడు కిలోమీటర్ల దూరం.

చిన్నపాదం మార్గంలో బస్సులు కూడా తిరుగుతాయి. బస్సులపై పంబానది వరకు చేరుకోవచ్చు. చివరి ఏడు కిలోమీటర్లు మాత్రం కాళినడకన వెళ్ళాలి.

సన్నిధానం
భక్తులు పంబానదిలో స్నానం చేసి "ఇరుముడి"ని తలపై పెట్టుకొని అయ్యప్ప శరణు ఘోషతో "నీలిమలై" అనే కొండ మార్గం ద్వారా ప్రయాణిస్తారు. కన్నెస్వాములు (తొలిసారి దీక్ష తీసుకొన్నవారు) తమతో తెచ్చిన ఒక బాణాన్ని దారిలో "శరమ్ గుత్తి" అనే చోట ఉంచుతారు. ఇక్కడినుండి అయ్యప్ప సన్నిధానంకు ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది.

సన్నిధానం వద్ద ఉన్న 18 మెట్లను "పదునెట్టాంబడి" అంటారు. 40 రోజులు దీక్ష తీసుకొని ఇరుముడి ధరించినవారు మాత్రమే ఈ మెట్లు ఎక్కేందుకు అర్హత కలిగి ఉంటారని కధనం. ఒక్కో మెట్టుకు ఒక్కో అధిష్టాన దేవత ఉంటుంది. సన్నిధానానికి, 18 మెట్లకు నమస్కరిస్తూ స్తోత్రాలు పఠిస్తూ మెట్లను ఎక్కుతారు. ఈ ఆళయంలో స్వామి కొలువైన సందర్భంగా 18 వాయిద్యాలను మ్రోగించారట.

సన్నిధానంలో "పానవట్టం"పైన అయ్యప్ప కూర్చుని ఉన్న భంగిమలో దర్శనమిస్తాడు. స్వామియే శరణం అయ్యప్ప స్వామి కూర్చున్న తీరు శివలింగాన్ని తలపిస్తుందని. ఒంపు తిరిగిన ఎడమచేయి మోహిని అవతారాన్ని తెలియజేస్తుందని చెబుతారు.
Photo: శబరిమలై ఆలయము :

స్కాందపురాణం లోని సోమవార వ్రత మహిమను తెలుపు కథ:

చాలా కాలం క్రితం భరతఖండములో పుణ్యాత్ముడైన చిత్రవర్మ అనే రాజుండెను. ఆయనకు పుత్రులు అనేకులు ఉండిరి. పుత్రిక కొరకు పార్వతిని ప్రార్ధించగా ఆడపిల్ల జన్మించెను. సర్వగుణ సంపన్నురాలైన ఆ శిశువునకు పదునాల్గవ సంవత్సరమున వైధవ్యము ఖచ్చితముగా ప్రాప్తించును. అని జ్యోతిష్కులు తెలిపిరి. అంతట రాజు దుఃఖితుడయ్యెను. శోకంతో పీడింపబడుతున్న రాజునకు జ్యోతిష్కులు దీనికి పరిహారం తెలిపిరి.

రాజకుమార్తె అయిన సీమంతిని పూర్ణచంద్రుని వలె పెరుగుచుండును. యుక్త వయస్సు వచ్చిన తరువాత ఆమెను రాజకుమారుడైన చంద్రాంగదున కిచ్చి చిత్రవర్మ వివాహం చేసెను. ఇల్లరికము వచ్చిన అల్లునితో రాజుకు కాలము సంతోషముగా గడుచుచుండెను. ఇట్లుండగా ఒక రోజున చంద్రాంగదుడు జలక్రీడ కోరి యమునానది కేగెను. దురదృష్ట వశమున నది యందలి సుడి గుండంలో చిక్కుకుపోయెను. రాజు పరివారమునకు ఎనలేని దుఃఖము కలిగెను. సీమంతిని కూడా సహగమనమునకు సిద్ధపడెను. అంతట యాజ్ఞవల్క్య మహాముని భార్యయైన మైత్రేయి అచటకు వచ్చి, " పుత్రీ ! చింతించవలదు. నేను నీకొక వ్రతమును ఉపదేశించెదను. దానివలన వైధవ్యము నుండి నీకు నివృత్తి కలుగగలదు". అని చెప్పి పదహారు సోమవారాల వ్రతము ఉపదేశించెను.
మైత్రేయి ఉపదేశించిన ప్రకారము చెప్పినది చెప్పినట్లుగా సీమంతిని కూడా భక్తితో వ్రతమును ఆచరించెను. నాగలోకమునకు చేరిన చంద్రాంగదుడు నాగరాజుచే సన్మానింపబడి సురక్షితంగా రాజధానికి మరలివచ్చెను. అందరూ సంతోషించి ఈ విధంగా ఎడబాసిన పతీ పత్నులు వ్రత మహిమచే మరలా ఒకటయ్యారు.

Photo: స్కాందపురాణం లోని సోమవార వ్రత మహిమను తెలుపు కథ:

హరి హర మూర్తి

పరమశివుని లీలామూర్తులలో పదమూడవమూర్తి హరిహరమూర్తి. అనగా ఆయన శరీరంలో సగభాగమును శ్రీమహా విష్ణువు స్వీకరించారు. అలా పరమశివుణ్ణి ప్రసన్నుడిని చేసుకుని శరీరంలో సగభాగమును స్వీకరించిన మూర్తిని హరిహరమూర్తి అంటారు." నీవు ఏటువంటి భక్తితో ఎటువంటి ఉపాసన చేసి శంకరుని అర్ధభాగమును పొందావో ఆ ఉపాయమును నాకు చెప్పవల్సినది" అని పార్వతి దేవి నారాయణుణ్ణి ప్రార్థన చేస్తే, శ్రీ మన్నారయణుడు పార్వతీదేవికి ఉపదేశం చేసిన స్తోత్రమే శివాష్టొత్తర శతనామస్తోత్రం. ఈ శివాష్టోత్తర నామ స్తోత్రమును ఆధారము చేస్కొని పార్వతి దేవి శంకరుని శరీరంలో అర్ధభాగమును పొందింది. అది పదునాల్గవ స్వరూపము. దానిని అర్ధనారీశ్వర స్వరూపము అని పిలుస్తారు. మనుష్యజన్మ ప్రయోజనం భగవంతునితో ఐక్యమే కనుక శివాష్టోత్తర శతనామ స్తోత్రమును ప్రదోషవేళలో ఇహమునందు సమస్తమయిన కోరికలను తీరుస్తుంది. పరలోక సుఖమును, భగవంతుని అనుగ్రహమును మనయందు ప్రసరింపచేస్తుంది.

Photo: హరి హర మూర్తి

కార్తీక పురాణము -- అధ్యాయం -- 5

అథ పంచమాధ్యాయ ప్రారంభః
వశిష్ఠుడు తిరిగి ఇట్లు చెప్పెను. ఓ జనకమహారాజా! వినుము. కార్తీకమాసమందు పాపక్షయము కొరకు పుణ్యమును జేయవలయును. పుణ్యముచేత పాము నశించుటయేగాక పుణ్యమధికమగును. కార్తీకమందు హరిసన్నిధిలో భగవద్గీతా పారాయణమును చేయువాడు పాము కుబుసమువలెపాపములను విడుచును. ఈమాసమందు తులసీ దళములతోను, తెల్లనివి నల్లనివి అయిన అవిశపూలతో కరవీర(గన్నేరు) పూలతో హరిని పూజించినయెడల వైకుంఠమునకు బోయి హరితో గూడా సుఖించును. భగవద్గీతయందు విభూతి విశ్వరూప సందర్శనాధ్యాయములను హరి సన్నిధిలో పారాయణ చేయువాడు వైకుంఠలోకమునకు అధిపతియగును. హరిసన్నిధిలో శ్లోకముగాని, శ్లోక పాదముగాని, పురాణము చెప్పిన వారును, విన్నవారును కర్మబంధ వినిర్ముక్తులగుదురు. కార్తీకమాసమందు శుక్లపక్షమందు వనభోజనము చేయువారికి సమస్త పాపములు నశించును. ఇతర కాలములలో జపకాలమందు, హోమకాలమందు, పూజాకాలమందు, భోజనకాలమందు, తర్పణకాలమందు, చండాలురయొక్కయు, పాపాత్ములయొక్కయు, శూద్రులయొక్కయు, అశౌచవంతులయొక్కయు సంభాషణలను వినినచో దోషపరిహారము కొరకు కార్తీకమాసమునందు వనభోజనమాచరించవలయును. అనేక జాతి వృక్షములతో గూడిన వనమందు ఆమలక(ఉసిరిక) వృక్షమువద్ద సాలగ్రామము నుంచి గంధపుష్పాక్షతాదులతో బూజించి శక్తి కొలది బ్రాహ్మణులను బూజించి భోజనము చేయవలెను. ఇట్లు కార్తీకమాసమందు వనభోజనము చేసినయెడల ఆయాకలమునందు చేసిన సమస్త పాపములు నశించి విష్ణులోకమునందు సుఖముగా నుండును. కాబట్టి తప్పక ఈమాసమందు వనభోజనమాచరించ వలయును. కార్తీకమహాత్మ్యమును భక్తితో విని బ్రాహ్మణుని కుమారుడు నీచ జన్మనుండి విముక్తుడాయెను. ఆకథ చెప్తాను వినుము అని వశిష్ఠుడు జనకమహారాజుకు ఈ విధంగా చెప్పెను.
కావేరీ తీరమందు దేవశర్మయను బ్రాహ్మణుడు వేదవేదాంగ పారంగతుడు గలడు. ఆదేవశర్మకు దురాచారవంతుడగు ఒక కుమారుడు గలడు. అతని దుర్మార్గమును జూచి తండ్రి నాయనా! నీకు పాపములు నశించెడి ఒక మాటను చెప్పెదను. కార్తీకమాసమందు ప్రాతస్స్నానము చేయుము. సాయంకాలమునందు హరిసన్నిధిలో దీపములను సమర్పించుము. ఈలాగున తండ్రిచెప్పిన మాటలను విని కుమారుడు కార్తీకమాస ధర్మమనగా యేమి ఇట్టి కార్యమునాచే ఎన్నటికీ చేయతగదు. ఆమాట విని తండ్రి ఓరి దుర్మార్గుడా! ఎంతమాట అంటివిరా, నీవు అరణ్యమందు చెట్టుతొర్రలో ఎలుకవై పుట్టి ఉండుమని శపించెను. తండ్రి శాపమును విని కుమారుడు పశ్చాత్తాప పడి శాప విముక్తి దురాచారుడనైన నాకు ఎట్లు కలుగును అని తండ్రిని అడిగెను. ఆతండ్రి ఇట్లనెను. కుమారకా! ఎప్పుడు నీవు కార్తీక మహాత్మ్యమును వినెదవో అప్పుడు నీకు మూషకత్వ విముక్తి గలుగునని చెప్పెను. తండ్రి ఇట్లు చెప్పి ఊరకున్నంతలో కుమారుడు గజారణ్యమందు ఎలుక అయ్యెను. చెట్టుతొర్రలో నివసించెను. అది అనేక జంతువులకు ఆధారమైనది. ఇట్లు కొంతకాలము గడచిన తరువాత ఒకప్పుడు విశ్వామిత్ర మునీశ్వరుడు శిష్యులతో సహా కార్తీకస్నానమాచరించి ఆ వృక్షముయొక్క మొదట కార్తీకమహాత్మ్యమును భక్తితో చెప్పుచుండెను. అంతలో దురాచారుడును, హింసకుడును అగు ఒక కిరాతుడును వేటనిమిత్తము అచ్చటికి వచ్చి బ్రాహ్మణులను జూచి పాపాత్ముడు గనుక దయాశూన్యుడై వారిని జంప నిశ్చయించెను. అంతలో విశ్వామిత్రాది ముని సందర్శనము వలన వానికి జ్ఞానము కలిగి సంతోషించి అయ్యా ఏమిటి ఈపనివల్ల ఏమిఫలము అనియడిగెను. కిరాతా! వినుము చెప్పెదను. నీబుద్ధి మంచిదైనది. ఇది కార్తీకధర్మము ఈధర్మము మనుష్యులకు కీర్తి పెంపొందించును. కార్తీకమాసమందు మోహముచేతనైనను స్నానదానాదికమును జేసినవాడు పాపవిముక్తుడై వైకుంఠమును జేరును. ఈమాసమందు భక్తిశ్రద్ధలతో కూడినవాడై స్నానదానాదివ్రతము ఆచరించువాడు జీవన్ముక్తుడగును. విశ్వామిత్రుడు ఇటుల కిరాతుని గురించి చెప్పిన కార్తీక ధర్మమును వృక్షము మీదనున్న ఎలుక విని అప్పుడే నీచదేహమును విడిచి విప్రుడయ్యెను. విశ్వామిత్రుడది చూచి ఆశ్చర్యమునొందెను. తరువాత బ్రాహ్మణ కుమారుడు తన వృత్తాంతమునంతను విశ్వామిత్రునికి దెల్పి అనుజ్ఞ తీసుకొని తన ఇంటికిబోయెను. కిరాతుడును మూషకదేహత్యాగమును బట్టి కార్తీకవ్రత ఫలమును తరువాత మునివలన సకల ధర్మములను విని వైకుంఠము జేరెను. సుగతిని గోరువాడు కార్తీకమహాత్మ్యమును వినవలెను. విన్నంతనే పుణ్యవంతులై పరమపదము పొందెను. కాని విద్వాంసుడు తెలిసి కార్తీక ధర్మమును విని అభ్యసించవలెను. కాబట్టి తప్పక కార్తీకవ్రతము ఆచరించదగినది. ఇది నిజము. నాకు బ్రహ్మ చెప్పినాడు. రాజా! నీవును పురాణములందు బుద్ధినుంచుము. అట్లయిన యెడల పుణ్యగతిక బోవుదువు. ఈ విషయమై విచారణతో పనిలేదు. నిశ్చయము.
ఇతి స్కాంద పురాణే కార్తీకమహాత్మ్యే పంచమోధ్యాయస్సమాప్తః

Photo: కార్తీక పురాణము -- అధ్యాయం  -- 5

కన్యాకుమారి

కన్యాకుమారి... మూడు సముద్రాల కలయికను, ఒకేప్రదేశంలో సూర్యోదయ సూర్యాస్థమయాలను వీక్షించగలిగిన ఏకైక అద్భుత ప్రదేశం...
కన్యాకుమారి భారతదేశపు ఒక చివరి సరిహద్దు గ్రామం...... ఇక్కడ విశేషమేమంటే ఈ ప్రదేశం లో మూడు సముద్రాలు ఏకమవుతాయి.. అంటే భారతదేశానికి తూర్పు హద్దుగా ఉన్న బంగాళాఖాతం, దక్షిణ సరిహద్దుగా ఉన్న హిందూ మహా సముద్రం, పశ్చిమ సరిహద్దుగా ఉన్న అరేబియా సముద్రం ఇక్కడే కలుస్తాయి... విచిత్రమేమంటే ఆయా సముద్రాలలోని నీరు(మట్టి) వేరేవేరే రంగులలో ఉండడం... ఆ మూడు సముద్రాల అలలు ఒక దానితో నొకటి ఢీకొనటం చూడడానికి చాలా చాలా బావుంటుంది..... ఆ అనుభూతులు జీవితాంతం మనకు ఖచ్చితంగా తోడుంటాయి... తూర్పు పశ్చిమాలు ఒకే దగ్గర ఉండడం వలన ఈ ప్రదేశంలో మనం సూర్యోదయ, సూర్యాస్తమయాలను ప్రత్యక్షంగా అంటే సముద్రంలోంచి సూర్యుడు వస్తున్నాడా అనేట్లు మనకు కనపడే విధంగా ఉంటాయి... సాధారణంగా ఏ సముద్రంలో నైనా సూర్యోదయం కానీ సూర్యాస్తమయం కానీ ఏదో ఒకటే చూడొచ్చు.. కానీ ఇక్కడ మాత్రమే మనం ఒకే ప్రదేశం నుండి సూర్యోదయ సూర్యాస్తమయాలను చూసే అవకాశం వీలవుతుంది... అందుకే ఈ ప్రదేశం సందర్శకులకు ప్రత్యేకమైనది... ఇక్కడినుండి కొంచెం దూరంలో వివేకానందుడు ధ్యానంచేసిన ప్రదేశం ఉంది... అదే ఒక విధంగా భారతదేశపు చివరి హద్దుగా భావించవచ్చు.. అక్కడ ధ్యానం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది.. తమిళ కవి తిరువళ్ళువార్ , మరియు వివేకానందా రాక్ అనే ప్రదేశాలు చాలా సుప్రసిద్ధమైనవి... ఇవి రెండూ కొంచెం ప్రమాదకర సముద్రం మధ్య లో ఉంటాయి.... కానీ ఆ ప్రదేశాలకు వేళ్ళేందుకు చేసే పడవ ప్రయాణం చాలా థ్రిల్లింగ్ గా .. చాలా బావుంటుంది...