ధనుర్మాసం ప్రారంభం

ధనుర్మాసంలో చేసే వ్రతం కనుక దీనిని ధనుర్మసవత్రంగా పిలుస్తున్నాం. మనకు మేషం నుండి మీనం వరకు పన్నెండు రాశులున్నాయి. సూర్యుడు నెలకో రాశిలో ప్రవేశిస్తుంటాడు. దీనిని సంక్రమణం లేక సంక్రాంతి అంటున్నాం. ఉదాహరణకు సూర్యుడు మేష రాశిలో ప్రవేశిస్తే ధనుస్సంక్రమణం లేదా మేష సంక్రాంతి అవుతుంది. అలాగే సూర్యుడు ధనూరాశిలో ప్రవేశిస్తే ధనుస్సంక్రమణం లేక ధనుస్సంక్రాంతి అవుతుంది. ఒక రాశిలో ప్రవేశించిన సూర్యుడు నెలపాటు ఆ రాశిలో వుంటాడు కనుక ఆ రాశి పేరున ఆ సంక్రాంతిని వ్యవహరిస్తారు. ధనూరాశిలో ఒక మాసం పాటు సూర్యుడు వుంటాడు కనుక ఆ మాసాన్ని ధనుర్మానం అనడం జరుగుతోంది. మార్గశీర్ష మానం ఆరంభమైన ఏడు రోజులకు ధనుస్సంక్రమణం జరుగుతుంది. అంటే మార్గశీర్ష మాసపు ఏడవ రోజునుండి పుష్యమాసం ప్రారంభమైన ఆరవ రోజు వరకు ఉంటుంది. 30వ రోజును భోగి పండుగగాను, ఆ మరుసటిరోజున మకర సంక్రాంతి పండుగగాను మనం జరుపుకుంటాం.

ఈ ధనుర్మాస వ్రతం మార్గశీర్షపు ఏడవ రోజునుండి ప్రారంభమై పుష్యమాసపు ఆరవ రోజువరకు నిరంతరాయంగా సాగుతుంది. వ్రతాన్ని ధనుర్శాసంలోనే ఎందుకు చేయాలన్న సందేహం రావచ్చు. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా 'మాసోహం మార్గశీర్షోహం' అని తానే మార్గశీర్ష మాసాన్నని భగవద్గీతలో సెలవిచ్చాడు. ఇది శ్రీకృష్ణ భగవాసునికి ప్రీతి పాత్రమైన మాసం కాబట్టి స్వామిని ఈ మాసంలో విశేషంగా ఆరాధిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని శ్రీ గోదాదేవి మనకు నిరూపించి చూపింది. మనకు ఉత్తరాయణం, దక్షిణాయనం అని రెండు పుణ్యకాలాలున్నాయి. ఇందులో ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకు పగలుగను, దక్షిణాయన పుణ్యకాలం వారికి రాత్రిగాను పరిగణించబడతాయి. ఇందులో మార్గశీర్ష మాసం ఉత్తరాయణ పుణ్యకాలానికి ఉషఃకాలమాట. అంటే బ్రహ్మీ ముహూర్తమన్నమాట! కావుననే మార్గశీర్షమాసం ఇంత ఆధిక్యతను సంతరించుకుంది. ఇక ధనుర్మస వ్రత విషయానికొస్తే శ్రీ ద్వాపరయుగంలో శ్రీ కృష్ణ సంశ్లేషమును పొందగోరిన గోపకన్యలు వ్రేపల్లెలో కాత్యాయినీ వ్రతాన్ని చేశారని విని, తానూ అలాగే చేయాలనుకుంది. తానున్న విల్లిపుత్తూరును వ్రేపల్లెగను, తన్ను ఒక గోప కన్యకగను, తన స్నేహితురాళ్ళను వ్రజ కన్యలుగను భావించి, తాను గొల్ల కన్య రూపాన్ని ధరించి విల్లిపుత్తూరులో వేంచేసియున్న వటపత్రశాయినే శ్రీకృష్ణునిగా భావించి, అతి శ్రేష్ఠమైన మార్గశీర్షమాసాన ధనుర్మాససమయంలో శ్రీ స్వామివారిని నెలరోజులూ అర్చిస్తూ రోజుకొక పాశురాన్ని(పాట) సమర్పించింది. ఆమె పాడిన పాటలు సామాన్యమైనవి కావు.

శ్రీ గోదాదేవి స్వామికి సమర్పించిన పాశురాలు ప్రణవమంత్ర, అష్టాక్షరీ మంత్ర, స్వరూపాలే. వేదోపనిషత్తుల సారాంశమే! నియమ నిష్ఠలతో స్వామిని ఆరాధిస్తే ముప్పది దినాల్లోనే తరుణోపాయం లభిస్తుందని చాటి చెప్పింది మన ఆండాళ్ తల్లి చూపిన మార్గంలో పయనించి మన జీవితాలను ధన్యం చేసుకుందాం.
వ్రతం చేయదల్చుకున్న వారెవరైనా ఆచార్య నిష్ఠను కలిగి కులమత వర్గ భేదాల కతీతంగా ఉండి బ్రాహ్మీ ముహూర్తంలో బహిర్ స్నానం చేయటం అంతర్ మనస్సుకు భక్తిజల స్నానాన్నవలంభించటం ముద్గాన్నం వండి ఆరగింపు చేయగలగటం ఇవే నియమాలు.

సూర్యదేవుడు ధనుస్సురాశిలో ప్రవేశించడంతో మొదలై భోగిపండుగ రోజువరకూ, సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించేంతవరకూ ఉండే మాసం - "ధనుర్మాసం". వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసం ఇది. మాసమంతా వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. గోదాదేవి రచించిన "తిరుప్పావై" ని ఈ మాసం రోజులు పఠిస్తారు. ముఖ్యంగా కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల రోజులు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావైని పఠిస్తారు. అటువంటి పవిత్రమైన ధనుర్మాసంలో శ్రీమహావిష్ణువును "మధుసూదనుడు" అనే పేరుతో పూజించాలి. ప్రతిదినం పూజించి మొదటి పదిహేను రోజులూ నైవేద్యంగా పులగం లేదా చెక్కరపొంగలిని, తర్వాతి పదిహేను రోజులు దధ్యోదనమును సమర్పించాలి. ధనుర్మాసం మొత్తం ఇంటి ముందు ఆవుపేడను కలిపిన నీటిని చల్లి బియ్యపుపిండితో అందమైన ముగ్గులు పెట్టి, ముగ్గుల మధ్యలో ఆవు పేడతో చేసి, పసుపు, కుంకుమలు, వివిధ పూలను అలంకరించిన గొబ్బిళ్ళను ఉంచాలి. ఈ విధంగా చేయడం వల్ల కన్యకు మంచి భర్త లభిస్తాడు, సౌభాగ్యం కలకాలం వర్థిల్లుతుంది అని నమ్మకం. 

ప్రత్యక్ష భగవానుడైన శ్రీసూర్యభగవానుడు మేషరాశి మొదలు పన్నెండు రాశులలో సంచరిస్తుంటాడు. ద్వాదశాత్మడైన ఆదిత్యుడు, తన దివ్యయాత్రలో ధనస్సు రాశిలోనికి ప్రవేశిస్తూనే "ధనుర్మాసం" ప్రారంభమై, సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించేంతవరకూ, అంటే మకర సంక్రాంతి పర్వదినం ముందురోజు భోగి వరకు వుంటుంది. ఈ నెలరోజుల పాటూ "ధనుర్మాసవ్రతం" ఆచరించాలి. ధనుర్మాసం గురించి మొదట బ్రహ్మదేవుడు స్వయంగా నారద మహర్షికి వివరించినట్లు పురాణకథనం. ధనుర్మాస వ్రత ప్రస్తావన, మహాత్మ్యాలు బ్రహ్మాండ, భాగవత ఆదిత్యపురాణాల్లో, నారాయణ సంహితలో కనిపిస్తుంది. 

విష్ణువును 'మధుసూదనుడు' అనే పేరుతో వ్యవహరించాలి. ప్రతి రోజు సూర్యోదయానికి కంటే ఐదు ఘడియలు ముందుగా నిద్ర లేచి కాలకృత్యాలను పూర్తిచేసుకుని, తలస్నానం చేసి నిత్యపూజలు, సంధ్యావందనాలను ముగించి, తరువాత ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి. మధుసూధనస్వామిని ఆవు పాలు, కొబ్బరి నీరు, పంచామృతాలతో అభిషేకించాలి. అందుకోసం శంఖాన్ని ఉపయోగించడం శ్రేష్ఠం. శంఖంలో అభిషేక ద్రవ్యాలను ఒక్కొక్కదానినే నింపుకుని, అభిషేకం చేయాలని శాస్త్రవచనం. తర్వాత తులసీ దళాలతోనూ, వివిధ రకాలైన పుష్పాలను ఉపయోగించి స్వామి వారిని అష్టోత్తర శతనామాలతోగానీ, సహస్రనామాలతోగానీ, పూజించాలి. నైవేద్యంగా మొదటి పదిహేనురోజులూ 'చెక్కర పొంగలి' ని గానీ, బియ్యం, పెసరపప్పు కలిపి వండిన 'పులగం'ను గానీ సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులూ 'దధ్యోదనం' నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత ధూప, దీప, దక్షిణ, తాంబూలాలను సమర్పించి నమస్కరించుకోవాలి. మధుసూధనస్వామివారిని పూజించడంతో పాటూ బృందావనంలో తులసిని పూజించాలి. ఈ మాసమంతా విష్ణుపురాణాన్ని, విష్ణుగాథలను చదువుతూగానీ, వింటూగానీ గడపడం, వైష్ణవాలయాలను దర్శించడం చేయాలి.

ధనుర్మాసంలో ప్రతిరోజూ తెల్లవారుజామునే నిద్ర లేచి, కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేయాలి. ఇంటిముందు శుభ్రపరిచి పేడనీటితో కళ్ళాపి చల్లి, బియ్యపు పిండితో ముగ్గులను తీర్చిదిద్ది, ముగ్గుల మధ్యలో ఆవుపేడతో చేసిన గొబ్బిళ్ళను ఉంచి, వాటిని గుమ్మడి, బీర, చామంతి, బంటి వంటి పూలతో అలంకరించి నమస్కరించాలి. అనంతరం కాత్యాయనీదేవిని షోడశోపచారాలు , అష్టోత్తరాలతో పూజించి నైవేద్యం సమర్పించాలి. ఈ విధంగా ప్రతిరోజూ ధనుర్మాసమంతా ఆచరించాలి. తెలుగునాట గొబ్బెమ్మల వ్రతంగా పేరు పడిన ఈ కాత్యాయనీ వ్రతాన్ని కన్యలు ఆచరించడం వల్ల మంచి భర్త లభిస్తాడని శాస్త్రవచనం.
వ్రతం ప్రాతఃకాలములో ప్రారంభం అయితే రోజూలాగ కాక సూర్యోదయానికి ముందే పూజ అయ్యేటట్టు చూసుకోవాలి. నైవేద్యం సమర్పంచాలి(రోజు పొంగలి,తద్ధోజనం,పరవన్నం ఉండి తీరాలి....కాలము ఉంటే గోదాదేవి పాటలు కూడా పాడుకోవచ్చు...
ఆచరిద్దాం! శ్రీ గోదా రంగనాధుల అనుగ్రహాన్ని పొందుదాం.

No comments:

Post a Comment