ఉదయం లేవగానే

కరదర్శనం :- కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి / కరమూలే స్థితాగౌరి ప్రభాతే కరదర్శనం //
చేయి పైభాగాన లక్ష్మీ, మధ్యభాగమున సరస్వతి, చివరిభాగమున గౌరీదేవి వున్నందున ప్రాతః కాలమున ఈ శ్లోకం చదివి మన రెండు చేతులను కళ్ళకు అద్దుకోవలెను.
లేదా
మూడుసార్లు శ్రీహరి, శ్రీహరి శ్రీహరి అని తలస్తూ కరదర్శనం చేసుకోవలెను)

భూప్రార్ధన :- సముద్ర వసనే దేవి పర్వతస్తన మండలే / విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్యమే //
పాదస్పర్శతో భూదేవిని బాధిస్తున్నందుకు క్షమాపణ చెప్తూ కాలిని నేలకు ఆన్చాలి.
లేదా
పాదస్పర్శ క్షమస్వమే, భూదేవి నమోస్తుతే అనైన ప్రార్ధించవచ్చును)

ప్రాతః స్మరణ :- బ్రహ్మ మురారి స్త్రిపురాంతకశ్చ, భాను శ్శశీ భూమిసుతో బుధశ్చ / గురుశ్చ శుక్ర శ్శని రాహు కేతవః, కుర్వంతం సర్వే మమ సుప్రభాతమ్ //
త్రిమూర్తులు, సూర్యచంద్రులు, నవగ్రహాలు నాకు మేలు చేయుదురుగాక!
లేదా
హరం హరిం హరిశ్చంద్రం హనూమంతం హలాయుధమ్ / పంచకం వై స్మరేన్నిత్యం ఘోరసంకటనాశనమ్ //

స్నాన విధి :- గంగే చ యమునే చైవ కృష్ణే గోదావరి సరస్వతి / నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు //
లేదా
యో సౌ సర్వగతో విష్ణు: చిత్ స్వరూపీ నిరంజనః / స ఏవ ద్రవరూపేణ గంగాంభో నాత్ర సంశయః //

(భాహ్యాభ్యంతరభేదేన శౌచం తు ద్వివిధం స్మృతమ్ / మృజ్జలాభ్యాం బహిశుద్ధి ర్భావశుద్ధి స్తదాన్తరమ్ //
బాహ్యాభ్యంతర భేదములచే శౌచం రెండువిధములుగా వుండును. జలముచే కలిగెడుశుద్ధి బాహ్యశుద్ది, నిర్మలభావము(భావశుద్ధి) చే కలిగెడుశుద్ధి అంతర శుద్ధి).

ఆత్మను పరమాత్మలో లయం చేయడానికి మన పూజావిధానం ఒక ఉతమోత్తమ మార్గం. దేవుని విగ్రహం లేదా చిత్రం విశ్వాత్మకు ప్రతిబింబం. విగ్రహం భూతత్వమైనది. అలానేసాంబ్రాణి ధూపం భూతత్వమైన వాసన కల్గివుంటుంది. ఇవి మూలాధారచక్రమును ఉత్తేజితం చేస్తుంది. అలానే తీర్ధ ప్రసాదాలు రుచి ద్వారా స్వాదిష్టానాన్ని ఉత్తేజితం చేస్తుంది. దీపం, హారతి ద్వారా జనించిన అగ్ని మణిపూరచక్రమును, గంధం, అగరబత్తిల ద్వారా వాయుతత్వమైన అనాహతచక్రమును, గంటానాదం ద్వారా విశుద్ధిచక్రం ఉత్తేజితం అవుతాయి. తద్వారా ఆజ్ఞాచక్రం, సహస్రారం జాగృతం అవుతాయి. ఇట్లా మనలోని నాడీకేంద్రాలను జాగృతం చేసుకోవడానికి పూజావిధానాన్ని ప్రాచీన మహర్షులు మనకందించారు. మంత్రాలు, ప్రార్ధనలు, సంకీర్తనలు, అర్చనలు, పూజలు ద్వారా మన షట్చక్రాలను మేలుకొల్పి కుండలినీశక్తిని పైకి నడిపి సహస్రారంలో గల పరమాత్మతత్వాన్ని ఆరాదిస్తున్నాం.

పూజావిధం :- చిత్రం, మృత్తిక, శిల, దారువు, లోహం.... దేనితో తయారైనదైనా దానిని భగవంతుని ప్రతిరూపముగా భావించి పూజిస్తాం. [ఈ రూపాలు మన ప్రగాడ విశ్వాసభావనతో ఏర్పరుచుకున్నవి]
{న తే రూపం న చాకారో నాయుధాని న చాన్పదమ్ / తధ్కాపి పురుషాకారో భక్తానాం త్వం ప్రకాశాసే //
భగవంతునికి ప్రత్యేకముగా ఒక్క రూపముగాని, ఒక్క ఆకారముగాని, ఆయుధముగాని (శంఖు,చక్ర,డమరు మొదలగు), వైకుంఠ కైలాసాది ప్రత్యేక స్థలములుగాని లేనప్పటికిని భక్తవత్సలగుటచేతను, పరమకరుణాస్వరూపులగుటచేతను భక్తులయొక్క భావమును అనుసరించి అనేకరూపములను ధరించుచున్నారు.
యే యధా మాం ప్రవద్యంతే తాంస్తదైవ భజామ్యహం ..... ఎవరు ఎలాంటి భావముతో నన్ను ఉపాసింతురో వారికాలాంటి భావముతో దర్శనమిత్తును.}

దీపస్తుతి :- దీపం జ్యోతి: పరబ్రహ్మ దీపం సర్వ తమోపహమ్ / దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే //
దీపజ్యోతే పరబ్రహ్మం. దీపజ్యోతే అన్ని తమో గుణాలని హరించేది. దీపం వల్లే సర్వం సాధ్యం. సంధ్యలో వెలిగే దీపానికి నమస్కారాలు. [దీపకాంతిలో తమోరజో గుణాలు హరిస్తాయి]

నమస్కారం :- పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవః / త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల //
తలవంచి రెండు చేతులు జోడించి హృదయం వద్దగానీ, భ్రూమధ్యంలో గానీ, నెత్తి పై అంటే సహస్రారంపై గానీ పెట్టి నమస్కరించడానికి కారణం ఏమిటంటే - మూడు ప్రదేశాలలో భగవంతుని భావన విశేషంగా ఉంటుంది. హృదయంలో ఆత్మరూపములో, భ్రూమధ్యంలో జీవరూపములో, సహస్రారంలో పరమాత్మరూపములో ఉంటుంది.
'న' అంటే లేదు, 'మ' అంటే నాది అయినటువంటిది అని అర్ధం. నమః అంటే నాదంటూ ఏదిలేదని అర్ధం. భగవంతున్ని నమష్కరించడం అంటే నాదంటూ ఏదిలేదని, ఉన్నదంతా నీదే (పరమాత్మదే) అని శరణాగతి భావమును తెలపడం.

పూజకు వినియోగించే పదార్దముల అంతరార్ధం :- కృష్ణభగవానుడు చెప్పిన పత్రం, పుష్పం, ఫలం, తోయంలకు అర్ధమేమిటంటే - పత్రం అంటే దేహం. ఈ శరీరమును వినియోగిస్తూ చేసే క్రియలను భక్తిభావముతో కృష్ణార్పణం చేయాలి.(ప్రారబ్ధకర్మనుండి విముక్తి కల్గుతుంది) పుష్పం అంటే హృదయం. పుష్పములా సున్నితముగా, సువాసనభరితంగా, స్వచ్ఛముగా వున్నా హృదయమును సమర్పించాలి. ఫలం అంటే కర్మఫలం. ఫలములో విత్తనములు వుంటాయి, అవి నాటితే తిరిగి చిగురిస్తాయి. అలానే కర్మల వలన జన్మించాల్సివస్తుంది. అలానే కర్మఫలాన్ని అనుభవించాల్సివస్తుంది. అలా కాకుండా త్రికరణశుద్ధిగా కర్మఫలాన్ని ఈశ్వరార్పణం చేస్తే కర్మబంధం తప్పుతుంది.(దీనివలన సంచిత, ఆగామి కర్మలనుడి విముక్తికల్గుతుంది) తోయమనగా భక్తిరసం. ఆరాధనతో, ఆర్తితో పరిపూర్ణ శరణాగతి భక్తిభావముతో మనస్సు ఉప్పొంగికార్చే ఆనందభాష్పాలను సమర్పించాలి.
కొబ్బరికాయ :- కొబ్బరికాయ కొడుతున్నామంటే మన అహంకారమును వీడుతున్నామని. కొట్టిన కొబ్బరిచెక్కలను భగవంతునికి సమర్పించడమంటే - లోపలున్న తెల్లనికొబ్బరిలా మన మనస్సును సంపూర్ణముగా భగవంతుని ముందు పరిచామని. తద్వారా నిర్మలమైన కొబ్బరినీరులా మన జీవితాలని వుంచమని అర్ధం. కొబ్బరి బయటిభాగం మన శరీరమని, లోపలభాగం మన మనస్సని, మూడుకళ్ళు ఇడా,పింగళ, సుషమ్ననాడులని కూడా పెద్దలు చెప్తారు. అలానే కొబ్బరికాయపై పీచును తమోగుణమునకు ప్రతీకగా, గట్టిగా ఉండే టెంక రజోగుణమునకు ప్రతీకగా, లోపల ఉన్న తెల్లని కొబ్బరిని సత్వగుణమునకు ప్రతీకగా విశీదకరిస్తూ, మనలో ఉన్న త్రిగుణములను బద్దలుకొట్టి పావనమైన అంతఃకరణమును కొబ్బరినీరుగా భగవంతునికి అర్పించడమనే అర్ధాని కొందరు చెప్తారు. 

ధూపం
:- సువాసనభరితమైన ధూపం మనలో వున్న చెడువాసనలను తొలగించాలని వెలిగిస్తాం.

హారతి స్తుతి :- ఆరోగ్యం ఆయుష్యం అనంతసౌఖ్యం
సంపత్సముర్ధ్యం శుభసన్నిధానం
కర్పూరదీవేన లభస్త్యదేహి
నీరాజనయే వేంకటనాధ నిత్యమ్.మనలోనికి
కర్మవాసనలన్నియు కర్పూరముల పూర్తిగా క్షయింపబడాలని. ఏ శేషములేకుండా భగవంతుని ముందు వెలిగించిన హారతి భగవంతునిలో కైకర్యం చెందినట్లుగా భక్తిభావంతో మనలోవెలుగుతున్నఆత్మ పరమాత్ముని యందు ఐక్యంకావాలని కోరుకోవడం. హారతిని కళ్ళకు అద్దుకోవడమంటే మన దృష్టి అంతర్ముఖం కావాలని. 

గంట :- మనస్సు ఎన్నో విషయాలు (జ్ఞాపకాలు, ఆలోచనలతో) తో నిండి ఉంటుంది. వాటన్నింటిని విడిచి కొన్ని క్షణములైన దైవమందు మనస్సు నిల్పవలయునని ఉద్దేశ్యంతో గంటను పుజాసామగ్రిలో ఓ భాగంగా పూర్వీకులు ప్రవేశపెట్టారు. ఘంటారావం వినగానే అనేక విషయాలయందు తిరిగే మనస్సు ఆ నాదమందైక్యమై నాదం ఏకస్థాయికి వచ్చునట్లు మనస్సు కూడా ఏకస్థాయికి వచ్చును అని పెద్దలు చెప్తారు. ఘంటానాదం నిశ్చబ్ధ స్థితిలోకి తీసుకువెళ్ళి, మన మనస్సును నిజ తత్వమైన ఆత్మవైపు కాసేపైన మళ్ళిస్తుంది. శబ్దంలోనుంచి నిశ్శబ్ధం, శూన్యంలోకి వెళ్ళమని గంట సూచిస్తుంది.

నైవేద్య నివేదన శ్లోకం :- త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే /తేన త్వదంఘ్రి కమలే భక్తిం మే యచ్చ శాశ్వతీం
గోవిందా! నీ వస్తువులు నీకే సమర్పిస్తున్నాను. వీనితో నీ చరణకమలాలపై శాశ్వతమైన భక్తి కలుగునట్లు ప్రసాదించు.

ప్రదక్షిణ స్తుతి :- యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ / తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే //
ప్రదక్షిణ అనగా నేను అన్నివైపుల నుండి నిన్నే కాంచుతూ నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నానని అర్ధం. 'ప్ర' అనగా పాపాల నాశనమని, 'ద' అనగా కోరికలు తీర్చమని, 'క్షి' అనగా మరు జన్మలో మంచి జన్మ ఇవ్వమని, 'ణ' అంటే అజ్ఞానం పారద్రోలి ఆత్మజ్ఞానమును ఇవ్వమనే అర్ధమును కొందరు చెప్తారు. 

దివ్యమంగళకరమగు భగవద్విగ్రహంను దర్శిస్తూ నేతేన్ద్రియములు భక్తిత్వంలో లయించును. సుగంధ ధూపవాసనలచే ఘ్రానేన్ద్రియం లయించును. ఓంకారం, గంటానాదం, శంఖారావం, మంత్రోచ్చారణలయందు కర్ణేన్ద్రియములు లీనమగును. భాగావన్నామోచ్చారణల చేతను, తీర్ధాది ప్రసాదముల చేతను జిహ్వేంద్రియం లయించును. పరిమిళమిళిత శీతలదాయకమగు పసుపుకుంకుమ చందనాదులచే త్వగింద్రియం శాంతంనొంది పవిత్రభావాలతో పులకరించును. పంచేంద్రియములు ఇలా ఒకే ధ్యాసతో భక్తిభావంనందు లయమైనప్పుడే మనస్సు కూడా పూర్తిగా ఏకాగ్రతతో యందు లయించును.

సూర్య స్తుతి :
- ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మామ భాస్కర / దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే //
లేదా
సప్తాశ్వరధ మారుడం ప్రచండం కశ్యపాత్మజమ్/ శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ //
లేదా
త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరమ్ / మహాపాపహారం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ //

తులసి స్తుతి:- యన్మూలే సర్వతీర్ధాని యన్మధ్యే సర్వదేవతాః / యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహమ్ //
లేదా
ప్రసీద దేవదేవేశి ప్రసీద హరివల్లభే / క్షీరోదమాధనోద్భూతే తులసి త్వాం నమామ్యహమ్ //

నవగ్రహ స్తుతి :- ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయచ / గురు శుక్ర శనిభ్యశ్ఛ రాహవే కేతవే నమః //

గురు స్తుతి :- గురు బ్రహ్మా గురు విష్ణు: గురు దేవో మహేశ్వరః / గురు సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః //
లేదా
అఖండ మండలాకారం వ్యాప్తం యేవ చరాచరమ్ / తత్పదం దర్శితం యేవ తస్మై శ్రీ గురవే నమః //
లేదా
అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా / చక్షురున్మీలితం యేవ తస్మై శ్రీ గురవే నమః //

భోజనమునకు ముందు
:- (ఏది భుజించినను భగవంతుని ప్రసాదముగానే స్వీకరించాలి)
అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లబే / జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం భిక్షాం దేహి చ పార్వతి //
లేదా
అన్నం బ్రహ్మరసో విష్ణు: భోక్తా దేవో మహేశ్వరః / ఇతిస్మరన్ ప్రభుం జానః దృష్టి దోషై: నలిప్యతే //
మరియు
బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ / బ్రహ్మైవ తేవ గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా //
మరియు
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః / ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ //

భోజనము తర్వాత
:- అగస్త్యం కుంభకర్ణంచ శమ్యంచ బడబానలమ్ / ఆహారపరిణామార్ధం స్మరామి చ వృకోదరమ్ //
మరియు
విష్ణు: సమస్తేంద్రియ దేహదేహీ ప్రదానభూతో భగవాన్ యధైకః / సత్యేన తేనాత్త మశేష మన్నం ఆరోగ్యదం మే పరిణామ మేతు //

ప్రయాణం విధి :- జలే రక్షతు వారాహః స్థలే రక్షతు వామనః / అతవ్యాం నారసింహశ్చ సర్వతః పాతుకేశవః //
నీటిబాధనుంచి వరాహావతారం, భూ సంబంధమైన బాధలనుంచి వామనావతారం, అడవుల్లోని బాధలనుంచి నరసింహావతారం, అన్ని బాధలనుంచి అన్ని అవతారాలకి మూలమైన శ్రీహరి రక్షించుగాక!
లేదా
వనమాలీ గదీ శారజ్ఞి శంఖీ చక్రీ చ నందకీ / శ్రీమాన్ నారాయణో విష్ణు: వాసుదేవోభిరక్షతు //
లేదా
ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదామ్ / లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం //

కార్యసిద్ధి :- వినాయకం గురుం భానుం బ్రహ్మ విష్ణు మహేశ్వరాన్ / సరస్వతీం ప్రణమ్యాదౌ సర్వకార్యార్ధ సిద్ధయే //

స్మృతి సిద్ధి :- శ్రీదత్తో నారదో వ్యాసః శుకశ్చ పవనాత్మజః / కార్తవీర్యశ్చ గోరక్షో సప్తైతే స్మృతిగామినః //
(అనుకున్నది సిద్ధించడానికి, జ్ఞాపకశక్తి పెరగడానికి)

చంద్ర దర్శన స్తుతి
:- క్షీరార్ణవ సముత్పన్న లక్ష్మీప్రియ సహోదర / మహేశమకుటాభాస్వన్ బాలచంద్ర నమోస్తుతే //

గోవు దర్శన స్తుతి :- గావో మే చాగ్రతో నిత్యం గావః పృష్ఠత ఏవ చ / గావో మే హృదయేచైవ గవాం మధ్యే వసామ్యహమ్ //
మరియు
మంగళం దర్శనం ప్రాతః పూజానం పరమం పదమ్ / స్పర్శనం పరమం తీర్ధం నాస్తి ధేనుసమం క్వచిత్ //

ఔషద విధి :- ధన్వంతరిం గురుత్మంతం ఫణిరాజం చ కౌస్తుభమ్ / అచ్యుతం చామృతం చంద్రం స్మరే దౌషధకర్మణి //
లేదా
శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే / ఔషదం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరి: //
లేదా
అచ్యుతానంత గోవింద నామోచ్చారణ భేషజాత్ / నశ్యంతి సకలా రోగాః సత్యం సత్యం వదామ్యహమ్ //

శయనవిధి :- రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరం / శయనే యః స్మరేన్నిత్యం దుఃస్వప్నం తన్న నశ్యతి //
లేదా
అగస్త్యో మాధవశ్చైవ ముచుకుందో మహాబలః / కపిలో ముని రాస్తీకః పంచైతే సుఖశాయినః //
లేదా
హనుమా నంజనాసూను: వాయుపుత్రో మహాబలః
రామేష్ఠ: ఫల్గునసఖః పింగాక్షోమిత విక్రమః
ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకః
లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పహా
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః
స్వాపకాలే పఠే న్నిత్యం యాత్రాకాలే విశేషతః
తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్.

కుంకుమ ధారణ :- కుంకుమస్త్రీ పురుషులు ధరించడం మన సనాతన ఆచారం. ఇది తప్పనిసరి. ఎందుకంటే - రెండు కనుబొమలకు మద్యభాగమైన నుదుటిస్థానం 'ఇడ' 'పింగళ' 'సుషుమ్న' అనే ప్రధాన నాడుల సంగమస్థానం. కుంకుమ ధరించడం పవిత్రతకు, అస్తికత్వానికి, ధార్మికత్వానికి పురుషులకు సంకేతమైతే, స్త్రీలకు ఐదవతనానికి, సౌభాగ్యానికి, స్థిరబుద్ధికి సంకేతంగా చెప్తారు. కుంకుమ మనిషిలోని మనోశక్తిని, త్యాగతత్వాన్ని, నిర్భయత్వాన్ని, సహృదయతను పెంపొందిస్తుంది. మనం బొట్టు పెట్టుకునే చోటే అజ్ఞాచక్రం ఉంటుంది. దానికి త్రివేణి సంగమమని, అమృతస్థానమని పేరు. ధ్యానానికి ఇది ముఖ్యస్థానం. ఈచోట కుంకుమధారణ వలన పుష్టి, భక్తి, ఐశ్వర్యం మొదలైనవి కలుగుతాయి.

Santhana Gopala Mantram

ఓం దేవకీ సుధా  గోవిందవాసుదేవ  జగత్  పతే 
దేహిమేయ్  తనయం కృష్ణ  త్వామహం శరణం 
కదహా ధెవ ధెవ ఝగన్నత ఙ్హొత్ర వ్రిది కరప్ ఫ్రభొ
ధెహిమెయ్ థనయమ్ షీగ్రమ్ ఆయుశ్మన్దమ్ యశశ్రీనమ్

సంతానం కలగాలంటే గోపాల స్తోత్రం పటించాలి

Om Devaki Sudha Govinda
Vasudeva Jagath Pathe
Dehimey Thanayam
Krishna Thwamaham
Saranam
Kadhahaa Deva Deva
Jagannatha
Gothra Vridhi Karap Prabho
Dehimey Thanayam Sheegram
Ayushmandham Yashashreenam

**********************************************

 ఓం దేవకీ సుధా గోవింద 
వాసుదేవ జగత్ పతే 
దేహిమే తనయం 
కృష్ణ త్వామహం 
శరణం 
కధహా దేవ దేవా
జగన్నాధ 
గోత్ర  వృ ద్ది   కరప్ ప్రభో 
 దేహి మే  తనయం శీగ్రం 
అయుష్ మన్దం  యశశ్రీనమ్ 

విజయాలకి భక్తి మార్గాలు

సాధారణంగా రోజూ చేసే పూజాదికాలతోపాటు, గ్రహస్థితి బాగా లేదని తెలిసినపుడు, ఆయా గ్రహాలకు జపాలు, శాంతులు చేయించాలని చెబుతారు. దాని వలన ఆ గ్రహ ప్రభావం తగ్గుతుందని కూడా అంటారు. అలాగే మనం ఏదైనా ఓ పని జరగాలని కోరున్నప్పుడు ఆ పని సవ్యంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలంటే వివిధ దేవతా స్తోత్రాలు పఠించాలని చెబుతున్నారు పెద్దలు. ఏయే పనులకు ఏయే స్తోత్రాలు పఠించాలి, ఏ దేవతా పూజ చేయాలనే వివరాలు మీకోసం.

1. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నపుడు మంచి అవకాశాలు రావాలన్నా, చేసే ప్రయత్నాలు ఫలించాలన్నా రోజూ సూర్యాష్టకం, ఆదిత్య హృదయం చదవాలి. సూర్యధ్యానం చేయాలి.

2. ఇక వ్యాపార ప్రయత్నాలు చేస్తున్నపుడు "కనకధారా స్తోత్రం" రోజు చదివితే ఆ వ్యాపారం అభివృద్ధి చెందుతుందట.

3. ఇక మంచి విద్య రావాలన్నా, చదువులో ఏకాగ్రత కుదరాలన్నా రోజూ " హయగ్రీవ స్తోత్రం" పిల్లలతో చదివించాలి. అలాగే "సరస్వతి ద్వాదశ నామాలు" చదువుకోమనాలి.

4. కుటుంబ వ్యక్తుల మధ్య మంచి సత్సంబంధాలకు " విష్ణు సహస్రనామం, లలిలా సహస్ర నామం పారాయణ చేయాలిట.

5. పిల్లలు కలగాలని కోరుకునే దంపతులు "గోపాల స్తోత్రం " చదివితే మంచిదట. అలాగే గర్భవతిగా వున్న స్త్రీ ఈ స్తోత్రాన్ని రోజు పఠిస్తే సుఖప్రసవం అవుతుంది అంటారు పెద్దలు.

6. ఇక వివాహానికి "లక్ష్మీ అష్టోత్తర పారాయణం" చెయ్యాలి. మంచి సంబంధం దొరికి, పనులన్నీ చక్కగా జరగాలని,పెళ్లితంతు సక్రమంగా జరగాలని సంకల్పించి ఈ పారాయణాన్నీ రోజు చేస్తే ఆ కోరికలు తీరుతాయట.

7. ఋణబాధలు ఇబ్బంది పెడుతుంటే రోజూ నవగ్రహ స్తోత్రం చదువుకోవాలిట. అలా చదివితే ఆ ఇబ్బందులలోంచి బయట పడతారుట.

8. ఇవే కాక ఇక ఇతర ఏ కోరికలు సిద్ధించాలన్నా విష్ణు సహస్ర నామ పారాయణ చేస్తే చాలు ఆ కోరికలన్నీ తీరుతాయట.

అసమాన ప్రవచన చక్రవర్తి - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు

పుస్తక పఠనం చేసేవారు చాలామంది కాన వస్తారు. అందులో విషయాలను అర్ధం చేసుకునే గ్రహణపరాయణత ఉన్న వారు మరికొందరు; అలా అర్ధం చేసుకున్న విషయాన్ని, ఇంకా విశ్లేషించి సారాన్ని ఆకళించుకునే వారు బహు కొద్ది మంది. ఆ విజ్ఞాన సారాన్ని దైనందన జీవిత విధి విధానాలతో జోడించి విషయాన్ని, సామాన్య పద ప్రయోగాలతో జనా హృదయాలకు తాకేటట్టు మాటలాడ్డం ఇంకా అరుదు. ఈ అరుదైన కోవకు చెందిన వారు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈయన ప్రవచన శిరోమణి. నిరాడంబర జీవి, నిష్కలమైన వ్యక్తిత్వం వీరిధి.

శ్రీమద్భాగవతం, రామాయణం, పురాణాల మీద దాదాపు నూట ఇరవై ప్రవచనాలు చేశారు చాగంటి వారు. వీటిలో సుందర కాండ, సుబ్రహ్మణ్య వైభవం, స్థల పురాణం, గీతా వైభవం ఉన్నాయి.
చాగంటి కోటేశ్వర రావు ప్రసంగించిన ప్రవచనాలు సంపూర్ణ రామాయణము, ఇవి బాల కాండ నుండి పట్టాభి షేకము వరకు చెప్పబడ్డాయి. శివ పురాణము నండు భక్తుల కధలు, మార్కండేయ చరిత్ర, నంది కధ, జ్యోతిర్లింగ వర్ణన, లింగావిర్భావము, రమణ మహర్షి జీవితము మొదలైన అనేక విషయాలు చోటు చేసుకున్నాయి. విరాట పర్వము అనే ప్రవచనంలో భారతమునందలి అజ్ఞాత వాస పర్వము వివరించబడింది. భాగవతము అనే ప్రవచనంలో భాగవతుల కధలు, కృ ష్ణావతారం యొక్క పూర్తి కధ చోటు చేసుకుంది. భాగవత ప్రవచనాలలో ప్రధమముగా శ్రీకృష్ణ నిర్యాణం, పాండవుల మహాప్రస్థాన కధ చోటు చేసుకున్నాయి. సౌందర్య లహరి ఉపన్యాసాలు ఆది శంకరాచార్య విరచిత సౌందర్య లహరి వివరణ ఉంది. శిరిడి సాయి బాబా కధ చోటు చేసుకుంది. ఇంకా రుక్మిణీ కల్యాణం, కనకధారా స్తోత్రం, గోమాత విశిష్ఠత, భజగోవిందం, గురుచరిత్ర, కపిల తీర్ధం, శ్రీరాముని విశిష్ఠత, తిరుమల విశిష్ఠత, హనుమజ్జయంతి, హనుమద్వైభవం, సుందరాకాండ, భక్తి, సామాజిక కర్తవ్యం, శంకరాచార్య జీవితం, శంకర షట్పది, సుబ్రహ్మణ్య జననం మొదలైన ప్రవచనాలు ఛేశారు కోటేశ్వర రావు. ఆయన తన వాక్పఠిమతో హృద్యమైన ప్రవచనములను చేసి ప్రముఖుల నుండి బ్రహ్మశ్రీ అని గౌరవ నామాన్ని పొందారు.
ఇవేకాక పూజా విశిష్టత, ధ్యాన ప్రక్రియ, మనుష్య జీవితము, సంగీత సాహిత్య సమ్మేళనం, సామాజిక కర్తవ్యం, భక్తి, వివాహ వైభవం, గోమాత విశిష్టత, సనాతన ధర్మము, పూజా విధి, ఏకాదశి వ్రత మహత్యము, ఆదిత్య హృదయం, ఆది శంకరాచార్య శివానంద లహరి కూడా ఉన్నాయి. ఇలా విభిన్న అంశాల మీద ఏకధాటిగా మాట్లాడగల దిట్ట. ఆయన చెప్పినవి విన్నవారి మనసులని హత్తుకునేవిగా, అలోచింప జేసేవిగా ఉండటం బహు విశేషం.
వీరి ఉపన్యాసాలు, ప్రవచనలు తరచూ మా టీ వీ , భక్తి టీ వీ, ఎస్ వి బి సి చానెల్స్ లో ప్రసారమవుతున్నాయి. వీటికి అనేక అనుయాయులు ఉన్నారు.

నలబై రెండు రోజుల పాటు, గుంటూరులో సంపూర్ణ రామాయణం మీద ప్రవచనలు చేశారు. అలానే శ్రీమద్భాగవతం మీద నలబై రెండు రోజుల పాటు ఉపన్యసించారు. శివ పురాణం విషయాలపై ముప్పై రోజులు ఉపన్యసించి అనేక విషయాలను తన దృక్పథంలో చాటారు చాగంటి కోటేశ్వరరావు గారు.

భక్తి, భావం, నమ్రత కనిపిస్తాయి వీరి వ్యక్తిత్వంలో. హిందూ ధర్మ సాంప్రదాయాలు పాటిస్తూ, పాండిత్యం మూర్తీభవిస్తూ, ముఖ వర్ఛస్సు కలిగి ఉన్న వారు చాగంటి గారు. శివ తత్వం, శ్రీ కాళహస్తీశ్వర శతకం, లలితా సహస్రనామం తదితర అంశాల మీద మంచి వక్త.

కోటేశ్వరరావు గారికి డబ్బు యావ లేదు. భారతీయ సంస్కృతిక, సాంప్రదాయం, ఆధ్యాత్మికతలను పెంపొందిస్తూ, వాటి పరివ్యాప్తికి కృషి చేస్తున్నారు. ఇది వారి జీవితాశయమని చెప్పవచ్చు. చాగంటి గారు కారణ జన్ములు అని కొందరు పండితులు సెలవిచ్చారు.

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో పనిచేస్తున్నారు (ప్రభుత్వ ఉద్యోగి). వీరి తండ్రి చాగంటి సుందర శివరావు గారు; తల్లి సుశీలమ్మ గారు. కోటేశ్వరరావు గారి సతీమణి శ్రీమతి సుబ్రహ్మణ్యేశ్వరి. వీరికి ఇద్దరు పిల్లలు;

చాగంటి కోటేశ్వరరావు గారి తల్లిదండ్రుల జ్ఞాపకార్ధం చాగంటి విద్యా పురస్కారం (పారితోషకం, జ్ఞాపిక) వైద్య విద్యార్ధికి అందజేస్తున్నారు.

అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడేవారే కరువైపోతున్నారు. అలాటిది స్వచ్ఛమైన భాషలో, నిబద్ధతో మాట్లాడ గల దిట్ట శ్రీ చాగంటి వారు. వీరికి భాష పై ఉన్న పట్టు అపారం. విషయంతో పాటు నిక్షిప్త, నిగూడార్ధాలు తెలిసుకున్నవారు; వీరికి వాక్ సుద్ధి ఉంది. వీరు ప్రసంగించినప్పుడు జనాలు మంత్ర ముగ్దులు అవటం కాయం; పండితులు, పామరులు అందరూ హర్షిస్తారు. విషయాన్ని అంత సూటిగా, సరళముగా జనముందుంచుతారు. ఆలోచింప చేయిస్తారు. ఇది అసామాన్యమైన విషయం.

అందుకున్న పురస్కారాలు:
శారదా జ్ఞాన పుత్ర
ప్రవచన చక్రవర్తి - కంచి కామకోటి శంకరాచార్య గారు చాగంటి గారికి " ప్రవచన చక్రవర్తి " గౌరవం ఇచ్చారు.

వృత్తి ధర్మం నిర్వర్తిస్తూ, ప్రవృత్తి ఎంత బాగా నిర్వర్తించ వచ్చో శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని చూసి నేర్చుకోవచ్చు అంటే అతిశయోక్తి కాదు.

అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడేవారే కరువైపోతున్నారు. అలాటిది స్వచ్చమైన భాషతో పాటు, అచ్చ తెలుగులో శాస్త్రీయ, సాంప్రదాయ, సాంస్కృతిక, పురాణ, నిత్య విధి విధానాల అంశాలపై అనర్గళముగా మాట్లాడుతూ జన ప్రవర్తనా నియమావళిని, వారి ఒరవడిని ప్రభావితం చేయగలుతున్న మహా వ్యక్తి శ్రీ చాగంటి వారు. అంతే కాదు మాటలాడే అంశం భావ, అంతర్గత, నిక్షిప్తార్ధాలను రంగరించుకుని విషయాన్ని నిబద్ధతో గంటాపథంగా చెప్పే అసామాన్యులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. ఇలా చెప్పేవారున్నారు; వినే వారు కూడా బయలుదేరారు. విని మంచి చేద్దాం, మంచి ఒరవడి సాధించుకుందాం అన్న తాపత్రయం విన్న వారిలో బయలుదేరింది. ఇది గమనార్హం. ఎందుకంటే ఇది గొప్ప విషయం. విషయం అని చెప్పే కంటే మార్పు అని చెప్పడం సమంజసం. తెలుగు నాట ఇలాటి ఉదాహరణలు తారసిల్లడం ముదావహం. తెలుగు నాట వీరి అనుయాయులు రోజు రోజుకి పెరుగుతున్నారు. ఇలా జన హృదయాలని జయించుకున్నే మాహద్భాగ్యం ఎందరికి లభిస్తుంది? అది వారి అదృష్టం. హిందూ సంస్కృతిక, సాంప్రదాయ, ఆధ్యాత్మికత పెంపొందించి పరివ్యాప్తి చేస్తున్నారు చాగంటి కోటేశ్వరరావు గారు.
తెలుగు నాట ఇలాటి ఆణి ముత్యాలు మరికొన్నిదొరుకుతాయని ఆశిద్దాo . వీరి ప్రభావంతో మరిందరు అసలు తెలుగు ధనం సాధిస్తారని ఆశిద్ధాం. ..

చాగంటి వారి ప్రవచనాల వీడియోలు youtube లో , ఆడియో లు ఇతర విషయాలు వారి వెబ్సైటు ద్వారా దర్శించవచ్చు. వీరి ప్రవచనాలు పుస్తకాలు గా డౌన్లోడ్ చేసుకోవచ్చు .

http://telugu.srichaganti.net/Default.aspx

www.facebook.com/PravachanaChakravarti

Photo: అసమాన ప్రవచన చక్రవర్తి - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు

ADMIN
 
Photo

గురుసేవ మహద్భాగ్యం

మహా మహా గురువులకు సేవ చేసుకునే అవకాశం కోసం పిన్నలూ, పెద్దలూ ఆరాటపడుతుంటారు. అంతటి మహానుభావులకు మన ఉపచారాలు అవసరం లేదు. కానీ మనం గౌరవభావం, భక్తి భావంతో ఉపచారాలు చేస్తే సంతోషంగానే స్వీకరిస్తారు. గురుసేవా భాగ్యం కలిగినప్పుడు బద్ధకం, అలసత్వం, అవిశ్వాసం లాంటివి దరి చేరకూడదు. ఇతర కార్యాల పై మనస్సు విచలితం కాకుండా గురు చరణాలపై ధృడవిశ్వాసంతో సేవలందించాలి.

సద్గురువు శిష్యులకు సరైన మార్గోపదేశం చేస్తారు. వారిని అపాయాల నుంచి తప్పిస్తారు. అపాయల జాడ కూడా వారికి తెలియకుండాని వారికి ఉపాయలు తెలియజేస్తారు. గురువులు మన అజ్ఞానాన్ని పోగొట్టి, జ్ఞాన మార్గాన్ని చూపిస్తారు.ఈ త్రిభువనాలలో గురువు కంటే గొప్ప దాత మరొకరు ఉండరు. కల్పతరువు కల్పిత వస్తువులనే మాత్రమే ఇవ్వగలదు. చింతామణి కోరుకున్న దానిని మాత్రమే ప్రసాదిస్తుంది. కానీ గురువులు మనసు ఊహించని నిర్వికల్ప స్థితిని మనకు అందించగలరు. ఆశించని ఆత్మస్థితి సిద్థింపచేయగల శక్తిసంపన్నులు గురువులు.గురువుల సేవ భక్తితో చేసిన వారు బ్రహ్మసాయిజ్యాన్ని పొందగలుగుతారు

పుష్కరుడి కథ - పుష్కరమంటే ఏమిటి?

పుష్కరం అంటే "పోషయతి అథవా పుష్ణాతీత పుష్కరం" పుష్టినిచ్చి పోషించేది అని అర్థం. పుష్కరాన్ని గురించి పరంపరగా ఎన్నో గాథలున్నాయి. బహుజన వ్యాప్తిలోని ఒక కథ ఇలా ఉంది. "ముద్గలుడనే మహర్షి పరమశివుణ్ణి గురించి మహాతపస్సు చేశాడు. శివుడు మెచ్చి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ఆ మహర్షి మరేమీ కోరుకోకుండా శివునిలో తనను లీనం చేసుకోమన్నాడు. శివుడు అతడ్ని తన అష్టమూర్తులలో ఒకటైన జలమూరతితో లీనం చేసుకుంటూ ఆ మహర్షికి పుష్కరుడని పేరుపెట్టాడు. అంతేకాక విశ్వంలోని మూడున్నర కోటి తీర్థాలకు రాజును చేశాడు. భూతత్వాన్ని కమండలంగా చేసి పుష్కరుని అందులో ఉంచి బ్రహ్మదేవునికిచ్చాడు. ఆ కమండల జలమే పుష్కరతీర్థంగా మారింది. మూడున్నరకోట్ల పుణ్య తీర్థాలతో దేవతలతో అందులో ఉంటూ అక్కడ స్నానాదులు చేసిన వారిని తరింపజేస్తున్నాడు.

ఆ పుష్క్రర తీర్థాన్ని గూర్చి తెలుసుకుందాం. పూర్వం హిమాచలంలో 'సరస్వతి' అనే నది పుట్టినది. అది వేదకాలం నాటికే ప్రసిద్ధి చెంది ఉంది. మహర్షులు ఆ నదీ తీరంలో ఉండగా వేదాలను దర్శించారు. ఆ తీరంలో వేదోక్త యజ్ఞకర్మలు ఆచరించారు. అక్కడ నుంచే ప్రపంచానికి వేదవిజ్ఞానాన్ని చాటారు. ఆ నదీ జలాల మహిమను తెలుసుకున్న మహర్షులు ఆ సరస్వతిని విద్యాధి దేవతగా గుర్తించారు. ఆ నది దక్షిణ దిశగా ప్రవహించి 'దృషద్వతి - అ వయా' అనే రెండు నదులతో కలిసి రాజస్థాన్‌ ద్వారా పశ్చిమ సముద్రం (అరేబియా సముద్రంలో) కలుస్తుండేది. తర్వాత కొన్ని వేల ఏళ్ళ క్రిందట రాజస్థాన్‌లో జరిగిన భూపరిణామాల వల్ల సరస్వతి ప్రవాహం పైకి పారకుండా భూమిలో ఇంకిపోయి సమీపంలో ఉండే యమునా నదిలో కలిసిపోయింది. ప్రయాగలో ప్రస్తుతం గంగ, యమునలు కలుస్తున్న యమునలో సరస్వతి అంతర్వాహినిగా ఉన్న సంగతిని తెలుసుకున్న ఋషులు సరస్వతిని కలుపుకొని త్రివేణీ సంగమమని అంటున్నారు. సరస్వతి ఇప్పుడు కొన్ని మడుగులుగా మారి మిగిలిపోయింది. ఆ మడుగులో పుష్కర తీర్థం ఒకటి. 'మహా భారతంలో పుష్కర తీర్థ ప్రస్తావన ఉంది.

" కురుక్షేత్రే గయాం గంగాం! ప్రభాసం పుష్కరం చ యత్‌
ఏతాని పుణ్యతీర్థాని! ధ్యాత్వా మోక్షమవాప్నుయాత్‌"

నారద పద్మ పురాణంలో గూడా పుష్కర తీర్థం వర్ణించబడింది. ప్రసిద్ధ బౌద్ధక్షేత్రమైన 'సాంచీ'లో దొరికిన 3వ శతాబ్దినాటి శిలాశాసనంలో పుష్కర తీర్థ ప్రశంస ఉన్నది. రాజస్థాన్‌లోని అజ్మీరుకు 36 కి.మీ దూరంలో ఉన్న పెద్ద సరస్సును ఆ ప్రజలు 'పోఖరా' అంటున్నారు. అదే పుష్కర తీర్థం. వేదరాశి జన్మించిన పవిత్రనదీ భాగమైనందున మహాపవిత్రమైంది.

పుష్కరుడంటే వరుణదేవుడని ఒకచోట, మహాపుణ్య పురుషుడని ఒకచోట, పుష్కరమంటే తీర్థమని, సరస్సు అనీ పురాణాలు రకరకాలుగా వర్ణించాయి. పుష్కరుడ్ని బ్రహ్మ సృష్టి చేసాడని, అతడు శివుడి కోసం తపస్సు చేశాడని కూడా కొన్ని పురాణాలు వివరించాయి. పుష్కరుడ్ని తీర్థరాజు అని పిలుస్తారు. ఈలోకంలో నదులన్నీ తమలో స్నానం చేసిన వారి పాపాలన్నింటినీ స్వీకరించడం మూలంగా వాటి పవిత్రత క్షీనించడాన్ని గమనించి పుష్కరుడు చాలా చింతించేవాడు.

ఒకనాడాయన పరమశివుడి కోసం తపస్సు చేసి నదుల దోషాలన్నింటినీ ప్రక్షాళనం చేసే మార్గాన్ని అర్థించాడు. శివుడికి గల ఎనిమిది దేహాలలో జలరూపమైన దేహాన్ని తనకనుగ్రహించమని కోరాడు. దాని ప్రభావం వల్ల పుష్కరుడికి అనంతమైన శక్తి ప్రాప్తించింది. నదులలో పాపాలన్నింటినీ తొలగించగల ప్రభావం లభించింది. అందుకే నదులన్నీ పుష్కరుడిని ఆహ్వానించి తమలో నివసించవలసిందిగా అభ్యర్థించసాగాయి. అటు పిమ్మట పన్నెండు పుణ్యనదులలో పుష్కరుడు ఉండేలా ఏర్పాటు అయింది. ఈ ఏర్పాటు సురగురువైన బృహస్పతి సంచారాన్ని అనుసరించి నిర్ణయమైనది. అంటే మేషరాశి, వృషభరాశి, మిధునరాశి, ఇలా వరుసగా 12 రాసులలో ఎప్పుడైతే గురుడు సంచరిస్తుంటాడో అప్పుడే పుష్కరుడు కూడా ఆయా నదులలో నివసించేలా ఏర్పాటయింది. కనుక ప్రతీ నదికీ 12 ఏళ్ళకోసారి పుష్కరుడి ఆగమనం సంభవిస్తుంది. అంటే ప్రతినదీకి 12 ఏళ్ళకు ఓసారి పుష్కరాలు వస్తాయి.

పుష్కరాలు వచ్చినపుడు ఆనదిలో స్నానం చేస్తే మూడున్నరకోట్ల తీర్థాలలో స్నానంతో సమానం అన్నమాట. ఇలా పన్నెండు పుణ్యనదులకు పన్నెండేళ్ళకోసారి పుష్కరాలొచ్చే క్రమం ఇదిగో ఈ వరసలో ఏర్పాటయింది.

శ్లోకం|| మే షే గంగా వృషే రేవా గతేయుగ్మే సరస్వతీ
యమునా కర్కటేచైవ గోదాసింహం గతేపిచ
కన్యాయాం కృషవేణీచ కావేరీచ తులాగతే
వృశ్చికేస్యాద్భీమరథీ చాపే పుష్కరవాహినీ
మృగే తుంగా ఘటే సింధుః ప్రణీతా తటనీ ఝషే
తిష్ఠన్న బ్దాత్సురగురుః క్రమాత్సర్యే మునీశ్వరాః

సురగురువగు బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినపుడు గంగానదీ పుష్కరము, వృషభరాశినందు ప్రవేశించినపుడు నర్మదానదీ పుష్కరము, మిధున రాశి యందు గురుడున్నచో సరస్వతీ నదికి పుష్కరము, కర్కటరాశి యందున్నచో యమునా నదికి, సింహరాశి యందున్న గోదావరికీ నదికీ, కన్యారాశియందు కృష్ణానదికి, తులయందు కావేరి నదికి, వృశ్చికరాశి యందు బీమరథీనదికి, ధనూరాశి నందు పుష్కరనదికి, మకరము నందు తుంగభద్రానదికి, కుంభమందు సింధునదికి, మీనరాశియందు ప్రణీతానదికి పుష్కరం.

పుష్కరంలో ఏం చేయాలి?

పరమ పవిత్రము, దుర్లభము అయిన పుష్కరము నదులకు వచ్చినపుడు ఆస్తిక జనులు తప్పక ఆచరించవలసిన కొన్ని కర్మలను శాస్త్రకర్తలు విధించినారు. వాటిని శ్రద్ధతో ఆచరిస్తే విశేష ఫలములు కలుగుతాయి. ఆ విధులు ఇలా ఉన్నాయి.

1. స్నానం: నదిలో సంకల్ప పూర్వకంగా స్నానం చేసి విధిప్రకారం కొందరు దేవతలకు ఆర్ఝ్యాదులు వదలవలెను.

2. పుష్కరాదుల పూజ: స్నానం చేసి బయటకి వచ్చి ఒక సమతల ప్రదేశంలో కూర్చుని యధావిధిగా నదికి - బృహస్పతికి - పుష్కరరాజుకు విడివిడిగా షోడశోపచార పూజలు చేయవలెను. నదిలో అనుకూలముండదు. తొందర అవుతుంది.

3. పితరులకు శ్రాద్ధ తర్పణాలు: పుష్కర కాలంలో నదీతీరంలో తమ పితరులకు శ్రాద్ధకర్మలు చేయవలెను. అందువల్ల వారి ఆశీర్వాదాలు లభిస్తాయి. ఈ శ్రాద్ధకర్మ వల్ల మరణించిన వారికి పుణ్యలోక ప్రాప్తి చేసిన వారికి వంశవృద్ధి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. పెద్దలకు పిండాలు పెట్టి శ్రాద్దం చేయలేని వాళ్ళు పెద్దల పేరు మీద నువ్వులు నీళ్లతో తర్పణాలైనా వదలవలెను.

4. దానాలు: పుష్కర సమయంలో తమ తమ శక్తికి తగినట్లు దశదానాలలో వేటినైనా దానం చేయవలెను.

దశదానాలంటే - 1. గోదానము, 2. భూదానము, 3. హిరణ్యదానము (బంగారు), 4. రౌప్యదానము (వెండి), 5. వస్త్రదానము (పంచలుగాని, సెల్లాగాని), 6. తిలదానము (నూవులు), 7. ఆజ్యదానము (పాత్రలో నెయ్యి వేసి చ్చుట), 8. ధాన్యదానము (ఒక పాత్రలో బియ్యం పోసి ఇవ్వడం), 9. గుడదానము (బెల్లం), 10. లవణదానము (ఉప్పు) ఈ దానాలు శక్తి ఉన్నవాళ్లకు, లేనివాళ్ళకూ అనుకూలంగా ఉన్నాయి. ఈ విధులు ఆచరించుటతో పుష్కరంలో కర్తవ్యం నిర్వహింనట్లు కాగలదు.

పుష్కర స్నానం - నియమాలు

పుష్కరస్నానానికి గాని, తీర్థస్నానానికి గాని వెళ్ళినపుడు కొన్ని నియమాలు తప్పక పాటించాలి. ఆ నియమాలు పాటించడం ఉత్తమం.

తీర్థ స్థలానికి చేరిన రోజు ఉపవాసం చేయడం వాటిలో ఒకటి.

దంపతులు కలిసే స్నానం చేయాలి. బ్రహ్మముడి వేసుకుని ఈ స్నానం చేయాలి.

పురుషులు శిఖమాత్రమే ఉంచుకుని శిరోమండనం చేయించుకోవాలి. స్త్రీలు శిరోమండనం చేయించుకోరాదు.

తండ్రి లేనివారు తీర్థస్నానం చేయాలి.

పుష్కర దినాలలో తొమ్మిదవ రోజుగానీ, లేదా తమ పెద్దలు మరణించిన తిథి రోజు గానీ పితృ శ్రాద్ధాన్ని నిర్వహించాలి.

సమీప బంధువులకు, పిండ ప్రదానం చేయవచ్చు. తర్పణం విడవవచ్చు. స్నేహితులకూ ఆత్మియులకూ పిండ ప్రదానం చేస్తే సరిపోతుంది.

పిండ ప్రదానం ఆకు దొప్పలలోనే చేయాలి.

తీర్థాల సమీపంలో మలమూత్ర విసర్జన, ఉమ్మి వేయడం, బట్టలు ఉతకడం చేయరాదు.

స్నానం చేసే సమయంలో నిట్టనిలువుగా మూడు సార్లు మునకలు వేయాలి.

సంప్రదాయం కోసమే కాకుండా ఆరోగ్య కరమైన వాతావరణం కోసం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి.

ఏ రోజు ఏ దానం

మొదటి రోజు - సువర్ణ, రజిత, ధాన్య, భూదానలు.

రెండోవ రాజు - వస్త్ర, లవణ, ధేను, రత్న ధానాలు.

మూడవ రోజు - అశ్య, శాక, ఫల దానాలు.

నాల్గవ రోజు - ఘృత, తైల, క్షీర, మధు దానాలు.

ఐదవ రోజు - ధాన్య, శకట, మహిష, వృషభ, హల దానాలు.

ఆరవ రోజు - ఔషద, కర్పూర, కస్తూరి, చందన దానాలు.

ఏడవ రోజు - గృహ, పీఠ, శయ్య, ఆందోళికా దానాలు.

ఎమిదవ రోజు - చందన, పుష్పమాల, మూల ఆథృక దానాలు.

తొమ్మిదవ రోజు - పిండ, దాసీ, కన్య, కంబళ దానాలు.

పదవ రోజున - శాక, సాలగ్రామ, పుస్తక దానాలు.

పదకొండవ రోజు - గజాది దానాలు.

పన్నెండవ రోజు - తిల అజాది దానాలు

దాన ఫలితాలు

సువర్ణ, రజత దానాలతో - సుఖ భోగాలు

భూ దానం - భూ పతిత్వం

వస్త్రదానం - వసులోక ప్రాప్తి

గోదానం - రుద్ర లోక ప్రాప్తి

అజ్వదానం - ఆయుర్వృద్ధి

ఔషధ దానం - ఆరోగ్యం

సాలగ్రామ దానం - విష్ణులోకం

గృహదానం - ధన సౌఖ్యం

శయ్యా దానం - స్వర్గ సుఖాలు

తిలదానం - ఆపదల నివారణ.

వినాయక చతుర్థి నాడు గరికతో పూజ చేస్తే సర్వ శుభములు చేకూరుతాయి

వినాయక చతుర్థి నాడు గరికతో పూజ చేస్తే సర్వ శుభములు చేకూరుతాయి. వినాయకునికి గరికపోచలంటే చాలా ఇష్టం. ఎన్నిరకాల పత్రాలు, పుష్పాలతో పూజించినప్పటికీ గరిక లేకుండా విఘ్నేశ్వరుడు లోటుగా భావిస్తాడు. గరికెలు లేని వినాయక పూజ వ్యర్థమని, ప్రయోజన రహితమని పండితులు అంటున్నారు.

"చతుర్ధీ పూజన ప్రీత:" అంటే వినాయకుని చతుర్ధి పూజంటే ప్రీతి. ఈ తిథినాడు విఘ్నేశ్వరుడు ఉద్భవించినాడు. భాద్రపద శుద్ధ చవితినాడు వినాయక చవితిగా మనం గణపతిని పూజిస్తాం. అయితే ప్రతి మాసంలో వచ్చే చవితీ గణపతికి ప్రీతికరమే. భాద్రపద శుక్ల చవితి రోజున పార్వతీ-పరమేశ్వరులకు కుమారునిగా వినాయకుడు అవతరించినాడు.

కానీ అంతకుముందే గణపతి ఉన్నాడు. ఆయన ఉపాసన కూడా ఉంది. బ్రహ్మదేవుడు సృష్టి ఆది నిర్వహణకు కలిగే విఘ్నాలు చూసి భయపడి, పరబ్రహ్మను ప్రార్థించాడు. ప్రణవ స్వరూపుడైన ఆ పరమాత్మ విఘ్నాల్ని నశింపజేయడానికి గజవదన రూపంలో సాక్షాత్కరించి తన వక్రతుండ మంత్రాన్ని బ్రహ్మకు ఉపదేశించి, విఘ్నాల్ని హరింపజేస్తాడు. ఇది తొలి ఆవిర్భావమని పండితులు అంటున్నారు.

కాగా.. భయరోగాది కష్టాలు, సర్వ దారిద్ర్యాలు తొలగించే విఘ్నేశ్వరునికి ప్రీతికరమైనది చతుర్థీ వ్రతం. ముఖ్యంగా కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధి ముఖ్యమైనది. ప్రతినెలా ఆ చతుర్ధికి గణపతిని ఉద్దేశించి ఉపవాసమో లేక ఉండ్రాళ్ళు, మోదకాలు వంటివి నివేదిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

కృష్ణ చతుర్థినాడు దూర్వాలు, బిల్వాలతో, పువ్వులతో గణపతిని అర్చించి, 21 ఉండ్రాళ్లు నివేదన చేస్తే గ్రహదోషాలు, గృహదోషాలు తొలగిపోతాయంటారు. కృష్ణ చతుర్థి వ్రతానికి చంద్రోదయంతో చవితి తిథి ఉండాలి. ఆ రోజున ఉపవాసం చేసి పూజ తర్వాత 21సార్లు "ఓం శ్రీ గణేశాయ నమ:" అని జపించాలని పండితులు చెబుతున్నారు.
Photo: వినాయక చతుర్థి నాడు గరికతో పూజ చేస్తే సర్వ శుభములు చేకూరుతాయి. వినాయకునికి గరికపోచలంటే చాలా ఇష్టం. ఎన్నిరకాల పత్రాలు, పుష్పాలతో పూజించినప్పటికీ గరిక లేకుండా విఘ్నేశ్వరుడు లోటుగా భావిస్తాడు. గరికెలు లేని వినాయక పూజ వ్యర్థమని, ప్రయోజన రహితమని పండితులు అంటున్నారు. 
 
"చతుర్ధీ పూజన ప్రీత:" అంటే వినాయకుని చతుర్ధి పూజంటే ప్రీతి. ఈ తిథినాడు విఘ్నేశ్వరుడు ఉద్భవించినాడు. భాద్రపద శుద్ధ చవితినాడు వినాయక చవితిగా మనం గణపతిని పూజిస్తాం. అయితే ప్రతి మాసంలో వచ్చే చవితీ గణపతికి ప్రీతికరమే. భాద్రపద శుక్ల చవితి రోజున పార్వతీ-పరమేశ్వరులకు కుమారునిగా వినాయకుడు అవతరించినాడు.
 
కానీ అంతకుముందే గణపతి ఉన్నాడు. ఆయన ఉపాసన కూడా ఉంది. బ్రహ్మదేవుడు సృష్టి ఆది నిర్వహణకు కలిగే విఘ్నాలు చూసి భయపడి, పరబ్రహ్మను ప్రార్థించాడు. ప్రణవ స్వరూపుడైన ఆ పరమాత్మ విఘ్నాల్ని నశింపజేయడానికి గజవదన రూపంలో సాక్షాత్కరించి తన వక్రతుండ మంత్రాన్ని బ్రహ్మకు ఉపదేశించి, విఘ్నాల్ని హరింపజేస్తాడు. ఇది తొలి ఆవిర్భావమని పండితులు అంటున్నారు. 
 
కాగా.. భయరోగాది కష్టాలు, సర్వ దారిద్ర్యాలు తొలగించే విఘ్నేశ్వరునికి ప్రీతికరమైనది చతుర్థీ వ్రతం. ముఖ్యంగా కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధి ముఖ్యమైనది. ప్రతినెలా ఆ చతుర్ధికి గణపతిని ఉద్దేశించి ఉపవాసమో లేక ఉండ్రాళ్ళు, మోదకాలు వంటివి నివేదిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. 
 
కృష్ణ చతుర్థినాడు దూర్వాలు, బిల్వాలతో, పువ్వులతో గణపతిని అర్చించి, 21 ఉండ్రాళ్లు నివేదన చేస్తే గ్రహదోషాలు, గృహదోషాలు తొలగిపోతాయంటారు. కృష్ణ చతుర్థి వ్రతానికి చంద్రోదయంతో చవితి తిథి ఉండాలి. ఆ రోజున ఉపవాసం చేసి పూజ తర్వాత 21సార్లు "ఓం శ్రీ గణేశాయ నమ:" అని జపించాలని పండితులు చెబుతున్నారు.

వినాయకుని అలంకారాలు.

* స్వర్ణాభరణాలంకృత గణపతి
* విశ్వరూప గణపతి
* సింధూరాలంకృత గణపతి
* హరిద్రా (పసుపు) గణపతి
* రక్తవర్ణ గణపతి
* పుష్పాలంకృత గణపతి
* చందనాలంకృత గణపతి
* రజతాలంకృత గణపతి
* భస్మాలంకృత గణపతి
* మూల గణపతి.
గణపతి నవరాత్రుల్లో ఈ వరసని పాటిస్తారు.

వినాయకుని నామాలు...
1. తెలుగు భారతం ప్రకారం : హేరంబ, గణనాయక, గణేశ
2. పద్మపురాణం ప్రకారం : ద్వైమాతుర, లంబోదర, గణాధిపతి, వక్రతుండ, కపిల, చింతామణి, డుంఠి
3. వేదాల ప్రకారం : బ్రహ్మణస్పతి, కవి, జ్యేష్ఠరాజు, కవీనాం కవి.
4. సంగీత శాస్త్రం ప్రకారం : పిళ్ళారి, శ్రీ గణనాథ, కరివదన, లకుమికర (లక్ష్మీకరుజడు), అంబాసుత, సిద్ధి వినాయక.
5. పూజప్రకారం : సుముఖ, ఏకదంత, గణకర్ణిక, వికట, విఘ్నరాజ, గణాధిప, ధూమకేతు, గణాధ్యక్ష, పాలచంద్ర, గజానన, వక్రతుండ, శూర్పకర్ణ, స్కందపూర్వజ (లంబోదర, వక్రతుండ, కపిల, హేరంబ అనేవి కూడా ఉన్నా ఇవి పద్మ పురాణం, తెలుగు భారతం అనే వాటిలో ఉన్నాయి)
Photo: వినాయకుని అలంకారాలు.. 
* స్వర్ణాభరణాలంకృత గణపతి 
* విశ్వరూప గణపతి
* సింధూరాలంకృత గణపతి
* హరిద్రా (పసుపు) గణపతి 
* రక్తవర్ణ గణపతి 
* పుష్పాలంకృత గణపతి 
* చందనాలంకృత గణపతి 
* రజతాలంకృత గణపతి 
* భస్మాలంకృత గణపతి 
* మూల గణపతి. 
గణపతి నవరాత్రుల్లో ఈ వరసని పాటిస్తారు. 

వినాయకుని నామాలు...
1. తెలుగు భారతం ప్రకారం : హేరంబ, గణనాయక, గణేశ 
2. పద్మపురాణం ప్రకారం : ద్వైమాతుర, లంబోదర, గణాధిపతి, వక్రతుండ, కపిల, చింతామణి, డుంఠి 
3. వేదాల ప్రకారం : బ్రహ్మణస్పతి, కవి, జ్యేష్ఠరాజు, కవీనాం కవి. 
4. సంగీత శాస్త్రం ప్రకారం : పిళ్ళారి, శ్రీ గణనాథ, కరివదన, లకుమికర (లక్ష్మీకరుజడు), అంబాసుత, సిద్ధి వినాయక. 

5. పూజప్రకారం : సుముఖ, ఏకదంత, గణకర్ణిక, వికట, విఘ్నరాజ, గణాధిప, ధూమకేతు, గణాధ్యక్ష, పాలచంద్ర, గజానన, వక్రతుండ, శూర్పకర్ణ, స్కందపూర్వజ (లంబోదర, వక్రతుండ, కపిల, హేరంబ అనేవి కూడా ఉన్నా ఇవి పద్మ పురాణం, తెలుగు భారతం అనే వాటిలో ఉన్నాయి).

శ్రీ సిద్ది వినాయకుడు - అయినవిల్లి

అత్యంత పురాతనమైన శ్రీ విఘ్నేశ్వర ఆలయములలో అయినవిల్లి క్షేత్రం ప్రసిద్ధి గాంచింది. ఇది తూర్పు గోదావరి జిల్లా అమలాపురం పట్టణానికి అత్యంత చేరువలో ఉన్నది.

పూర్వము దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞము నిర్వర్తించే ముందు ఈ వినాయకుని పూజించి పునీతుడైనట్లు క్షేత్రపురాణమును బట్టి తెలియుచున్నది. తొలుత ఈ ఆలయ నిర్మాణము దేవతలే చేసారని పెద్దలు చెబుతూ ఉంటారు.

ప్రతినిత్యం శ్రీ స్వామి వారికి శివాగమ ప్రకారం విశేషార్చనలు సహస్రాధికములుగా నారికేళ ఫలోదకములతో అభిషేకములు చేయించుకుని వేలాది మంది భక్తులు శ్రీ స్వామి కృపా పాత్రులు అవుతారు. భక్తుల కోర్కెలను తీర్చటంలో శ్రీస్వామి ప్రత్యక్ష నిదర్శనాలు చూపిస్తారు. అత్యంత సంతృప్తులైన భక్తులు వేయి నూట పదహార్ల వరకు నారికేళములతో అభిషేకములు చేయించుకుని మొక్కులు సమర్పించుకుంటారు.

ఇక ప్రతి మాసం ఉభయ చవితి తిధులు దశమి, ఏకాదశి,'వినాయక చవితి, నవరాత్రులలోను' శ్రీ స్వామి వారి వైభవములు వర్ణింపలేము. విశాలమైన ఈ ఆలయ ప్రాంగణములో శివకేశవులకు భేదము లేదని చాటిచెపుతున్నట్లు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవస్వామి, శ్రీ అన్నపూర్ణా దేవి సమేత శ్రీ విశ్వేశ్వరాలయం ప్రక్క ప్రక్కనే ప్రతిష్ఠింపబడిన ఈ ఆలయానికి క్షేత్రపాలకుడుగా శ్రీకాలభైరవ స్వామి కొలువై ఉన్నారు. ఇది భక్తులు తప్పక దర్శించకోగల పుణ్యక్షేత్రం.
Photo: శ్రీ సిద్ది వినాయకుడు - అయినవిల్లి

వక్రతుండావతారం

ధ్యానశ్లోకం: వక్రతుండావతారశ్చ దేహానాం బ్రహ్మధారక:,
మత్సరాసురహంతా స సింహవాహనగ: స్మృత:

ఎన్నో అంతరార్ధాలతో కూడుకున్న కధ: దేవరాజైన ఇంద్రుని పొరపాటువలన మత్సరాసురుడనే రాక్షసుని జననం జరిగింది. రాక్షస గురువైన శుక్రాచార్యులు ఇచ్చిన మంత్రోపదేశంతో కఠోరమైన తపస్సు చేసి అనేక వరాలను పొంది అశేష సేనాబలంతో మూడు లోకాలనూ జయించాడు. దేవతలు కూడా ఈ రాక్షసుని బాధలకు తాళలేక తరుణోపాయం గురించి తపస్సు చేయగా, వారికి భగవాన్ శ్రీ దత్తాత్రేయస్వామివారు ప్రత్యక్షమై వక్రతుండుని ఉపాసనావివరములు తెల్పి అతనిని ప్రసన్నము చేసుకోవలసినదిగా అదేశించెను. దేవతల ఆరాధనకు సంతసించిన గణపతి వక్రతుండునిగా సింహవాహనుడై వారిముందు ప్రత్యక్షమై మత్సరాసురునిపై యుద్ధానికి అనేక సేనలతో బయల్దేరేడు. యుద్ధం 5 రోజులుగా కొనసాగింది. ఆ యుద్ధంలో మత్సరాసురుని పుత్రులైన `సుందరప్రియుడు ' మరియు `విషయప్రియుడు ' అనబడే అసురులు వధింపబడ్డారు. పుత్రుల వధ తెలుసుకున్న మత్సరాసురుడు యుద్ధభూమిలో అడుగుపెట్టేడు. 14 భువనాలనూ భయపెట్టిన ఆ మత్సరాసురుడు, వక్రతుండుని దర్శించగానే భయముతో వణుకుతూ శరణువేడి రక్షించమని ప్రార్థించాడు. దయామయుడైన వక్రతుండుడు మత్సరాసురునితో వక్రతుండుని భక్తులజోలికి రావద్దని నియంత్రించి అధోలోకానికి పంపివేసాడు. ఆ నాటినుండి దేవతలందరూ స్వతంత్రులై వక్రతుండుని సేవిస్తూ వారి వారి విధినిర్వహణలు కొనసాగించారు.

....కాస్త అలోచనాబుద్ధితో ఈ కథ చదివితే ఇందులో అంతరార్థం తేటతెల్లమవుతుంది. మన ఇంద్రియాలకి అధిపతే ఇంద్రుడు. వాటినుండి పుట్టినవాడే మత్సరాసురుడు. అసురునిచే బాధలుపడుతున్న ఇంద్రియాలు (దేవతలు) గురువైన దత్తాత్రేయుని శరణువేడగా సద్గురుని ప్రసాదం వల్ల వక్రతుండావతారం జరిగి, మొదటిగా విషయ, సుందర ప్రియత్వాలని నాశనంచేసి మత్సరాసురుని నియంత్రించాడు. కాబట్టి మనం కూడా వక్రతుండుని శరణువేడి మాత్సర్యగుణాన్ని పోగొట్టుకుందాము. "శ్రీ వక్రతుండాయ నమ:" ...మనలో మాత్సర్య గుణం వక్రతుండుని అనుగ్రహం వలన నశించుగాక.
చిత్రం: ధ్యానశ్లోకం: వక్రతుండావతారశ్చ దేహానాం బ్రహ్మధారక:, 

మహా గణపతి పూజ వెనుక అనేక పర్యావరణ సూత్రాలు

మహా గణపతి పూజ వెనుక అనేక పర్యావరణ సూత్రాలను మన పూర్వీకులు పొందుపరిచారు. వినాయక చవితి పూజా విధిలో ఈ సూత్రాలను పాటిస్తుంటాం.
-కొత్త మట్టితో వినాయకున్నితయారు చేయడం
-ఇరవై ఒకటి పత్రాలతో పూజ చేయడం
-నవరావూతుల అనంతరం పత్రితో సహా వినాయక ప్రతిమను నిమజ్జనం చేయడం.
శివపార్వతుల ముద్దుబిడ్డ వినాయకుడు. ఆయన జన్మంలోనే పర్యావరణ రహస్యం దాగుంది. నలుగు పిండితో తయారైన బొమ్మకు ఆది శక్తి పార్వతీదేవి ప్రాణవూపతిష్ఠ చేసింది. అనంతరం ఏనుగు తలను అతికించి ఆది దేవుడు పరమేశ్వరుడు పునః ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఆనాటి నుంచి యుగాలు మారుతున్నా, కాలం మార్తున్నా మహాగణపతి పూజలందుకుంటూనే ఉన్నాడు. సమాజంలో అనేక వర్గాల వారుంటారు. వారందరినీ కలిపి మానవత్వమే మహా మతం అన్న ఏకైక నినాదంతో కూడుకున్నదే మహాగణపతి పూజ. ఈ సృష్టిలో సర్వజీవులు సమానమే అని చాటిచెప్పడమే వినాయక జనన రహస్యం. మానవరూపంలో ఉన్న వినాయకునికి ఏనుగు తలను అమర్చడం, మూషికుడిని (ఎలుకను) వాహనంగా అమర్చడంలోనే సర్వవూపాణులు సమానమనే అర్ధం చెబుతోంది. హారంగా ఔషధ మొక్కల ఆకులు తినడంలోనే పర్యావరణ రహస్యం దాగుంది.

మట్టి వినాయకుడు-అసలు రహస్యం
వినాయకుడి విగ్రహాన్ని కొత్త మట్టితోనే చేయాలని మన పూర్వీకులు చెప్పేవారు. కొత్త మట్టి అంటే తొలకరి జల్లులు పడిన తర్వాత మట్టి వాసన వెదజల్లే సమయంలో తీసిన మట్టి అని అర్ధం. ఈ మట్టిని వినాయక చవితికి ముందే అంటే వర్షాకాలం ఆరంభానికి ముందే తవ్వితీస్తారు. మట్టి తవ్వాలంటే సహజంగానే ఎవరైనా చెరువులు, కుంటల దగ్గరకు వెళతారు. అలా చేయాలనే ఈ పనిని పెద్దలు పురమాయించారని చెబుతుంటారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు చెరువులు, వాగులు, కుంటలు నిండిపోతాయి. మరీ ఎక్కువగా వానలు పడితే పక్కనే ఊర్లు కూడా మునిగిపోతాయనే ఆలోచన చేసేవాళ్లు. అందుకే అలా జరుగకుండా ఉండాలంటే చెరువులు, కుంటల్లో పూడికలు తీయాలి. నీరు నిల్వ ఉండాలే కానీ అవి ఊర్ల మీద పడకూడదని భావించేవారు. వానల వల్ల మట్టి కొట్టుకెళ్లి చెరువుల్లో చేరిపోతుంటుంది. కాబట్టి ముందుగా పూడిక తీయాల్సిందే. ఆ పని పూర్వం రోజుల్లో గ్రామస్తులే చేసేవారు. అలా చేసేందుకు ఉత్సాహంగా ఆ పని పూర్తి చేసేందుకు మత పెద్దలు వినాయక ప్రతిమలను మట్టితోనే చేయాలన్న నిబంధన పెట్టారు.

పత్రిపూజ-రహస్యం
గణనాథుడ్ని 21 పత్రితో పూజించడం ఆచారంగా వస్తుంది. అలా తొమ్మిది రోజులు చేయమని శాస్త్రం కూడా చెబుతోంది. పత్రి పూజకు మనం ఎంచుకునేవి మామూలు ఆకులు కాదు. అవి ఔషధ మొక్కలకు సంబంధించిన ఆకులు. అందుకే వ్రతకల్పంలో పేర్కొన్న పత్రాలతోనే పూజించాలే కానీ వేరే వాటితో చేయకూడదు. ఔషధపవూతాల నుంచి విడుదలయ్యే ఔషధ గుణాలు గాలిలో కలిస్తాయి. దీంతో ఊర్లో అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. వైరస్, బాక్టీరియా వంటి వాటి వల్ల ఇబ్బందులు పోతాయి. ఇలా తొమ్మిదిరోజులు చేయడమన్నది వైద్యుల పరిభాషలో చెప్పాలంటే ఒక కోర్సు. ఏ మందైనా డాక్టర్ ఇచ్చేటప్పుడు మూడు రోజులో, వారం రోజులో వాడమని చెప్పినట్లుగానే పూర్వీకులు పత్రిలోని ఔషధ గుణాలతో ఊరు బాగుపడాలంటే తొమ్మిది రోజులు పూజలు చేయమని చెప్పారని చెబుతుంటారు.

నిమజ్జనం-అసలు రహస్యం
నవరావూతుల తర్వాత వినాయక ప్రతిమను సమీపంలోని చెరువులోనో, లేదంటే కుంటలోనూ నిమజ్జనం చేయడం కూడా ఆచారంగానే వస్తుంది. చెరువులు, కుంటలు లేని చోట బావిలోనే నిమజ్జనం చేయవచ్చు. 21 రకాల పత్రి, ప్రతిమలోని మట్టి నీటిలో కలిశాక 23 గంటలకు తమలోని ఔషధ గుణాలున్న ఆల్కలాయిడ్స్‌ను నీళ్లలోకి వదిలేస్తాయి. ఈ ఆల్కలాయిడ్స్ వల్ల నీళ్లలోని ప్రమాదకరమైన బ్యాక్టీరియా నశిస్తుంది. ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఇదే వినాయక నిమజ్జనం వెనుక దాగి ఉన్న పర్యావరణ పరమ రహస్యం.

కైలాస పర్వతం

కైలాస పర్వతానికి నాలుగు రూపాలు కూడా వున్నాయి. ఒకవైపు సింహం, రెండోవైపు గుర్రం, మూడోవైపు ఏనుగు, నాలుగోవైపు నెమలిలాగా ఈ పర్వతశిఖరం కనిపిస్తుంది. అందులో గుర్రం హయగ్రీవ రూపంలోను, సింహం పార్వతి దేవి వాహనం, నెమలి కుమారస్వామికి వాహనం కాగా ఏనుగు విఘ్నేశ్వరునికి ప్రతీకగా వుంటాయి.
నలువైపులా మంచుతో కపబడివున్న ఈ పర్వతం.. పౌర్ణమినాడు మిలమిల మెరుస్తూ ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. దీని మొత్తం చుట్టుకొలత 52 కిలోమీటర్లు. ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ ఈ కైలాస పర్వతంపై అధిరోహించలేదు. ఎవరికి సాధ్యం కాలేదు కూడా. పూర్వం కొంతమంది సాధువులు ఈ అధిరోహించేందుకు ప్రయత్నించి, మధ్యలోనే అదృశ్యమయ్యారు. ఎందుకంటే... నాలుగు మతాలవారు ఎంతో ఆధ్యాత్మికంగా పూజించే ఈ పర్వత వాలుపై కాలుపెట్టడం మహాపాపమని ప్రతిఒక్కరు విశ్వసిస్తారు.

అయితే ఈ మూఢవిశ్వాసాన్ని పోగొట్టేందుకు చైనా ప్రభుత్వం వారు దీనిపై పరిశోధనలు కూడా చేశారు. రెండుసార్లు ఈ పర్వతంపై పంపించిన హెలికాప్టర్లు మధ్యలోనే కూలిపోయాయి కూడా. దాంతో అప్పటినుంచి ఈ పర్వతం జోలికి ఎవ్వరు వెళ్లలేదు. ఈ పర్వత ఉపరి భాగంలో ఏముందో తెలుసుకోవడానికి సైన్స్ కి కూడా ఇంతవరకు అంతపట్టడం లేదు. యోగశాస్త్రంలో ఈ పర్వతాన్ని షమస్ర చక్రంగా పేర్కోవడం జరిగింది.

పూర్వం రావణాసురుని తల్లి వ్యాధితో బాధపడుతుండుగా.. ఎంతో ఆధ్యాత్మికంగా పూజించే శివుని దర్శనం కల్పించడానికి రావణుడు తన వీపు మీద ఈ కైలాస పర్వతాన్ని పెట్టుకుని తల్లి దగ్గరకు తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తాడు. శివుడు అతని ధైర్యానికి మెచ్చి.. అతనికి అమరత్వాన్ని ప్రసాదిస్తాడు.

మానస సరోవరం :
కైలాస పర్వతానికి పాదపీఠంలోనే మానస సరోవరం ఎంతో అపురూపంగా దర్శనమిస్తుంటుంది. మానస్ అంటే మెదడు.. అంటే బ్రహ్మ తన మెదడు నుంచి ఈ సరస్సును సృష్టించాడని హిందూ పురాణాలు చెబుతున్నారు. పూర్వం శివుడు ఉదయం 3 నుంచి 5 గంటల మధ్యలో బ్రహ్మీ ముహూర్తంలో ఈ మానస సరోవరంలోనే స్నానం ఆచరించేవాడని ఇక్కడి భక్తులు విశ్వసిస్తారు. అంతేకాదు.. ఈ సరస్సుకు చుట్టుపక్కల వుండే గృహాల్లో చాలామంది మునులు కొన్ని వేల సంత్సరాలుగా తపస్సు చేసేవారని కూడా చెబుతుంటారు. ఇక్కడే ఔషధ విలువలైన మొక్కలు కూడా కొన్ని కనిపిస్తాయి.

 కైలాస పర్వతం
కైలాస పర్వతం... అంటే మౌంట్ కైలాష్. ఇది టిబెట్ భూభాగంలో వున్న హిమాలయ పర్వత శ్రేణుల్లో సముద్రమట్టానికి 6.638 మీటర్ల ఎత్తులో వుంది. ఈ పర్వతం నాలుగు మతాలలో పవిత్ర స్థలంగా భావించబడుతుంది. అవి బోన్, బుద్ధిజం, హిందూమతం, జైనిజం. హిమాలయాల్లో వున్న అనేక పర్వతాలలో కంటే ఈ కైలాస పర్వతానికే ఎన్నో విశిష్టతలు వున్నాయి. సమస్త మానవాళికి అర్థంకాని రహస్యాలు ఇక్కడెన్నో వున్నాయి. హిందూమతం ప్రకారం.. శివుడు, పార్వతీ సమేతుడై ఇక్కడే కొలువై వున్నాడని పురాణాలలో కొన్ని కథలు కూడా వున్నాయి.

మొత్తం ఆసియాలోనే పొడవైన నదులుగా పేరుగాంచిన బ్రహ్మపుత్ర, సింధూ, సట్లజ్, గంగానదికి ఉపనది అయిన కర్నాలి మొదలైన నదుల మూలాలు ఈ పర్వత ప్రాంతంలోనే వున్నాయి. కైలాస పర్వతం నలువైపులా నాలుగు రూపాల్లో కనిపిస్తూ.. నాలుగు రంగుల్లో దర్శనమిస్తుంటుంది.

హిందూ మతప్రకారం.. శివుడు ఈ కైలాస పర్వత శిఖరంలో నివసిస్తున్నాడు. పార్వతీ సమేతుడై నిరంతరం ధ్యాన పరిస్థితిలో వుంటాడు. విష్ణుపురాణం ప్రకారం కైలాస పర్వత నాలుగు ముఖాలు స్ఫటిక, బంగారం, రుబి, నీలం రాయితో రూపొందించినట్లు తెలుపబడింది. ప్రపంచానికి పునాది వంటిది. తామరు పువ్వు ఆకారంలో వున్న ఆరు పర్వతాల మధ్య ఈ కైలాస పర్వతం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది

భీమశంకర జ్యోతిర్లింగము

ఢాకినీ - మహారాష్ట్రలోని ఖేడ్ ప్రాంతము.
యం ఢాకిని శాకినికా సమాజైః, నిషేవ్యమాణం పిశితాశనైశ్చ |
సదివ భీమాది పద పరసిద్ధం, తం శంకరం భక్తహితం నమామి ||
మాంసము తినే ఢాకిని శాకినీ సమూహముల చేత సేవింపడుతూ, భీముడు (లేక భయంకరుడు) అని పేరుతో ప్రసిద్ధుడైన, భక్తులకు శుభములను కలిగించు శంకరునకు నమస్కరిస్తున్నాను.
ఇక్కడి అమ్మవారిని బ్రహ్మ కమలముతో పూజించుట చేత "కమలజ" అని పిలువబడుతోంది.
పురాణగాథ :
ప్రస్తుత పూనా నగరమునకు సుమారు 100 మైళ్ళ దూరంలో గల సహ్యపర్వత మండలి ఢాకినీ శిఖర ప్రాంతమున పూర్వము కర్కటుడనే రాక్షసుడు "పుష్కసి" అను పేరు గల భార్య మరియు "కర్కటి" అనే కుమార్తెతో నివసిస్తూ ఉండేవాడు. కర్కటి భర్త అయిన 'విరాధుడు'ని శ్రీరాముడు చంపటంతో, తల్లిదండ్రుల దగ్గరే ఉంటోంది.
ఢాకినీ శిఖరము నుండి పుట్టిన భీమానది యందు స్నానము చేయుటకు అగస్త్య మహర్షి సిషుడైన 'సుతీక్షణుడు' రాగా, అతనిని కర్కట-పుషసులు చంపబోగ, ఆ ముని వారిని తన తపోబలముచే భస్మము చేయుట కూతురైన కర్కటి చూస్తుంది. అలా ఒంటరిగా సహ్యాది పర్వతమున ఒక్కతే ఉండగా, రావణుని సోదరుడైన కుంభకర్ణుడు అక్కడికి వచ్చినప్పుడు, ఆమెను చూసి బలత్కరించి, కొన్నాళ్ళు విహరించి గర్భవతియైన కర్కటిని విడిచి లంకకు తిరిగి పోతాడు. పుట్టిన కొడుకుకు కర్కటి భీముడని పేరు పెట్టింది. పెద్దవాడైన భీముడు, సమీప ప్రజలను నానాహింసలు పెట్టేవాడు. ఒకనాడు, తన తండ్రి ఎవరని ప్రశ్నించగా, కర్కటి, తన మొదటి భర్త గురించి మరియు కుంభకర్ణుని వల్ల వాని జన్మవృత్తాంతము చెబుతుంది, రామ-రావణ యద్ధంలో కుంభకర్ణాదుల మరణము చెబుతూ, మూల్లోకాలనూ జయించి, వారి కీర్తిని నెలబెట్టమని కోరుతుంది. నాటినుండి ఆశ్రమ వాసులను, విష్ణు భక్తులను హింసించి, అక్కడే బ్రహ్మకి తపమాచరించి కావలసిన వరములను పొందుతాడు.
వర గర్వముతో, భీమాసురుడు దేవతలను, ఇంద్రుడిని, దిక్పాలకులను జయించి, మర్త్యలోకంలో -- భూలోకంలో -- కామరూప (నేపాల్) దేశమును పరిపాలిస్తున్న గొప్ప శివ భక్తుడైన సుదక్షిణ్యుడనే రాజును ఓడించి, కరగన బంధిస్తాడు. అయినాను, ఆ శివభక్తుడు, ఒక పార్థివలింగమును చేసి, దానిని పూజింపసాగాడు. అది తెలిల్సికొని, చూసి, వారిని పరిహసిస్తూ దూషించాడు. దానికి సుదక్షిణుడు మందలించేసరికి, కోపంతో తన చేతిలో ఉన్న కత్తిని అక్కడ ఉన్న పార్థివలింగం పైకి విసిరాడు. దాంతో శివిడు ఆ పార్థివలింగంనుండి ఉద్భవించి, తన మూడవ కంటితో భీమాసురిని మరియు అక్కడ ఉన్న రాక్షస గణములను భస్మము చేశాడు. సుధక్షిణ మహారాజు, ఇంద్రాది దేవతలు, నారద మహర్షులు శివుని స్తుతుంచి కోరగా, అక్కడ భీమశంకర జ్యోతిర్లింగముగా వెలసి సకల శుభాములనిచ్చి భక్తులను రక్షింస్తానని వరములిస్తాడు. రాక్షస మమూహములు భస్మము చేహయడిన ఆ బూడిద కాలాంతరమున ఓషధములుగా రూపొందాయి.

భీమాశంకరుడను పేరుగల శివలింగములు పైన తెలిపిన ఖేఢ్ ప్రాంతమునే గాక:
(1) ఉత్తరప్రదేశ్ లో నైనితాల్ కి 20 కే.మీ.లో ఉజ్జనాక్ అనే గ్రామంలో
(2) అస్సాంలోని గౌహతిలో బ్రహ్మపుర పర్వతంపై
(3) ఆంద్రప్రదేశ్ లో, తూర్పుగోదావరి జిల్లాలోని దక్షారామమున
కూడా ఉన్నాయి.
చరిత్ర:
శివాజీ తర్వాత మహారాష్ట్రను పాలించిన పీష్వాలలో నానా ఫడ్నీస్ అనునతడు శ్రీ స్వామి వారికి అందమైన ఆలయాన్ని నిర్మించి ఈ క్షేత్రాబి వృద్ధికి చాలా కృషి చేసాడు.

తెల్ల జిల్లేడు

తెల్ల జిల్లేడును శ్వేతార్కం అంటారు. వృక్షజాతిలో ఈ తెల్ల జిల్లేడు విశిష్టమైంది. ఇందులో విషం ఉంటుందని చాలామంది ఈ మొక్కలకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా జిల్లేడు పాలు కళ్ళలో పడితే చూపు పోతుందని భయపడతారు.

ఈ మొక్కలో ఉన్న విషంతో ఆయుర్వేదంలో దివ్యమైన ఔషధాలు తయారుచేస్తున్నారు. జిల్లేడులో రెండు రకాలు ఉంటాయి. వంగపూవు రంగు పూలు పూసే జిల్లేడు ఒకటి, తెల్ల పూల జిల్లేడు మరొకటి. ఇది హేరంబ గణపతికి ప్రతీక. ఈ తెల్ల జిల్లేడును దొరికించుకుంటే మహాశివుడు, విఘ్నాదిపతుల దయ మనమీద ప్రసరిస్తుందట. తెల్ల జిల్లేడు వేళ్ళ మీద గణపతి నివసిస్తాడు.

ఈ వేళ్ళు కొన్నిసార్లు ఆకృతిలో సైతం గణేశుని పోలి ఉంటాయి. అందుకే చాలామంది తెల్ల జిల్లేడును పరమ పవిత్రంగా భావించి, తులసి మొక్కలా ఇంట్లో నాటుతారు. ఈ మొక్క గనుక ఉంటే ధన ధాన్యాలు పుష్కలంగా లభిస్తాయట. ఆలోచనల్లో పరిపక్వత వస్తుందని, ఎవరైనా హాని తలపెట్టినా అలాంటివి దుష్ప్రభావం చూపకుండా, వారి ప్రయోగాలే నశిస్తాయని ప్రతీతి. ఇళ్ళలో జిల్లేడు మొక్కలు ఉండకూడదు అనేది ఒక అపోహ మాత్రమే. నిజానికి శ్వేతార్కం లేదా తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఇక వారికి దారిద్ర్యం అంటే ఏమిటో తెలీదట. జిల్లేడు మొక్కలు అధికంగా ఉన్న ఊళ్ళో పంటలు బాగా పండుతాయంటారు.

ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లేడు సిరిసంపదలకు చిహ్నం అని నమ్ముతారు. తెల్ల జిల్లేడు వేళ్ళు గనుక గణపతి రూపాన్ని సంతరించుకుంటే, అది స్వయంభూ శ్వేతార్క గణపతి అన్నమాట. మరి ఈ శ్వేతార్క రూపాన్ని ఎలా పూజించాలి అని సందేహం వస్తుంది కదూ! ఈ గణపతికి ఎరుపు రంగు ఇష్టం. ఆసనం మీద కుంకుమ వేసి శ్వేతార్క గణపతిని నిలిపి, ఎర్ర వస్త్రం కప్పి, నైవేద్యం సమర్పించి పగడాలు లేదా ఎర్ర రుద్రాక్షలతో పూజించాలి. మందార లాంటి ఎర్రటి పూలు, ఎర్ర చందనంతో పూజ చేయాలి. శ్వేతార్క గణపతిని పూజించిన వారికి వెంటనే గొప్ప ఫలితాలు సాక్షాత్కరిస్తాయని ఎందరో అనుభవపూర్వకంగా చెప్తున్నారు.
फ़ोटो: తెల్ల జిల్లేడును శ్వేతార్కం అంటారు. వృక్షజాతిలో ఈ తెల్ల జిల్లేడు విశిష్టమైంది. ఇందులో విషం ఉంటుందని చాలామంది ఈ మొక్కలకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా జిల్లేడు పాలు కళ్ళలో పడితే చూపు పోతుందని భయపడతారు.

ఈ మొక్కలో ఉన్న విషంతో ఆయుర్వేదంలో దివ్యమైన ఔషధాలు తయారుచేస్తున్నారు. జిల్లేడులో రెండు రకాలు ఉంటాయి. వంగపూవు రంగు పూలు పూసే జిల్లేడు ఒకటి, తెల్ల పూల జిల్లేడు మరొకటి. ఇది హేరంబ గణపతికి ప్రతీక. ఈ తెల్ల జిల్లేడును దొరికించుకుంటే మహాశివుడు, విఘ్నాదిపతుల దయ మనమీద ప్రసరిస్తుందట. తెల్ల జిల్లేడు వేళ్ళ మీద గణపతి నివసిస్తాడు.

ఈ వేళ్ళు కొన్నిసార్లు ఆకృతిలో సైతం గణేశుని పోలి ఉంటాయి. అందుకే చాలామంది తెల్ల జిల్లేడును పరమ పవిత్రంగా భావించి, తులసి మొక్కలా ఇంట్లో నాటుతారు. ఈ మొక్క గనుక ఉంటే ధన ధాన్యాలు పుష్కలంగా లభిస్తాయట. ఆలోచనల్లో పరిపక్వత వస్తుందని, ఎవరైనా హాని తలపెట్టినా అలాంటివి దుష్ప్రభావం చూపకుండా, వారి ప్రయోగాలే నశిస్తాయని ప్రతీతి. ఇళ్ళలో జిల్లేడు మొక్కలు ఉండకూడదు అనేది ఒక అపోహ మాత్రమే. నిజానికి శ్వేతార్కం లేదా తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఇక వారికి దారిద్ర్యం అంటే ఏమిటో తెలీదట. జిల్లేడు మొక్కలు అధికంగా ఉన్న ఊళ్ళో పంటలు బాగా పండుతాయంటారు.

ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లేడు సిరిసంపదలకు చిహ్నం అని నమ్ముతారు. తెల్ల జిల్లేడు వేళ్ళు గనుక గణపతి రూపాన్ని సంతరించుకుంటే, అది స్వయంభూ శ్వేతార్క గణపతి అన్నమాట. మరి ఈ శ్వేతార్క రూపాన్ని ఎలా పూజించాలి అని సందేహం వస్తుంది కదూ! ఈ గణపతికి ఎరుపు రంగు ఇష్టం. ఆసనం మీద కుంకుమ వేసి శ్వేతార్క గణపతిని నిలిపి, ఎర్ర వస్త్రం కప్పి, నైవేద్యం సమర్పించి పగడాలు లేదా ఎర్ర రుద్రాక్షలతో పూజించాలి. మందార లాంటి ఎర్రటి పూలు, ఎర్ర చందనంతో పూజ చేయాలి. శ్వేతార్క గణపతిని పూజించిన వారికి వెంటనే గొప్ప ఫలితాలు సాక్షాత్కరిస్తాయని ఎందరో అనుభవపూర్వకంగా చెప్తున్నారు.

భాద్రపద మాసం

భాద్రపద మాసం ప్రారంభం (ఆగష్టు 26, 2014, మంగళవారం)

భాద్రపదం అనగానే అందరికీ గుర్తొచ్చేది వినాయకచవితి పర్వదినమే. కాని వరాహజయంతి, వామనజననం, రుషిపంచమి, ఉండ్రాళ్ల తద్దె, పితృదేవతలకు ఉత్తమగతులు కల్పించే మహాలయ పక్షం...ఇలా మాసానికి ఎన్నో ప్రత్యేకతలు.

దేవతా పూజలకు, పితృదేవతల పూజకు కూడా ఉత్కృష్టమైన మాసం ’భాద్రపద మాసం’. చాంద్రమానం ప్రకరం భాద్రపద మాసం ఆరవమాసం. ఈ మాసంలోని పూర్ణిమ తిథినాడు చంద్రుడు పూర్వాభాద్ర నక్షత్రం సమీపంలోగాని, ఉత్తరాభాద్ర నక్షత్రం సమీపంలోగానీ ఉండడంవల్ల ఈ మాసానికి ’భాద్రపద మాసం ’ అనే పేరు ఏర్పడింది. భాద్రపద మాసం వర్షఋతువులో రెండో మాసం.

భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతాపూజలకు ఉత్కృష్టమైన కాలం కాగా, కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనలకు అత్యంత ప్రీతికరమైన కాలంగా పురాణాలు చెబుతున్నాయి. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కొరకు శ్రీమహావిష్ణువు దశావతారాలను ధరించినట్లు అందరికీ తెలిసిన విషయమే. అట్టి దశావతారాలలో మూడవ అవతారమైన శ్రీ వరాహ అవతారాన్ని, ఐదవదైన శ్రీ వామనావతారాన్ని భాద్రపద మాసంలోనే శ్రీమన్నారాయణుడు ధరించి దుష్టశిక్షణ గావించాడు.అందుకే ఈ మాసంలో ’దశావతార వ్రతం’ చెయాలనే శాస్త్ర వచనం. భాద్రపదమాసంలోని అష్టమి శ్రీకృష్ణ పరమాత్మ పూజకు ఉత్కృష్టమైన రోజు. ఈ నాడు పవిత్ర ప్రేమకు చిహ్నంగా చెప్పబడుతూ ఉన్న శ్రీ రాధాకృష్ణులను పూజించాలి. ఈ దినానికి ’రాధాష్టమి’ అని పేరు. ఈ దినం రాధాకృష్ణులను పూజించడంవల్ల సంసార సుఖం లభిస్తుందని, భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని చెప్పబడుతూ ఉంది.

మహాలయ పక్షం ;

భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం కాబట్టి దీనికి పితృపక్షం అని పేరు. ఈ పక్షానికే ’మహాలయ పక్షం’ అని పేరు. ఈ పక్షం శుభకార్యాలకు పనికిరాదు. ఈ పక్షంలో పదిహేనురోజులపాటు పితృదేవతలకు తర్పణాలు వదలడం, శ్రాద్ధవిధులను నిర్వహించడం, పిండప్రదానం చేయడం ఆచరించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ రకమైన విధులను నిర్వహించడంవల్ల గయలో శ్రాద్ధ విధులను నిర్వహించినంత ఫలం లభిస్తుంది.

భాధ్రపదంలో స్త్రీలు చేయాల్సిన వ్రతాలు                                                                                                      

హరితాళిక వ్రతం , సువర్ణగౌరీ వ్రతం

భాద్రపద శుక్ల పక్ష తదియనాడు ’ హరితాళిక వ్రతం’ లేదా ’ సువర్ణ గౌరీ వ్రతం ’ ’పదహారు కుడుముల తద్ది’ ఆచరిస్తారు. శివపార్వతులను పూజించి, పదహారు కుడుములను తయారుచేసి నైవేద్యంగా సమర్పించవలెను. ఈ పూజను కన్యలు పాటించడంవల్ల వారికి మంచి భర్త లభిస్తాడు. ముత్తయిదువలు పాటించడంవల్ల వారి సౌభాగ్యం అభివృద్ధి చెందుతుందని శాస్త్ర వచనం.

ఉండ్రాళ్ళ తద్ది

భాద్రపద బహుళ తదియ నాడు అవివాహితలు చేసే వ్రతం . తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి దేవతాపూజ చేసి, ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టి సాయంత్రం ఊయలలో వూగుతారు.

శుక్ల చవితి : వినాయక చవితి

ఏ పూజ అయినా, వ్రతమైనా, చివరకు ఏ పని ప్రారంభించాలన్నా ముందుగా వినాయకుడిని పూజించడం మన సాంప్రదాయం. అటువంటి వినాయకుడి జన్మదినంను ’వినాయక చవితి’ లేదా ’ గణేశ చతుర్ధి’ పర్వదినంగా జరుపుకుంటారు. ఈనాడు వినాయకుడి ప్రతిమను ఇంటిలో ప్రతిష్టించి స్వామివారికి పూజ చేసి గరికతో పాటు, 21 పత్రాల్తో పూజించి , వ్రతకథ చెప్పుకుని, ఉండ్రాళ్ళు, కుడుములను నైవేద్యంగా సమర్పించవలెను.

శుక్ల ఏకాదశి : పరివర్తన ఏకాదశి

తొలి ఏకాదశినాడు క్షీరాబ్దిపై శేషతల్పంమీద శయనించిన శ్రీమహావిష్ణువు ఈ దిన ప్రక్కకు పొర్లుతాడు అంటే పరివర్తన చెందుతాడు కనుక దీనికి ’పరివర్తన ఏకాదశి’ అని, ’విష్ణు పరివర్తన ఏకాదశి’ అని ’పద్మ పరివర్తన ఏకాదశి’ అని పేరు. ఈనాడు ఏకాదశి వ్రతం ఆచరించడంవల్ల కరువుకాటకాలు రావని, వచ్చి వుంటే విముక్తి లభిస్తుందని కథనం.

శుక్ల ద్వాదశి : వామన జయంతి

దశావతారాల్లో ఐదవదైన వామనావతారాన్ని శ్రీమహావిష్ణువు ఈ దినం ధరించినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈనాడు వామనుడిని పూజించి, వివిధ నైవేద్యములు సమర్పించి, పెరుగును దానం చేయాలని శాస్త్ర వచనం.

శుక్ల చతుర్డశి : అనంత చతుర్ధశి

అనంతుడు అనేది శ్రీమహావిష్ణువుకు ఉండే పేర్లలో ఒకటి. శ్రీమహావిష్ణువును అనంతుడిగా పూజిస్తూ చేసే వ్రతమునకే ’అనంత చతుర్దశి వ్రతం’ లేదా ’ అనంత పద్మనాభ వ్రతం’ అని పేర్లు. ఈ వ్రతం గురించి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు వివరించినట్లు భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది.

కృష్ణ పక్ష ఏకాదశి : అజ ఏకాదశి

అజ ఏకాదశికే ’ధర్మప్రభ ఏకాదశి’ అని కూడా పేరు. పూర్వం గౌతమ మహర్షి చెప్పిన ఈ వ్రతం చేసి రాజ్యాన్ని, భార్యాకుమారులను పోగొట్టుకుని కాటికాపరిగా పని చేసిన హరిశ్చంద్రుడు వాటిని తిరిగి పొందినట్లు పురాణ కథనం.ఈ ఏకాదశినాడు వ్రతం ఆచరించడంతోపాటు నూనెగింజలు దానం చేయాలని శాస్త వచనం.

అక్క మహాదేవి

అక్క మహాదేవి ఇప్పటికీ శ్రీశైలం దేవాలయంలోపల కనిపిస్తుంది. స్థల వృక్షమైనటువంటి మద్ది చెట్టు ప్రక్కన ఆ మహాతల్లియొక్క పెద్ద విగ్రహం వుంటుంది. ఆవిడ నగ్నంగా ఉండి ఒళ్ళంతా జుట్టుతో కప్పుకొని ఒక చేతిలో రుద్రాక్షమాల, ఒక చేతిలో శివలింగం పట్టుకొని ఉంటుంది. అక్కమహాదేవి ఒకానొకప్పుడు దక్షిణ దేశంలో ఉండే కర్ణాటక సామ్రాజ్యంలో ఉడుతడి అనే ఒక గ్రామంలో జన్మించింది. మహా సౌందర్యరాశి. మల్లికార్జునుని యొక్కఅనుగ్రహంతో జన్మించింది. తండ్రి పేరు నిర్మల శేఠ్ . తల్లి పేరు సుమతి. ఈమెని పెంచి పెద్ద చేస్తున్నారు. అక్కమ్మ అని పిలిచేవారామెని. ఆవిడ పెద్దది అవుతుంటే ఆవిడయొక్క అందచందాల గురించి విన్నాడు అక్కడ రాజ్యాన్ని పరిపాలించే ప్రభువు. కౌశికుడు అని పేరు ఆయనకి. ఆయన జైనుడు. ఆమె అందచందాల గురించి తెలుసుకొని ఆ గ్రామానికి వెళ్ళి అక్కమ్మను నేను పెళ్ళి చేసుకుంటాను అన్నాడు. తల్లిదండ్రులు ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఈమె ఏమో శివభక్తురాలు, ఆయనేమో జైనుడు. శివార్చన లేకపోతే ఈమె బ్రతకలేదు. కాబట్టి మేము పిల్లనివ్వం అన్నారు. పిల్లనివ్వకపోతే మీ అమ్మాయిని, కుటుంబాన్ని కూడా ధ్వంసం చేస్తానన్నాడు. తండ్రి అక్కమాంబ దగ్గరికి వచ్చి "ఇలా అంటున్నాడు ప్రభువు, ఎదిరించలేము" అని. ప్రభువును పిలిపించండి, నేను మాట్లాడతాను అన్నది అక్కమాంబ. ప్రభువు వచ్చాడు. ఆమె బయటికి వచ్చింది. ఆమె అందచందాలు చూసి నిరుత్తరుడైపోయాడు ప్రభువు. ఆమె అన్నది నువ్వు శైవుడవైన నాడు నేను నిన్ను వివాహమాడతాను. నువ్వు శివభక్తి నాకోసం కృతకంగా అనుకరించడం కాదు. శివుడి గొప్పతనాన్ని పండితుల దగ్గర తెలుసుకొని శివభక్తియందు తాదాత్మ్యత పొందు. శివలింగార్చన నువ్వు కూడా చేసుకున్న నాడు నేను వివాహం చేసుకుంటాను. నేను వేరొకరిని వివాహం చేసుకుంటాను అని నీకు అనుమానమైతే నీ అంతఃపురానికే వచ్చి వుంటాను. కానీ ఒక్క నియమం. ఎన్నడూ నువ్వు నా మందిరంలోకి రాకూడదు, నన్ను తాకకూడదు. నా మందిరానికి వచ్చినా, నన్ను తాకినా నేను యథేచ్ఛగా వెళ్ళిపోతాను అన్నది. మహారాజు శివభక్తి తత్పరుడు కాలేదు, శివభక్తి గురించి తెలుసుకోలేదు. జైనుడిగానే ఉండి ఎప్పటికైనా ఆమెని పొందవచ్చని ఊహించాడు. తమకాన్ని నిగ్రహించుకోలేక శివలింగానికి పూజ చేస్తున్న అక్కమాంబ దగ్గరికి వచ్చి ఒక రోజున అకస్మాత్తుగా ఆమెను కౌగిలించుకున్నాడు. దుర్మార్గుడా! నేను నియమం పెట్టినా శివలింగాన్ని ఆరాధన చేస్తూండగా వచ్చి కౌగిలించుకున్నావు కనుక నువ్వు ఏ చేతులతో పట్టుకున్నావో ఆ బట్ట నీముఖం మీద పడేస్తున్నాను అని అమె వివస్త్రయై ఆ బట్ట తీసి ఆయన ముఖాన పడేసి తన కబరీ బంధాన్ని విప్పి ఆ కొప్పు వెంట్రుకల చేత తన శరీరాన్ని కప్పుకుంది. నగ్నంగా ఆమె కనపడేసరికి తన గురువులైనటువంటి జైన మతానికి సంబంధించినటువంటి తీర్థంకరులు జ్ఞాపకానికి వచ్చి వాళ్ళు దిగంబరులుగా ఉంటారు గనుక తన గురువు కనపడి వెంటనే ఆమె పాదముల మీద పడ్డాడు. ఆమె చరచరా బయటికి వెళ్ళిపోయింది.

Photo: అక్క మహాదేవి:

గర్భరక్షాంబిక ఆలయం

తంజావూరుజిల్లాలో పాపనాశనం అను ఊరి సమీపంలో " గర్భరక్షాంబిక " ఆలయం ఉంది. స్త్రీల , గర్భస్థ శిశువులకు ఏర్పడు దోషనివారణ కొరకు, ఆ గర్భము నిల్చి సత్సంతాన ప్రాప్తి కొరకు ఈ దేవతను ఆరాధిస్తారు. 1960వ సంవత్సరంలో శ్రీ స్వామిశాస్త్రిగారు "తిరుకడగావూరు " లో వేంచేసివున్న ఈ అమ్మవారి మీద స్తోత్రము వ్రాసి దానిని పారాయణ చేస్తే గర్భిణీ స్త్రీలకు రక్షణ కల్గి గర్భము నిల్చి మంచి ఆరోగ్యమైన సంతానప్రాప్తి కలుగుతుంది అనిచెప్పేరు.

1. శ్రీమత్కల్పక విఘ్నరాజమమలం, శ్రీ గర్భరక్షాంబికాసూనుం వృత్తకవేరజావర నదీకూలేస్థితం దక్షిణే|
భక్తానాం అభయప్రదాన నిపుణం శ్రీమాధవీ కానన క్షేత్రస్థం హృదిభావయే గజముఖం విఘ్నోపశాంత్యై సదా||

2. కావేరిజాత తటదక్షదిశాస్థి తాలయస్తాం కరుణాసుపూర్ణం|
స్వపాద పద్మాశ్రితభక్తధారా గర్భావనే దక్షతరా నమామి||

3. శ్రీమల్లికారణ్యపతే హృదిస్థితాం శ్రీమల్లికాపుష్ప లసత్కచాఢ్యాం|
శ్రీ మల్లికాపుష్ప సుపూజితాంఘ్రిం| శ్రీ మల్లికారణ్యగతాం నమామి|

4. భక్తావలీనాం అభయప్రదాత్రీం రిక్తావలీనాం అతివిద్యదాత్రీం|
శాక్తావలీనాం సుఖమోక్షదాత్రీం శ్రీ గర్భరక్షాం అక్షమాశ్రయేంబాం|

5. భక్తిప్రదాన వరభక్తదీక్షా స్త్రీగర్భరక్షాకరణేతి దక్షా|
భక్తావనార్థం జితశతృబక్షా భిభర్తి భర్త్రాసహ గర్భరక్షా|

6. కవేరజాతావరతీరరాజత్ ప్రసిద్ధ దేవాలయకా ఫలాని|
శ్రీ మల్లికేశానననాథపత్నీ సర్వాన్ జనాన్ రక్షతు గర్భరక్షా||

7. శ్రీ మల్లికారణ్యపతిప్రియం తాం విద్యుల్లతాభ స్వశరీర కాంత్యాం| ఉత్ఫుల్ల పద్మాభ పదాబ్జయుగ్మా శ్రీ గర్భరక్షాం శరణం ప్రపద్యే||

8. యా గర్భరక్షాకరణే ప్రసిద్ధా సుపుత్రదానేపి మహాప్రసిద్ధా|
సర్వేష్ట దానేపి అతి సుప్రసిద్ధా తాం గర్భరక్షాం శరణం ప్రపద్యే||

9. స్వల్పం గృహీత్వా నిజభక్తవర్గాత్ అనల్పవిత్తం ప్రదదాతియాంబా|
లక్ష్మీపతే: సుప్రియసోదరీ యా తాం గర్భరక్షాం శరణం ప్రపద్యే||

10. కవేరికాసేచిత పాదపద్మాం కవేరణే కార్తద వాక్ప్రదాత్రీం|
కుబేరమిత్రాంగనాం తా భవానీం శ్రీ గర్భరక్షాం ప్రణమామి నిత్యం||

11. శ్రీ గర్భరక్షాపుర సంస్థితానాం భక్తోత్తమానాం ధన ధాన్య దాత్రీం|
దీర్ఘాయురారోగ్య శుభప్రదాత్రీం శ్రీ గర్భరక్షాం ప్రణతోస్మి నిత్యం||

12. అనంతకళ్యాణగుణస్వరూపాం శ్రీమద్ సచ్చిదానంద రసస్వరూపాం|
ప్రాణ్యంతరంగ సద్గుహాంతరస్థాం శ్రీ గర్భరక్షాం ప్రణతోస్మి నిత్యం||

Photo: On request by a few followers of the page, garbharakshambika stotra  is being reposted. Sree gurubhyoh namah - admin

రామేశ్వర జ్యోతిర్లింగం:

భగవంతుడగు విష్ణువు రామావతరమునందు రావణుడు సీతను అపహరించి లంకకు తీసుకొని వెళ్ళెను. అప్పుడు సుగ్రీవుని 18 పద్మముల వానర సైన్యమును తీసుకొని శ్రీరాముడు సముద్రతీరమునకు వచ్చెను. సముద్రమును దాటుట ఎట్లు? రావణుని ఎట్లు జయించవలెను? అని ఆ స్వామి ఆలోచింపసాగెను. ఇంతలో రామచంద్రునకు దప్పిక కలిగెను. ఆ ప్రభువు నీరును అడిగెను. వానరులు మంచినీటిని తెచ్చిరి. శ్రీరాముడు ప్రసన్నుడై ఆ జలమును తీసుకొనెను. "నేను నా స్వామియు భగవంతుడగు శంకరుని దర్శించకుండా జలమునెట్లు గ్రహించగలను" అని తలంచెను. అట్లు భావించి ఆ స్వామి జలమును త్రాగలేదు. జలమునచట ఉంచి రఘునందనుడు పార్థివపూజ చేసెను. ఆవాహనాది పదహారు ఉపచారములను సమర్పించి మిగుల భక్తితో శివుని అర్చించెను. ప్రణామములు, దివ్యస్తోత్రముల ద్వారా ప్రయత్నపూర్వకముగా శంకరుని సంతోషపరచి భక్తిభావముతో ఆ స్వామిని ప్రార్థించెను. ’జయశంకర జయశివ’ అని పలుకుచూ ఆయనను స్తుతించెను. తదుపరి ఆ స్వామి మంత్ర జపమునందు, ధ్యానమునందు తత్పరుడయ్యెను. తదుపరి మరలా పూజించి శివుని యెదుట నృత్యము చేయసాగెను. అప్పుడు ఆయన హృదయము ప్రేమతో ద్రవించెను. శివుని సంతుష్టపరచుటకు ఆనంద పారవశ్యములో బిగ్గరగా కేకలు వైచుచు శివస్తుతి గావించెను. అప్పుడు భగవంతుడగు శంకరుడు ఆయన యెడల మిగుల ప్రసన్నుడయ్యెను. జ్యోతిర్మయుడగు మహేశ్వరుడు వామాంగభూతయగు పార్వతితో పార్షదగణములతో శాస్త్రోక్త నిర్మల రూపమును ధరించి అచటకు వచ్చెను.శ్రీరాముని భక్తివలన సంతోషచితుడై మహేశ్వరుడు ఇట్లు పలికెను. "శ్రీరామా! నీకు మేలగుగాక! వరమునడుగుము’. అప్పుడా స్వామి రూపమును జూచి అచటనున్న వారందరును పవిత్రులైరి. శివధర్మ పరాయణుడగు రామచంద్రుడు స్వయముగా ఆయనను పూజించెను. తదుపరి రకరకములగు స్తుతులు ప్రణామములు చేయుచు లంకయందు రావణునితో జరుగు యుద్ధమున తనకు విజయమును చేకూర్చమని ఆ దేవదేవుని ప్రార్థించెను. అప్పుడు ఆ రాముని భక్త్కి మెచ్చి "మహారాజా! నీకు జయమగుగాక!" అని శివుడు పలికెను. భగవంతుడగు శివుడొసగిన విజయపూర్వక వరమును స్వయముగా యుద్ధమునకు ఆదేశమేనని రామచంద్రుడు భావించెను. నతమస్తకుడై చేతులు జోడించి ఆయనను మరల ఇట్లు ప్రార్థించెను.
శంకరా! మీరు సంతుష్టులైనచో జగత్తునందలి ప్రజలను పవిత్రులను చేయుటకు, ఇతరుల కుపకారమొనర్చుటకు మీరిచటనే స్థిరనివాసమేర్పరచుకొనుడు.
శ్రీరాముడిట్లు పలుకగా భగవంతుడగు శివుడు జ్యోతిర్లింగ రూపమున అచట సంస్థితుడయ్యెను. ముల్లోకములయందు రామేశ్వరుడను పేరుతో ఆ స్వామి ప్రసిద్ధి చెందెను. ఆ స్వామి ప్రభావముచేత అనాయాసముగా సముద్రమును దాటి లంకను చేరెను. రావణాది రాక్షసులను సంహరించెను. తన ప్రియురాలగు సీతాదేవిని పొందెను. అప్పటినుండి యీ భూతలమున రామేశ్వరుని అద్భుతమహిమ అన్నిచోట్లా వ్యాపించెను. భగవంతుడగు రామేశ్వరుడు సదా భోగమోక్షములను ప్రసాదించును. భక్తుల కోరికలను తీర్చును. దివ్యగంగాజలముతో రామేశ్వరునకు స్నానమొనరించువాడు జీవన్ముక్తుడే. అట్టి వాడు ఈ లోకమున దేవదుర్లభమగు సమస్త భోగములను అనుభవించి చివరకు ఉత్తమ జ్ఞానమును పొంది నిశ్చితముగా కైవల్య మోక్షమును పొందును. తన మహిమను వినువారి సకల పాపములను హరించును.

శని ప్రభావం

శని నపుంసక గ్రహం. వర్ణం నలుపు, నీలం సూచిస్తాడు. శని సూర్యుడి పుత్రుడు. అధిదేవత యముడు. శని మకర రాశి, కుంభరాశులకు అధిపతి. తులారాశిలో ఉచ్ఛస్థితిని, మేషరాశిలో నీచ స్థితిని పొందుతాడు. పుష్యమి, అనూరాధ, ఉత్తరాభద్ర నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తాడు. మిత్రులు బుధుడు, శుక్రుడు, శత్రువులు రవి, చంద్ర, కుజులు, సముడు గురువు. ముసలి వారిని, సన్నని పొడగరులను సూచిస్తాడు. తత్వం వాయుతత్వం, దిక్కు పడమర, ఋతువు శిశిరం, జాతి శూద్ర, లోహము ఇనుము, ఉక్కు, రత్నములలో నీలం, గ్రహసంఖ్య ఎనిమిది, దిక్బలం సప్తమ స్థానం, గుణము తమోగుణము, ప్రదేశము హిమాలయాలలోని గంగా పరివాహక ప్రాంతాన్ని సూచిస్తాడు. శరీర అవయవములలో ఎముకలు, క్లోమము, విసర్జకావయములను సూచిస్తాడు.

శని ప్రభావం

సాదారణంగా శనిని చూసి కష్టాలు కలిగిస్తాడని చాలా మంది భయపడుతుంటారు. శని పాపములకు తగిన దండన ఇస్తాడని జ్యోతిష శాస్త్రం వివరిస్తుంది. ఎలిన నాటి శని కాలం ఏడున్నర సంవత్సరమముల కాలం, శని మహర్దశా కాలంలో, అర్ధాష్టమి, అష్టమ స్థాన సంచార కాలంలో సమస్యలు సృష్టిస్తాడు. వీటికి ఆందోళన చెందవలసిన పని ఉండదు. పరిహారాలు ఉంటాయి. శని ఆధిపత్యంలో ఉన్న రాశులు అయిన కుంభ, మకర రాశుల వారికి , మిత్ర స్థానాలు అయిన మిధున, కన్యా, వృషభ, తులా రాశుల వారికి శని నక్షత్రాలైన పుష్యమి, అనూరాధ, ఉత్తరాభద్ర నక్షత్రాలలో జన్మింక్ష్చిన వారికి, కొంత వెసులుబాటు ఉంటుంది. కష్టాలు మనిషి అహంకారం తగ్గించి జీవిత సత్యాలను తెలియ చేయడమే కాక సుఖానికి ఉన్న విలువను గుర్తించేలా చేస్తుంది. శని జీవిత గమనానికి కావలసిన స్థిరాస్థులను ఏర్పరుచుకోవడానికి కారకుడౌతాడు కనుక కొంత మంచి జరుగుతుంది. కష్టాలను ఓర్చుకునే శక్తిని, వాటిని అధిగమించే శక్తిని ఇచ్చి మనిషిని పుటం పెట్టిన బంగారంలా మెరిసేలా చేస్తుంది. శని వైరాగ్యాన్ని, భక్తిని ప్రసాదిస్తాడు.

కారకత్వం

ఆయుఃకారకుడు, ఆటంకములు, విరోధం, కష్టం, బాధలు, దుఃఖం, సేవకత్వం, దురాచారము, బంధనం, మూర్ఖత్వం, జూదము, జైలు జీవితం, మద్యపానం, అంగవైకల్యం, మూర్చ రోగం, అంగవైకల్యం, బ్లాక్ మార్కెట్, అన్యాయార్జన, జీవహింస, అవమానము, రాజదండన, బద్ధకం, క్షుద్రశక్తులు, అప్పులు, మృత్యుదేవతారాధాన, అంద విహీనత, బంధు మిత్ర తిరస్కారం సూచిస్తాడు. వంటవారు, నపుంసకులు, చండాలురు, అక్రమసంతానం, సేవకులు, నీచులను సూచిస్తాడు. పురాతన భవనాలు, పురాతన వస్తువులు, పూరావస్తు శాఖ, సొరంగాలు, గుహలు, చలివేంద్రములు, నువ్వుల నూనె, గానుగ, నూనె దుకాణములను సూచించును. నువ్వులు, ఉల్లి, వేరు శనగ, బంగాళాదుంపలు, రాగులు, జొన్నలు, మినుములు, దున్నపోతు, గాడిద, ఒంటె, కోడి, బొగ్గు, తారు, నల్లమంగోళ్ళకు సంబంధించిన సమస్యలు, అజీర్ణం, కిరోసిన్, వెంట్రుకలు, ఎముకలు, దంతములను సూచిస్తాడు. కలప, తోలు పరిశ్రమలను సూచిస్తాడు. ఆలస్యము, దురదృష్టము, సరిహద్దులు, దహనకార్యక్రమాలు, అపవాదు, పదవీ విరమణ, నిర్మాణం, శాస్త్రీయదృక్పదం, ఒంటరి తనం సూచిస్తాడు. గనులు, వంతెనలు, చర్మము, ఆనకట్టలు, పిరికి వాళ్ళు, రాళ్ళు, ఆస్తి, ఆపద, మంచు, ఆందోళన, వినయము, అనుమానము, అనుకూలత, వినయము, సెరామిక్స్, మట్టిని సూచిస్తాడు.

వ్యాధులు

శని వాత సంబంధ వ్యాదులను సూచిస్తాడు. కీళ్ళ వాతం, పక్షవాతం, బలహీనత, నొప్పులు, కిడ్ని లివర్ మొదలైన వాటిలో రాళ్ళు ఏర్పడుట, క్షయ, దగ్గు, ఆస్త్మా, న్యుమోనియా, ఎముకలకు సంబంధించిన వ్యాదులు, వెంట్రుకలకు సంబంధించిన సమస్యలు, అజీర్ణ వ్యాదులు, పని చేయలేని అశక్తి, డ్రగ్స్ అలవాటు మొదలైన వాటికి కారకుడు. చంద్రుడితో కలిసిన మతి భ్రమణం, పిచ్చి, వాతం, గుండె నొప్పి, కండరాల నొప్పి, తల నొప్పి, బద్దకం, నీరసం మొదలైనవి సూచిస్తాడు. గురువుతో చేరిన జీర్ణ వ్యస్థకు సంబంధించిన వ్యాధులు. బుధుడితో కలిసిన మాటలు సరిగా రాకుండుంట, నత్తి, నాలుక మొద్దుబారటం, మెదడు మొద్దుబారటం, చెవి సంబధిత వ్యాదులు సూచిస్తాడు. కుజుడితో కలిసిన కండరాల నొప్పి, కండరాల జబ్బులు సూచిస్తాడు. శుక్రుడితో కలిసిన గొంతు నొప్పి, టాన్సిల్స్, పైల్స్, విరోచనాలు మొదలైన వ్యాదులను సూచిస్తాడు. రాహువుతో కలిసిన విషప్రయోగం, వైరస్ వ్యాదులను సూచిస్తాడు.కేతువుతో కలిసిన రక్త పోటు వ్యాదులను సూచిస్తాడు.

రూపము

శని నీల కాంతి కలిగిన మేని ఛాయ కలవాడు. నాలుగు భుజములు కలవాడు. ధనుర్భాణాలు, శూలం ధరించిన వాడు. కాకిని వాహనంగా చేసుకున్న వాడు. శనికి నిదానంగా సూర్యుడిని చుట్టి వస్తాడు కనుక మందుడు అని పిలుస్తారు. పంగు, సౌరి అను ఇతర నామాలు ఉన్నాయి. సూర్యుడికి ఛాయాదేవికి కలిగిన పుత్రుడు. మాఘ మాసం కృష్ణ పక్షం చతుర్ధశి నాడు ధనిష్ఠా నక్షత్రంలో విభవానామ సంవత్సరంలో జన్మించాడు. శనిభగవానుడి సోదరి యమున, సోదరుడు యముడు, భార్య జ్యేష్టాదేవి. సూర్యుడి భార్య త్వష్ట ప్రజాపతి కుమార్తె సజ్ఞాదేవి సూర్యుడి తాపం భరించ లేక తనకు ప్రతిగా ఛాయాదేవిని సృష్టించి పుట్టింటికి వెళ్ళిన సమయంలో శని జన్మించాడు. తరువాత కాలంలో సూర్యుడిని చేరిన సజ్ఞాదేవి శనిని సరిగా చూడని కారణంగా శని ఆమెను కాలితో తన్నాడు. ఆకారణంగా శనిని ఆమె శపించంగా శనికి మందగమనం ప్రాప్తించింది.

పరిహారం

శని దశా ప్రారంభ సమయం, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలిననాటి శని కాలం శని సమస్యలను ఇచ్చే సమయం. శివారాధన,శివార్చన, శివాలయ దర్శనం సమస్యలకు పరిస్కారంగా చేయాలి. శని క్షేత్రాలయిన తిరునల్లారు, శని సింగినాపురం లాంటి క్షేత్ర దర్శనం. శ్రీకూర్మ దేవాలయ దర్శనం చేయాలి. శని దశాకాలం పందొమ్మిది సంవత్సరాలు కనుక పంతొమ్మిదివేల సార్లు జపం చేయించాలి. నువ్వులు, మినుములు, నూనెలను దానం ఇవ్వాలి. నల్ల వస్త్రాలు ధరించి శని గాయత్రి, శని శ్లోకం లాంటివి పారాయణం చేయాలి. అయ్యప్ప జయంతి, శనీశ్వర వ్రతం, సత్యనారాయణ వ్రతం, అయ్యప్పస్వామి పూజ చేయాలి. కూర్మపురాణ పారాయణం, వేంఖటేశ్వర శతనామావళి, శని అష్టోత్తరం చేయాలి.ఆంజనేయుడిని పూజించి దర్శించుట. పూజకు ఇనుముతో చేసిన ప్రతిమను వాడాలి. నైవేద్యం నువ్వులతో కలిపిన అన్నం, నువ్వు చిమ్మిరి, నువ్వు ఉండలు, ద్రాక్షరసం వాడాలి. కపిల గోవు దానం చేయాలి. శనికి ప్రీతికరమైన జ్యేష్టశుద్ధ ద్వాదశి, మార్గశిర శుద్ధ అష్టమి నాడు పూజలు జపాలు నిర్వహించడం శ్రేష్టం. దోషనివారణకు నీలమణి, ఎర్రచందన మాల, చతుర్దశ ముఖ రుద్రాక్ష ధారణ చేయాలి. హోమముకు వాడవలసిన సమిధ జమ్మి. ప్రీతికరమైన వారం శనివారం.

Photo: శని నపుంసక గ్రహం. వర్ణం నలుపు, నీలం సూచిస్తాడు. శని సూర్యుడి పుత్రుడు. అధిదేవత యముడు. శని మకర రాశి, కుంభరాశులకు అధిపతి. తులారాశిలో ఉచ్ఛస్థితిని, మేషరాశిలో నీచ స్థితిని పొందుతాడు. పుష్యమి, అనూరాధ, ఉత్తరాభద్ర నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తాడు. మిత్రులు బుధుడు, శుక్రుడు, శత్రువులు రవి, చంద్ర, కుజులు, సముడు గురువు. ముసలి వారిని, సన్నని పొడగరులను సూచిస్తాడు. తత్వం వాయుతత్వం, దిక్కు పడమర, ఋతువు శిశిరం, జాతి శూద్ర, లోహము ఇనుము, ఉక్కు, రత్నములలో నీలం, గ్రహసంఖ్య ఎనిమిది, దిక్బలం సప్తమ స్థానం, గుణము తమోగుణము, ప్రదేశము హిమాలయాలలోని గంగా పరివాహక ప్రాంతాన్ని సూచిస్తాడు. శరీర అవయవములలో ఎముకలు, క్లోమము, విసర్జకావయములను సూచిస్తాడు.