చాలామంది మనతో పిల్లలు చెప్పిన మాటవినడం లేదు అని వాపోవడం - దానికి బాధ్యులు ఎవరు బాగుగా యోచించండి.

నేడు పిల్లలు మీ మాట వినడంలేదు అంటే దానికి బాధ్యులు మీరే.
మూడు యేండ్ల పిల్లవాడు పెందలాడే లేవడం నేర్పకుండా వదిలేసి ఇప్పుడు లేవలేదు అంటే కారణం మీరే కదా?
రాత్రిండ్లు మీరు టెలివిజన్ ఆపేవరకూ పిల్లలను నిద్దుర పోనీయకుండా మీతోనే ఉంచుకొంటే తప్పు మీదే కదా?
పొద్దునే మీ పిల్లలను దేవుని దీపం వెలిగించడం మీరు ఎందుకు వాడుక చేయలేదు?
చదువుకునేటప్పుడు సెలవులప్పుడు కూడా ఇంటి పని వంటపని ఎందుకు వాడుక చేయలేదు వేసవి సెలవులందు కూడా వదిలేస్తే వారు ఎప్పుడు నేర్చుకోనేది, అలవాటుపడేది?
చదువు అనేది విజ్ఞానము కొరకే. ఒక డిగ్రీ కాగానే పిల్లకు ఎందుకు వివాహము చేయలేదు. పైనపైన చదివిస్తూ పోతే ఏండ్లైన తర్వాత వచ్చేది ముసలి ముతకలే కదా! పిల్లవాడికి ముప్పై దాటటం పిల్లకు ఇరవైఎనిమిది దాటటం ఎందుకు అనుమతించవలెను?
కాలాకాలంలో వివాహము చేయకుండా పిల్లలు పుట్టలేదు అని బాధపడితే లాభము లేదు
జీవనమునకు డబ్బు, చదువు, పదవి మట్టుకే ముఖ్యము కాదు మానవత్వము కూడా ముఖ్యమని ఎందుకు చెప్పించడం లేదు? ధనాశ మట్టుకే ఎందుకు చెప్పించడం ?
ఏనాడైనా మీ పిల్లల ముందు మీరు మీ తల్లితండ్రులకు నమస్కరించి వారు చెప్పిన విధముగా నడచుకొని చూపిస్తే మీ పిల్లలు మిమ్ములను అనుకరిస్తారు.
మన సంస్కృతి సంప్రదాయము ఏనాడు చెప్పకుండా వుంటే వారికి ఎన్నడు ఎప్పుడు తెలుసుకునేది?
వానికి తల దువ్వి పూలు పెట్టి బడికి పంపడంలేదే! ఎప్పుడూ తల విరబోసుకోవడం మట్టుకే కదా మీరు నేర్పించేది. ఏ చోట స్త్రీ కేశములు విరబోసుకొని సంచరిస్తుందో అచ్చోట వెల్లుల్లి చెట్టు కూడా పెరగదు అని శాస్త్రం చెప్పలేదా? ఇప్పుడు చిన్న పిల్లల నుండి ముదుసల్లవరకు తల విరవపోసుకోవడం ఒక జాడ్యం అయిపోయింది.
పిల్లల ఎదుట తాగుడు, ధూమపానం, చీట్లు ఆడడం చేస్తే ఇక పిల్లలు ఏమైపోతారు?
మన పండుగలు సంబరాలు చేయకుండా కేవలం పుట్టినరోజు దీపము ఆర్పడం అలవాటు చేస్తే ఇక గతి ఏమి?
పిల్లో, పిల్లవాడు పరాయి జాతి వారిని వివాహము చేసుకోవడం ఇల్లు వదలి పారిపోవడం అన్యమత స్వీకారం చేయడానికి కారకులు మీరే కదా?
డబ్బు డబ్బు డబ్బు అని పరుగిడడం, విదేశభాష కళాచార వ్యామోహం వల్లే కదా!
మన సంస్కృతీ కళాచారాదులని మనమే అనుకరించకుండా వుంటే మన పిల్లలు ఎలా పాటిస్తారు?
ముందు మడక పోయినట్టుగానే కదా వెనుక మడక పోవును.

No comments:

Post a Comment