ప్రభాత కాలంలో దేవతలను స్మరించి ప్రస్తుతించాలని వేదమాత చెపుతోంది.

ప్రభాత కాలంలో దేవతలను స్మరించి ప్రస్తుతించాలని వేదమాత చెపుతోంది. దేవతలను స్మరించడం వల్ల , ప్రస్తుతించడం వల్ల దైవశక్తులను పొంది దైవీగుణ సంపన్నులు కావచ్చు.నిండుమనస్సుతో దైవాన్ని స్మరించేవాడు దైవసన్నిధిని చేరతాడని, దైవీశక్తులను ఆకర్షిస్తాడని, శక్తిమంతుడౌతాడని, జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను ధైర్యస్తైర్యాలతో సహించి, సంతోషంతో ముందుకు సాగుతాడని ఋగ్వేదం చెబుతోంది. పవిత్రభావనస్మరణంతో పరమేశ్వర సాహచర్యాన్ని పొందవచ్చు. వేకువసమయంలో చేసే భగ్వత్స్మరణ ధ్యానాలు ఎంతో ప్రసన్నంగా ఉంటాయి. పరమేశ్వర స్మరణవల్ల ఆత్మ విశ్వాసం ప్రబలుతుంది. ప్రాతః స్మరణకు అనువైన శ్లోకాలు, పద్యాలు, దండకాలు, పాటలు ఎన్నో ఉన్నాయి. వాటిని పాడుకొంటూ భావాన్ని మననం చేస్తూ ఉండాలి. ప్రహ్లాద, నారద , అంబరీష, విభీషణాది పరమభక్తులను స్మరించడంవల్ల భగవత్భక్తి ప్రబలుతుంది. ధర్మరాజును కీర్తించడంవల్ల ధర్మం వృద్ధి అవుతుంది. భీమసేనుని స్మరించడంవల్ల పాపసమ్హారం అవుతుంది. అర్జునుని కీర్యించ్డం వల్ల శత్రువులు నశిస్తారు. నకులసహదేవులను తలచడంవల్ల రోగాలు పోతాయి. ఈ విధంగా పరమ శివుని, రాముని, కృష్ణుని , ఆంజనేయుని....ఇలా ఏదేవతయైనా స్మరించవచ్చు. శుభములను పొందవచ్చు.

No comments:

Post a Comment