Showing posts with label శనివారం). Show all posts
Showing posts with label శనివారం). Show all posts

హనుమజ్జయంతి (ఏప్రియల్ 4, 2015, శనివారం)

హనుమంతుని జయంతిని చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకుంటారు.
హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు
హనుమంతుడు అంజనాదేవి, కేసరిల పుత్రుడు. వాయుదేవుని ఔరస పుత్రుడు. మహాబలుడు. శ్రీరామ దాసుడు. అర్జునుని సఖుడు. ఎర్రని కన్నులుగల వానరుడు. అమిత విక్రముడు. శతయోజన విస్తారమైన సముద్రమును దాటినవాడు. లంకలో బందీయైన సీతమ్మతల్లి శోకమును హరించినవాడు. ఔషధీ సమేతముగా ద్రోణాచలమును మోసుక వచ్చి యుద్ధమున వివశుడైన లక్ష్మణుని ప్రాణములు నిలిపినవాడు. దశకంఠుడైన రావణాసురుని గర్వమును అణచినవాడు. హనుమంతుని ఈ నామములు నిదురించుటకు ముందు, ప్రయాణమునకు ముందు స్మరించినవారికి మృత్యుభయం లేదు. వారికి సర్వత్ర విజయం లభిస్తుంది.

చైత్రమాసము (మార్చి 21, 2015, శనివారం)

చైత్ర మాసము తెలుగు సంవత్సరంలో మొదటి నెల. పౌర్ణమి రోజున చిత్త నక్షత్రము (అనగా చంద్రుడు చిత్తా నక్షత్రం తో కలిసిన రోజు) కావున ఆ నెల చైత్రము. ఇంగ్లీషు క్యాలెండరు ప్రకారం సాధారణంగా మార్చి-ఏప్రిల్ నెలల్లో వస్తుంది. ఈ నెలతో వసంత ఋతువు ప్రారంభం కావడం వల్ల చెట్లన్నీ కొత్తగా చిగురించడం, పూతపూయడం మొదలు పెడతాయి. చలికాలం ముగియడంతో వాతావరణం నులివెచ్చగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.
చైత్ర మాసము పండుగలు
చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది , శ్వేతవరాహకల్పం ప్రారంభం ,ఆర్యసమాజం స్థాపన
చైత్ర శుద్ధ విదియ అరుంధతీవ్రతము సౌభాగ్య గౌరీ వ్రతము
చైత్ర శుద్ధ తదియ శివడోలోత్సవము మత్స్య జయంతి
చైత్ర శుద్ధ చతుర్థి గణేశ దమనపూజ
చైత్ర శుద్ధ పంచమి శాఇహోత్రపంచమి, వసంతపంచమి కూర్మకల్పం ప్రారంభం
చైత్ర శుద్ధ షష్ఠి స్కంద దమనపూజ
చైత్ర శుద్ధ సప్తమి సూర్య దమనపూజ
చైత్ర శుద్ధ అష్ఠమి భవానీ అష్ఠమి, అశోకాష్టమి
చైత్ర శుద్ధ నవమి శ్రీరామనవమి
చైత్ర శుద్ధ దశమి ధర్మరాజదశమి
చైత్ర శుద్ధ ఏకాదశి కామదైకాదశి రుక్మిణీపూజ
చైత్ర శుద్ధ ద్వాదశి భాతృప్రాప్తివ్రతము
చైత్ర శుద్ధ త్రయోదశి మదనత్రయోదశి
చైత్ర శుద్ధ చతుర్దశి శైవచతుర్దశి
చైత్ర పూర్ణిమ హనుమజ్జయంతి
చైత్ర బహుళ పాడ్యమి పాతాళవ్రతం
చైత్ర బహుళ విదియ *
చైత్ర బహుళ తదియ *
చైత్ర బహుళ చవితి *
చైత్ర బహుళ పంచమి మత్స్య జయంతి
చైత్ర బహుళ షష్ఠి *
చైత్ర బహుళ సప్తమి *
చైత్ర బహుళ అష్ఠమి *
చైత్ర బహుళ నవమి *
చైత్ర బహుళ దశమి *
చైత్ర బహుళ ఏకాద శి వరూధినిఏకాదశి
చైత్ర బహుళ ద్వాదశి *
చైత్ర బహుళ త్రయోద శి వరాహజయంతి
చైత్ర బహుళ చతుర్దశి మాసశివరాత్రి
చైత్ర బహుళ అమావాస్య మేష సంక్రాంతి